టాటా ప్లే బింజ్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. అతి తక్కువ ధరకే ఒకే వేదికపై 25 ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా కేవలం ఒక్కసారి పేమెంట్ చేసి..లాగిన్ చేస్తే సరిపోతుంది.
బింజ్ మొబైల్ యాప్ సర్వీస్
ఈ అవకాశాన్ని టాటా ప్లే డీటీహెచ్ సబ్‌స్కైబర్లతో పాటు సాధారణ వీక్షకులు సైతం వినియోగించుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇక నాన్ బింజ్ సబ్‌స్క్రైబర్లు బింజ్ మొబైల్ యాప్‌లో బేసిక్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటకే బింజ్‌ను ఉపయోగిస్తున్న కస్టమర్లు టాటా ప్లే బింజ్ సర్వీసులు ఇతర ఛార్జీలు, సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సిన అవసరం లేదు. టాటా ప్లే డీటీహెచ్ యూజర్లు నామ మాత్రం రుసుముతో బింజ్ మొబైల్ యాప్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
యూజర్ల సౌలభ్యం కోసమే
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే తడిసి మోపెడవుతుంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా పుట్టుకొచ్చిందే ఈ టాటా ప్లే బింజ్ యాప్. ఈ యాప్‌లో నెలవారీ సాధారణ మొత్తాన్ని చెల్లించి పదుల సంఖ్యలో ఓటీటీ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్కువ గంటలు చూసే వెసలు బాటు , సులభంగా సెర్చ్ చేసే అవకాశం ఉండడంతో ఓటీటీ లవర్స్ టాటా బిజ్ యాప్‌ను వినియోగిస్తుండగా..వారిని మరింతగా ఆకర్షించేందుకు భారీ ఆఫర్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది ఆ సంస్థ.
టాటా ప్లే బింజ్ మెగా సబ్‌స్క్రిప్షన్
ఇందులో భాగంగా టాటా ప్లే బింజ్ మెగా సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ కంటెంట్‌ను యూజర్లకు అందిస్తుంది. ఇందులో 25 రకాల ఓటీటీ కంటెంట్‌ను చూడొచ్చు. వాటిల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, వూట్ సెలక్ట్, సోనీలివ్, ఎంఎక్స్ ప్లేయర్, లైన్స్ గేట్ ప్లే, ఎరోస్ నౌ, హంగామా ప్లే, షీమారోమీ, ఎపిక్ ఆన్, డక్‌బే, క్యూరియాసిటీ స్ట్రీమ్, వూట్ కిండ్స్, షార్ట్స్ టీవీ, ట్రావెల్ ఎక్స్‌పీ, సన్ నెక్ట్స్, హోయిచోయి, నమ్మా ఫ్లిక్స్, ప్లానెట్ మరాఠీ, చౌపల్, కూడ్, తరంగ్ ప్లస్, మనోరమా మ్యాక్స్, ఆహా, వ్రోట్‌లు ఉన్నాయి.
టాటా ప్లే బింజ్ మెగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్
టాటా ప్లే బింజ్ మెగా ప్లాన్‌ను మూడు సబ్‌స్క్రిప్షన్ పద్దతుల్లో అందిస్తుంది. నెలవారీ టారిఫ్ ప్లాన్‌తోపాటు త్రైమాసికం, వార్షిక ప్లాన్ టారిఫ్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ రూ.349 ప్లాన్ ఉండగా, 3 నెలలకు రూ.989 చెల్లించాలి. ఏడాదికి వార్షిక ప్లాన్ కింద రూ.3839 పే చేయాల్సి ఉంటుంది. టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ ద్వారా అమెజాన్ ఫైర్ స్టిక్, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ప్రోగ్రామ్‌లను టీవీల్లో వీక్షించవచ్చు.
ఓటీటీ యాప్స్ టారిఫ్ ప్లాన్
ఇక, ఓటీటీ యాప్స్ వారీగా సేవలపై టారిఫ్ ప్లాన్ నిర్ణయించింది టాటా ప్లే బింజ్. 26 ఓటీటీ యాప్స్ గల నెలవారీ ప్లాన్ టారిఫ్ రూ.349, 24 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.249, 20 ఓటీటీ యాప్స్‌తో కూడిన ప్లాన్ టారిఫ్ రూ.199 గా ఖరారు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment