పెయింటింగ్ వేస్తూ కిందపడి వ్యక్తి మృతి | Painter dies slipped while on painting top buliding | Sakshi
Sakshi News home page

పెయింటింగ్ వేస్తూ కిందపడి వ్యక్తి మృతి

Published Mon, Mar 7 2016 8:17 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

Painter dies slipped while on painting top buliding

దాబాగార్డెన్స్(విశాఖపట్నం): నగరంలోని దాబాగార్డెన్స్ ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్‌ హోటల్‌కు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు అమర్‌నాథ్(42) స్వస్థలం కృష్ణా జిల్లా కొండపల్లి. నెల రోజుల క్రితమే విశాఖపట్నం వచ్చినట్లు తెలిసింది.

హోటల్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తోటి పెయింటర్లు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement