Hotel Management
-
సీటీ చెఫ్.. టేస్ట్‌కి కేరాఫ్
చారిత్రకంగా విభిన్న రకాల వంటకాలకు ప్రసిద్ధి చెందిన మన నగరం విశ్వనగరిగా మారే క్రమంలో అంతర్జాతీయ రుచులకూ కేరాఫ్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలోనే నగరం పాకశాస్త్ర ప్రావిణ్యులు, నలభీముల నిలయంగా వర్ధిల్లుతోంది. ఒకప్పుడు స్టార్ హోటల్స్‌కు మాత్రమే పరిమితమైన చెఫ్ అనే పదం.. ఇప్పుడు రెస్టారెంట్స్, కేఫ్స్, ఆఖరికి ఇంటి వంటకు పేరొందిన హోమ్ చెఫ్స్ దాకా కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో నగరంలో కొంతకాలంగా భోజనప్రియులకు సేవలు అందిస్తున్న కొందరు చెఫ్స్ పరిచయం.. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న నోవోటెల్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా ప్రస్తుతం సేవలు అందిస్తున్న అమన్న రాజు.. సిటీలోని టాప్ చెఫ్స్‌లో ఒకరు. ఆయన 2012లో జరిగిన సిఒపి 11 ఇంటర్నేషనల్ క్లైమేట్ మీటింగ్‌లో ఆహార తయారీ బృందానికి సారథ్యం వహించినందున ఆయన పాకశాస్త్ర నైపుణ్యం గ్లోబల్ స్టాండర్డ్స్‌ను అందుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని ఐకాన్ ప్రధాన కార్యా లయం ప్రశంసలు మొదలుకుని 2014లో అకార్ చెఫ్ అవార్డు రాయల్ కరీబియన్ నుంచి క్యులినరీ సీ అవార్డ్స్‌తో సహా ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు పొందారు. రాడిసన్ బ్లూ ప్లాజా, నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, హాలండ్ అమెరికా క్రూయిస్ లైనర్స్ వంటి ప్రసిద్ధ హాస్పిటాలిటీ సంస్థల్లో పనిచేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ టైగర్ రిజర్వ్ సందర్భంగా ఒకసారి, అలాగే ఎన్నికల ప్రచారంలో మరోసారి ప్రత్యేక చెఫ్‌గా వండి వడ్డించిన ఘనత కూడా ఆయన దక్కించుకున్నారు. విజయాలు ‘అమేయం’.. 2 దశాబ్దాల కెరీర్లో పలు అవార్డులు గెలుచుకున్న చెఫ్ అమేయ్ మరాఠే. సన్–ఎన్–సాండ్ హోటల్స్, సెయింట్ వంటి కొన్ని అగ్ర బ్రాండ్లతో అలాగే నగరంలోని లార్న్ హోటల్స్, హార్డ్ రాక్ ఇంటర్నేషనల్, ఇన్వెన్యూ హాస్పిటాలిటీ, ఓహ్రీస్ – ప్యారడైజ్లకూ సేవలు అందించారు. ప్రస్తుతం చెఫ్ అమేయ్.. హాస్పిటాలిటీ పరిశ్రమలో కన్సలి్టంగ్లో ఉన్నారు. అలాగే సొంతంగా జేఎస్ అమేయ్ ఫుడ్స్‌ను నిర్వహిస్తున్నారు. యువతను ఈ రంగం వైపు ప్రోత్సహిస్తూ తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.ప్రస్తుతం వివాహ భోజనంబు రెస్టారెంట్‌కు సేవలు అందిస్తున్న అనుభవజ్ఞులైన చెఫ్ యాదగిరి నగరంలో చెఫ్స్ పదుల నుంచి వందలు వేలకు చేరుతున్న పరిస్థితుల్లో.. చెఫ్ కమ్యూనిటీలో యూనిటీ తీసుకువచ్చి సంఘటితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. హ్యాండ్స్ ఇన్ హాస్పిటాలిటీ చెఫ్స్ అసోసియేషన్ తరఫున పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చెఫ్స్ కాలనీకి రూపకల్పన చేయడం, యువతను హోటల్ మేనేజ్మెంట్ రంగం వైపు ఆకర్షించేందుకు సీనియర్ చెఫ్స్కి గుర్తింపును ఇచ్చేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం, ప్రత్యేక ఆర్టిఫిషియల్ రంగులు తదితర అనారోగ్యకర ముడి పదార్థాల వినియోగాన్ని రూపుమాపేందుకు కృషి చేయడంతో పాటు గ్రామాల్లో నిరుపేదలకు ఉపకరించే పలు సేవా కార్యక్రమాలు సైతం ఆయన తమ సంస్థ తరఫున నిర్వహిస్తున్నారు.మాస్టర్ చెఫ్.. జన్మతః విశాఖపట్టణానికి చెందిన మహేష్ నగరంలో స్థిరపడి 22 సంవత్సరాల నుంచి చెఫ్‌గా ఉన్నారు. నగరంలో, బెంగుళూర్లో షెరటెన్ గ్రాండ్ గ్రూప్ ఆధ్వర్యంలోని రెస్టారెంట్స్‌లో సేవలు అందిస్తున్నారు. వెస్టిన్, మారియట్ హోటల్స్‌లో చేశాను. అమెరికాలో చేశాను. దేశంలో 35 రెస్టారెంట్స్‌లో చేశాను. విదేశాల్లో కూడా చాలా పేరొందిన రెస్టారెంట్స్‌లో చేశాను. 2010లో మారియట్ గ్లోబల్ రైజింగ్ స్టార్ చెఫ్స్ ఆఫ్ ద ఇయర్‌గా ఏసియాలో బెస్ట్ ఎగ్జిక్యూటివ్ చెఫ్ తదితర పురస్కారాలు దక్కించుకున్నారు. చెఫ్ అనే పదం అంటేనే తనకెంతో ప్రేమ అంటూ మెడమీద పచ్చ»ొట్టు సైతం పొడిపించుకున్న మహేష్.. ఆ ప్రేమతోనే దాదాపు 1,000 మందికిపైగా చెఫ్స్‌ను తయారు చేశానని సగర్వంగా చెబుతారు.క్రూయిజ్ నుంచి సిటీ దాకా... దశాబ్దంన్నరగా సిటీలో సేవలు అందిస్తున్న చెఫ్ నరేష్ ముంబైలోని ఐటీసీ గ్రాండ్ మరాఠా వంటి భారీ హోటళ్లు, క్రూయిజ్ లైనర్స్లలో కూడా పనిచేశారు. గ్రాండ్ హయత్ రీసార్ట్ అండ్ స్పా, ఫ్లోరిడా ఐడా క్రూయిజ్‌లో తనదైన ముద్ర వేశారు. హల్సియోలో సౌస్ చెఫ్‌గా వంటగది. కొత్త రకం వంటకాలను సృష్టించడంలో బిజీగా ఉన్నారు. మాదాపూర్‌లోని సి–గుస్తా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న హల్సియోన్ ఫుడ్‌కు కార్పొరేట్ చెఫ్‌గా నరేష్ సేవలు అందిస్తున్నారు. టైమ్స్ దినపత్రిక ఆధ్వర్యంలో 2019 సంవత్సరపు ఉత్తమ చెఫ్‌ని గెలుచుకున్నారు. -
Christmas Celebrations Photos: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఐహెచ్ఎంఐలో క్రిస్మస్ వేడుకలు
-
ఈ టెస్ట్‌లో పాస్ అయితే.. ఇంటర్ అర్హతతోనే జాబ్!
హోటల్ మేనేజ్మెంట్.. సేవల రంగంలో వేగంగా విస్తరిస్తూ వృద్ధి బాటలో పయనిస్తున్న విభాగం. టూరిజం, హాస్పిటాలిటీకి పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణం! ఇలాంటి రంగంలో కెరీర్ కోరుకునే వారికి అవకాశాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. అందుకు మార్గం.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్! ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే .. ఇంటర్మీడియెట్ అర్హతతోనే బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో అడుగు పెట్టొచ్చు. ఆపై.. ఉజ్వలమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. తాజాగా.. 2022–23లో ప్రవేశాలకు సంబంధించి ఎన్సీహెచ్ఎం–జేఈఈ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ టెస్ట్ ప్రత్యేకత.. ప్రాధాన్యత, అర్హతలు, పరీక్ష విధానం, అందుబాటులో ఉన్న సీట్లు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... ఇంటర్మీడియెట్ తర్వాత విభిన్నంగా ఆలోచించే వారికి మెరుగైన మార్గం.. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లలో ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. అవకాశాలకు కొదవే లేదు అంటున్నారు నిపుణులు. హోటల్ మేనేజ్మెంట్ విభాగంలో నిపుణులైన మానవ వనరులను తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్స్టిట్యూట్లు.. ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈ క్యాంపస్‌లలో బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఎన్సీహెచ్ఎం–జేఈఈ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా.. తదుపరి దశలో ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా సీట్లను భర్తీ చేసే విధానం కొనసాగుతోంది. అర్హతలు 10+2/ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్హత చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 01.07.2022 నాటికి వయసు 25ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 28ఏళ్లలోపు ఉండాలి. 78 ఇన్స్టిట్యూట్లు.. 13 వేలకు పైగా సీట్లు ► ఎన్సీహెచ్ఎం–జేఈఈలో స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లోని 78 హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్లో 13,118 సీట్లకు పోటీపడొచ్చు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో 21 ఇన్స్టిట్యూట్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 27 ఇన్స్టిట్యూట్లు, 29 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు, ఒక పీఎస్‌యూ ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ హోటల్‌మేనేజ్‌మెంట్ కోర్సు అందుబాటులో ఉంది. వీటన్నింటి పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ సంస్థను కూడా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ► తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణలో డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఎస్ఐహెచ్ఎం–మెదక్, సీఐహెచ్ఎం –హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్ఐహెచ్ఎం–తిరుపతిలలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్లు బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ కోర్సును అందిస్తున్నాయి. వీటితోపాటు పలు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్.. లభించే కొలువులు హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులు పూర్తి చేసిన వారికి.. గెస్ట్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; ఫ్రంట్ డెస్క్ మేనేజర్; క్రూయిజ్ మేనేజర్; కిచెన్ ఎగ్జిక్యూటివ్; మార్కెటింగ్ మేనేజర్; సర్వీస్ ఎగ్జిక్యూటివ్; అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్; ట్రిప్ అడ్వైజర్; బ్యాక్ ఎండ్ ఎగ్జిక్యూటివ్స్; చెఫ్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. బీఎస్సీ కోర్సులో వీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రారంభంలో సగటున రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వేతనాన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఐదు విభాగాలు–200 ప్రశ్నలు ► ఎన్సీహెచ్ఎం–జేఈఈ పరీక్ష మొత్తం అయిదు విభాగాల్లో 200 ప్రశ్నలకు జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ అప్టిట్యూడ్ 30 ప్రశ్నలు, రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ 30 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 60 ప్రశ్నలు, అప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ 50 ప్రశ్నలు.. ఇలా మొత్తం మొత్తం 200 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ► పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ► ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ► నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం మూడు గంటలు. ► మెరిట్ జాబితాను రూపొందించే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో అత్యధిక మార్కులు పొందిన వారిని ముందుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఎన్సీఎహెచ్ఎం–జేఈఈ ఫలితాలు వెల్లడించాక.. సీట్ల భర్తీకి ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌లో స్కోర్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇన్స్టిట్యూట్ ప్రాథమ్యాలతో ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. అందుబాటులో ఉన్న సీట్లు, స్కోర్ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. గతేడాది రెండు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్స్ మాత్రం సొంతంగా ప్రవేశ ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఎన్సీహెచ్ఎం–జేఈఈ–2022 ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: ఫిబ్రవరి 4 – మే 3, 2022 దరఖాస్తు సవరణ అవకాశం: మే 4 నుంచి మే 6 వరకు ఎన్సీహెచ్ఎం–జేఈఈ పరీక్ష తేదీ: మే 28, 2022 తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్,వరంగల్ పూర్తి వివరాలకు వెబ్సైట్: https://nchmjee.nta.nic.in, www.nta.ac.in విజయం సాధించండిలా న్యూవురికల్ ఎబిలిటీ అండ్ అనలిటికల్ అప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్‌లో ఉన్న బేసిక్ నైపుణ్యాలను పరీక్షించే విభాగం ఇది. కాబట్టి హైస్కూల్ స్థాయిలోని మ్యాథమెటిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వీటిలోనూ ముఖ్యంగా శాతాలు, లాభ–నష్టాలు, నెంబర్ సిస్టమ్,సగటు,కాలం–పని,సాధారణ వడ్డీ, బారు వడ్డీ, కాలం–వేగం–దూరం, నిష్పత్తులు, జామెట్రీ వంటి వాటిపై మరింత పట్టు సాధించాలి. అనలిటికల్ ఆప్టిట్యూడ్‌లో.. నిర్దిష్టంగా డేటాను విశ్లేషించగలిగే సామర్థ్యం, డేటాలోని ముఖ్య సమాచారాన్ని క్రోడీకరించి.. ఇచ్చిన ప్రశ్నకు అనువుగా, సమాధానం గుర్తించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ఇందుకోసం గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు, ఫ్లో చార్ట్‌లు వంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ అభ్యర్థుల్లోని సునిశిత పరిశీలన, తార్కిక విశ్లేషణ నైపుణ్యాలను పరీక్షించే విభాగమిది. ఇందులో మెరుగైన ప్రతిభ కనబర్చాలంటే.. మ్యాథమెటికల్ ఆపరేషన్స్, కోడింగ్–డీకోడింగ్, నంబర్ సిరీస్, బ్లడ్ రిలేషన్ వంటి రీజనింగ్ ఆధారిత అంశాలపై పట్టు సాధించాలి. ఇందుకోసం ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా డేటా సఫీషియన్సీ, వెన్ డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అభ్యర్థులకు సామాజిక, సమకాలీన అంశాలపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం ఇది. ఇందులో మంచి మార్కులు పొందాలంటే.. హైస్కూల్ స్థాయిలోని పుస్తకాల్లో ఉండే చరిత్ర, రాజ్యాంగం, జాగ్రఫీ, ఎకనామిక్స్ పాఠ్యాంశాలు చదవాలి. హిస్టరీలో ముఖ్యమైన యుద్ధాలు–పరిణామాలు–పర్యవసానాలు, స్వాతంత్య్రోద్యమం వంటి అంశాలపై అవగాహన లాభిస్తుంది. జాగ్రఫీలో దేశంలో ముఖ్యమైన ప్రదేశాలు, ఖనిజ వనరులు– అవి ఎక్కువగా లభించే ప్రాంతాలు, నదులు, సరస్సులు, పర్వతాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. కరెంట్ అఫైర్స్‌లో ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు, వార్తల్లోని వ్యక్తులు, ఇటీవల కాలంలో అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ తుది జాబితా రూపకల్పనలో కీలకం ఇంగ్లిష్ లాంగ్వేజ్. ఈ విభాగంలో రాణించడానికి అభ్యర్థులు గ్రామర్‌ను అవపోసన పట్టాల్సిందే. టెన్సెస్, ప్రిపోజిషన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటానిమ్స్, సినానిమ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్‌పై పూర్తి పట్టు సాధించాలి. దీనికోసం బేసిక్ గ్రామర్ పుస్తకాలను అధ్యయనం చేయాలి. న్యూస్ పేపర్లను చదవడం,వాటిలోని కొత్త పదాలను తెలుసుకోవడం, ఆ పదాలను వినియోగించిన తీరుపై అవగాహన పెంచుకోవడం వంటివి లాభిస్తాయి. అప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్.. స్పెషల్ సెక్షన్ ఎన్సీహెచ్ఎం జేఈఈలో ప్రత్యేకమైన విభాగంగా అప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టార్ విభాగాన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అభ్యర్థికి ఆతిథ్య, పర్యాటక రంగాలపై ఉన్న ఆసక్తిని, అభ్యర్థి దృక్పథాన్ని పరీక్షించేవిధంగా ప్రశ్నలు ఉంటాయి. వాస్తవ సంఘటన లేదా అంశం ఇచ్చి దానికి ఎలా స్పందిస్తారు? అనే తరహా ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు అభ్యర్థుల్లో ఎదుటి వారిని మెప్పించే తీరుకు సంబంధించి ఉంటాయి. విస్తృత అవకాశాలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు అభ్యర్థులకు బ్యాచిలర్ డిగ్రీతోనే విస్తృత అవకాశాలు సొంతమవుతున్నాయి. ఎన్సీహెచ్ఎం–జేఈఈ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాంపస్‌లలోని విద్యార్థులకు ఇండస్ట్రీ నుంచి ఎంతో ఆదరణ లభిస్తోంది. స్టార్ హోటల్స్, టూరిజం ఏజెన్సీల్లో కొలువులు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే రూ.4 లక్షల నుంచి రూ. 5 లక్షల వార్షిక వేతనం అందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఐటీసీ, ఒబెరాయ్, తాజ్ గ్రూప్ వంటి హోటల్ ఇండస్ట్రీలోని ప్రముఖ సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో రాణించాలంటే.. ఓర్పు, ఎదుటి వారిని మెప్పించే నేర్పు ఎంతో అవసరం. –ప్రొ‘‘చిన్నంరెడ్డి, డైరెక్టర్,ఎన్ఐటీహెచ్ఎం -
విద్యార్థినిపై అధ్యాపకుల అనుచిత ప్రవర్తన
సాక్షి, హైదరాబాద్: ఈవెంట్ పేరిట ఇంటికి పిలిపించుకొని హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, హెచ్‌వోడీ ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంనగర్‌లోని సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన ఓ విద్యార్థిని ఫైనలియర్ చదువుతోంది. జనవరి 24న ఈవెంట్ ఉందని చెప్పడంతో ఆమె తన సోదరుడిని తీసుకొని మాదాపూర్ చందానాయక్ తండాలోని వైస్ ప్రిన్సిపాల్ కల్యాణ్ వర్మ ఇంటికి వచ్చింది. సోదరుడు బయటే ఉండగా విద్యార్థిని ఇంట్లోకి వెళ్లింది. కల్యాణ్ లోపలికి పిలిచి ఆమెపై చేయివేసి అనుచితంగా ప్రవర్తించాడు. తప్పించుకుని బయటకు వెళ్తుండగా హెచ్‌వోడీ రవీందర్ మెయిన్‌డోర్‌ను మూసేసి విద్యార్థినిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఇద్దరినీ ప్రతిఘటించి తలుపులు తీసుకొని బయటకు పరుగుతీసింది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా విద్యార్థిని కుటుంబీకులతో నిందితులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 9న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితుల కోసం గాలిస్తున్నామని మాదాపూర్ సీఐ చెప్పారు. విద్యార్థి సంఘాల ఆందోళన కల్యాణ్ శర్మ, రవీందర్‌లపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి నేతలు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కళాశాల డైరెక్టర్ వాణి ఒక మహిళ అయ్యుండి బాధితురాలి పక్షాన మాట్లాడకుండా బేరసారాలకు దిగారని ఆరోపించారు. ఆమెను ఘెరావ్ చేశారు. -
అమ్మ గెలుపు
బిడ్డ తాగే పాలలో నీళ్లు కలిపేటప్పుడు ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. తాను భవిష్యత్తులో విజేతగా నిలుస్తానని అప్పుడామె ఏ మాత్రం ఊహించలేదు. తాను చదివిన పదో తరగతి చదువుకి చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదెవ్వరూ. అలాంటి తనను పెద్ద విద్యాసంస్థలు సగౌరవంగా ఆహ్వానించి మరీ బిజినెస్ మేనేజ్మెంట్లో లెక్చర్ ఇప్పించుకుంటాయని ఆనాడు ఆమె ఊహకు కూడా అందలేదు. ‘తన జీవితమే తానిచ్చే సందేశం’ అనే పెద్ద మాటలు చెప్పడం లేదు, కానీ తన జీవితాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తోంది శిల్ప. ‘‘శిల్ప 2009 వరకు భర్త సంరక్షణలో జీవించిన గృహిణి. ఒక బిడ్డకు తల్లి. భర్త రాజశేఖర్ వ్యాపారి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. కర్నాటక రాష్ట్రం, హసన్‌లో ఉన్న తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా తన దగ్గరకు వచ్చేయమని చెప్పింది. అలా అందరూ బళ్లారిలో ఉంటున్నారు. ఓ రోజు ఉదయం ఇంటి నుంచి బెంగళూరుకు వెళ్లిన రాజశేఖర్ తిరిగి ఇంటికి రాలేదు. అతడికి ఏమైందో తెలియదు. మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది తప్ప అతడి ఆచూకీ తేలలేదు. శిల్ప మానసికంగా కుంగిపోయింది. భర్త ఎక్కడికి వెళ్లాడో తెలియదు. ఏమయ్యాడో తెలియదు. ఆమెకి తెలిసిందల్లా తాను, తన బిడ్డ దిక్కులేని వాళ్లమయ్యామనే చేదు నిజం మాత్రమే. తనను నమ్ముకుని తనతోనే ఉంటున్న తల్లిదండ్రులు, తమ్ముడి బాధ్యత కూడా తన మీదనే ఉంది. భవిష్యత్తు అగమ్యగోచరం. పాలలో నీళ్లు రోజురోజుకీ బతుకు కష్టమవుతోంది. పిల్లవాడికి పాలు కలుపుదామని గ్లాసు తీసుకుంది. పాల గిన్నెలో అడుగున ఉన్నాయి పాలు. ఆ పాలలో అరగ్లాసు నీళ్లు పోసింది శిల్ప. ఆమె పోసిన నీళ్లతోపాటు ఆమె చెంపల మీదుగా కారిన కన్నీళ్లు కూడా ఆ పాలలో కలిసిపోయాయి. ఆ క్షణమే ఒక నిర్ణయానికి వచ్చిందామె. తన బిడ్డను పోషించుకోవడానికి తాను పని చేయాలి. రిసెప్షనిస్ట్ ఉద్యోగం కోసం ఇంటర్వూ్యకెళ్లింది. సేల్స్ ఉమన్‌గా ప్రయత్నించింది. వంట మనిషి కావాలనే ప్రకటన చూసి ఆ ఉద్యోగం కోసమూ వెళ్లింది. హౌస్ కీపింగ్ ఉద్యోగమూ రాలేదు. ఏ ఉద్యోగానికి వెళ్లినా సరే అందరూ అడిగే కామన్ ప్రశ్న ‘నీ భర్త గురించిన వివరాలేంటి’ అని. తన దగ్గర జవాబు లేని ఆ ప్రశ్నను ఎదుర్కోవడం కంటే తనకు చేతనైన మరేదో పని చేసుకోవడమే మంచిదనే అభిప్రాయానికి వచ్చేసిందామె. శిల్ప తమ్ముడు చిరంజీవి మంగుళూరులో సెక్యూరిటీ గార్డు ఉద్యోగంలో చేరాడు. అందరూ మంగుళూరుకు వచ్చారు. తన తల్లి ఎప్పుడూ తాను వండినవి తింటూ ‘నువ్వు కానీ హోటల్ పెడితే వండినవి వండినట్లే ఖర్చయిపోతాయి. ఇంత రుచిగా వండడం ఎలా నేర్చుకున్నావ్’ అని మెచ్చుకుంటుండేది. అమ్మ మాటలను గుర్తు చేసుకుంది శిల్ప. పిల్లవాడి చదువు కోసమని భర్త ఉన్నప్పుడు బ్యాంకులో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ తీసింది. ఆ పెట్టుబడితో సెకండ్ హ్యాండ్ ట్రక్కు కొని మొబైల్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పెట్టింది. జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగిముద్ద, అన్నం, సంప్రదాయ కన్నడ రుచులతో మొదలైన ‘హల్లే మనే రొట్టి’కి ఉద్యోగులే ప్రధానమైన కస్టమర్లు. తమ్ముడితోపాటు రొట్టెలు చేస్తున్న శిల్ప శ్రమ ఫలించింది శిల్పకు సహాయంగా ఆమె అమ్మానాన్న కూడా పని చేసేవాళ్లు. తర్వాత తమ్ముడు కూడా సెక్యూరిటీ గార్డు ఉద్యోగం మానేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే పని చేస్తున్నారు. మంగుళూరులో సక్సెస్ఫుల్ ఉమన్ ఎంటర్ప్రెన్యూర్ల ప్రస్తావన వస్తే మొదటగా శిల్ప పేరునే చెప్పుకుంటారు. మేనేజ్మెంట్ కాలేజ్‌లు ఆమె అనుభవాలనే విద్యార్థులకు పాఠాలుగా చెప్తున్నాయి. ఆహారప్రియుల మౌత్ పబ్లిసిటీతో ‘హల్లే మనే రొట్టి’ గురించి స్థానిక మీడియాలో పడింది. వార్తా పత్రికల్లో శిల్ప జీవనపోరాటాన్ని చదివిన మహీంద్ర గ్రూప్ నిర్వహకులు ఆనంద్ మహీంద్ర ఆమెను అభినందించి బొలేరో మ్యాక్సీ ట్రక్ ప్లస్‌ను బహూకరించారు. ‘తల్లి ఏదైనా సాధించ గలదు’ అంటోంది శిల్ప సంతోషంగా. -
హోటల్ కార్మికులతో కేరళ నటి వాగ్వాదం
చెన్నై ,పెరంబూరు: హోటల్ కార్మికులతో కేరళ నటి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాలు చూస్తే ఒక మలయాళ చిత్రం నాగర్‌కోవిల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్ర యూనిట్ నాగర్‌కోవిల్‌లోని ఒక హోటల్లో బస చేసి షూ టింగ్‌కు హాజరవుతున్నారు. కాగాబుధవారం అర్ధరాత్రి ఆ చిత్ర హీరోయిన్ మంజు సవేకర్ షూటిం గ్ ముగించుకుని హోటల్లోని తన గదికి వెళ్లగా గది క్లీన్ చేయకపోవడంతో ఆ హోటల్ కార్మికులపై వాగ్వాదానికి దిగింది. దీంతో ఈ వ్యవహారం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు విచారణ జరిపి నటి మంజు సవేకర్‌కు, కార్మికులకు మధ్య గొడవను సర్ది చెప్పి సమస్యను పరిష్కరించారు. -
ఇదేం పాపం !
భద్రాచలం : పాపికొండల విహార యాత్ర పేరుతో కొందరు చేస్తున్న వ్యాపారం పర్యాటకులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎలాంటి భద్రత, రవాణా వ్యవస్థ అందుబాటులో లేని చోట పర్యాటకులు చేస్తున్న రాత్రి బస ఒక్కోసారి వారిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. పాపికొండల వద్ద కొల్లూరు ఇసుక తిన్నెల్లో సోమవారం జరిగిన సంఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. భోజనం విషయంలో నిర్వాహకులు, పర్యాటకులకు మధ్య జరిగిన మాటల యుద్ధం చివరకు ఘర్షణకు దారితీసింది. కొల్లూరు హట్స్ నిర్వాహకులు విచక్షణారహితంగా తమపై దాడి చేశారని బాధిత పర్యాటకులు భద్రాచలంలో విలేకరుల వద్ద వెల్లడించారు. ఖమ్మానికి చెందిన దంతవైద్య నిపుణులు పి. కిశోర్ కుటుంబంతో పాటు, హైదరాబాద్‌కు చెందిన బంధువులతో కలసి మొత్తం 21 మంది ఆదివారం పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. ఇందులో పదేళ్ల లోపు వారు 8 మంది ఉన్నారు. వీరంతా ఆదివారం రాత్రి పాపికొండల వద్ద గల కొల్లూరు ఇసుక తిన్నెలపై ఉన్న హట్స్‌లో బస చేశారు. సోమవారం తిరుగు ప్రయాణ సమయంలో మధ్యాహ్న భోజనం చేసేచోట నిర్వాహకులతో కొంతమంది వాగ్వాదానికి దిగారు. భోజనం బాగాలేదని నిలదీయగా, నిర్వాహకులు తమపై దాడి చేశారని డాక్టర్ కిశోర్ తెలిపారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి వచ్చామని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడ సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక ఎవరికీ చెప్పుకోలేకపోయామని, భయంతో తిరుగుముఖం పట్టామని డాక్టర్ కిశోర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరుగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్వాహకుల ఇష్టారాజ్యం... పాపికొండల విహార యాత్రపై ప్రైవేటు పెత్తనం సాగుతోంది. ప్రకృతి అందాలతో కొంతమంది బడాబాబులు చేస్తున్న దోపిడీ వ్యాపారానికి అడ్డకట్ట వేయడంపై అధికారులు దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకృతి అందాలు కనుమరుగవుతాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. -
పెయింటింగ్ వేస్తూ కిందపడి వ్యక్తి మృతి
దాబాగార్డెన్స్(విశాఖపట్నం): నగరంలోని దాబాగార్డెన్స్ ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్ హోటల్‌కు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు అమర్నాథ్(42) స్వస్థలం కృష్ణా జిల్లా కొండపల్లి. నెల రోజుల క్రితమే విశాఖపట్నం వచ్చినట్లు తెలిసింది. హోటల్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తోటి పెయింటర్లు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
ప్రాణం ఖరీదు రూ.రెండున్నర లక్షలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఏసీ మెకానిక్ నిండు ప్రాణం పోయింది. ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు రంగంలోకి దిగి రూ.రెండున్నర లక్షలకు ఖరీదు కట్టి సెటిల్ చేసిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ కేసు వరకు వెళ్లకుండా, విషయం బయటకు పొక్కకుండా పంచాయతీ చేసినందుకు సదరు దళారి రూ.లక్ష దండుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి లేని నలుగురు ఆడపిల్లల కుటుంబానికి ఏకైక దిక్కైన ఓ పేదవాడి మృత్యువాతపై రాబందుల్లా వాలి కాసులు దండుకున్న దారుణ వ్యవహారం పూర్వాపరాలిలా ఉన్నాయి. ఏలూరు ఆర్ఆర్ పేట సమీపంలోని ఓ హోటల్ రెస్టారెంట్లో ఈ నెల 18న రాత్రి ఏసీలు పాడవడంతో కత్తేపువీధికి చెందిన మెకానిక్ (21)ను పిలిపించారు. ఏసీలు బాగు చేస్తుండగా కరెంట్ షాక్‌తో ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. విషయం తెలిసి అతడి డి బంధువులు అర్ధరాత్రి అక్కడకు చేరుకున్నారు. హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యం.. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని వాపోయారు. 3నెలల కిందటే యువకుడి తండ్రి మరణించాడని, నలుగురు ఆడపిల్లలున్న ఆ కుటుంబానికి అతనొక్కడే ఆధారమని చెప్పారు. దీంతో విషయం ఎటు తిరిగి ఎటొస్తుందోనని భావించిన యాజమాన్యం నగరంలోని ఓ ప్రజాప్రతి నిధి అనుచరుడిని రంగంలోకి దింపింది. సదరు వ్యక్తి హోటల్ యాజమాని తరఫున వకాల్తా పుచ్చుకుని ‘పోయిన ప్రాణం ఎటూ తిరిగి రాదు. పోలీస్‌స్టేష న్లో కేసు పెట్టినా ఒరిగేదేమీ లేదు. రూ.రెండున్నర లక్షలు ఇప్పిస్తా తీసుకోండి’ అని దబాయించి వ్యవహారాన్ని సెటిల్ చేశాడు. ఇందుకుగాను ఆ ప్రజాప్రతినిధి అనుచరుడికి హోటల్ యాజమాన్యం రూ.లక్ష ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. ఇంత జరిగితే నగరంలో పోలీసులేం చేస్తున్నారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. -
హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణ
హయత్‌నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు. వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.