9న నొవోటెల్‌ విజయవాడ ప్రారంభం | Novotel Direction starts on 9th | Sakshi
Sakshi News home page

9న నొవోటెల్‌ విజయవాడ ప్రారంభం

Published Sat, Dec 8 2018 1:30 AM | Last Updated on Sat, Dec 8 2018 1:30 AM

Novotel Direction starts on 9th - Sakshi

పటమట (విజయవాడ తూర్పు): విజయవాడలో వరుణ్‌ గ్రూపు రూ.150 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న నొవోటెల్‌–వరుణ్‌ హోటల్‌ను ఈ నెల 9న ప్రారం భించనున్నట్లు వరుణ్‌ గ్రూపు అధినేత వి.ప్రభు కిషోర్‌ చెప్పారు. 2009లో ఆతిథ్య రంగం లోకి అడుగుపెట్టామని, అప్పటి నుంచి మరిన్ని గదు లను జత చేసుకుంటూ ముందుకెళుతున్నామని చెప్పారు. శుక్రవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘విజయవాడ హోటల్లో 227 విలాసవంతమైన గదులతోపాటు 4 ఫుడ్‌బేవరేజ్‌ అవుట్‌లెట్లు, 7 సమావేశ గదులు, 10 వేల చ. అ. విస్తీర్ణంలో బాంక్వెట్‌ హాలు ఉంటాయి.

అకార్డ్‌ గ్రూపునకు చెందిన నొవోటెల్‌ బ్రాండుకు 20వ హోటల్‌గా ప్రారంభమవుతుంది. నొవోటెల్‌ సిగ్నేచర్‌ స్పా, రూఫ్‌టాప్‌ స్విమ్మింగ్‌ ఫూల్, ఫిట్‌నెస్‌ కోసం ఇన్‌–బ్యాలెన్స్‌ జిమ్‌తో పాటు దేశంలోని ఏ హోటల్లో లేనివిధంగా 200 మీటర్ల యూనీఫ్లో జాగింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అమరావతిలోని ఉద్ధండరాయుని పాలెంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 కోట్లు వెచ్చించి కన్వెన్షన్‌ సెంటర్‌ను 2019 మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని చెప్పారాయన. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్‌ బెల్లంకొండ మధు, హోటల్‌ మేనేజర్‌ టి.వి. మధుపాల్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement