tata company
-
బడ్జెట్ ప్రకటన.. టాటా కంపెనీకి రూ.19,000 కోట్లు లాభం!
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.బీఎస్ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు. గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది. -
ఏమన్నా ఆఫరా అసలు, రూ.349కే ఏకంగా 26 ఓటీటీ యాప్స్ చూడొచ్చు.. ఇంకా
టాటా ప్లే బింజ్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే ఒకే వేదికపై 25 ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా కేవలం ఒక్కసారి పేమెంట్ చేసి..లాగిన్ చేస్తే సరిపోతుంది. బింజ్ మొబైల్ యాప్ సర్వీస్ ఈ అవకాశాన్ని టాటా ప్లే డీటీహెచ్ సబ్‌స్కైబర్లతో పాటు సాధారణ వీక్షకులు సైతం వినియోగించుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక నాన్ బింజ్ సబ్స్క్రైబర్లు బింజ్ మొబైల్ యాప్‌లో బేసిక్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటకే బింజ్ను ఉపయోగిస్తున్న కస్టమర్లు టాటా ప్లే బింజ్ సర్వీసులు ఇతర ఛార్జీలు, సబ్స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. టాటా ప్లే డీటీహెచ్ యూజర్లు నామ మాత్రం రుసుముతో బింజ్ మొబైల్ యాప్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల సౌలభ్యం కోసమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే తడిసి మోపెడవుతుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా పుట్టుకొచ్చిందే ఈ టాటా ప్లే బింజ్ యాప్. ఈ యాప్‌లో నెలవారీ సాధారణ మొత్తాన్ని చెల్లించి పదుల సంఖ్యలో ఓటీటీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ గంటలు చూసే వెసలు బాటు , సులభంగా సెర్చ్ చేసే అవకాశం ఉండడంతో ఓటీటీ లవర్స్ టాటా బిజ్ యాప్‌ను వినియోగిస్తుండగా..వారిని మరింతగా ఆకర్షించేందుకు భారీ ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది ఆ సంస్థ. టాటా ప్లే బింజ్ మెగా సబ్స్క్రిప్షన్ ఇందులో భాగంగా టాటా ప్లే బింజ్ మెగా సబ్స్క్రిప్షన్ ఆఫర్ కంటెంట్‌ను యూజర్లకు అందిస్తుంది. ఇందులో 25 రకాల ఓటీటీ కంటెంట్‌ను చూడొచ్చు. వాటిల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, వూట్ సెలక్ట్, సోనీలివ్, ఎంఎక్స్ ప్లేయర్, లైన్స్ గేట్ ప్లే, ఎరోస్ నౌ, హంగామా ప్లే, షీమారోమీ, ఎపిక్ ఆన్, డక్బే, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్ కిండ్స్, షార్ట్స్ టీవీ, ట్రావెల్ ఎక్స్పీ, సన్ నెక్ట్స్, హోయిచోయి, నమ్మా ఫ్లిక్స్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, కూడ్, తరంగ్ ప్లస్, మనోరమా మ్యాక్స్, ఆహా, వ్రోట్లు ఉన్నాయి. టాటా ప్లే బింజ్ మెగా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ టాటా ప్లే బింజ్ మెగా ప్లాన్‌ను మూడు సబ్స్క్రిప్షన్ పద్దతుల్లో అందిస్తుంది. నెలవారీ టారిఫ్ ప్లాన్‌తోపాటు త్రైమాసికం, వార్షిక ప్లాన్ టారిఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ రూ.349 ప్లాన్ ఉండగా, 3 నెలలకు రూ.989 చెల్లించాలి. ఏడాదికి వార్షిక ప్లాన్ కింద రూ.3839 పే చేయాల్సి ఉంటుంది. టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ ద్వారా అమెజాన్ ఫైర్ స్టిక్, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ప్రోగ్రామ్‌లను టీవీల్లో వీక్షించవచ్చు. ఓటీటీ యాప్స్ టారిఫ్ ప్లాన్ ఇక, ఓటీటీ యాప్స్ వారీగా సేవలపై టారిఫ్ ప్లాన్ నిర్ణయించింది టాటా ప్లే బింజ్. 26 ఓటీటీ యాప్స్ గల నెలవారీ ప్లాన్ టారిఫ్ రూ.349, 24 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.249, 20 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.199 గా ఖరారు చేసింది. -
అత్యంత విలువైన కంపెనీగా 'అమెజాన్'.. భారత్ నుంచి 'టాటా' టాప్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా అంత్యత విలువైన కంపెనీల జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకుంది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమెజాన్ 15 శాతం మార్కెట్ వ్యాల్యూని కోల్పోయి 350.3 బిలియన్ డాలర్ల నుంచి 299.3 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయినా అమెజాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ గ్లోబల్ 500 2023 పేరిట ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో అమెజాన్‌కు నెంబర్ వన్ స్థానాన్ని కట్టబెట్టింది. ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. గతేడాది అమెజాన్ ఏకంగా 50 బిలియన్ డాలర్లు నష్టపోయింది. ఇక, విలువైన కంపెనీల జాబితాలో యాపిల్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 355 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ కంపెనీ విలువ 16 శాతం క్షీణించి 297.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌కు చెందిన కంపెనీల్లో టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 78వ స్థానంలో ఉన్న ఈ గ్రూప్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 69కి చేరింది. -
ఈవీ..‘పొగ’బెట్టవు
సాక్షి ప్రతినిధి, అమరావతి: ప్రపంచం కాలుష్య రహిత వాహనాల వైపు చూస్తోంది. ప్రస్తుతం వాడుతున్న పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల ద్వారా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచంలోని అన్ని దేశాలూ కార్యాచరణలోకి దిగాయి. దీంతో కాలుష్య రహిత వాహనాల తయారీపై కంపెనీలు దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీని ప్రారంభించాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక బ్యాటరీల మేళవింపుతో ఈ వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారత దేశంలోనూ ఇప్పుడిప్పుడే ఈ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులూ వస్తున్నాయి. ముంబైలో బ్యాటరీతో నడిచే డబుల్ డెక్కర్ బస్సును ఇటీవలే ప్రవేశపెట్టారు. దేశంలో బ్యాటరీ కార్ల తయారీ కూడా మొదలైంది. ఈవీల ధరలు ఎక్కువగా ఉండటం మార్కెట్లో పెద్ద సవాలుగా మారింది. అయితే, వీటి వినియోగంతో కాలుష్యంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుంది. విద్యుత్ వాహనాలపట్ల ప్రజలు ఆకర్షితులు కావడానికి ఇదే ప్రధాన కారణం. విద్యుత్ కార్లకు ఉన్న డిమాండ్‌ను, అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దేశంలో ప్రధాన కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. టాటా కంపెనీ ఇప్పటికే విద్యుత్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. 2024–26 మధ్య ఐదు కొత్త మోడల్స్ కార్లు తెస్తామని మహీంద్రా ప్రకటించింది. ఆన్లైన్ ట్యాక్సీ వ్యాపారం చేసే ‘ఓలా’, ఇప్పటికే విద్యుత్ స్కూటర్లు తయారుచేస్తోంది. రెండేళ్లలో విద్యుత్ కార్లు కూడా తెస్తామని ప్రకటించింది. దేశంలో కార్ల తయారీలో నంబర్–1 స్థానంలో ఉన్న మారుతి కూడా విద్యుత్ కారు తీసుకొస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ కంపెనీలవన్నీ లిథియం అయాన్ బ్యాటరీ ఆధారిత వాహనాలే. విద్యుత్ వాహనాల్లో ఇది విజయవంతమైన సాంకేతిక పరిజ్ఞానం. ఈవీల వినియోగంలో చైనా టాప్ ప్రయోగ దశ దాటి విద్యుత్ వాహనాలను పెద్ద సంఖ్యలో తయారుచేయడం 2010లో ప్రారంభమైంది. ‘ఈవీ’ల వాణిజ్య ఉత్పత్తి తొలుత ‘నిసాన్’ ప్రారంభించింది. నిసాన్ లీఫ్ తొలి ఈవీ వాహనం. 2012లో ‘టెస్లా మోడల్ ఎస్’ రోడ్డెక్కడంతో మిగతా సంస్థలూ వీటి తయారీ మీద దృష్టి పెట్టాయి. 2011లో ప్రపంచవ్యాప్తంగా 55 వేల వాహనాలు అమ్ముడయ్యాయి. పదేళ్ల తర్వాత వీటి సంఖ్య 70 లక్షలకు చేరింది. అందులో సగం వాటా చైనాది. ఈవీల వినియోగంలో అమెరికా, ఐరోపా దేశాలను మించి చైనా దూసుకుపోతోంది. భారత్‌లో సగం ద్విచక్ర వాహనాలు 2021లో దేశంలో 3.29 లక్షల విద్యుత్ వాహనాలు రోడ్డెక్కితే, అందులో 48 శాతం ద్విచక్ర వాహనాలే. మరో 45 శాతం ఆటో రిక్షాలు ఉన్నాయి. కార్లు 4 శాతం ఉండగా, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర వాహనాల వాటా 3 శాతం. ప్రజా, సరకు రవాణా వాహనాల సంఖ్య పెరిగితేనే కాలుష్యం తగ్గుదల ఎక్కువగా ఉంటుంది. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గుతుంది. ఫలితంగా శిలాజ ఇంధనాల దిగుమతులు తగ్గుతాయి. ఇటు పర్యావరణ పరిరక్షణకు, అటు విదేశీమాదక ద్రవ్యం మిగులుకు ఇది దోహదం చేస్తుంది. ధరలు ఎక్కువగా ఉండటమే అసలు సమస్య విద్యుత్ వాహనాల ధరలు సాధారణ వాహనాలతో పోలిస్తే ఎక్కువ. ద్విచక్ర వాహనాల ధరలు మరీ ఎక్కువగా లేకపోవడం, ఇంధన వ్యయం తక్కువగా ఉండటం వల్లే టూవీలర్ల విక్రయాలు పెరుగుతున్నాయి. లోస్పీడ్ ఆటో రిక్షాల ధరలూ మరీ ఎక్కువగా లేవు. ఈవీ కార్లు, బస్సుల ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికంగా తయారయిన వాహనాల మీద 28 శాతం జీఎస్టీ ఉండగా, విద్యుత్ వాహనాలకు 5 శాతం వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈవీల ధరలు ఎక్కువగానే ఉన్నాయి. బ్యాటరీ ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కంపెనీలు చెబుతున్నాయి. దేశంలో బ్యాటరీ తయారీకి విదేశీ కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని అరువు తెచ్చుకోవాలి. మన సొంత టెక్నాలజీతో బ్యాటరీలు తయారు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాటరీ తయారీలో సవాళ్లు ఎన్నో.. లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో ప్రధానంగా లిథియం, మాంగనీస్, నికెల్, కోబాల్ట్, కాపర్ (రాగి), అల్యూమినియం, గ్రాఫైట్, టైటానియం అనే 8 ఖనిజాలు అవసరం. మన దేశంలో మాంగనీస్, నికెల్, కాపర్, అల్యూమినియం నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. గ్రాఫైట్ నిల్వలూ ఉన్నప్పటికీ, ముడి ఖనిజం నుంచి బ్యాటరీ తయారీకి అవసరమయ్యే నాణ్యమైన గ్రాఫైట్‌ను తయారు చేసే కర్మాగారాలు లేవు. వాటిని ఏర్పాటు చేసుకుంటే గ్రాఫైట్ తయారు చేసుకోవచ్చు. దేశంలో ఉన్న టైటానియం మన అవసరాలకు సరిపోతుందో లేదో ఇంకా అంచనా వేయలేదు. లిథియం, కోబాల్ట్ మన దేశంలో లేవు. ఈ రెండింటినీ పూర్తిగా దిగుమతి చేసుకోవాల్సిందే. దేశంలో లభించే ఖనిజం ఉత్పత్తి, వీటిని లిథియం అయాన్ బ్యాటరీల్లో వినియోగానికి అనుగుణంగా మార్చుకోవడంపై ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలు దృష్టి పెట్టాలి. దేశంలో లభించని లోహాలను ఏ రూపంలో దిగుమతి చేసుకోవాలనే విషయంలో భిన్నవాదనలు ఉన్నాయి. ముడి ఖనిజం దిగుమతి చేసుకొని ఇక్కడ లోహాలు ఉత్పత్తి చేయాలన్న భావన ఉంది. లోహం కాన్సంట్రేట్‌ను దిగుమతి చేసుకొని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ద్వారా చౌకగా, వేగంగా అందుబాటులోకి తేవాలన్న వాదనా ఉంది. వివిధ దేశాల్లో ‘క్లీన్ ఎనర్జీ’ లోహాల మైనింగ్, ఉత్పత్తి ఉన్నా, చైనా మార్కెట్ లీడర్‌గా ఎదిగింది. ఆయా లోహాల ముడి ఖనిజం నిల్వలు చైనాలో లేకున్నా, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సమకూర్చుకొంది. ఇదే తరహాలో మనమూ ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటే బ్యాటరీల్లో వినియోగించే కీలక లోహాల కొరత లేకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
కొత్త మోడల్ కార్లలో టాటా సరికొత్త ఆవిష్కరణ
► కొత్త మోడల్ కార్ల తో టాటా దూసుకుపోతోంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ కోసం మైక్రో ఎస్‌యూవీని రంగంలోకి దించింది. ఎస్‌యూవీల్లో టాప్ బ్రాండ్‌గా ఉన్న జీప్.. 7 సీటర్‌ను ఇండియన్ రోడ్లపైకి తెచ్చింది. ► ఇక చాన్నాళ్ల పాటు మొబైల్ రంగాన్ని ఏలిన నోకియా.. స్మార్ట్ ఫోన్లలో కొత్త వ్యూహంతో అడుగుపెట్టబోతుంది. ఫుల్ హెచ్డీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన నోకియా బోలెడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ► పోలీస్ రోబో పేరుతో వచ్చిన గస్తీ రోబో.. త్వరలో భారతీయ కాలనీల్లో చూడవచ్చు. యాంటినాలు, ఎటువైపైనా కదిలే సౌకర్యం తో స్ట్రీట్ సర్వే చేపడతాయి ఈ రోబో లు. -
108పై 420 అటాక్!
పేదవాడికి అపర సంజీవని లాంటి పథకాన్ని స్వయంగా సర్కారే గొంతు నులుముతోంది. అర్ధరాత్రి, అపరాత్రి అనే భేదం లేకుండా పిలవగానే వచ్చి వాలిపోయే 108 పథకాన్ని ప్రభుత్వమే రెక్కలు విరగ్గొడుతోంది. ఆపదలో ఉన్నామంటూ ఆర్తనాదాలు చేస్తున్నా బాధితుల గోడు పట్టించుకోకుండా అంబులెన్సు వ్యవస్థను కుప్పకూల్చుతోంది. ఇదే ఆరోగ్యశాఖలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్) పేరుతో కార్పొరేట్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి పేదవాడిని కాపాడే అంబులెన్సులు గుర్తుకు రాలేదు. టైర్లు అరిగిపోయాయని, డీజిల్ లేదని, వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగులు రోజూ మొత్తుకుంటున్నా పెడచెవిన పెడుతోంది. నిధులివ్వాల్సిన ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకో కుండా నిర్వహణ సంస్థపైకి నెట్టేస్తోంది. పథకం సరిగా నడవక పోవడానికి నిర్వహణ సంస్థే కారణమని పదేపదే ప్రభుత్వం చెప్పడం, తన అనుకూల మీడియాతో రాయించుకోవడం తెలిసిందే. ఓవైపు మూలన పడ్డ వాహనాలను పట్టించుకోకపోగా మరోవైపు కొత్త అంబులెన్సుల కొనుగోళ్లను కూడా అవినీతిమయంగా మార్చిన ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టడం లేదు. అంబులెన్సు వాహనాలకు ప్రభుత్వం కనీసం ఇన్సూరెన్స్ కూడా చెల్లించడం లేదు. బీమా కట్టకపోవడంతో వాహనాలు ఏదైనా ప్రమాదానికి గురైతే పేదల జీవితాలు వీధిపాలవుతున్నాయి. ఈ పథకంలో పనిచేసే స్వల్ప వేతన జీవులకు సకాలంలో వేతనం అందకపోవడం నిర్వహణ సంస్థల బాధ్యతా? ఇది సర్కారుది కాదా? ఏతావాతా రాష్ట్రంలో అంబులెన్సు వ్యవస్థను నీరుగార్చి ఆపదలో ఉన్నవారిని గాలికొదిలేసిన సర్కారు...ఏ కొనుగోళ్లలో ఎంత కమీషన్లు వస్తాయని చూస్తోందే కానీ నీరుగారిన పథకాన్ని పునరుద్ధరించే ఆలోచనే చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పథకం పురుడు పోసుకుని దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో అమలవుతుండగా... పురుడు పోసుకున్న చోటే ఈ పథకం పుట్టెడు కష్టాల్లోకి నెట్టేయబడుతోంది. సాక్షి, అమరావతి: ఆపదలో ఆదుకునే అంబులెన్సులకే ఆపద వాటిల్లుతోంది! అత్యవసర వాహనాలు ఆగిపోకుండా చూడాల్సిన సర్కారే వీటిని మూలనపెడుతోంది. వాహనాలకు నిధులివ్వకపోగా ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా నిర్వహణా సంస్థలపై నెపం వేస్తోంది. రెండు ప్రభుత్వ విభాగాల మధ్య నెలకొన్న వివాదంతో 50 కొత్త అంబులెన్సులు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఓ షెడ్లో మూడు నెలలుగా మూలనపడి ఉండటం సర్కారు అసమర్థతకు నిదర్శనం. ఇక రోగులను కాపాడాల్సిన అంబులెన్సుల కొనుగోలును కూడా ప్రభుత్వ పెద్దలు ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. నిధులివ్వకుండా నిర్వహణ సంస్థలపై నెపం... 108 నిర్వహణకు టెండర్లు పిలిచింది సర్కారే. ఇష్టారాజ్యంగా బాధ్యతలు కట్టబెట్టిందీ ప్రభుత్వమే. పర్యవేక్షణ మరచి ఇప్పుడు సంస్థలపై నెపం వేస్తోంది. నాలుగున్నరేళ్లుగా ఏ నెలలోనూ సకాలంలో పథకానికి నిధులు చెల్లించలేదు. వాహనాలకు మరమ్మతులు చేయించలేదు. ఎప్పుడూ వంద వాహనాలు మూలనే ఉంటున్నాయి. ప్రస్తుతం బీవీజీ సంస్థ 108 నిర్వహణా బాధ్యతలు చూస్తోంది. ఈ సంస్థ సరిగా నిర్వహించడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. టైర్లు అరిగి, డీజిల్ లేక, ఇంజన్లు రిపేరుకు రావడంతో వాహనాలు తిరగడం లేదని, వీటికి మరమ్మతులు చేయించాలని మొత్తుకున్నా సర్కారు స్పందిచటం లేదని, అలాంటప్పుడు తమపై నెపం ఎలా వేస్తారని నిర్వహణ సంస్థ ప్రశ్నిస్తోంది. ఘటనా స్థలం నుంచి బాధితులతో అంబులెన్సులు వచ్చేదాకా అనుమానమేనని సిబ్బంది పేర్కొంటున్నారు. కొన్నవీ వాడుకోవడం లేదు... కేంద్ర ప్రభుత్వ నిధులతో 50 అంబులెన్సులను ఏపీఎంఎస్ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ) మూడు నెలల క్రితం కొనుగోలు చేసింది. వీటిని రిజిస్ట్రేషన్ చేయించి వినియోగించాల్సిన బాధ్యత కుటుంబ సంక్షేమశాఖది. ఫ్యాబ్రికేషన్, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తేనే తీసుకుంటామని ఆ శాఖ చెబుతోంది. కొనుగోలు చేసి ఇచ్చామని, ఇక ఆ బాధ్యత తమది కాదని ఏపీఎంఎస్ఐడీసీ అంటోంది. ఇలా రెండు విభాగాల మధ్య వివాదంతో విజయవాడ వద్ద గన్నవరంలోని ఓ షెడ్లో కొత్త అంబులెన్సులను మూలనపడేశారు. మరోవైపు ఇప్పటివరకూ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వాహనాల తయారీ సంస్థ కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్టు తెలిసింది. కొనుగోలుచేసిన వాహనాలను ఎందుకు వాడుకోవడం లేదని 108 వాహనాల పర్యవేక్షణాధికారి డా.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు. తిరిగేవి 310... డాష్‌బోర్డులో 414 సీఎం కోర్ డ్యాష్‌బోర్డులో మాయలు జరుగుతున్నాయనేందుకు 108 వాహనాల వివరాలే నిదర్శనం. రాష్ట్రంలో మొత్తం 439 వాహనాలుండగా రోడ్డుమీద తిరుగుతున్నవి తక్కువగా ఉంటున్నాయి. సోమవారం వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 108 ఉద్యోగుల నుంచి సేకరించిన సమాచారం మేరకు 310 వాహనాలు తిరిగినట్టు తేలింది. కానీ సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రి కోర్‌డాష్ బోర్డును పరిశీలిస్తే 414 వాహనాలు తిరిగినట్టు పొందుపరిచారు. 94.91 శాతం వాహనాలు తిరిగాయని చూపించారు. సీఎం కోర్‌డాష్ బోర్డులో ఉన్న లెక్కల ప్రకారమే వాహనాలకు బిల్లుల చెల్లింపు జరుగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే రోజుకు 100కిపైగా వాహనాలను ఎక్కువ చూపించి బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలుతోంది. వాహనం తయారీదారు దగ్గరే కొంటే... వాహనాలను తయారు చేసే కంపెనీ నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే తక్కువ ధరకు లభిస్తాయి. అలా కాకుండా ఫ్యాబ్రికేషన్ చేసే ఇన్‌స్ట్రోమెడిక్స్ సంస్థ నుంచి అంబులెన్సులను కొన్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సలహాదారు జితేంద్రశర్మకు అత్యంత సన్నిహితుడిదనే చర్చ జరుగుతోంది. 89 వాహనాలను ఈ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల ఒక్కో వాహనానికి రూ.5.39 లక్షలకు పైగా అధికంగా (టాటా అంబులెన్సులతో పోలిస్తే) చెల్లించారు. ఇందులో కమీషన్లు చేతులు మారాయని, ముఖ్యనేతల ప్రమేయం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాబ్రికేషన్‌లో ఏముంటాయంటే..? ఫ్యాబ్రికేషన్ అంటే రకరకాల పరికరాలను అమర్చుకునేందుకు ఏర్పాటు చేసే వసతులు. అంబులెన్సులో ప్రధానంగా ఫ్యాబ్రికేషన్‌కు సంబంధించి చేతులు శుభ్రం చేసుకునేందుకు స్టీల్సింకు, అల్మారాలు, మందులు నిల్వ చేసుకునేందుకు అల్మారాలు, టూల్ బాక్సు, స్ట్రెచర్ కదలకుండా ఉండేందుకు ఒక స్టాండు, మల్టీచానెల్ మానిటర్ పరికరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఒక స్టాండు, ఆక్సిజన్ రెగ్యులేటర్, టూల్బాక్సు మీద మనిషి కూర్చోవడానికి షీటు తదితరాలన్నీ ఉంటాయి. ఏ వాహనానికైనా దాదాపుగా ఇవే ఉంటాయి. అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు అంబులెన్సుకు కూడా ఒకటి రెండు మినహా మరేమీ మారవు. ఆగస్ట్ 21 తర్వాత వేతనమే ఇవ్వలేదు 108లో దాదాపు 2 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆగస్ట్ 21న వేతనం ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పటివరకూ ఇవ్వలేదు. పలుసార్లు వినతిపత్రాలు సమర్పించినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ సంస్థ వచ్చాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి నెలా వేతనంలో కట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు. అడిగితే స్పందించేవారు లేరు. మా పరిస్థితి దయనీయంగా ఉంది. – కిరణ్‌కుమార్ (108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు) వాహనం రూ.8.45 లక్షలు.. ఫ్యాబ్రికేషన్‌కు రూ.9.54 లక్షలు సాధారణంగా ఎక్కడైనా వాహనం ఖరీదు కంటే ఫ్యాబ్రికేషన్ వ్యయం ఎక్కువగా ఉండదు. కానీ ఫ్యాబ్రికేషన్ పేరుతో ప్రభుత్వం ఒక్కో వాహనానికి రూ.9.54 లక్షల దాకా చెల్లించడం గమనార్హం. 2016లో రాష్ట్రప్రభుత్వం 76 అంబులెన్సులను ఫోర్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. మరో 13 వాహనాలను కూడా అదే కంపెనీ నుంచి కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు నిధులతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఫోర్స్ కంపెనీకి చెందిన ఒక్కో అంబులెన్స్ ఖరీదు రూ.8.45 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్ పనుల కోసం అదనంగా రూ.9,54,696 చెల్లించారు. అంటే వాహనంధర కన్నా వంద శాతం ఎక్కువగా చెల్లించడం గమనార్హం. గతంలో అంబులెన్సులకు ఫ్యాబ్రికేషన్ చేయించినప్పుడు రూ.2 లక్షలకు మించి కాలేదు. కానీ టీడీపీ సర్కారు ఏకంగా రూ.తొమ్మిదిన్నర లక్షలకు మించి ఖర్చు చేసింది. అత్యవసరానికి ఉపయోగపడే పరికరాలు అంటే డిఫ్రిబ్యులేటర్, ఆక్సిజన్ పైప్‌లైన్, మందులు తదితరాలకు మళ్లీ ప్రభుత్వమే ప్రత్యేకంగా చెల్లిస్తుంది. తెలంగాణలో రూ.11.65 లక్షలకే... కొద్ది నెలల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్‌లను కొనుగోలు చేసింది. ఒక్కో అంబులెన్స్ ఖరీదు రూ.9.30 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్‌కు రూ.2.35 లక్షలు వెచ్చించింది. దీన్నిబట్టి ఒక్కో వాహనం ఖరీదు రూ.11.65 లక్షలుగా తేలిపోతోంది. తెలంగాణ సర్కారు వీటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. టాటా ఫ్యాబ్రికేటెడ్ 12.60 లక్షలలోపే టాటా కంపెనీ నుంచి 2016లో 202 అంబులెన్స్‌లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ‘ప్యాబ్రికేషన్’తో కలిపి ఒక్కో వాహనాన్ని రూ.12,60,106 చొప్పున విక్రయించారు. ప్రస్తుతం ఈ వాహనాల ధర ఇంకా తగ్గినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్నిబట్టి కమీషన్ల మాయాజాలం జరిగినట్లు తేటతెల్లం అవుతోంది. -
‘టాటా’ సునామీ!
ఉప్పు నుంచి విమానం విడిభాగాల వరకూ సకల రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ వెలుగులీనుతున్న కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపులో అకస్మాత్తుగా తలెత్తిన పెను సంక్షోభం సహజంగానే అందరినీ విస్మయానికి గురిచేసింది. సోమవారం జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశం ఉన్నట్టుండి సంస్థ చైర్మన్ సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించి, ఆ స్థానంలో తాత్కాలికంగా తిరిగి రతన్ టాటాను రప్పించడం ఎవరూ ఊహించని పరిణామం. ఆ పదవికి సమర్థత గల మరొకరిని ఎంపిక చేయడం కోసం సెర్చ్ కమిటీ కూడా ఏర్పాటైంది. సైరస్ న్యాయస్థానాలను ఆశ్రయించగలరన్న అంచనాతో సుప్రీంకోర్టునుంచి వివిధ కోర్టుల వరకూ టాటా గ్రూపు కేవియట్ పిటిషన్లు దాఖలు చేసింది. అంతేకాదు... తన నిర్ణయాలకు సమర్ధనగా సీనియర్ న్యాయవాదులతో వివిధ చానెళ్లలో మాట్లాడించింది. అయితే సైరస్గానీ, ఆయన తరఫున మరొకరు గానీ మీడియా ముందుకు రాలేదు. సైరస్ చైర్మన్ అయ్యాక ఆయన కుటుంబానికి చెందిన షాపోర్జీ పల్లోంజీ సంస్థకు టాటాలో కొత్తగా ఎలాంటి కాంట్రాక్టులూ ఇవ్వలేదని, కనుక ఆయన వైపునుంచి ‘పరస్పర విరుద్ధ ప్రయోజనాల’ను నెరవేర్చుకోవడమన్న ప్రసక్తే తలెత్తదన్న వివరణ మాత్రం సైరస్ కార్యాలయంనుంచి వెలువడింది. 150 ఏళ్ల టాటా మహా సామ్రాజ్యంలో ఇలాంటి పరిణామం కనీవినీ ఎరుగనిది. ఆ మాటకొస్తే టాటా వంటి సంస్థకు బయటి వ్యక్తి సారథ్యంవహించడాన్ని సైతం ఎవరూ ఊహించలేదు. అందుకే 2011లో సైరస్ను రతన్ టాటా తన వారసుడిగా ప్రకటించినప్పుడూ అందరూ ఆశ్చర్యపోయారు. అలాగని ఆయన పూర్తిగా బయటి వ్యక్తేమీ కాదు. డైరె క్టర్‌గా సంస్థలో అంతకు చాలాముందునుంచీ పనిచేస్తున్నారు. రతన్ వారసుడి అన్వేషణకు అయిదేళ్లక్రితం అయిదుగురు సభ్యుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిటీలో సైరస్ కూడా సభ్యుడే. చైర్మన్ పదవికి అర్హులైనవారి కోసం ఆ కమిటీ 15 నెలలు గాలించింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే సైరస్ దాన్నుంచి వైదొలగి తాను కూడా ఒక పోటీదారయ్యారు. కమిటీ ఏకగ్రీవంగా తీసు కున్న తుది నిర్ణయం సంగతలా ఉంచి, రతన్‌కి ఇష్టం లేకుండా ఇదంతా జరిగిందని ఎవరూ అనుకోలేరు. రతన్ 1991లో సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాక 21 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగి తనదైన ముద్ర వేశారు. 2005లో ఆంగ్లో–డచ్ ఉక్కు కంపెనీ కోరస్‌ను కొనుగోలు చేయడం, మరో బహుళజాతి లగ్జరీ కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో సొంతం చేసుకోవడం, బ్రిటన్‌కు చెందిన టెట్లీ టీ సంస్థను చేజిక్కించుకోవడం వంటి సంచలన నిర్ణయాలతో సంస్థకు ఆయన అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చారు. అది మదుపుదారుల్లోనూ, వినియోగదారు ల్లోనూ సంస్థ మీదున్న విశ్వాసాన్ని మరింతగా పెంచింది. రతన్ టాటా దూకుడు ఒక్కటే కాదు...అప్పటి మార్కెట్ పరిస్థితులు కూడా అందుకు అనుకూలించాయి. ఈ నేపథ్యంలో దాన్ని నిలబెట్టడం సైరస్‌కే కాదు ఎవరికైనా పెను సవాలే. ఆయన దాన్ని సరైన స్ఫూర్తితో స్వీకరించి విజయం సాధించగలిగారా? అందుకు ఏదో ఒక జవాబునే చెప్పడం కష్టం. సైరస్ పదవి చేపట్టేనాటికి నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న టాటా గ్రూపు విలువ ఇప్పుడు దాదాపు రెట్టింపైంది. ఇలాంటి పరిస్థితుల్లో సైరస్ విఫలమయ్యారని చెబితే అది అసత్యమవుతుంది. అదే సమయంలో గ్రూపులోని వివిధ సంస్థల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. రతన్ టాటా హయాంలో విజయవంతమైనవిగా కనబడిన నిర్ణయాల్లోనే పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని అనంతరకాలంలో నిరూపణ అయింది. టాటా సంస్థల అప్పు 10 రెట్లు పెరిగింది. టాటా మోటార్స్ ఒక్కటే గత ఆర్ధిక సంవత్సరం అమ్మకాల్లో ప్రగతి సాధించింది. అది నమోదు చేసిన 5 శాతం వృద్ధిలో సింహభాగం జాగ్వార్ ల్యాండ్‌రోవర్ నికరమైన పనితీరు వల్లే సాధ్యమైంది. ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆదాయంలో నిరుడు 7.1 శాతం వృద్ధి కనబడినా మొన్న జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నమోదైన 3.4 శాతం వృద్ధి... అంతకు ముందు సంవ త్సరాల్లో ఇదే సమయానికి ఉన్న వృద్ధితో పోలిస్తే చాలా తక్కువ. పైగా గ్రూప్‌లో ఎప్పుడూ రెండో స్థానంలో ఉండే టాటా స్టీల్ అమ్మకాలు 16 శాతం మేర పడి పోయాయి. దాని అనుబంధ సంస్థ టాటా స్టీల్ యూరప్ భారీ నష్టాలు చవి చూస్తున్నదన్న కారణంతో సైరస్ అమ్మకానికి పెట్టారు. ఈ నిర్ణయాన్ని ఆర్ధిక నిపు ణులంతా ప్రశంసించారుగానీ... దాన్ని కొనే నాథుడే లేకుండా పోయాడు. వీటన్నిటికీ కేవలం సైరస్నే బాధ్యుణ్ణి చేయడం న్యాయం కాదు. యూరప్ లోనూ, ప్రత్యేకించి బ్రిటన్‌లోనూ నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, ఐటీ రంగ సంక్షోభం లాంటివి కూడా అందుకు దోహదపడ్డాయి. పైగా అనేక వివాదాలు సంస్థను చుట్టు ముట్టాయి. వాటి విషయంలో తీసుకున్న నిర్ణయాలు టాటా గ్రూప్ పేరుప్రతిష్టల్ని దెబ్బతీశాయన్న భావం ఏర్పడింది. జపాన్‌కు చెందిన డొకోమోతో తెగదెంపులు, తమకు 120 కోట్ల డాలర్లు చెల్లించాలన్న ఆ సంస్థ వ్యాజ్యం, టీసీఎస్ సంస్థపై వచ్చిన వ్యాజ్యంలో వంద కోట్ల డాలర్ల పరిహారం చెల్లించాలన్న కోర్టు ఆదేశాలు, యూపీలోని యూరియా ప్లాంట్ విక్రయం, ఇండొనేసియా బొగ్గు గని సంస్థలో 30శాతం వాటా అమ్మకం వగైరాలు టాటా గ్రూప్ పనితీరుపై సందేహాలు తీసు కొచ్చాయి. సంస్థను పటిష్టం చేయడానికి ఆయన వద్దనున్న వ్యూహాలేమిటన్నది ఎవరికీ అంతుపట్టలేదు. తనను అన్యాయంగా తొలగించారని, కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని సైరస్ అన్నట్టు వార్తలొచ్చాయి. సైరస్ తీరు సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంటున్నవారు ఈ చర్యలోని సహేతుకతపై కూడా వివరణ నివ్వాల్సి ఉంటుంది. ఇందులో చట్టవిరుద్ధత ఏమీ లేదన్నది ముందూ మునుపూ కోర్టులో తేలితే తేలొచ్చు. కానీ ఆ పదవికి పోటీపడేవారిపై ఇది చూపగల ప్రభావం తక్కువేమీ కాదు. కార్పొరేట్ యుద్ధాలు ఎంత వేగంతో ప్రారంభమై విస్మయ పరుస్తాయో, అంతే త్వరగా చప్పున చల్లారి వింత గొలుపుతాయి. ఈ వివాదం సైతం న్యాయస్థానాల వరకూ పోకుండా సామరస్యపూర్వకంగా పరిష్కారమైతే అది అందరికీ మంచిది. -
ఆర్టీసీకి ‘లోఫ్లోర్’ కష్టాలు!
జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం అంటగట్టిన లోఫ్లోర్ బస్సులు - ఆరేళ్లకే నడవలేక మొరాయించిన వైనం - మరమ్మతులతో రూ.కోట్లలో వ్యయం - భరించలేక పాత బాడీ తీసేసి కొత్తగా బాడీ ఏర్పాటు - ప్రతి బస్సుకు రూ.10 లక్షల చొప్పున రూ.100 కోట్ల ఖర్చు - కేంద్రం సాయం కంటే ఈ వ్యయమే ఎక్కువ సాక్షి, హైదరాబాద్: ‘చారానా కోడికి బారానా మసాలా..’.. జేఎన్ఎన్యూఆర్ఎం బస్సుల విషయంలో ఆర్టీసీ అధికారులు ఇదే సామెతను గుర్తుచేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సులతో తిప్పలు పడలేక ఆర్టీసీ సతమతం అవుతోంది. కొత్త బస్సులు కొనేందుకు అవకాశం లేక.. ఆ బస్సులనే మన పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. లోఫ్లోర్ బస్సుల కోసం కేంద్రం తన వంతు వాటాగా చేసిన ఆర్థిక సాయం కంటే.. ఇప్పుడు వాటిని బాగుచేసుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తంగా ఆ బస్సులతో ఇంతకాలం వచ్చిన నష్టాలతో ఖజనాకు కన్నం పడితే, బాగు చేసుకుంటేగాని నడవని స్థితిలో ఉన్న వాటికి ఇప్పుడు పెడుతున్న ఖర్చు ఆర్టీసీకి తడిసి మోపడవుతోంది. మోయలేని భారం.. విదేశీ నగరాల్లో నేల నుంచి తక్కువ ఎత్తులో ఫ్లోర్ (బస్సులో మన పాదాల కింద ఉండే భాగం) ఉండే బస్సులు ఆకట్టుకుంటాయి. వాటినే లోఫ్లోర్ బస్సులుగా చెబుతారు. అదే మన బస్సులు ఎత్తుగా ఉండి.. మూడు నాలుగు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అది వృద్ధులకు, పెద్ద వయసువారికి ఇబ్బంది కలిగించే అంశం. దీంతో విదేశీ తరహాలో లోఫ్లోర్ బస్సులను తేవాలని భావించిన అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం... జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేసింది. సాధారణంగా జేఎన్ఎన్యూఆర్ఎం కింద కేంద్రం తన వాటా నిధులు విడుదల చేస్తే... మిగతా నిధులను ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలుపుకొని బస్సులు కొనుగోలు చేస్తాయి. కానీ 2010లో కేంద్ర ప్రభుత్వమే బస్సులను బాడీతోసహా రూపొందించి సరఫరా చేసే బాధ్యతను పలు కంపెనీలకు అప్పగించింది. అలా హైదరాబాద్‌కు వెయ్యి బస్సులు మంజూరు చేసింది. అందులో టాటా కంపెనీ మార్కోపోలోతో ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసిన బస్సుల బాడీ దారుణంగాఉండటంతో పాటు ఆ నమూనా మన రోడ్లకు సరిపడలేదు. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ బస్సులు బాగా దెబ్బతిన్నాయి. నిత్యం మరమ్మతులు చేస్తూ ఉంటేనే తప్ప కదలలేని స్థితికి చేరడంతో.. ఆర్టీసీకి భారీగా చేతి చమురు వదలడం మొదలైంది. అంతేగాకుండా ఆ బస్సుల బాడీ ఉక్కు (మైల్డ్ స్టీల్)తో రూపొందడంతో బరువు ఎక్కువగా ఉండి మైలేజీ తగ్గి ఖర్చు మరింత పెరిగింది. సాధారణంగా ఒక బస్సు 12 లక్షల కిలోమీటర్లు తిరిగినా.. 15 సంవత్సరాల పాటు కొనసాగినా, వాటిని తుక్కు కింద పరిగణించవచ్చు. కానీ ఈ బస్సులు ఆరేళ్లకే తుక్కుగా మారాయి. నిబంధనల ప్రకారం తుక్కు కింద తొలగించే అవకాశం లేదు, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకునే స్థోమత ఆర్టీసీకి లేదు. దీంతో వాటి బాడీని తొలగించి హైదరాబాద్ రోడ్లకు తగిన నాణ్యతతో, సాధారణ డిజైన్ బాడీని అమర్చడం మొదలుపెట్టారు. ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చు జేఎన్ఎన్యూఆర్ఎం కింద ఇచ్చిన ఆ బస్సుల బాడీని తీసేసి.. అల్యూమినియంతో సాధారణ డిజైన్‌లో రూపొందించే పని మొదలుపెట్టారు. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్‌కు ఈ బాధ్యత అప్పగించారు. అక్కడ నెలకు 25 బస్సులకు మించి బాడీ రూపొందించే సామర్థ్యం లేదు. దీంతో ఈ సంవత్సరం 300 బస్సులకు కొత్త బాడీలు రూపొందించే పని మొదలుపెట్టి.. 175 బస్సులకు అమర్చారు. ఇందుకోసం ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చవుతోంది. దీంతో కేంద్రం ఇచ్చిన వాటా సంగతేమోగానీ.. ఆర్టీసీ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే బస్ బాడీ మార్చాక బరువు తగ్గి వాటి మైలేజీ బాగా మెరుగుపడిందని, ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో కేంద్రం నుంచి వాటా నిధులే తప్ప బస్సులు తీసుకోవద్దని ఆర్టీసీ గట్టిగా నిర్ణయించుకుంది. -
పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి
టాటా సంస్థలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం ప్రభుత్వానికి సహకరిస్తామన్న టాటా గ్రూప్‌ల చైర్మన్ మిస్త్రి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని టాటా సంస్థలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. పారిశ్రామిక, ఐటీ, విద్య, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో అనుభవం ఉన్న టాటా కన్సల్టెన్సీ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. సీఎం అధికారిక నివాసంలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రి తన ప్రతినిధి బృందంతో బుధవారం సీఎం కేసీఆర్‌ను కలి శారు. ప్రభుత్వం తయారు చేసిన పారిశ్రామిక ముసాయిదా విధానం చాలా బాగుందని, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని మిస్త్రి అభిప్రాయపడ్డారు. ‘పారిశ్రామిక వృద్ధితో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి, కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం, అందరికీ వైద్యం వంటి పథకాలను చేపడుతున్నామ ని... ఏ ఒక్క రంగాన్నీ కూడా విస్మరించడం లే దు. పారిశ్రామిక భూములపై సర్వే జరుగుతోం ది. హైదరాబాద్ నగరంలో 1,700 గుర్తించిన మురికివాడలు ఉన్నాయి. వీటిలో ఇండ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం’ అని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్రమాల కు టాటా కన్సల్టెన్సీ సేవలు అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ అనుభవం, విజ్ఞానం, సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని మిస్త్రి హామీ ఇచ్చారు. ‘ఉచిత నిర్బంధ విద్య అమలుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలతోపాటు బోధన పద్ధతులు మొదలైన వాటిలో తమ వద్ద అవసరమైన సమాచారం ఉంది. ఇందుకోసం కేటాయించిన యంత్రాంగాన్ని ప్రభుత్వానికి సహకరించేందుకు ఉపయోగిస్తాం. గ్రామాల్లో పర్యటించి తరగతులను కూడా స్వయంగా చూసి కావాల్సిన సలహాలు ఇస్తారు’ అని మిస్త్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా మార్చాలన్న సీఎం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, వాటి రూపురేఖలు మార్చేందుకు అవసరమైన విధాన రూపకల్పనలోనూ సహకారం అందిస్తామని ప్రకటించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారు కూడా మెరుగైన జీవితాన్ని అందుకునే విధంగా కాలనీలు ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన కోసం ఆలోచించాలని కేసీఆర్ కోరారు. దీనిపై తాము ఇప్పటికే అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే ఫలితాలు సాధిస్తామని మిస్త్రి వివరించారు. సమావేశంలో ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మిశ్రా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. వైమానిక, ఆటో రంగాల్లో మహీంద్రా పెట్టుబడులు 9న కేసీఆర్‌తో మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో భేటీ హైదరాబాద్: రాష్ర్టంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సిద్ధమవుతోంది. విమానయాన, ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఈ నెల 9న సీఎం కేసీఆర్‌తో మహీం ద్రా అండ్ మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో ప్రవీణ్ షా భేటీ కానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో వైమానిక, ఆటో రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫ్రాన్స్ కార్ల తయారీ కంపెనీ ఫ్యూజోతో మహీంద్రా కం పెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో యూనిటు ఏర్పాటుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కూడా కుదిరింది. తాజాగా మహీంద్రాతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ యూనిట్‌ను మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌కు మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జహీరాబాద్‌లో మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లతోపాటు ట్రాలీ యూనిట్ కూడా ఉంది. డిసెంబరులో ట్రాలీ యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇక్కడే కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని.. మహీంద్రా ఆలోచిస్తోం దని ప్రభుత్వవర్గాలు వివరించాయి. మరోవైపు తాజాగా ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన మహీంద్రా.. ఈ రంగంలోనూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఇప్పటికే టాటా సంస్థ విమానయానరంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రం గంలో పెట్టుబడులను తెలంగాణలోనే పెట్టాలని మహీంద్రా భావిస్తున్నట్టు సమాచారం. -
‘ఆది’బట్లలో అంకురార్పణ
తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ స్థాపన ఇక్కడే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సెజ్‌లో విమానాల తయారీ కంపెనీ రూ.500 కోట్ల పెట్టుబడితో జర్మనీ కంపెనీతో టాటా భారీ ఒప్పందం చిగురిస్తున్న రియల్ ఆశలు ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్రంలో తొలి పరిశ్రమ ఆదిబట్లలోనే రూపుదిద్దుకోనుంది. రూ. 500 కోట్ల పెట్టుబడితో ‘టాటా’ కంపెనీ ప్రతిష్టాత్మక పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. టాటా లాకిడ్ మార్టిన్, టాటా ‘తారా’ వంటి హెలికాప్టర్ పరికరాల తయారీ కంపెనీల సరసన మరో పరిశ్రమ ఏర్పాటుకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ రూపకల్పన చేసింది. దేశంలోనే మొత్తం విమానాన్ని తయారుచేసే ప్రథమ పరిశ్రమకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. ఆదిబట్లలో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దీనిలో డార్నియార్ విమానాలకు సంబంధించిన మొత్తం పరికరాలన్నీ తయారవుతాయి. రూ.500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనున్నారు. జర్మనీకి చెందిన రుయాగ్ (ఆర్‌యూఏజీ) సంస్థతో టాటా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని దీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రెండు దశల్లో విమాన విడిభాగాల పరికరాలు తయారు చేస్తారు. మొదటి దశలో ప్రధాన భాగాల్ని, క్యాబిన్‌ను, రెండో దశలో పూర్తి విమానానికి రూపకల్పనచేస్తారు. పూర్తిస్థాయి విమానాన్ని రూపొందించే సంస్థ ఒకే చోట ఏర్పాటు కావడం దేశంలోనే ప్రథమం. దీంతో పలు కంపెనీల ఆగమనంతో ఆదిబట్లకు డార్నియార్ విమానాల రూపంలో మరో పరిశ్రమ రావడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. టాటా సెజ్.. పలు ఐటీ, ఐటీ ఆధారిత, విమాన భాగాల తయారీ వంటి ప్రక్రియల కోసం 2009లో ఏపీఐఐసీ టాటా కంపెనీకి సుమారు 250 ఎకరాల భూమిని అప్పగించింది. ఈ క్రమంలో ఈ సెజ్‌లో ఇప్పటికే పలు కంపెనీలొచ్చాయి. లాకిడ్ మార్టిన్, తారా, టీసీఎస్ వంటి కంపెనీలు టాటా ఆధ్వర్యంలో తమ నిర్మాణ, ఉత్పత్తి పనులకు కేంద్రంగా మారుతూ శరవేగంగా దూసుకెళ్తున్నాయి. గతంలో అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం టాటా విమాన విడిభాగాల తయారీ కంపెనీలోని కొన్ని విభాగాల్ని ప్రారంభించారు. ప్రస్తుతం టాటా కంపెనీ జర్మనీ సంస్థతో ఏర్పరచుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం తాజా పరిశ్రమకు శ్రీకారం చుట్టింది. నాడు కుగ్రామం.. నేడు స్పేస్ సిటీ.. ఆదిబట్ల పేరు రోజురోజుకూ మార్మోగుతోంది. ఒక ప్పుడు కుగ్రామంగా ఉన్న ఆదిబట్ల నేడు స్పేస్సిటీగా రూపాంతరం చెందింది. పలు ఐటీ కంపెనీలకు కేంద్రస్థానంగా నిలిచింది. కేంద్రప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్‌కు కూడా ఆదిబట్ల ప్రధాన కేంద్రంగా మారింది. పలు బహుళజాతి పరిశ్రమలకు ఆదిబట్ల కేంద్రస్థానమవుతోంది. ఆదిబట్ల అభివృద్ధి చెందడంపై స్థానికులు, వ్యాపారులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. అతి తక్కువ కాలంలోనే ప్రపంచస్థాయి పెట్టుబడులకు కేంద్రంగా మారిన ఆదిబట్లలో స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెడ్ కార్పెట్.. తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందారు. పెట్టుబడులన్నీ వెనక్కిపోతాయని కొందరు దుష్ర్పచారం కూడా చేశారు. దీంతో కొంత కాలంగా తెలంగాణలో పెట్టుబడులేవీ జరగలేదు. తొలిసారిగా రూ.500 కోట్ల పెట్టుబడితో విదేశీ సంస్థ ఒప్పందంతో భారీస్థాయి విమానాల తయారీ కేంద్రం రావడంతో పరిశ్రమలకు ఢోకా లేదని స్పష్టమైంది. మరోవైపు పెట్టుబడులు పెట్టేవారు టాటాను స్ఫూర్తిగా తీసుకుని పరిశ్రమల పెట్టుబడుల కోసం క్యూ కట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ విమానాల పరికరాల తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేయడంతో పరిశ్రమల ఉనికి ఎలా ఉంటుందోనన్న సందేహాలు తొలిగాయి. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెడతామని.. కో ఆపరేటివ్ విధానాన్ని ఏర్పాటుచేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో పరిశ్రమల ఏర్పాటుకు రెడ్ కార్పెట్ పరిచినట్టయింది. మరోవైపు అందర్నీ తనవైపు ఆకర్షిస్తున్న ఆదిబట్లలో మరిన్ని బహుళజాతి కంపెనీలు వచ్చేందుకు ఆస్కారముంది. పుంజుకోనున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గతంలో వలెనే ఆదిబట్లలోరియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోనుంది. తెలంగాణ ఏర్పాటైతే పెట్టుబడులు, పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతాయని అపోహ ఉండటంతో ఇన్నాళ్లూ ఈ వ్యాపారంలో స్తబ్ధత నెలకొంది. టాటా వంటి ప్రముఖ కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆదిబట్లను కేంద్రంగా ఎంచుకోవడంతో ఈ ప్రాంతంలో రియల్ జోరు మళ్లీ పుంజుకోనుందని అందరూ భావిస్తున్నారు. టాటా కంపెనీల ఆగమనంతో గతంలో ఈ ప్రాంతంలో ఎకరా రూ.2కోట్లపైపే పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థిరాస్తి రేట్లు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు, వ్యాపారులు భావిస్తున్నారు. -
టాటా సెజ్‌ను సందర్శించిన చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని టాటా కంపెనీని సందర్శించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలో హెలికాప్టర్ విడిభాగాల తయారీ విధానాన్ని, ఆయూ పరికరాలను కేంద్రవుంత్రి పరిశీలించారు. హైదరాబాద్‌లో సినీ ఉత్సవాలకు హాజరయ్యేందుకు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్రమంత్రి నోవాటెల్ హోటల్లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం నోవాటెల్ హోటల్లోనే బీమా ఎలక్ట్రానిక్ నిక్షిప్త సమాచారం కార్యక్రమాన్ని ప్రారంభించిన చిదంబరం అనంతరం ఆదిభట్లలో టాటా సెజ్‌కు వెళ్లారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్‌తో పాటు లాకిడ్ మార్టిన్ సంస్థను కూడా సందర్శించారు. చిదంబరం పర్యటన దృష్ట్యా పోలీసులు ఆదిభట్ల పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన అనంతరం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన చిదంబరాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నొవాటెల్ హోటల్ లో కలిశారు.