పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి | TATA Chairman Cyrus Mistry meets KCR | Sakshi
Sakshi News home page

పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి

Published Thu, Aug 7 2014 3:14 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి - Sakshi

పునర్నిర్మాణంలో భాగస్వాములుకండి

టాటా సంస్థలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం
ప్రభుత్వానికి సహకరిస్తామన్న టాటా గ్రూప్‌ల చైర్మన్ మిస్త్రి

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని టాటా సంస్థలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కోరారు. పారిశ్రామిక, ఐటీ, విద్య, మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో అనుభవం ఉన్న టాటా కన్సల్టెన్సీ సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. సీఎం అధికారిక నివాసంలో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రి తన ప్రతినిధి బృందంతో బుధవారం సీఎం కేసీఆర్‌ను కలి శారు. ప్రభుత్వం తయారు చేసిన పారిశ్రామిక ముసాయిదా విధానం చాలా బాగుందని, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని మిస్త్రి అభిప్రాయపడ్డారు. ‘పారిశ్రామిక వృద్ధితో పాటు ఐటీ, గ్రామీణాభివృద్ధి, కేజీ టు పీజీ ఉచిత విద్య పథకం, అందరికీ వైద్యం వంటి పథకాలను చేపడుతున్నామ ని... ఏ ఒక్క రంగాన్నీ కూడా విస్మరించడం లే దు. పారిశ్రామిక భూములపై సర్వే జరుగుతోం ది. హైదరాబాద్ నగరంలో 1,700 గుర్తించిన మురికివాడలు ఉన్నాయి.

వీటిలో ఇండ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం’ అని కేసీఆర్ వివరించారు. ఈ కార్యక్రమాల కు టాటా కన్సల్టెన్సీ సేవలు అవసరమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తమ అనుభవం, విజ్ఞానం, సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తామని మిస్త్రి హామీ ఇచ్చారు. ‘ఉచిత నిర్బంధ విద్య అమలుకు కావాల్సిన శిక్షణ కార్యక్రమాలతోపాటు బోధన పద్ధతులు మొదలైన వాటిలో తమ వద్ద అవసరమైన సమాచారం ఉంది. ఇందుకోసం కేటాయించిన యంత్రాంగాన్ని ప్రభుత్వానికి సహకరించేందుకు ఉపయోగిస్తాం. గ్రామాల్లో పర్యటించి తరగతులను కూడా స్వయంగా చూసి కావాల్సిన సలహాలు ఇస్తారు’ అని మిస్త్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా మార్చాలన్న సీఎం నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మురికివాడల్లో మౌలిక వసతుల కల్పన, వాటి రూపురేఖలు మార్చేందుకు అవసరమైన విధాన రూపకల్పనలోనూ సహకారం అందిస్తామని ప్రకటించారు. తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారు కూడా మెరుగైన జీవితాన్ని అందుకునే విధంగా కాలనీలు ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన కోసం ఆలోచించాలని కేసీఆర్ కోరారు. దీనిపై తాము ఇప్పటికే అధ్యయనం చేస్తున్నామని, త్వరలోనే ఫలితాలు సాధిస్తామని మిస్త్రి వివరించారు. సమావేశంలో ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మిశ్రా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు పాల్గొన్నారు.       
 
 వైమానిక, ఆటో రంగాల్లో మహీంద్రా పెట్టుబడులు
 9న కేసీఆర్‌తో మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో భేటీ

 
హైదరాబాద్: రాష్ర్టంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సిద్ధమవుతోంది. విమానయాన, ఆటో రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ కంపెనీ భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఈ నెల 9న సీఎం కేసీఆర్‌తో మహీం ద్రా అండ్ మహీంద్రా ఆటో కంపెనీ సీఈవో ప్రవీణ్ షా భేటీ కానున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో వైమానిక, ఆటో రంగాల్లో భారీ పెట్టుబడులు ప్రకటించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఫ్రాన్స్ కార్ల తయారీ కంపెనీ ఫ్యూజోతో మహీంద్రా కం పెనీ ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో యూనిటు ఏర్పాటుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయు) కూడా కుదిరింది.  తాజాగా మహీంద్రాతో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ యూనిట్‌ను మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌కు మార్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జహీరాబాద్‌లో మహీంద్రా కంపెనీ ట్రాక్టర్లతోపాటు ట్రాలీ యూనిట్ కూడా ఉంది.

డిసెంబరులో ట్రాలీ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభించనుంది. ఇక్కడే కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని.. మహీంద్రా ఆలోచిస్తోం దని ప్రభుత్వవర్గాలు వివరించాయి. మరోవైపు తాజాగా ఏరోస్పేస్ రంగంలోకి అడుగుపెట్టిన మహీంద్రా.. ఈ రంగంలోనూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఇప్పటికే టాటా సంస్థ విమానయానరంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ రం గంలో పెట్టుబడులను తెలంగాణలోనే పెట్టాలని మహీంద్రా భావిస్తున్నట్టు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement