painter
-
ప్రాణమున్నగోడలు
బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్ అండ్ పెయింట్ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్ ప్రదేశ్ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్ సంస్థలో ఇంటీరియర్ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్ సేల్ ఫర్ సేల్ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ. View this post on Instagram A post shared by Sneha Chakraborty (@lbc_sneha) -
చిత్రకారునికి కొత్త చేతులు.. ఢిల్లీ వైద్యుల అద్భుతం!
ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయిన ఒక చిత్రకారుడు ఇప్పుడు తన కొత్త చేతులతో బ్రష్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీకి చెందిన వైద్యుల బృందం చేసిన ఈ సర్జికల్ ఎక్సలెన్స్ ను అందరూ కొనియాడుతున్నారు. అవయవ దానంతో తన శరీరం నలుగురికి ఉపయోగపడాలని తపనపడిన ఒక మహిళ కలను ఆ వైద్యుల బృందం సాకారం చేసింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు 45 ఏళ్ల వ్యక్తికి ద్వైపాక్షిక చేతి మార్పిడి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.. బాధితుడు 2020లో రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో అతను ఏ పనీ చేయలేక నిరాశగా కాలం వెళ్లదీస్తున్నాడు. అయితే బ్రెయిడ్ డెడ్‌కు గురైన ఒక మహిళ అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. బ్రెయిన్ డెడ్‌కు చేరిన దక్షిణ ఢిల్లీలోని ఒక పాఠశాల మాజీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మీనా మెహతా తన మరణానంతరం అవయవ దానానికి గతంలోనే సమ్మతి తెలిపారు. దీంతో ఆమె శరీరంలోని కిడ్నీ, కాలేయం, కార్నియా ముగ్గురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాయి. ప్రమాదంలో చేతులు పోగొట్టుకుని నిస్సహాయంగా బతుకీడుస్తున్న ఒక చిత్రకారుని కుంచె ఇప్పుడు తరిగి అద్భుతాలను చేసేందుకు సిద్ధం అయ్యింది. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందానికి విశేష ప్రశంసలు అందుతున్నాయి. ఈ శస్త్రచికిత్స చేయడానికి వైద్యులకు 12 గంటలకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించింది. ఆ వైద్యుల బృందం చిత్రకారునితో ఒక ఫోటోను క్లిక్ చేసింది. పెయింటర్ విజయోత్సాహంతో తన రెండు చేతులను పైకి ఎత్తడాన్ని ఆ ఫొటోలో మనం చూడవచ్చు. -
చిత్రకారుల్లో ఇతడు వేరయా..! సైన్సుకే చిత్ర రూపం ఇచ్చి..
బొమ్మల భాషఅక్షరం పుట్టక ముందే చిత్రం రూపుదిద్దుకుంది. ప్రపంచంలో సైగల తర్వాత భాష బొమ్మలదే. పది వాక్యాల విషయాన్ని ఒక బొమ్మ చెప్తుంది. ఆ బొమ్మలతోనే శాస్త్రాన్ని బోధిస్తే ఎలా ఉంటుంది? విజ్ఞాన శాస్త్రం వినోద శాస్త్రమవుతుంది. ఆనందంగా మెదడుకు చేరుతుంది. మరిచిపోలేని జ్ఞానంగా మిగులుతుంది. అధ్యయనానికి అక్షర రూపమిస్తే మహాగ్రంథమవుతుంది. అధ్యయనానికి చిత్రరూపమిస్తే అద్భుతమైన చిత్రకావ్యం అవుతుంది. అలాంటి వందల చిత్రకావ్యాలకు రూపమిచ్చారు అబ్దుల్ మన్నాన్. డెబ్బై ఏళ్ల మన్నాన్ ఐదు వేలకు పైగా బొమ్మలు వేశారు. ‘‘నా వయసులో నుంచి మూడేళ్లు తగ్గిస్తే నాలోని చిత్రకారుడి వయసది. నా బొమ్మల్లో ఒక్కొక్క థీమ్‌తో కొన్ని వందల చిత్రాలున్నాయి. ఆ చిత్రాల్లో ఒక్కటి చేజారినా చిత్రకావ్యంలో అనుసంధానత లోపిస్తుంది. అందుకే నా బొమ్మలను ఎవరికీ ఇవ్వలేదు, డబ్బు కోసం అమ్మనూ లేదు’’ అన్నారు అబ్దుల్ మన్నాన్. బొమ్మల చదువు! మా సొంతూరు ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం, బంటుమిల్లి దగ్గర చిన పాండ్రాక. ఐదవ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. ఆ తర్వాత నా చదువు గుడివాడలో సాగింది. ఏఎన్నార్ కాలేజ్‌లో బీఎస్సీ చదివాను. బొమ్మల మీదున్న ఆసక్తి కొద్దీ చెన్నైకి వెళ్లి ‘శంతనుస్ చిత్ర విద్యాలయం’లో ఆర్ట్ డిప్లమో చేశాను. చెన్నైలోనే బాలమిత్ర, బాలభారతి, బుజ్జాయి వంటి పిల్లల పత్రికల్లో ఇలస్ట్రేటర్‌గా ఐదారేళ్లపాటు ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి నా అడుగులు సినీఫీల్డ్ వైపు పడ్డాయి. అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా సుమారు ఐదేళ్లు చేశాను. చెన్నైలో కవి సమ్మేళనాలు ఎక్కువగా జరిగేవి. మహాలక్ష్మి క్లబ్లో తెలుగు వాళ్ల కార్యక్రమాలు జరిగేవి. దాదాపుగా అన్నింటికీ హాజరయ్యేవాడిని. అలా శ్రీశ్రీ,, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి కవులతోపాటు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆర్ నారాయణమూర్తి వంటి చాలామందితో పరిచయాలయ్యాయి. దక్షిణాది భాషలు వచ్చాయి. ఇలా కొంత వైవిధ్యంగానే మొదలైంది నా కెరీర్. వైవిధ్యత ఆకట్టుకుంది! సైన్స్ చిత్రాల చిత్రకారుడిగా మారడానికి బీజం పడింది మాత్రం ఇంటర్‌లోనే. డార్విన్ సిద్ధాంతం ‘ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్’ చదవడం నా మెదడులో కొత్త ప్రపంచానికి ఆవిష్కారం జరిగింది. అలాగే మరో పుస్తకం ‘ఫేమస్ ఫైవ్ హండ్రెడ్ ఆర్టిస్ట్స్ ఇన్ ద వరల్డ్’. ప్రపంచంలోని చిత్రకారులను చదివినప్పుడు పికాసో నుంచి డావిన్సీ వరకు ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారులెవ్వరూ సైన్స్ ఇతివృత్తంగా బొమ్మలు వేయలేదని అవగతమైంది. దాంతో ఆ ఖాళీని పూరించాలనుకున్నాను. అలా నా చిత్రాలకు సైన్స్, నేచర్ ప్రధానమైన టాపిక్స్ అయ్యాయి. జీవ వైవిధ్యత నన్ను కట్టి పడేసే అంశం. దాంతో ప్రతి జీవి గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. డార్విన్ సిద్ధాంతం చదివినప్పుడు కలిగిన సందేహాలకు సమాధానాల కోసం లెక్కలేనన్ని పుస్తకాలు చదివాను. ఉదాహరణకు క్యాట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాల్సి వస్తే ఏ ఖండంలో ఎలాంటి జాతి క్యాట్లుంటాయో అనర్గళంగా చెప్పగలను. శిలాజాలను అధ్యయనం చేసి ఆ ప్రాణి ఊహాచిత్రాన్ని వేయడం, ఎండమిక్ స్పీసీస్ బొమ్మలేయడంలో అనంతమైన సంతృప్తి కలగడం మొదలైంది. ఇక ఆ అలవాటును కొనసాగించాను. సైన్స్ పాఠాల బోధన! నా వృత్తి ప్రవృత్తి రెండూ సైన్స్‌లోనే వెతుక్కున్నాను. ఎనిమిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైన్స్ పాఠాలు చెప్పేవాడిని. నా భార్య గవర్నమెంట్ టీచర్. నేను జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ట్యూటోరియల్స్ నిర్వహించాను. స్కూళ్లలో డ్రాయింగ్ టీచర్‌గా పిల్లలకు బొమ్మలు వేయడం నేర్పించాను. నేను అందుకున్న అవార్డులకంటే నా విద్యార్థులు అందుకున్న అవార్డులే ఎక్కువ. నేను పీటీరెడ్డి అవార్డు, మూడు జాతీయ స్థాయి అవార్డులందుకున్నాను. నా బొమ్మలు ఆహ్లాదం కోసం చూసేవి కాదు. అవి అధ్యయన మాధ్యమాలు. శాతవాహన, కాకతీయ యూనివర్సిటీలు, వైజాగ్‌లో కాలేజీలు, కరీంనగర్ ఉమెన్స్ కాలేజ్, చాలాచోట్ల స్కూళ్లలోనూ ప్రదర్శనలు నిర్వహించాను’’ అని తన చిత్రప్రస్థానాన్ని వివరించారు అబ్దుల్ మన్నాన్. ‘చిత్ర’ ప్రమాదాలు చిత్రకారుడు తన దేహానికి గాయమైనా పట్టించుకోడు. కానీ తన బొమ్మలకు ప్రమాదం వాటిల్లితే ప్రాణం పోయినట్లు విలవిలలాడుతాడు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ. నా చిత్రకార జీవితంలో మూడు ప్రమాదాలను ఎదుర్కొన్నాను. గుడివాడలో ఇల్లు అగ్నిప్రమాదానికి గురయ్యి చిన్నప్పటి నుంచి వేసిన బొమ్మలన్నీ కాలిపోయాయి. మరోసారి చెన్నైలో ఇంట్లో దొంగలు పడి నా పెయింటింగ్స్ పెట్టెను కూడా దోచుకుపోయారు. ఇక మూడవది హైదరాబాద్‌లో. ఈ ఏడాది వరదల్లో టోలిచౌకిలోని మా ఇంట్లో మూడు రోజులు నీళ్లు నిలిచిపోయాయి. అప్పుడు తడిసిపోయినవి పోగా మళ్లీ వేసిన బొమ్మలు ఐదు వందలు ఎగ్జిబిషన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఒక్కొక్క ప్రమాదం తర్వాత నాలోని చిత్రకారుడు మళ్లీ మళ్లీ పుట్టాడు. – అబ్దుల్ మన్నాన్, సైన్స్ చిత్రకారుడు – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
ఆమె అందం అలాంటిది, జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆమె స్నేహం కోసం..
అమృత షేర్గిల్. 20వ శతాబ్దపు గొప్ప చిత్రకారిణి. 1941లో 28 ఏళ్ల చిన్న వయసులో మరణించినా ఆమె చిత్రాలు ఇప్పటికీ వార్తలు సృష్టిస్తూనే ఉన్నాయి. అమ్మలక్కల కబుర్లను ‘ది స్టోరీ టెల్లర్’ పేరుతో ఆమె బొమ్మ గీస్తే ఇప్పటివరకూ భారతదేశంలో ఏ చిత్రకారుడికీ పలకనంత వెల– 61.8 కోట్లు పలికింది. ఆ చిత్రం గురించి...ఆ గొప్ప చిత్రకారిణి గురించి. అమృత షేర్గిల్ తన జీవిత కాలంలో 200 లోపు చిత్రాలను గీసింది. అన్నీ కళాఖండాలే. వాటిలో చాలామటుకు ప్రఖ్యాత మ్యూజియమ్‌లలో ఉన్నాయి. కొన్ని మాత్రమే ఆమె చెల్లెలి (ఇందిర) కుమారుడు వివాన్ సుందరం, కుమార్తె నవీనల దగ్గర ఉన్నాయి. 1937లో తను గీసిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రాన్ని అప్పటి లాహోర్‌లో మొదటిసారి ప్రదర్శనకు పెట్టింది అమృత. అప్పటి నుంచి ఆ చిత్రం చేతులు మారుతూ తాజాగా ఢిల్లీలో జరిగిన వేలంలో 61.8 కోట్లు పలికింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రకారుల ఏ పెయింటింగ్‌కూ ఇంత రేటు పలకలేదు. ఆ విధంగా చనిపొయిన ఇన్నాళ్లకు కూడా అమృత రికార్డు స్థాపించ గలిగింది. దీనికంటే ముందు గతంలో సయ్యద్ హైదర్ రజా గీసిన ‘జెస్టెషన్’ అనే చిత్రం 51.75 కోట్లకు పలికి రికార్డు స్థాపించింది. దానిని అమృత బద్దలు కొట్టింది. రూ.61.8 కోట్లు ధర పలికిన ‘ది స్టోరీ టెల్లర్’ చిత్రం గొప్ప చిత్రకారిణి అమృత షేర్గిల్ భారతీయ సిక్కు తండ్రి ఉమ్రావ్ సింగ్‌కి, హంగేరియన్ తల్లి ఎంటొనెట్కు జన్మించింది. బాల్యం నుంచి గొప్ప లావణ్యరాశిగా ఉండేది. ఐదేళ్ల నుంచి బొమ్మలు గీయడం మొదలు పెట్టింది. వీరి కుటుంబం సిమ్లాలో కొంత కాలం ఉన్నా అమృత బొమ్మల్లోని గొప్పదనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు 16 ఏళ్ల వయసున్నప్పుడు పారిస్‌కు తీసుకెళ్లి ఐదేళ్ల పాటు చిత్రకళలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత అమృత గొప్ప చిత్రాలు గీస్తూ వెళ్లింది. అవన్నీ కూడా భారతీయ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేవే. ఇప్పుడు అత్యధిక రేటు పలికిన ‘ది స్టోరీ టెల్లర్’– పల్లెల్లో నలుగురు అమ్మలక్కలు కూచుని కబుర్లు చెప్పుకునే సన్నివేశం. ఇది కాకుండా ‘వధువు అలంకరణ’, ‘ఒంటెలు’, ‘యంగ్ బాయ్ విత్ త్రీ యాపిల్స్’, ‘జిప్సీ గర్ల్స్’, ‘యంగ్ గర్ల్స్’ ఆమె ప్రఖ్యాత చిత్రాలు. ఆమె తన సెల్ఫ్ పొర్ట్రయిట్ను కూడా గీసుకుంది. అకాల మరణం అమృత షేర్గిల్ తన హంగేరియన్ కజిన్ విక్టర్‌ను వివాహం చేసుకుంది. వారు లాహోర్‌లో ఉన్న సమయంలో కేవలం 28 ఏళ్ల వయసులో 1941లో మరణించింది. అందుకు కారణం కలుషిత ఆహారంతో వచ్చిన వాంతులు, విరేచనాలు అని చెప్తారు. మరో కారణం ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉందని సంప్రదాయ డాక్టర్‌గా ఉన్న విక్టర్ ఆమెకు రహస్యంగా, అశాస్త్రీయంగా అబార్షన్ చేయబోయాడని, అందువల్ల తీవ్రమైన బ్లీడింగ్ జరిగి మరణించిందని అంటారు. ఆకర్షణాజాలం అమృత షేర్గిల్ ఆ రోజుల్లో సంపన్న వర్గాల్లో గొప్ప ఆకర్షణ కలిగిన వ్యక్తిగా కీర్తి గడించింది. జవహర్లాల్ నెహ్రూ ఆమె స్నేహం కోసం అనేక లేఖలు రాశాడు. ఢిల్లీలో జరిగిన అమృత ఆర్ట్ ఎగ్జిబిషన్‌కు హాజరయ్యాడు. ‘అమృత ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఉన్నవారందరూ చేష్టలుడిగి ఆమెను చూస్తూ ఉండిపొయేవారు’ అని అనేకమంది రాశారు. ‘ఆమె జీవించి ఉంటే ప్రపంచం మొత్తం ఎన్నదగిన గొప్ప చిత్రకారిణి అయి ఉండేది’ అని ఆర్ట్ క్రిటిక్స్ అంటారు.ఆమె లేదు. కాని ఆమె చిత్రాలు ఆమెను సజీవంగా ఉంచుతూనే ఉన్నాయి. -
మోకా.. ‘చిరు’ చిత్రాలు కేక!
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖపట్నానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ తీర్చిదిద్ధిన చిరుధాన్యాల చిత్రాలు అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విదేశీ ప్రతినిధులు, వివిధ దేశాల ప్రధానుల సతీమణులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో భాగంగా ప్రగతి మైదానంలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్లో దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన భారతీయ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించారు. మోకా విజయ్‌కుమార్ చిరుధాన్యాలతో తీర్చిదిద్ధిన భారతీయ రైతుల చిత్రాలు, వినాయకుడి ప్రతిమను ఉంచారు. ఆయన రెండు అడుగుల ఎత్తుతో తయారు చేసిన గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గణపతి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ ప్రారంభ ప్రదేశంలోనే ప్రదర్శనకు ఉంచడం విశేషం. విజయ్‌కుమార్ మిల్లెట్స్‌తో తయారు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చిత్రపటాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతుల మీదుగా ఆమెకు ప్రదానం చేశారు. భారతీయ రైతుల కష్టాన్ని ప్రతిబింబిస్తూ మిల్లెట్స్‌పై ప్రజల్లో మరింత చైతన్యం పెంచే విధంగా తాను ఈ చిత్రాలను తయారు చేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. గతంలో విశాఖపట్నం, హైదరాబాద్‌లలో జరిగిన జీ–20 సదస్సుల్లో కూడా తన చిత్రాలను ప్రదర్శించినట్లు చెప్పారు. -
30 అడుగుల అభిమానం
‘జవాన్’తో మరో పెద్ద విజయాన్ని అందుకున్నాడు షారుక్‌ఖాన్. అభిమానులు ఖుషీ ఖుషీగా ఉన్నారు. కోల్‌కత్తాకు చెందిన షారుక్‌ఖాన్ అభిమాని, చిత్రకారుడు ప్రీతమ్ బెనర్జీ మార్బుల్ స్టోన్ చిప్స్, పెయింట్ బ్రష్‌ను ఉపయోగిస్తూ 30 అడుగుల షారుక్ పోట్రాయిన్ రూపొందించాడు. ఈ స్టన్నింగ్ పోర్ట్రయిట్ డ్రోన్ షాట్ అదిరిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ మేకింగ్ వీడియో చూసిన నెటిజనులు ‘వావ్’ అంటున్నారు. ‘ట్రిబ్యూట్ టూ ది కింగ్‌ఖాన్. ఇది నా హృదయంలో నుంచి వచ్చిన కళారూపం. నా అభిమాన హీరో దీన్ని త్వరలోనే చూడాలనుకుంటున్నాను’ అంటూ రాశాడు బెనర్జీ. -
చిత్రాలు గీసేందుకు చేతులెందుకు?
12 ఏళ్ల వయసు వరకూ స్వప్న ఆగస్టయిన్కు తన చేతులు తనకు ఉపకరించవన్న సంగతే తెలియదు. వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవం ఆమెకు అవగతమవుతూ వచ్చింది. తాను జీవితాంతం చేతులు లేకుండానే ఉండాలన్న విషయం ఆమెకు స్పష్టమయ్యింది. దీనిని గ్రహించిన ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. చేతులు లేకపోతేనేం తనకు చక్కనైన కాళ్లు ఉన్నాయి కదా అని అనుకుంది. తన పాదాలనే వినియోగిస్తూ స్వప్న తనలోని కళా ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది. పాదాలతో అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించే ప్రపంచ కళాకారిణిగా స్వప్న పేరు తెచ్చుకుంది. వరల్డ్ మలయాళీ ఫౌండేషన్ ఆమెకు ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్- 2018’ అవార్డుతో సన్మానించింది. స్వప్న తన కుటుంబానికే కాకుండా యావత్‌దేశానికే గర్వకారణంగా మారింది. ఆమె తన పెయింటింగ్స్‌ను ఎంఎఫ్‌పీఏ ఫోరమ్‌కు విక్రయిస్తుంటుంది. ఈ ఫోరమ్‌లోని సభ్యులు ప్రతీనెలా రెమ్యునరేషన్ పొందుతుంటారు. 1999 నుంచి స్వప్న ఈ ఫోరమ్‌లో మెంబర్‌గా ఉంది. స్వప్న ఆగస్టయిన్ 1975, జనవరి 21న కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. ఆమె తండ్రి ఆగస్టయిన్ రైతు. తల్లి సోఫీ గృహిణి. స్వప్నకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అదిమొదలు ఆమె తన పాదాలతో బ్రెష్ పట్టుకుని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. స్వప్న పెయింటింగ్, డ్రాయింగ్ మాత్రమే కాకుండా అన్ని పనులను తన పాదాల సాయంతోనే చేస్తుంటుంది. ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఐదుగురు తోబుట్టువులలో స్వప్న మొదటి సంతానం. డెలివరీ అనంతరం ఆమె తల్లికి.. స్వప్న చేతులు లేకుండా జన్మించిందని చెప్పారు. నాలుగేళ్ల వయసులోనే స్వప్న తన పాదాలతో పెన్సిల్ పట్టుకుని రాయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో స్కెచ్చింగ్ వేయగలిగే స్థాయికి చేరింది. అలప్పుజాలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో స్వప్న హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత పూర్తి స్థాయిలో పెయింటింగ్‌పై దృష్టి సారించింది. ప్రొఫెషనల్ పెయింటర్ స్థాయికి చేరింది. కేన్వాస్ మీద అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించసాగింది. అదే సమయంలో ఆమెకు మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్(ఎంఎఫ్‌పీఏ) గురించి తెలిసింది. దానిలో స్వప్న సభ్యత్వం తీసుకుంది. ఎంఎప్పీఏ అనేది దివ్యాంగ కళాకారుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. 27 మంది భారతీయ కళాకారులకు దీనిలో సభ్యత్వం దక్కింది. -
చైతన్య భారతి: స్త్రీవాద వర్ణాలు-అమృతా షేర్గిల్
అమృత తన వర్ణచిత్రాల ద్వారా , తన వ్యక్తిత్వం ద్వారా ఈ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ఆమె చిత్రాలలో కనిపించే ఎడతెగని మార్పులకు అమృత పుట్టుపూర్వోత్తరాలే ప్రధాన కారణం. అయితే, ఈ విషయంలో కాలాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. భారతదేశమే పరిణామక్రమంలో ఉన్న సమయంలో ఆమె జీవించారు. ఆమె మాతృమూర్తి హంగేరియన్. తండ్రి పదహారణాల భారతీయుడు. దాంతో తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే స్పృహ అమృతలో గాఢంగా ఉండేది. ఆమెకు తన శారీరక సౌందర్యానికి సంబంధించిన స్పృహ కూడా ఎక్కువే. ఆమె తన అందచందాలను అనేక రకాలుగా ప్రదర్శించారు. అందులో చాలాభాగం ఫొటోలను ఆమె తండ్రి ఉమ్రావ్ సింగ్ స్వయంగా తీశారు. స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కలిగి, భారతదేశానికి వచ్చి సంచలనం సృష్టించిన ‘విమోచన పొందిన మహిళ’గా ఆమె చాలామందికి గుర్తుండిపోయారు. చనిపోవడానికి సుమారు రెండేళ్ల ముందు ఆమె హంగేరీలో ఉండగా వేసిన ‘టు ఉమెన్’ అరుదైన చిత్రం. అందులోంచి స్త్రీవాదం తొంగి చూస్తుంటుంది. స్త్రీత్వానికి తాను చెప్పిన భాష్యాన్ని తానే ఎదుర్కొన్న చిత్రం అది. ఆధునిక భారతీయ మహిళ అనే పదం అరిగిపోయినదిగా కనిపించవచ్చు. కానీ అంతిమంగా, నాకు అమృత.. ఆ పదానికి తగిన నిర్వచనంలా కనిపిస్తారు. ఆమె వర్ణచిత్రాలే అందుకు తార్కాణాలు. 28 ఏళ్ల వయసుకే అనారోగ్యంతో మరణించిన అమృత తను జీవించిన కొద్ది కాలంలోనే అమూల్యమైన చిత్రకారిణిగా పేర్గాంచారు. అప్పట్లో భారతదేశంలో అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లను చిత్రించిన మహిళ అమృతాయే. 1938లో గోరఖ్‌పూర్‌లోని తన ఎస్టేట్‌లో ఆమె గీసిన ‘ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్’ చిత్రం.. ఇటీవలే 2021 వేలంలో 37.8 కోట్లకు అమ్ముడయింది. చిత్రకారిణిగా ఆమె తన ఆర్ట్ వర్క్‌ను ప్రేమించినట్లే భారతదేశాన్నీ ప్రేమించారు. 1938లో అమృత తన తల్లి వైపు బంధువు అయిన వైద్యుడు విక్టర్ ఈగాన్ను వివాహమాడారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో స్థిరపడ్డారు. 1941లో లాహోర్‌లో అత్యంత భారీ కళా ప్రదర్శన ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందు తీవ్రమైన ఆనారోగ్యం బారిన పడ్డారు. ఆ ఏడాది డిసెంబర్ 6 అర్ధరాత్రి తను గీస్తున్న బొమ్మలపైనే ఒరిగిపోయారు. – వివాన్ సుందరం, అమృతా షేర్గిల్ బంధువు -
చిత్రలేఖనంతో అబ్బురపరుస్తున్న ఎన్ఆర్ఐ..!
భారతీయ సంస్కృతిని కాపాడుతూ....ఇతర దేశాల్లో కూడా మన సంస్కృతి గొప్పదనాన్ని చాటిచెప్పున్న ప్రవాస భారతీయులు ఎంతోమంది. ఉరుకులు, పరుగుల జీవితంలో తనకెంతో ఇష్టమైన చిత్ర లేఖనాన్ని వదులుకోకుండా ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ఐశ్వర్య భాగ్యనగర్. అమెరికాలోని టెక్సాస్ నగరం నివసిస్తున్న ఐశ్వర్య చిత్రలేఖనంతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ పోస్టర్, భీమ్, రామరాజు ఫోటోలను ఎంతో అద్బుతంగా పెయింట్ చేశారు. వీటితో పాటుగా ఆమె గీసిన దళపతి విజయ్, మహానటి కీర్తి సురేష్ సహా మరెన్నో చిత్రాలు అలరిస్తున్నాయి. భారతీయ కళలపై ఉన్న ఆసక్తితో ఆమె 2016లో భరత నాట్యంలో కూడా అరంగేట్రం చేశారు. ఐశ్వర్య కుంచె నుంచి జాలువారిన పలు చిత్రాలు ఇవే..! ఐశ్వర్య భాగ్యనగర్ చదవండి: డాలస్‌లో తానా పుస్తక మహోద్యమం -
రామానుజ విగ్రహ కథా ‘చిత్రమ్’
రామానుజాచార్య సమతామూర్తి విగ్రహం చెంత కొలువుదీరేందుకు పెద్ద సంఖ్యలో వర్ణచిత్రాలు సిద్ధమవుతున్నాయి. శంషాబాద్‌లోని ముచ్చింతల్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటవుతున్న ఈ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఉన్న ప్రాధాన్యతకు తగ్గట్టుగా వీటిని తీర్చిదిద్దేందుకు పలువురు చిత్రకారులు వర్ణాలద్దుతున్నారు. ఒకేసారి ఇన్ని చిత్రాలు రూపుదిద్దుకోవడం, పెద్ద సంఖ్యలో ఆర్టిస్టులు భాగస్వామ్యం కావడం ఇదే తొలిసారి అని నగర చిత్రకారులు చెబుతున్నారు. సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డిజిల్లా: వేల ఏళ్ల క్రితం నాటి రామానుజుల సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సదాశయంతో నెలకొల్పుతున్న సమతామూర్తి కేంద్రంలో వందలాదిగా వర్ణచిత్రాలు కొలువుదీరనున్నాయి. వీటిని కనువిందుగా చిత్రించే పనిలో రోజుకు కనీసం 50 మంది చిత్రకారులు భాగం పంచుకుంటున్నారు. కూకట్‌పల్లిలో ఉన్న జీవా గురుకులంలో దీని కోసం అతిపెద్ద ఆర్ట్ క్యాంప్ ఏర్పాటైంది. నేపథ్యానికి అనుగుణంగా చిత్రాలను గీసేందుకు నగరానికి చెందిన పలువురు చిత్రకారులు, ఆర్ట్ కాలేజీ విద్యార్థులు కూడా హాజరవుతున్నారు. సమాజంలో ఎన్నో రకాల మంచి మార్పులకు, సర్వ ప్రాణి కోటి సమానత్వానికి, ఆధ్యాత్మిక ఆలోచనల వ్యాప్తికి ఎనలేని కృషి చేసి చరిత్రలో నిలిచిపోయిన రామానుజాచార్యులు జీవితంలోని ముఖ్య ఘట్టాలే నేపథ్యంగా ఈ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. సందేశాత్మకంగా సాగే ఆయన జీవితాన్ని కళ్లకు కట్టేలా మొత్తంగా 350 చిత్రాలు ఈ ఆధ్యాత్మిక పరిసరాల్లో కొలువుదీరనున్నాయి. సమతామూర్తి ప్రాంగణంలో ఉన్న 40 స్తంభాలకు నలువైపులా వీటిని అమరుస్తారు. ఈ పెయింటింగ్స్ కొన్ని 3/3, కొన్ని 3/11 సైజులో తయారవుతున్నాయి. సమతామూర్తి విగ్రహం చెంత ఏర్పాటు చేసేందుకు చిత్రకారులు వేస్తున్న చిత్రాలు నెలాఖరు వరకూ క్యాంప్... చిత్రకళా శిబిరం నెలాఖరు వరకూ కొనసాగనుందని ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న నగర చిత్రకారుడు మారేడు రాము చెప్పారు. తాను రామానుజాచార్యుల జీవిత ఘట్టం లోని ముఖ్యమైన ఉపదేశాల సన్నివేశాలను రామానుజాచార్యులు రుషులకు బోధిస్తున్న దృశ్యాలను చిత్రించామని తెలిపారు. ఈ తరహా అతిపెద్ద చిత్రకారుల శిబిరం తన జీవితంలో చూడలేదని, దీనిలో తాను సైతం భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇదొక పెద్ద చిత్రకళా పండుగలా ఉందన్నారాయన. గిన్నీస్ రికార్డ్ సాధించదగ్గ భారీ ఆర్ట్ క్యాంప్‌గా దీనిని చెప్పొచ్చునన్నారు. రేపటితో క్యాంప్ పూర్తవుతుందని తెలిపారు. -
ఏమా అదృష్టం.. పెయింటర్‌ను వరించిన రూ.12 కోట్ల లాటరీ.. టికెట్ కొన్న గంటల్లోనే
కొట్టాయం (కేరళ): యాభై ఏళ్లుగా సామాన్య పెయింటర్... రెక్కల కష్టంతో జీవితం నెట్టుకొస్తున్నాడు. ఆదివారం అదృష్టం ఆయన తలుపు తట్టింది. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్‌కు సుడి మామూలుగా లేదు. క్రిస్మస్– నూతన సంవత్సరపు బంపర్ లాటరీలో ఆయన ఏకంగా రూ. 12 కోట్లు గెల్చుకున్నారు. ఆదివారం తిరువనంతపురంలో ఈ మెగా లాటరీ డ్రా తీశారు. దానికి కొద్ది గంటలకు ముందు సదానందన్ ‘ఎక్స్‌జి 218582’ నంబర్ లాటరీ టికెట్ కొన్నారు. అట్నుంటే బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశారు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే సదానందన్ టికెట్‌కు రూ. 12 కోట్లు తగిలింది. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. కొత్త కేసులు ఎన్నంటే..) -
Animal Art: ‘పిగ్'కాసో పెయింటింగ్స్.. ఒక్క చిత్రం ధర ఏకంగా రూ. 14 లక్షలు!
Pig Painter Pigcasso’s Artwork Story In Telugu రవివర్మ, లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, ఆర్టెమిసియా జెంటిలేస్చి... వంటి ప్రసిద్ధ పెయింటర్స్ చేతుల్లో జీవం పోసుకున్న రకరకాల పెయింటింగ్‌లను మీరిప్పటివరకూ చూసి ఉంటారు. అఫ్కోర్స్! వాటి ధర కూడా కోట్ల రూపాయలు పలుకుతాయి. ఐతే మీమ్మల్ని అమితాశ్చర్యాలకు గురచేసే ఈ సరి కొత్త పెయింటర్ గురించి ఇప్పటివరకూ తెలిసుండదు. ఆ పెయింటర్ మనిషికాదు ఓ జంతువు. అది వేసే రంగుల చిత్రాలకు జనాల్లో యమ క్రేజీ ఉంది. ఒక పెయింట్ ధర లక్షల రూపాయలు పలుకుతోంది మరి! ఆ జంతువు మరేదోకాదు అక్షరాలా ఓ పంది. ఇక ఈ సునక పెయింటర్ కుంచెతో పట్టి గీసిన చిత్రాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ పంది పేరు పిగ్కాసో. పిగ్కాసో తాజాగా వేసిన పెయింటింగ్ 72 గంటల్లోనే డిసెంబర్ 13న జర్మనీకి చెందిన వ్యక్తి 20 వేల డాలర్లు (రూ. 14, 97, 000) కు కొన్నట్లు అక్కడి స్థానిక మీడియా తెల్పింది. గతంలో ఓ చింపాజీ వేసిన పెటింటింగ్ 14 వేల డాలర్లు పలకగా, తాజాగా ఆ రికార్డును పిగ్కాసో బద్ధలుకొట్టింది. నిజానికి దక్షిణాఫ్రికాలోని ఫ్రెంచ్వ్యాలీకి చెందిన జోన్ లెఫ్సన్, 2016లో కేప్ టౌన్‌లోని పదిమాంసం విక్రయించే దుకాణం నుంచి ఈ పందిని కాపాడింది. ఆతర్వాత ఆమె తనతో పాటు పందిని తీసుకువచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. ఐతే ఒక రోజు అనుకోకుండా కొన్ని పెయింట్ బ్రష్‌లను పిగ్కాసో ఉంటున్న ఎన్‌క్లోజర్‌లో జోన్ వదిలేసింది. బ్రష్‌లతో ఆడుతున్న పందిని చూసిన జోన్‌కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది అప్పటినుంచి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది పిగ్కాసో. 5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 400కుపైగా పెయింటింగ్స్ వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంది వేసిన పెయింటింగ్స్ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారట. హాట్ కేకుల్లా వేసీవేయంగానే లక్షల్లో అమ్ముడుపోతున్నాయని, ఈ విధంగా పెయింటింగ్స్ ద్వారా వచ్చిన డబ్బును ఇతర జంతువుల పెంపకానికి వినియోగిస్తున్నట్లు జోన్ లెఫ్సన్ మీడియాకు తెల్పింది. యానిమల్ ఆర్ట్‌కు జనాల్లో బాగానే పాపులార్టీ ఉంది కదా! చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు.. -
చిత్రం.. ఇది బొట్టో గీసిన విచిత్రం
చూడగానే వావ్..అనిపిస్తున్న ఈ వర్ణరంజిత చిత్రాలు ఏ చిత్రకారుడి కుంచెలోంచి జాలువారినవో కాదు సుమా! డిజిటల్ కాన్వాస్‌పై కృత్రిమమేధ (ఏఐ)సృష్టించిన అద్భుతాలివి. దేన్నైనా సృష్టించగలగడం మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకత అని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం కదా! కృత్రిమ మేధపుణ్యమా అని ఈ సరిహద్దు కూడా చెరిగిపోతోందని ఈ ఫొటోలను చూస్తే అనిపించకమానదు. ఇవి ఓ పికాసో.. ఓ వాన్గో.. ఎం.ఎఫ్.హుస్సేన్‌ల కుంచె చేసిన మహిమలని అనిపిస్తోంది కదూ! కానీ, బొట్టో అనే ఓ కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ గీసిన డిజిటల్ చిత్రాలివి. ఈ మధ్యనే జరిగిన ఓ వేలంలో 6 ‘బొట్టో’బొమ్మలకు దాదాపు రూ. 9.76 కోట్లు వచ్చాయి. బొట్టో.. ప్రతివారం 350 వరకూ చిత్రాలు గీస్తే, వాటిని చూసి ఏవి బాగున్నాయో? ఏవి బాగాలేవో? చెబుతూ చిత్రకళాప్రియులు ఓటేస్తారు. ఒక్కో చిత్రానికి వచ్చిన ఓట్లు, కామెంట్ల ఆధారంగా బొట్టో తన కళకు మెరుగులు దిద్దుకుంటుందన్నమాట. బొట్టో చిత్రాలకు మీరూ ఓటేయొచ్చు. కాకపోతే ఈ వ్యవహారమంతా క్రిప్టో కరెన్సీతో కూడుకున్నది. వివరాలు https://botto.comలో ఉన్నాయి. -
మరీ ఇంత కోపమా.. 26వ అంతస్తు నుంచి వేలాడదీసిందిగా..!
బ్యాంకాక్: సాధారణంగా ఎవరైనా మనకు కోపం తెప్పించే పని చేస్తే.. గట్టిగా అరుస్తాం.. లేదా చేతిలో ఉన్న వాటిని విసిరేస్తాం. అంతేతప్ప.. కోపంలో అవతలి వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చే పని చేయం కదా. కానీ థాయ్‌ల్యాండ్‌లో ఓ మహిళ ఆగ్రహం.. ఆమెకు జైలు జీవితాన్ని.. ఇద్దరు వ్యక్తులకు బతికుండగానే చావును పరిచయం చేసింది. సదరు వ్యక్తుల మీద ఆగ్రహించిన మహిళ.. ఏకంగా వారిని 26వ అంతస్తు నుంచి కిందకు వేలాడేలా చేసింది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అని హెచ్చరిస్తోంది థాయ్‌ల్యాండ్ సీతమ్మ. ఇంతకు ఆమెలా అంతలా కోపం తెప్పించినా ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ సంఘటన ఉత్తర బ్యాంకాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లో సదరు మహిళ నివసిస్తూ ఉండేది. ఈ క్రమంలో అపార్ట్మెంట్లో ఓ చోట రిపేర్ రావడంతో ఇద్దరు పెయింటర్లు 26వ అంతస్తుకు వెళ్లి.. బాగు చేయడం ప్రారంభించారు. (చదవండి: Viral: అనుకోని అతిథి.. మామూలు నష్టం కాదు) అయతే తనను అడగకుండా ఎలా వెళ్తారని ఆగ్రహించిన మహిళ సదరు పెయింటర్స్‌కు మద్దతు కోసం ఏర్పాటు చేసిన తాడును కత్తిరించింది. అనుకోని ఈ సంఘటనకు బిత్తరపోవడం పెయింటర్ల వంతయ్యింది. పాపం వారిద్దరు 26వ అంతస్తు నుంచి గాల్లో వేలాడసాగారు. సహాయక సిబ్బంది వచ్చి.. వారిని కాపాడేవరకు గాల్లోనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. (చదవండి: కిరీటం, చెప్పు జారిపోయిన బెదరలేదు.. 5 మిలియన్ల మంది ఫిదా ) విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సదరు మహిళను అరెస్ట్ చేశారు. అయితే తాను పెయింటర్లను చంపాలనుకోలేదని.. తన అనుమతి లేకుండా బిల్డింగ్‌కు మీదకు ఎక్కడంతో కోపం వచ్చి.. తాడు కట్ చేశానని తెలిపింది. ఏది ఏమైనా సదరు మహిళ చేసిన పని హత్యాయత్నం కిందకే వస్తుందని చెప్పి.. ఆమె మీద కేసు నమోదు చేశారు. కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొన్ని నిమిషాల పాటు సహనంగా ఉంటే.. ఇంత ప్రమాదం జరిగేది కాదు కదా అంటున్నారు విషయం తెలిసిన నెటిజనులు. చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు -
AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి
సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వాలి.. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు. అంధత్వం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్.వి. ప్రభాకర్ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్ రెండవ సంతానం. ప్రభాకర్.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్‌చైర్‌కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్ అకౌంటెంట్) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు. మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు. ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్ కోరాడు. తిరుత్తణి దేవ పెయింటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్ తిరుత్తణి దేవ కోరుతున్నాడు. -
రూ. 300 కోట్లకు అమ్ముడైన పెయింటింగ్.. స్పెషల్ ఏంటి?
ఊపిరి సినిమా చూశారా! అందులో హీరో కార్తీ టాయిలెట్ క్లీనింగ్ బ్రష్‌తో ఓ చిత్రమైన పెయింటింగ్ వేస్తాడు. దానిని రూ. 2 లక్షలు పెట్టి కొనటమే కాకుండా.. లేని ఓ అర్థాన్ని వివరిస్తూ హాస్యం పండిస్తాడు ప్రకాశ్‌రాజ్. అలా వచ్చిన డబ్బుతో కార్తీ తన చెల్లి పెళ్లి చేస్తే.. నిజ జీవితంలో బ్రిటన్‌కు చెందిన ‘సచా జాఫ్రీ’ ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. అయితే, ఇతను కార్తీలా కాదు.. ప్రసిద్ధ కళాకారుడు. ఇతను వేసిన పెయింటింగ్ కూడా అర్థవంతమైందే. ఆ బొమ్మను గీసే ముందు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ కరోనా కాలంలో వాళ్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? ఒంటరిగా అయిపోయినట్టు ఫీలవుతున్నారా? ఇలా వాళ్ల అనుభవంలోకి వచ్చిన భావాలతో స్కెచెస్ వేసి వాటిని తనకు పంపాలని కోరాడు. ఆ తర్వాత దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని వెచ్చించి ఆ పెయింటింగ్ వేశాడు. దీనికోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్‌ను ఉపయోగించాడు. 70 విభాగాలుగా చిత్రించి తర్వాత ఒక్కటిగా కలిపి పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో పెద్ద కాన్వాస్ పెయింటింగ్‌గా తయారు చేశాడు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు కూడా సంపాదించుకుంది. పైగా ఇందులో ‘జర్నీ ఆఫ్ హ్యుమానిటీ’ అనే అర్థం దాగి ఉంది. దుబాయ్‌లోని ‘ది పామ్’ హోటల్లో నిర్వహించిన వేలంలో దీన్ని ఫ్రాన్స్‌కు చెందిన ‘ఆండ్రీ అబ్దున్’ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. #HappeningNow the #OpeningAuction of @SachaJafri' record breaking #artwork #TheJourneyOfHumanity is achieved great interest! It actually has enough interest to be sold entirely to one bidder! pic.twitter.com/e2E4EcGg1z — Mazdak (@MazRaf75) March 22, 2021 చదవండి: రూ.2,000 నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన -
Artist Gopi: గూడు వీడిన గిజిగాడు
మణికొండలో ఆర్టిస్ట్ కడలి సురేష్ ఉండేవారు. ఒక మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయిం టింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ఫ్రేము లుగా రామాయణం బొమ్మల సిరీస్‌లు. అన్నీ అద్భు తాలే. నేను దొంగ కంట మరో బొమ్మ చూస్తున్నా, టీవీ వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్ క్యాలెండర్ ఒకటి. ప్రతి షీట్ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. గోపీ అనే పేరంత సింపుల్ లైన్ బొమ్మలు. పెన్సిల్ పట్టి వంద ఎవరెస్ట్ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు. సురేష్ గారి వేలాది బొమ్మలని వదిలి ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డువచ్చింది. అడిగినా కావలిస్తే నా బొమ్మలు అన్నీ పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి’ అనేవారు సురేష్ గారు. గోపీ చిత్రకారులకే చిత్రకారుడు. ఆయన గురించి మహాను‘బాపు’ తమదైన పొదుపైన మాట లతో ఇలా అన్నారు. ‘నాకున్న ఇంకో గురువు గారు గోపి–ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిస లాడుతూ వుంటాయి’. ఆయన ఇమాజినేషన్ కూడా అంత డైనమిక్‌గా ఉంటుంది–గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతావాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్ ఫీట్! పకడ్బందీగా–కొమ్మకు వేలాడుతూ–అంతస్తులు–కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఇంజనీర్ల కన్వెన్షన్ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే, గోపి దానికి ముఖ చిత్రంగా గిజిగాడు బొమ్మవేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టి ఇంజనీర్లు ప్రతిసృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమాజినేషన్ అంటే, అదీ గోపీ అంటే! అనగనగా రోజుల్లో సాహిత్యం–చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగా రించుకునేది. ఒక కన్ను చేతనున్న కుంచె వైపు, మరో కన్ను కెమెరా వంక ఆయన చూస్తున్న కాలంలో ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు ‘మీరు కాక పోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి’ అంటే బాపు పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే! గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపుబొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండిపోయిన పత్రికల రోజులని గోపి అనే కొత్త సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్ పేజీల డ్రాయింగులకి కొత్త వరుసలు చూపించింది. రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగి మలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్ని టిని ఆయన డైనమిక్ టచ్‌తో మార్చేశారు. మెల కువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్‌బుక్ ఉండేది. కనపడిన ప్రతీది బొమ్మగా మలి చేవారు. చూసిన సినిమాల్లో సన్నివేశాలు గుర్తు పెట్టు కుని వచ్చి ఆ యుద్ధ పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్ డ్యాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ఫ్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెర పటం, మళ్ళీ గీయటం... బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు–బొమ్మలని జీవనోపాధిగా చేసు కోడం వేరు. గోపిగారే కాదు, చాలామంది చిత్ర కారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు. ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చిపెట్టిన డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యవ్వనం–ఆరోగ్యం సహక రించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నా అని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదం తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి. ఆయన బొమ్మల జ్ఞాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్ చప్పుడులు తెలిసిన జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు గానీ, ఆయన భౌతిక దేహం వద్ద కూచుని చెవి దగ్గర ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్టిస్ట్ గానే పుడతారా గోపీ గారు?’ అని అడిగితే ప్రాణం లేని ఆ తల ‘ఊహు’ అని అడ్డంగా ఊపడానికైనా కాస్త ప్రాణం కచ్చితంగా తెచ్చుకునేదే. – అన్వర్ -
కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’
రాప్తాడు: చేయి పట్టుకుని నడక నేర్పించే తండ్రి దూరం కావడం.. ఆ చిన్నారి ఒంటరితనానికి కారణమైంది. కుటుంబ పోషణ కోసం అమ్మ పడుతున్న కష్టం కలచి వేసింది. పలుగు... పార చేతబట్టి ఉపాధి పనులకు పోయిన తల్లి చేతుల నిండా బొబ్బలు.. అన్నం ముద్ద తినిపిస్తున్న ఆమె చేతిలోని గాయాలు ఆ చిన్నారి హృదయాన్ని మరింత గాయపరిచాయి. ఏదో తెలియని ఒత్తిడి. ఆ భారం నుంచి బయటపడేందుకు తనకొచ్చిన గీతలతో కాలక్షేపం. ఆ గీతలే చివరకు అతని ఒత్తిడిని దూరం చేశాయి. అభద్రతాభావం నుంచి బయటపడేస్తూ అద్భుత చిత్రకారుడిని ఈ లోకానికి పరిచయం చేశాయి. అతనే షేక్ మహమ్మద్ అర్షద్ (ఎస్.ఎం.అర్షద్). చనిపోవాలనుకుని.. రాప్తాడుకు చెందిన బికెన్బాషా, కౌసర్‌బాను దంపతులకు ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం భార్యాపిల్లలకు బికన్బాషా దూరమయ్యాడు. దిక్కుతోచని స్థితిలో కౌసర్‌బాను కొట్టుమిట్టాడింది. చిల్లిగవ్వ కూడా చేతిలో లేక సతమతమవుతున్న కౌసర్‌బాను తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో పుట్టింటి వారు ఆమెకు ధైర్యం చెప్పారు. మదర్‌థెరిస్సా చిత్రాన్ని గీస్తున్న అర్షద్- అర్షద్ గీసిన త్రీడీ చిత్రం.. ఎలాగైనా ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేయాలని అనుకున్న ఆమె ఉపాధి పనులతో పాటు కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. ఏనాడూ ఎండ ముఖం ఎరుగని ఆమె.. ఒక్కసారిగా తట్టాబుట్ట పట్టుకుని పొలాల బాట పట్టింది. ఈ క్రమంలోనే తమ కోసం తల్లి పడుతున్న తపన ఆ ఇద్దరు చిన్నారులనూ కదిలించింది. తల్లి రెక్కల కష్టం వృథా కాకూడదనుకున్న వారు ఇష్టంతో చదువుకుంటూ రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో సీటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కౌసర్‌బాను పెద్ద కుమారుడు ఎస్.ఎం.అర్షద్ స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. గీతలతోనే కాలక్షేపం రాప్తాడులోనే అద్దె ఇంటిలో నివసిస్తున్న కౌసర్‌బాను.. అప్పు చేసి కుట్టుమిషన్ సమకూర్చుకుంది. ఉదయం ఉపాధి పనులకు పోవడం, ఇంటికి వచ్చిన వెంటనే కుట్టు మిషన్ మీద ఇతరుల దుస్తులు కుట్టి ఇవ్వడం ద్వారా వచ్చే సంపాదనతో పొదుపుగా జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలోనే తాను ఇంటి వద్ద లేని సమయంలో అర్షద్ కాగితాలపై గీతలు గీస్తుండడం ఆమె గ్రహించింది. నోటు పుస్తకాల నిండా గీతలు గమనించిన ఆమె ఒక్కసారిగా అసహనానికి గురైంది. అసలే అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. చదువులకు ఇక నోటు బుక్కులు ఎలా కొనుగోలు చేయాలంటూ కుమారుడిని మందలిస్తూ వచ్చింది. ఇలాగే గీతలు గీస్తూ కూర్చొంటే తనలా కూలి పనులకు వెళ్లాల్సి ఉంటుందని కుమారుడిని హెచ్చరించింది. బుద్ధిగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో బాగా ఎదగాలని హితబోధ చేసేది. త్రీడీ చిత్రాలు గీయడంలో దిట్ట ఇంటి వద్ద ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు పిచ్చి గీతలు గీయడం మొదలు పెట్టిన అర్షద్... ఆ తర్వాత ఆ గీతల ద్వారా అద్భుతాలను ఆవిష్కరించడం మొదలు పెట్టాడు. తల్లి ఇస్తున్న డబ్బును దాచుకుని వాటితో తనకు కావాల్సిన పెన్నులు, స్కెచ్‌లు, పెయింట్స్, డ్రాయింగ్ పేపర్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు. అతనిలోని కళాకారుడిని అతని క్లాస్మేట్స్ గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాను చదువుకుంటున్న స్కూల్లోని ఉపాధ్యాయుల చిత్రాలను గీసి, అందరి మన్ననలూ పొందాడు. ఆ సమయంలోనే త్రీడీ చిత్రాలు గీయడం నేర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. అప్పటి వరకూ త్రీడీ చిత్రాలు అంటే ఏమిటో తెలియని అర్షద్.. ఇంటికెళ్లిన తర్వాత సెల్ఫోన్లో యూట్యూబ్ ద్వారా త్రీడీ చిత్రాలు గీయడం చూసి సాధన మొదలు పెట్టాడు. చూస్తుండగానే అందరినీ అబ్బురపరిచే స్థాయికి ఎదిగాడు. అర్షద్లోని ప్రతిభను తల్లి కౌసర్ గుర్తించింది. కుమారుడి అభీష్టం మేరకు అతనికి ఇష్టమైనవి కొనుగోలు చేసి ఇస్తూ మరింత ప్రోత్సహిస్తూ వచ్చింది. -
చిత్తు కాగితాల సుందర చిత్రం
ఎవరూ పట్టించుకోని.. ఎవరికీ అక్కర్లేని... చిత్తుకాగితాలు స్లమ్స్. ఆ కాగితాలను అందమైన పువ్వులుగా సీతాకోకచిలుకలుగా, పిల్లల నవ్వుల్లా కొత్తగా సింగారిస్తోంది రూబుల్నాగి. కాశ్మీర్లో పుట్టిన రూబుల్ నాగి లండన్‌లో పెరిగింది. అక్కడే చదువుకుంది. శిల్పాలు, ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లో ప్రత్యేకత కలిగిన ఆమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కళతో సమాజాన్ని మార్చాలన్నది ఆమె కల. అందుకు తగినట్టుగానే రెండు దశాబ్దాలుగా పెయింటింగ్ చేస్తోంది. ఎక్కడో కాదు భారతదేశంలో చిత్తుకాగితాలుగా పరిగణించే స్లమ్స్‌ని ఆమె తన కాన్వాస్‌కు వాడుకుంది. స్లమ్స్ కలర్‌ఫుల్ దేశమంతా తిరిగి పిల్లల కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్న ఆమె ‘రూబుల్ నాగి’ ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. యువ ప్రతిభావంతులైన కళాకారులను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న రూబుల్ జనవరి 2018 నుంచి ‘మిసాల్ ముంబై’ పేరుతో ధారవి మురికి వాడలను పెయింటింగ్ తో అలంకరిస్తోంది. ఇప్పటివరకు 30 మురికివాడల్లోని 1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది. గోడలపై చిత్రాలను రూపొందించింది. తన పెయింటింగ్‌తో స్లమ్స్ రూపురేఖలను మార్చుతోంది 40 ఏళ్ల రూబుల్ నాగి. కళతో కనెక్ట్ కళకోసమే జీవితాన్ని అంకితం చేసిన రూబుల్ రెండు దశబ్దాలలో 800 శిల్పాలు, లెక్కలేనన్ని చిత్రాలను రూపొందించింది. 62 కిండర్ గార్టెన్లను కూడా నడుపుతోంది. తద్వారా పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తోంది. రూబుల్ నాగి సంస్థ దేశవ్యాప్తంగా పిల్లల కోసం ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఆమె తన కళను ప్రజలతో కనెక్ట్ అయ్యే మాధ్యమంగా భావిస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘సామాజిక సమస్యలను లేవనెత్తడానికి వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రజలకు సహాయపడే మార్గం ఇది’ అని చెప్పే రూబుల్ పెయింటింగ్స్‌తో సామాన్య ప్రజలూ ప్రేరణ పొందుతుంటారు. ఆమె పెయింటింగ్స్ విద్య, మహిళా సాధికారత, ఉపాధి వంటి సమస్యలను చర్చిస్తాయి. అదే సమయంలో ఆమె వర్క్‌షాప్‌లో మురికివాడల ప్రజలు పరిశుభ్రత గురించీ తెలుసుకుంటారు. కొత్త శక్తి దిశగా! రూబుల్ ఆలోచన గొప్పదనం తెలుసుకోవాలంటే ఆమెతో కాసేపు ముచ్చటించాలి. ‘ఈ ఇళ్ళపై నేను పెయింట్ చేసిన రంగులు కొన్ని ఏళ్ల తరువాత మసకబారుతాయి. కానీ ఈ రంగులు ప్రజల ఆలోచనలో సానుకూల మార్పులు వస్తాయి. అవి వారికి ఎల్లప్పుడూ కొత్త శక్తిని ఇస్తాయి’ అంటుంది అంటోంది ఈ చిత్రకారిణి. రూబుల్ ఇప్పటివరకు రాజస్థాన్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ మహారాష్ట్రతో పాటు పెయింటింగ్ ద్వారా ముంబై మురికివాడలను అభివృద్ధి చేసింది. చేస్తోంది. ఆమె పెయింటింగ్స్‌ను కార్పోరేట్ సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, భారతప్రభుత్వం, మ్యూజియమ్‌లతో సహా ఎంతో మంది సేకరిస్తుంటారు. కొనుగోలు చేస్తుంటారు. అలా వచ్చిన డబ్బుతో మురికివాడలకు ప్రాణం పోస్తోంది రూబుల్ నాగి. మహిళలతో రూబుల్ నాగి -
మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో చిక్కుకున్న పెయింటర్లు
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో ఐదుగురు పెయింటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో ముందుగా ఇద్దరు పెయింటర్లను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కూడా ఉండటంతో తీవ్రంగా శ్రమించి వారిని కూడా సురక్షితంగా పోలీసులు బయటకు తీశారు. ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన పెయిటర్లు స్పృహ కోల్పోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పెయిటర్లు శనివారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో పెయింటింగ్ వేయడానికి అందులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే వారు పెయింట్ వేస్తూ అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. చదవండి: అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం -
ఎంఎఫ్ హుస్సేన్ ‘సినిమా ఘర్’.. ఇక ఫొటోలోనే..
సాక్షి, బంజారాహిల్స్: సినిమాలు, కళలను అనుసంధానిస్తూ ప్రఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్.హుస్సేన్ బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రధాన రహదారిలో తన కలల సౌధంగా నిర్మించుకున్న సినిమా ఘర్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఒక వైపు సినిమాలను, ఇంకోవైపు పెయింటింగ్స్‌ను తిలకిస్తూ కళాకారులు మురిసిపోయే విధంగా 1994లో ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడ సినిమా ఘర్ పేరుతో తన సొంత ఆలోచనతో దీన్ని నిర్మించారు. అప్పటి బాలీవుడ్ అగ్రనటి మాధురి దీక్షిత్ చేతులమీదుగా ప్రారంభించారు. ఆయన మరణానంతరం కుటుంబ సభ్యులు దీని నిర్వహణ వదిలేశారు. కోట్ల విలువ చేసే పెయింటింగ్స్‌ను ముంబైకి తరలించారు. పది సంవత్సరాల నుంచి ఈ భవనం శిథిలావస్థలోనే ఉంది. పదేళ్ల క్రితమే మళ్లీ తెరుస్తామని ప్రకటనలు వచ్చినప్పటికీ ఆ లోపే ఆయన 2011 జూన్ 9న మరణించడంతో మళ్లీ తెరుచుకోలేదు. ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అండ్ సినిమా పేరుతో కనువిందుగా ఈ మ్యూజియంను తీర్చిదిద్దారు. 50 మంది కూర్చొని సినిమా తిలకించే విధంగా సౌందర్య టాకీస్ పేరుతో ఇందులో మినీ థియేటర్ కూడా ఉండేది. ఇక పెయింటింగ్స్, బుక్స్, పోస్ట్‌కార్డుల ప్రదర్శన కోసం ప్యారిస్ సూట్ పేరుతో మరో హాల్ ఉండేది. తరచూ ఎంఎఫ్ హుస్సేన్ ఇక్కడికి వచ్చి తన సన్నిహితులతో, కళాకారులతో సంభాషిస్తూ ఉండేవారు. ఆయన మరణం సినిమా ఘర్ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేస్తుంటే కళాభిమానులు కంటనీరు పెట్టుకుంటున్నారు. ఎంఎఫ్ హుస్సేన్ జ్ఞాపకాలు కళ్లముందే కూలిపోతుంటే ప్రతిఒక్కరూ చలించిపోతున్నారు. కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఈ భవనాన్ని తీసుకొని కళాకారుల సందర్శనార్థం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. -
670 కోట్ల అరుదైన చిత్రం!
కళాచరిత్రలో ప్రముఖంగా చెప్పుకునే చిత్రకారుల్లో ఇటాలియన్ చిత్రాకారుడు సాండ్రో బాటిచెలి ఒకరు. ఆయన చిత్రించిన అలనాటి చిత్రం ఒకటి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 15 వ శతాబ్దానికి చెందిన ఈ చిత్రం న్యూయార్క్‌లోని సోత్బీస్ యాక్షన్ హౌజ్‌లో 670 కోట్లకు అమ్ముడుపోయి కొత్త సంవత్సరంలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. ‘యంగ్ మ్యాన్ హోల్టింగ్ ఏ రౌండెల్’ అని పేరుగల ఈ చిత్రరాజాన్ని వేనోళ్ల పొగుడుతుంటారు కళాభిమానులు. ఈ చిత్రం మార్కెటింగ్ కోసం నాలుగు నెలల సమయాన్ని వెచ్చించారు. లాస్ ఎంజెల్స్, లండన్, దుబాయ్‌లలో ప్రదర్శించారు. కళా, సాంకేతిక విషయాలకు సంబంధించిన విశ్లేషణతో 100 పేజీల కేటలాగ్ కూడా ప్రచురించారు. మొత్తానికైతే ఫలితం వృథా పోలేదు. చిత్రంలో ఉన్న వ్యక్తి గురించి చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరు అనేది పక్కన పెడితే ఆ కాలానికి చెందిన సంపన్న, శక్తిమంతమైన కుటుంబానికి చెందిన వ్యక్తి అనే విషయంలో ఎవరికీ భేదాభిప్రాయాలు లేవు. అంత పెద్ద మొత్తం పెట్టి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన కళాభిమాని పేరు, వివరాలు ఇప్పటికైతే గోప్యంగా ఉన్నాయి. -
రూ.640 కోట్లు: ‘ఊపిరి’లో పెయింటింగ్ సీన్ గుర్తుందా..
న్యూయార్క్: అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ సినిమా గుర్తుందా. ఆ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేస్తే నోరెళ్లబెట్టిన హీరో కార్తీ గుర్తున్నాడు కదా. ఇప్పుడు మీరు కూడా ఈ వార్త చదివితే అలాగే అవుతారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక పాతకాలం నాటి పెయింటింగ్ వేలంలో పెడితే అత్యధిక రేటు పలికింది. ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా నిలిచింది. వేలంలో ఆ పెయింటింగ్ అక్షరాల రూ.640 కోట్లు పలికింది. వందల ఏళ్ల నాటి ఇటలీకి చెందిన చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి ఓ పెయింటింగ్ వేశాడు. ఆ పెయింటింగ్‌ను ఇటీవల న్యూయార్క్‌లో వేలం వేశారు. ఆ పెయింటింగ్ ఏకంగా రూ.670 కోట్లకు (92.2 మిలియన్ డాలర్లు) అమ్ముడవడం విశేషం. ఇటలీకి చెందిన సాండ్రో క్రీ.శ.1440-1510 మధ్య జీవించాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా పేరుపొందాడు. ఆయన ఎన్నో రకాల పెయింటింగ్‌లు వేశారు. ఈ విషయాన్ని వేలం నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వేలంలో సాండ్రో బొటిసెల్లి వేసిన ఎన్నో చిత్రాలు కూడా పెట్టగా.. అందులో ఈ పెయింటింగ్‌కే అత్యధిక ధర పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు. -
బూడిదతో గాంధీ బొమ్మ.. లిమ్కా బుక్‌లో చోటు
ఆదోని: బూడిదతో బాపూ బొమ్మను అత్యంత సహజంగా చిత్రీకరించిన ఆదోని యువకుడికి అరుదైన గౌరవం దక్కింది. అతని ప్రతిభను అత్యుత్తమంగా గుర్తించిన ముంబై ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ 2021 రికార్డుల జాబితాలో చోటు కల్పించింది. కరోనా నిబంధనలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపి సత్కరించింది. ఆదోని పట్టణం, నారాయణ గుంతకు చెందిన లక్ష్మీ, పద్మనాభం దంపతుల రెండో సంతానం శ్రీకాంత్ ఎంబీఏ పూర్తి చేసి చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నారు. కళాఖండాలను సృష్టించడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు. తాజాగా ఈ నెల 4న కాగితాన్ని కాల్చగా వచ్చిన బూడిదలో తన చేతి మునివేళ్లను అద్ది తెల్ల కాగితంపై బాపూ (మహాత్మా గాంధీ) బొమ్మను అపురూపంగా తీర్చిదిద్దారు. కాగితం కాల్చి బూడిద చేయడం నుంచి బొమ్మ పూర్తిగా చిత్రీకరించే వరకు వీడియో రికార్డు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపారు. రికార్డును పరిశీలించిన ఆ సంస్థ ప్యానల్ కమిటీ 2021– 22లో అత్యుత్తమ ఆర్ట్‌గా గుర్తించింది. అతన్ని గౌరవిస్తూ కరోనా నిబంధనల దృష్ట్యా గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రాన్ని కొరియర్లో పంపింది. బుధవారం రాత్రి కొరియర్ అందుకున్న శ్రీవైష్ణవ శ్రీకాంత్ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాను సరికొత్త ప్రయోగంతో చిత్రీకరించిన బాపు బొమ్మ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చిపెట్టడం ఆనందం కలిగించిందన్నాడు. -
హాబీగా ఎంచుకున్న కళతో ఇప్పుడు రికార్డులు
తనను తాను అంకితం చేసుకున్నప్పుడే ఎంచుకున్న పని అయినా, అభిరుచి అయినా విజయవంతం అవుతుంది. కీర్తిని కట్టబెడుతుంది. అందుకు ఉదాహరణ 40 ఏళ్ల జిస్నా నాగిరిషా. ప్రపంచంలోని ఏడు అద్భుత కట్టడాల నమూనాలను గాజు బాటిళ్లపైన చిత్రించిన జిస్నా నాగిరిషాకు ఏషియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశం లభించింది. జిస్నాకు పెయింటింగ్ అంటే చాలా మక్కువ. చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ చేస్తూ ఉండేది. ఆరేళ్ల క్రితం బాటిల్ ఆర్ట్ నేర్చుకుంది. అలా చిత్రించిన బాటిల్ ఆర్ట్‌ను ఆప్తులకు కానుకలుగా ఇచ్చేది. కేరళ రాష్ట్రం కొచ్చిలో ఉంటున్న జిస్నా హాబీగా ఎంచుకున్న కళ ఇప్పుడు ఆమెకు రికార్డులు తెచ్చిపెడుతోంది. ‘ఆరేళ్లుగా బాటిల్ ఆర్ట్ చేస్తున్నాను. రెండేళ్ల క్రితం దీంట్లో ఏదో ప్రత్యేకత సాధించడమెలా అని ఆలోచించాను. అప్పుడే న్యూ సెవన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనే ఆలోచన వచ్చింది’ అని ఈ సందర్భంగా అనందంగా చెబుతారు జిస్నా. ఆమె దీని గురించి మరింతగా వివరిస్తూ ‘స్మారక చిహ్నాల ఫొటోలను ఒక్కోటి పరిశీలిస్తూ చాలా ఆశ్చర్యపోయాను వాటి అందానికి. వాటిని యధాతథంగా సీసాలపై నిలపాలనుకున్నాను’ అని తన అభిరుచి గురించి తెలిపారు. అనుకున్నట్టుగానే రెండేళ్లలో ప్రపంచ అద్బుత కట్టడాలను బాటిళ్లపై చిత్రించి, ఇండియా ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. జిస్నా బాటిల్ ఆర్ట్ గిఫ్ట్ ఐటమ్స్గానూ చేస్తుంది. డిజైన్ బట్టి ఒక్కో బాటిల్ గిఫ్ట్ ఐటమ్ రూ.1000 నుండి అమ్ముడవుతున్నాయి. ఏషియన్ రికార్డ్ నుంచి ప్రపంచ రికార్డ్ సాధించాలనే తపనలో ఉంది జిస్నా. -
ఏందిది కికా.. నిజమా లేక భ్రమా!
కికా రంగంలోకి దిగితే ఇలాగే ఉంటుంది. చిన్నప్పుడే మొదలైంది పెయింటింగ్ మీద ఆసక్తి.. అలా మొదలైన ప్రయాణం ఇదిగో ఇలాంటి చిత్రవిచిత్రమైన బాడీ పెయిటింగ్ టెక్నిక్‌ల దాకా చేరింది. నిజమా లేక భ్రమా అన్నట్లుగా బాడీ పెయింటింగ్ టెక్నిక్‌ను వాడటంలో సెర్బియాకు చెందిన మిర్జానా కికా మిలోసెవిక్ది అందె వేసిన చేయి.. మోడళ్లను వాడదు.. అన్నీ ప్రయోగాలు తనపైనే.. అదిరిపోలే.. అందుకే సోషల్ మీడియాలో తనకు తెగ క్రేజ్ ఉంది. -
ఆ కుంచె.. సౌందర్యం చిలికించే..
తెల్లని ఖద్దరు పంచె, అదే రంగు లాల్చీ, చేతికో గడియారం కూడా లేని అతి సామాన్యుడు తెలుగు చిత్రకళా రంగంలో అసమాన్యుడు ! ఆయనవి పిల్లి కళ్ళు, నిశీధి కూడా నిశీతంగా చూసే డేగ కళ్ళు అవి ఆయన చూపు ఓ రంగుల చిత్రం ఆయన దృష్టి ఓ అద్భుత సృష్టి ఆయన పొట్టిగా ఉన్నా గీసిన గట్టి చిత్రాలు ఎన్నో ఆయన నిరాడంబరుడే కానీ ఆయన చిత్రాల్లో నాయకి, నాయకులంతా ఆడంబరులే. ఆయన చిత్రకళా యోగే కాదు, భోగి కూడా ఆయన వాస్తవం కంటే – ఊహల్లో ఎక్కువ జీవిస్తారు. ఆయనకు పగలే రాత్రి, రాత్రే పగలు. ఆయనకు పగలు విశ్రాంతి –నిశీధి నిశ్శబ్దంలో కళాసాధన. ఆయన జీవికకు సరిపడా ‘సిరి ’లేని, కళా శ్రీమంతుడు. ఆయన ఎవరికీ అభిమాని కాదు కానీ, ఆయనకు లక్షల్లో కళాభిమానులున్నారు. ఆయన చిత్రాలు తెలుగు సంస్కృతిక ప్రతీకలు. అవి అభిమానులకు రసగుల్లాలు ! అభిమానుల గుండెల్లో అమరుడు..ఆయనే కళాభిమానుల వడ్డాది పాపయ్య.. శ్రీకాకుళంలో పుట్టి, మద్రాసులో మెరిసి, కశింకోటలో కన్నుమూశారు. బుధవారం 28వ వర్ధంతితోపాటు శత జయంతి ఉత్సవాలను చిత్ర కళాభిమానులు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిభా పాఠవాలను అవలోకిస్తే... సాక్షి, కశింకోట (అనకాపల్లి): తండ్రి నుంచి వారసత్వంగా సంక్రమించిన కళను స్వయం కృషితో సాధన చేసి మహా చిత్రకారుడు కావచ్చునని వడ్డాది పాపయ్య నిరూపించారు. చిత్ర కళా జగత్తును మకుటం లేని మహారాజులా నాలుగు దశాబ్దాల పాటు ఏలారు. ఆయన 1992 డిసెంబర్ 30న కశింకోటలోని పావని నిలయంలో తనువు చాలించారు. వ.పా.గా వినుతికెక్కిన వడ్డాది పాపయ్య 1921 సెపెంబర్ 10న శ్రీకాకుళంలో మధ్య తరగతికి చెందిన వడ్డెర కుటుంబంలో జన్మించారు. అత్త వారి గ్రామమైన కశింకోటలో స్థిరపడ్డారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఐదో ఏట నుంచే చిత్ర కళకు శ్రీకారం చుట్టారు. తన తండ్రి రామ్మూర్తికి చిత్రకళలో ప్రవేశం ఉంది. ఆయన చిత్రాలు గీస్తున్నప్పుడు దగ్గర ఉండి చిత్రకళలో మెళకువలను తెలుసుకొని అభ్యసించి స్వయం కృషితో సాధన చేశారు. ఐదవ ఏటనే ఆంజనేయస్వామి చిత్రాన్ని మొదటిసారిగా గాశారంటే అతిశయోక్తి కాదు. పాపయ్య కుంచె పట్టిన తొలి నాళ్లలో ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ, దురంధర్ల ప్రభావం ఉండేది. తర్వాత కాలంలో తనదైన శైలిలో ‘వ.పా. శైలి అనితర సాధ్యం’ అనే రీతిలో ఇతరులెవరూ అనుకరించడానికి అవకాశం లేని విధంగా చిత్రాలే గీసేవారు. చిత్ర కళా ప్రియుల హృదయాలను దోచుకున్నారు. వ.పా.కుంచె నుంచి జాలువారేది చిత్ర కళ కాదు సాక్షాత్తూ మహిళా సౌందర్య స్వరూపమే. పత్రికా ప్రపంచానికి వ.పా.గా సుపరిచితుడైన పాపయ్య అనేక మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. చందమామ, ఆంధ్రజ్యోతి, భారతి, రేరాణి, అభిసారిక, యువ, స్వాతి వంటి పలు మాస, వార పత్రికలకు ముఖ చిత్రాలను గీశారు. ఆయన గీసిన చిత్రాలు పత్రికల్లో ప్రచురితం అయి తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆయన గీసిన చిత్రాల కోసమే కొన్ని పత్రికలు అమ్ముడయ్యేవంటే అతిశయోక్తి కాదు. పాపయ్యకు సంగీతం అంటే ప్రత్యేక అభిమానం. ఎన్నో రాగాలకు సంబంధించిన చిత్రాలను గీయడం ఇందుకు నిదర్శనం. నవ రసాల్లో శృంగారానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే రసానికి ఇవ్వలేదు. శృంగార పరమైన గ్రామీణ మహిళల చిత్రాలు గీసి యువతను రస డోలలో గిలిగింతలు పెట్టారు. కళా దేవులపల్లి, పోతన, శ్రీశ్రీల సాహిత్యమంటే ఆయన అభిమానించేవారు. పాపయ్య చిత్రకారుడే కాదు మంచి రచయిత, ఫొటోగ్రాఫర్ కూడా. పొగడ్తలంటే గిట్టేవి కాదు. ఇంటర్వ్యూలన్నా, కళా ప్రదర్శనలన్నా ఆమడ దూరంలో ఉండేవారు. ఎవరైనా కళను గౌరవించాలిగాని వ్యక్తులను కాదని అభిప్రాయపడేవారు. పాపయ్య ఎక్కువగా నీలి రంగు చిత్రాల పట్లే మక్కువ చూపేవారు. తైల వర్ణాల కంటే నీలి రంగు చిత్రాలు అయితే అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా సత్వరమే చిత్రాలను పూర్తి చేయవచ్చునని అభిప్రాయపడేవారు. సుమారు నాలుగు దశాబ్దాలపాటు వర్ణ సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజుగా వెలుగొందిన వ.పా. నిరాడంబర జీవితాన్ని సాగించి ఇక్కడ తనువు చాలించారు. ఆయన చిత్రాలతో వ.పా. ఆర్ట్సు గ్యాలరీని ప్రదర్శనకు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. అలాగే వ.పా. జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శత జయంతి ఉత్సవాలను నిర్వహించి ఆయన ప్రతిభా పాటవాలను నేటి తరానికి తెలిసే విధంగా చాటాలని, ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కళాభిమానులు కోరుతున్నారు. -
ఎయిర్‌పోర్టులో పోయింది.. చెత్త తొట్లో దొరికింది!
బెర్లిన్: ఎయిర్‌పోర్టులో మర్చిపోయి పోగొట్టుకున్న విలువైన పెయింటింగ్ దగ్గరలోని చెత్తతొట్లో దొరికిన సంఘటన జర్మనీలో జరిగింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ వ్యాపారవేత్త అనుకోకుండా 2.8లక్షల యూరోల విలువైన (సుమారు రూ.2.5 కోట్లు) ప్రఖ్యాత పెయింటింగ్‌ను డస్సెల్‌డార్ఫ్ విమానాశ్రయంలో మర్చిపోయాడు. ఫ్రెంచ్ సర్రీయలిస్టు టాంగే గీసిన ఈచిత్రాన్ని డస్సెల్‌డార్ఫ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్లే ప్రయాణంలో నవంబర్ 27న సదరు వ్యాపారవేత్త పోగొట్టుకున్నాడు. ఇజ్రాయిల్‌లో విమానం దిగిన అనంతరం పెయిటింగ్ మర్చిపోయిన సంగతి గుర్తుకువచ్చి డస్సెల్‌డార్ఫ్ పోలీసులకు విషయం తెలియజేశాడు. అనంతరం ఈమెయిల్స్‌లో పెయింటింగ్ వివరాలను ఆయన అందజేసినా ఎయిర్‌పోర్టులో కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో వ్యాపారవేత్త మేనల్లుడు బెల్జియం నుంచి వచ్చి స్థానిక పోలీసులను కలిశాడు. అదనపు వివరాలు అందుకున్న అనంతరం పోలీసులు పలుచోట్ల విచారించగా ఒక ఇన్స్పెక్టర్కు సదరు పెయింటింగ్ ఒక పేపర్ రీసైక్లింగ్ చెత్తతొట్లో కనిపించింది. ఈ రీసైక్లింగ్ తొట్టిని ఎయిర్‌పోర్టు క్లీనింగ్ కంపెనీ వాడుతోంది. అక్కడనుంచి తీసుకువచ్చిన పెయింటింగ్‌ను సదరు వ్యాపారవేత్తకు భద్రంగా అందజేసామని పోలీసులు చెప్పారు. -
అమెరికా అధ్యక్షులంతా ఒకేచోట..
అమృత్సర్ : గత 230 సంవత్సరాలుగా అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారి చిత్రాలను పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన చిత్రకారుడు జగ్జోత్ సింగ్ రుబల్ రూపొందించారు. తాజాగా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ చిత్రాన్ని అందులో జోడించారు. జార్జ్ వాషింగ్టన్ నుంచి బైడెన్ వరకు అందరి చిత్రాలను ఎంతో అందంగా తన పెయింటింగ్‌లో పొందుపరిచారు. ఎన్నికల్లో గెలుపొందిన బైడెన్‌కు తాను శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నట్లు జగ్జోత్ సింగ్ వెల్లడించారు. బైడెన్ అధ్యక్షతన భారత్- అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉండేలా ఈ పెయింటింగ్ వేశానని, ఇది మొత్తం పూర్తికావడానికి దాదాపు 4 నెలల సమయం పట్టిందని సింగ్ అన్నారు. (బంధాలు బలోపేతం) తన పేరు మీద ఇప్పటికే పది ప్రపంచ రికార్డులు ఉండగా, తాజాగా తాను గీసిన పెయింటింగ్ అమెరికాలోని ఆర్ట్ గ్యాలరీలో లేదా వైట్ హౌస్‌లో ప్రదర్శించాల్సిందిగా కోరుకుంటున్నట్లు మనసులో మాటను బయటపెట్టారు. ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకు శనివారంతో తెర పడిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 284 ఎలక్టోరల్ ఓట్లను సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించిన బైడెన్ త్వరలోనే వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్ ఓట్లు సాధించి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) -
ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు
పుట్టినప్పుడు కదలకుండా ఉంటే, మృతశిశువు పుట్టాడనుకుని వదిలేసింది నర్సు. బతికే ఉన్నట్లు మేనమామ గుర్తించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. బాల్యంలో అతణ్ణి చూసిన వారెవరూ ఊహించని విధంగా తొంభై ఏళ్లకు పైబడిన నిండు జీవితం గడిపాడు. ఆధునిక చిత్రకళా చరిత్రనే మలుపు తిప్పాడు. అతడే పికాసో! ఆధునిక చిత్రకళలో ఒకే ఒక్కడు. పికాసో ప్రస్థానంలో కొన్ని సంగతులు మీ కోసం... మాటలు నేర్చుకునే వయసులో పిల్లలెవరైనా ‘అమ్మా’ అనో, ‘నాన్న’ అనో పలకడానికి ప్రయత్నిస్తారు. పికాసో అందరిలాంటి వాడు కాదు. అతడి నోటి నుంచి వెలువడిన తొలి పదం ‘లాపిస్’. స్పానిష్ భాషలో ‘లాపిస్’ అంటే ‘పెన్సిల్’ అని అర్థం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు, నోట మాట పుట్టగానే పరిమళించిన చిత్రకారుడు పికాసో. స్పెయిన్‌లోని మలగా పట్టణంలో 1881 అక్టోబర్ 25న పుట్టాడు పికాసో. అందరికీ అతని పేరు పాబ్లో పికాసో అనే తెలుసు. నిజానికి అతని పూర్తి పేరు చాలా పొడవాటిది. ఇరవైమూడు పదాలతో కూడిన అతడి పేరులో సుప్రసిద్ధ మతపెద్దలు, బంధువుల పేర్లన్నీ ఉన్నాయి. పికాసో తండ్రి డాన్ జోస్ రూయిజ్ బ్లాస్కో కూడా చిత్రకారుడే. ఏడేళ్ల వయసులోనే కొడుకుకు కుంచెప్రాశన చేశాడు. ఇక అప్పటి నుంచి జీవితాంతం రంగులను, కుంచెలను వదల్లేదు పికాసో. తొమ్మిదేళ్ల పసితనంలోనే తొలి కళాఖండం ‘లె పికాడర్’ను చిత్రించాడు. పికాసోకు పదమూడేళ్లు రాగానే అతడి తండ్రి కుంచె విరమణ చేసేశాడు. తనకంటే తన కొడుకే బాగా బొమ్మలు గీస్తున్నాడనే నమ్మకం కలగడమే అందుకు కారణం. అదే వయసులో పికాసో ‘స్కూల్ ఆఫ్ ఫైనార్ట్స్’ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో వారం రోజుల్లోనే ఉత్తీర్ణత సాధించాడు. ఆ పరీక్షలో నెగ్గాలంటే అప్పట్లో చాలామంది విద్యార్థులకు నెల్లాళ్లకు పైనే పట్టేది. అప్పట్లో అదొక రికార్డు. పికాసో గీసిన తొలి రూపచిత్రం ‘ఫస్ట్ కమ్యూనియన్’. దీనిని అతడు తన పదిహేనేళ్ల వయసులో చిత్రించాడు. పికాసో గీసిన వాటిలో ‘గయెర్నికా’ ప్రపంచవ్యాప్తంగాపేరుపొందింది. స్పానిష్ సివిల్ వార్ సమయంలో గయెర్నికా పట్టణంపై నాజీ సేనలు బాంబు దాడి జరిపినప్పుడు, ఆ దాడిలో జరిగిన విధ్వంసానికి చలించిపోయి చిత్రించిన భారీ చిత్రం అది.. పికాసో చిత్రకారుడు, శిల్పిగానే ప్రసిద్ధి పొందినా, అతడు బహుముఖ ప్రజ్ఞశాలి. పికాసో మంచి కవి, రంగస్థల అలంకరణ నిపుణుడు, నాటక రచయిత, సైద్ధాంతికంగా సామ్యవాది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ నేతృత్వంలోని నాజీ సర్కారు తన చిత్రాలపై నిషేధం విధించినా, ఏమాత్రం తొణకని ధీశాలి. నిండు జీవితం గడిపిన పికాసో, 1973 ఏప్రిల్ 8న ఫ్రాన్స్‌లోని మోగిన్స్ పట్టణంలో తన తొంభై ఒకటో ఏట కన్నుమూశాడు. -
శ్రీవారి సిరా చిత్రాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వరుడు వాహనాల మీద ఊరేగుతాడు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారు తొమ్మిది రూపాలలో దర్శనమిస్తుంది. ఈ రెండు విశేషాలు ఒకసారే జరుగుతాయి. ఒకటి తిరుమల కొండ మీద.. మరొకటి విజయవాడలోని ఇంద్రకీలాద్రి పైన. ఈ రెండు అద్భుతాలను తన కలంతో చిత్రీకరించాడు రాజమండ్రికి చెందిన మాధవ్ చిత్ర. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎం.టెక్ పూర్తి చేసి, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మాధవ్ దసరా సందర్భంగా సాక్షితో తన మనసులోని భావాలను పంచుకున్నాడు. నా చిన్నతనం నుంచే అంటే ఏడవ ఏట నుంచే బొమ్మలు వేయటం ప్రారంభించాను. అమ్మ ఆ బొమ్మలు చూసి, వాటిమీద తారీకులు వేసి దాచుకోమని చెప్పేది. ప్రతిరోజూ స్కూల్ నుంచి ఇంటికి రాగానే బొమ్మలు వేసుకునేవాణ్ణి. మొదట్లో వాటర్ కలర్స్‌తో తరవాత పోస్టర్ కలర్స్‌తో వేయటం ప్రారంభించాను. రాజమండ్రిలో చిన్నజీయర్ స్వామి రామానుజ కూటం వారు రామాయణంలోని బాలకాండ మీద పోటీలు పెట్టారు. అందులోని ఏదో ఒక సంఘటనను బొమ్మగా వేయాలి. నేను అహల్య శాపవిమోచనం బొమ్మ వేశాను. దానికి నాకు మొదటి బహుమతి వచ్చింది. బహుమతితో పాటు నాలో ఉత్సాహం కూడా మొదలైంది అప్పటి నుంచి బొమ్మలు వేస్తూనే ఉన్నాను. జెల్ పెన్‌తో ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో చార్కోల్తో బొమ్మలు వేయటం ప్రారంభించాను. వాటికి మంచి స్పందన వచ్చింది. ఖరగ్‌పూర్ లో రంగోలీ చాలా ప్రముఖంగా వేసేవారు. నేలమీద మనం అనుకున్న థీమ్‌తో రంగులతో ముగ్గులు వేయాలి. నేను మేఘ సందేశం కావ్యంలోని గంధర్వుడి సన్నివేశం వేశాను. ఆ తరవాత భారతీయ పౌరాణిక సన్నివేశాలు చాలా వేశాను. వాల్మీకి రచించిన రామాయణ మహేతిహాసాన్ని మొత్తం 30 బొమ్మలుగా వేశాను. అన్నీ ఏ 4 సైజులో నల్లరంగు జెల్ పెన్‌తో వేశాను. శివకల్యాణాన్ని దక్షప్రజాపతి దగ్గర నుంచి శివుని కల్యాణం వరకు 15 బొమ్మలుగా నలుపు జెల్ పెన్‌తో వేశాను. మా ఇంట్లో సంప్రదాయ వాతావరణం నా మీద ప్రభావం చూపిందేమో అనిపిస్తుంది. అలాగే టీవీలో ప్రవచనాలు విని వాటికి ప్రభావితమయ్యాను. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై 30 పాశురాలు ఎరుపు రంగు పెన్నుతో వేశాను. నవరాత్రుల నేపథ్యంలో... దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకుని 2013లో నవదుర్గలు వేశాను. 2019లో నవదుర్గలు రెండోసారి ఎరుపు బ్యాక్‌గ్రౌండ్‌తో వేశాను. ఇదంతా నాకు దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అట్లతద్ది, మంగళ గౌరి వంటి చిన్న చిన్న పండుగల నుంచి అన్ని పండుగలకు బొమ్మలు వేయాలనుకుంటున్నాను. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి వాహనాలను పెన్సిల్ స్కెచ్‌లుగా వేసి, తిరుమల మ్యూజియమ్ వారికి సమర్పించాను. ఈ సంవత్సరం కూడా చిన్న చిన్న బొమ్మలు మట్టితో చేస్తున్నాను. జాడీల ప్యాక్టరీ నుంచి మట్టి తెచ్చి ఈ బొమ్మలు చేస్తున్నాను. కృష్ణాష్టమికి పాడ్యమి నుంచి అష్టమి దాకా ఎనిమిది రకాల కృష్ణుడి బొమ్మలు వేశాను. చెన్నై నగరాన్ని నా బొమ్మలలో బంధించటానికి ప్రయత్నించాను. కపాలేశ్వర ఆలయం, పార్థసారథి దేవాలయం, లజ్ చర్చ్... ఇలా చెన్నైకి సంబంధించిన వాటిని గీశాను. సన్నిహితులు ఒకరు వటపత్రశాయి బొమ్మ వేసి, ఇవ్వమని అడిగారు. బొమ్మ పూర్తయ్యాక ఇవ్వాలనిపించలేదు. నా గదిలో పెట్టుకున్నాను. – సంభాషణ: డా. వైజయంతి పురాణపండ -
చందమామను చూపించిన శంకర్ మామ
చందమామలో కుందేలు ఉంటుందో లేదో కాని చందమామ బాలల పత్రికలో కుందేలు ఉండేది. అడవి ఉండేది. సింహాలు, పులులు, నక్కలు. ఏనుగులు పిల్లలు కోరే ప్రపంచమంతా ఉండేది. ఆ బొమ్మలు గీసిన చిత్రకారుడు శంకర్ చెన్నైలో మంగళవారం కన్నుమూశారు. ఒక గొప్ప శకానికి ముగింపు పలికారు. చందమామకు 75 సంవత్సరాలు, శంకర్‌కు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా గతంలో సాక్షితో పంచుకున్న జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... ‘‘మా స్వస్థలం కరత్తొలువు. ఇది కోయంబత్తూరు జిల్లాలో ఉంది. మా నాన్నగారు టీచర్. అందువల్లనేనేమో చిన్నప్పటి నుంచి అక్షరాలు అందంగా రాసేలా అలవాటు చేశారు. ఆ రోజుల్లోనే పాఠశాలల్లో అందరికీ మధ్యాహ్న భోజనం ఉండేది. జస్టిస్ పార్టీ వాళ్లు అందరికీ ఎంత తింటే అంత భోజనం పెట్టించేవారు. నా పదవ యేట చెన్నై వచ్చాను చదువుకు. ఎస్ఎస్ఎల్సి పూర్తయ్యాక మా గురువులు నాతో ‘నువ్వు మామూలు చదువుల వైపు కాకుండా ఫైన్ ఆర్ట్స్‌లో చేరు’ అన్నారు. అప్పట్లో ఆ స్కూల్‌ని బ్రిటీషువారు నడుపుతున్నారు. నేను ఆయన చెప్పినట్లే చిత్రలేఖనంలోకి వెళ్లాను. నా శ్రద్ధ చూసి, పాఠశాల వారు నాకు స్కాలర్షిప్ మంజూరు చేశారు. దాంతో నేను ముందు తరగతులు చదువుకోవడానికి వీలుపడింది. చందమామలో బొమ్మలు 1940లో చందమామ ప్రారంభమైతే 1952లో నాగిరెడ్డిగారి పిలుపు మేరకు 300 రూపాయల జీతానికి చేరాను. అంతకు ముందు వేరొక తమిళ మ్యాగజీన్లో పనిచేశాను. తెలుగు, తమిళం, ఇంగ్లీషు భాషలలో తగినంత పరిజ్ఞానం ఉండటం వల్ల పని సులువుగా చేసుకోగలిగాను. గత 60 సంవత్సరాలుగా అందులోనే పని చేస్తున్నాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ. భక్తి కూడా ఎక్కువ. అదే సంస్థలో ఆరు దశాబ్దాలు పాటు పనిచేయడం నాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. నా తుదిlశ్వాస వరకు చందమామలోనే ఉండాలనేది నా ఆకాంక్ష మాత్రం నెరవేరకుండా గత సంవత్సరం ఈ పత్రిక మూతపడింది. విక్రమ్ భేతాళ్... 1955లో చక్రపాణి, కుటుంబరావుగార్లు తెలుగులో బేతాళ కథలకు బొమ్మలు వేయమని అడిగారు. అప్పటివరకు వస్తున్నవాటిని మార్చి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి బొమ్మలు గీయమని సూచించారు. అది పిల్లల కథే అయినప్పటికీ చాలా పెద్ద విజయం సాధించింది. ఈ కథలకు నేను 700 బొమ్మలు వేశాను. పిల్లల ఆలోచనా ధోరణి ఆరోగ్యకరంగా ఉండేలా చేసేందుకు చందమామ నాకు అవకాశం ఇచ్చింది. నేను, చిత్ర, వపా... మా బొమ్మల ద్వారా గత ఆరుతరాలుగా ఇంటింటా నిలిచిపోయాం. ఆనందంగా ఉంటుంది... కథలకు బొమ్మలు వేసి ఆ బొమ్మల ద్వారా కథను సజీవం చేయడానికి మించిన ఆనందం ఇంకేముంటుంది. పురాణాలకు సంబంధించి ఇప్పటికి వేలకొలది బొమ్మలు వేశాను. చాలామంది నేను వేసిన రాముడు, కృష్ణుడు బొమ్మలను వారి వారి పూజా మందిరాలలో పెట్టుకున్నామని చెబుతుంటే ఎంతో పరవశంగా అనిపిస్తుంది. చందమామను మీరే కాదు, మీ తల్లిదండ్రులు, తాతలు కూడా తప్పనిసరిగా చదివి ఉంటారని నా అభిప్రాయం. కేవలం ఐదారు వేలతో ప్రారంభమైన చందమామ సర్క్యులేషన్ లక్షల స్థాయికి చేరి ఒక వెలుగు వెలిగింది. మరచిపోలేని అనుభవాలు ఎన్నో... ఆంధ్రప్రదేశ్‌లో మారుమూల గ్రామంలో ఒక చదువురాని స్త్రీ ‘చందమామ కారణంగా చదవడం, రాయడం నేర్చుకున్నాను’ అని చెప్పింది. ఒరిస్సాలో ఒక గొర్రెల కాపరి ఒక వెదురుబొంగులో చందమామ పుస్తకాన్ని భద్రపరిచాడట. అతడికి ఎప్పటికైనా నేను వేసినట్లుగా బొమ్మలు వేయాలని కోరికట. చందమామ గురించి కవిసమ్రాట్, ‘చందమామ నా చేత కూడా చదివిస్తున్నారు. పత్రిక రావడం ఆలస్యమైతే కొట్టువాడితో దెబ్బలాడతా’ అని ఒక సందర్భంలో అన్నారంటే చందమామ ఎంత ప్రసిద్ధి పొందిందో, పిల్లల పెద్దల మనసులో ఎంత స్థానం సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. చందమామ నా బిడ్డ. ఈ పత్రిక ఆగిపోవడంతో బిడ్డను చంపేసినట్టుగా ఉంది. ప్రపంచంలో ఇన్ని భాషలలో వచ్చిన పత్రిక ఇదొక్కటే. అవార్డులు, రివార్డులు ప్రభుత్వాల నుంచి అందుకోలేదు కాని, ప్రజల ప్రశంసలు మాత్రం లెక్కలేనన్ని అందుకున్నాను. ఆ అనుభూతులు నేను ఎన్నటికీ మరచిపోలేను.’’ – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
‘చందమామ’ శంకర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కరథొలువు గ్రామంలో 1924 జూలై 24న శంకర్ జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేసేవారు. తల్లి గృహిణి. శంకర్‌కు నలుగురు సోదరు లు. చిన్నప్పటి నుంచే చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్న శంకర్ పన్నెండవ తరగతి పూర్తయ్యాక చెన్నైలోని ఆర్ట్ కాలేజీలో చేరారు. అక్కడ తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత 1946లో కళైమాగల్ అనే పత్రికలో తొలిసారి చిత్రకారునిగా కొలువులో చేరారు. అనంతరం 1952లో ‘చందమామ’లో చేరి, 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ దాదాపు 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. తన అద్భుత చిత్రాలతో చందమామ కథలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపచేశారు. పురాణ పాత్రలకు సజీవరూపం.. చిత్రకారునిగా శంకర్ వేలాది చిత్రాలకు జీవం పోశారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ ఆయన అద్భుత చిత్రాలు వేశారు. అయితే, ఆయనకు బాగా పేరు తెచ్చింది మాత్రం చందమామలో బేతాళ కథలకు రూపొందించిన చిత్రాలే. శంకర్ చందమామలో చేరేటప్పటికే అక్కడ మరో ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులు ‘చిత్రా’రాఘవులు, వడ్డాది పాపయ్య ఉన్నారు. సాధారణంగా పిల్లలకు ఇంట్లో తాతయ్యో, అమ్మమ్మో పురాణాలు, కథలు చెప్పడం మామూలే. అయితే, వాటిలోని పాత్రధారులు ఎలా ఉండేవారో ఎవరికి తెలుసు? ఊహించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కానీ, ‘చందమామ’లో శంకర్ బొమ్మలు చూస్తూ పెరిగిన వారికి పురాణపాత్రలు టక్కున కళ్లముందు మెదులుతాయి. అంత అద్భుతంగా ఆ పాత్రల చిత్రాలను ఆయన మన కళ్లముందు ఉంచారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తయితే, బేతాళ కథలకు వేసిన శీర్షిక చిత్రం ఒక ఎత్తు. విక్రమార్కుడు ఒక చేతిలో కరవాలం పట్టుకొని, భుజంపైన శవాన్ని మోసుకుంటూ వెళుతున్నట్లుండే ఆ చిత్రం శంకర్‌కు ఎంతో పేరు తెచ్చింది. అంతేకాదు, పురాణగాథలకు శంకర్ చిత్రీకరించిన భవనాలు, ఆభరణాలు, సినిమాల్లో ఎన్నో సెట్టింగ్‌లకు ప్రేరణ అంటే అతిశయోక్తికాదు. -
‘ఇంటి అద్దె చెల్లించలేదని చితకబాదారు’
చెన్నై : ఇంటి అద్దె చెల్లించనందుకు ఓ పోలీస్ అధికారి కొట్టడంతో పెయింటర్ ఒంటికి నిప్పంటించుకున్న ఘటన చెన్నైలో వెలుగుచూసింది. నగరంలోని పుజాల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి నివసించే పెయింటర్ శ్రీనివాసన్ నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేదు. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన శ్రీనివాసన్ అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని రాజేంద్రన్ పలుమార్లు శ్రీనివాసన్‌ను హెచ్చరించాడు. శ్రీనివాసన్‌పై పుజాల్ పోలీస్ స్టేషన్లో రాజేంద్రన్ ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదుతో ఇన్స్పెక్టర్ శామ్ బెన్సన్ తన ఇంటికి వచ్చి భార్యా పిల్లల సమక్షంలో తనను తీవ్రంగా కొట్డాడని శ్రీనివాసన్ ఆరోపించాడు. మనోవ్యథతో శ్రీనివాసన్ తన ఒంటికి నిప్పంటించుకున్నాడు. 80 శాతం కాలిన గాయాలతో శ్రీనివాసన్ కిల్పాక్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసన్‌పై దాడికి పాల్పడిన ఇన్‌స్సెక్టర్‌ను అధికారులు సస్సెండ్ చేశారు. చదవండి : కూతుర్ని హతమార్చి నాటకం -
కాళ్లతోనే విధిని జయించాడు
రాయ్‌పూర్: జీవితంలో ఒక లక్ష్యం కోసం శ్రమిస్తూ..ఓటమి ఎదురయి.. మధ్యలోనే వదిలేసే వారు.. అసలు ఏ లక్ష్యం లేకుండా ఖాళీగా తిరిగేవారు తప్పకుండా ఈ వార్త చదవాలి. చేతులు లేకుండా పుట్టిన ఓ యువకుడు తన కలను సాకారం చేసుకోవడం కోసం చేస్తోన్న కృషి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తోంది. వివరాలు.. చత్తీస్‌గఢ్ భిలాయ్ ప్రాంతానికి చెందిన గోకరన్కు గొప్ప ఆర్టిస్ట్ కావాలనేది కల. కానీ దురదృష్టవశాత్తు అతడికి పుట్టుకతోనే చేతులు లేవు. పైగా వినికిడి లోపం. అయితే అంగవైకల్యం అతడి ఆశయ సాధనకు ఏ మాత్రం అడ్డురాలేదు. చేతులు లేకపోతేనేం.. కాళ్లు ఉన్నాయి కదా అనుకున్న గోకరన్.. పాదాల సాయంతో బొమ్మలు గీయడం సాధన చేశాడు. కొన్నాళ్లకు గోకరన్ శ్రమ ఫలించి కుంచె అతడి పాదాక్రాంతమైంది. ప్రస్తుతం అతడు ఎందరో గొప్పకళాకారులకు ధీటుగా కాళ్లతోనే అద్భుతమైన చిత్రాలు గీస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రియా శుక్లా అనే ఐఏఎస్ అధికారిణి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘ఈ వీడియోలో పెయింటింగ్ వేస్తోన్న యువకుడి పేరు గోకరన్ పాటిల్. చత్తీస్‌గఢ్‌కు చెందిన ఇతడికి పుట్టుకతోనే చేతలు లేవు. వినికిడి లోపం కూడా. కానీ తన కలను నిజం చేసుకోవడానికి అతడు నిరంతరం శ్రమించాడు. తేలికగా ఓటమిని ఒప్పుకునే వారికి గోకరన్ ప్రేరణగా నిలుస్తున్నాడు’ అంటూ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. నెటిజనులు గోకరన్ పట్టుదలని ప్రశంసిస్తున్నారు. इस वीडियो में पेंटिंग कररहे छ.ग के आर्टिस्ट श्री गौकरण पाटिल-श्रवणबाधित हैं और इनके हाथ भी नहीं हैं-फिरभी ये अपने परिश्रम से निरंतर आगे बढ़ रहे हैं!😊 श्री पाटिल निश्चित तौर पर उन सभी के लिए बड़ी प्रेरणा हैं जो जीवन की छोटी-छोटी समस्याओं से हार मान लेते हैं! #MondayMotivation pic.twitter.com/LN7yBN1pt3 — Priyanka Shukla (@PriyankaJShukla) June 29, 2020 -
లాక్డౌన్ పాటిద్దాం - కరోనాను తరిమికొడదాం
-
ప్రముఖ చిత్రకారుడు సతీశ్ గుజ్రాల్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు, శిల్పి సతీశ్ గుజ్రాల్ (94) కన్నుమూశారు. మాజీ ప్రధాన మంత్రి ఐకే గుజ్రాల్‌కు ఈయన సోదరుడు. వయోభారం రీత్యా గురువారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యుడు, రాజ్యసభ ఎంపీ నరేశ్ గుజ్రాల్ తెలిపారు. సతీశ్ నైపుణ్యం కలిగిన చిత్రకారుడు, శిల్పి, గ్రాఫిక్ ఆర్టిస్ట్ అంతేగాక దేశంలో రెండో అత్యుత్తమ పురస్కారమైన పద్మవిభూషన్‌ను పొందిన వ్యక్తి. ఆయన మృతిపై దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సతీశ్ గుజ్రాల్‌కు ఉన్న అపారమైన జ్ఞానమే ఆయన్ను అంత ఎత్తుకు తీసుకెళ్లిందని, అయినప్పటికీ ఆయన ఎప్పుడూ తగ్గి ఉండేవారని మోదీ కొనియాడారు. కళలు, సాంస్కృతిక విభాగంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. -
మునివేళ్ల సృష్టి
అందమైన చిత్రాలను సున్నితమైన బ్రష్‌తో తీర్చిదిద్దుతారు. కానీ, కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన వినీ వేణుగోపాల్ తన మునివేళ్లతో అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు 200 కు పైగా చిత్రాలను బ్రష్ లేకుండా వేళ్లతోనే ‘గీసిన’ వినీని పరిచయస్తులందరూ ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. ప్యాలెస్ చేరిన చిత్రం రంగులను అద్దుకున్న వేళ్లు తెల్లని కాన్వాస్ పైన కదులుతూ ఒక మంచి చిత్రంగా ప్రాణం పోసుకునే కళలో మూడేళ్లుగా రాణిస్తున్నారు వినీ. ప్రస్తుతం ఆమె సౌదీ అరేబియాలో ఉంటున్నారు. భర్త అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఏడాదిన్నర కొడుకు. పేరు గెహాన్. వాడిని ఆడించడం కోసం రకరకాల ప్రయోగాలు చేసేవారు వినీ. ‘ఆ ప్రయోగాల ఫలితమే ఇది’ అంటూ ఇటీవల రియాద్‌లోని నైలా ఆర్ట్ గ్యాలరీలో తన వేలి చిత్రాలను ప్రదర్శనకు పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన సౌదీ రాజు అమిర్ మహమ్మద్ బిన్ సల్మాన్ చిత్రం ఇప్పుడు అక్కడి ప్యాలెస్‌లో చేరింది! కొడుకు ఆటకు రంగులు వినీ చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌లో తన ప్రతిభ కనబరిచేది. అయితే, ఫింగర్ పెయింటింగ్ మాత్రం మూడేళ్ల నుంచే వేస్తున్నారు ఆమె. ఆసక్తి కొద్ది తనకు తానే సాధన చేసిన వినీ ఇప్పుడు ఈ వర్క్‌లో బిజీగా మారిపోయారు. తన కొడుకు ఆట కోసం మైదా, అందులో కొన్ని ఫుడ్ కలర్స్‌ను ఉపయోగించే క్రమంలో కొడుకుతోపాటూ తనూ కొత్త కొత్త నమూనాలు తయారు చేశారు. అక్కణ్ణుంచే వేళ్లతో పెయింటింగ్ వేస్తే బాగుంటుందనే ఆలోచన చేసి, ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వాటర్ కలర్స్, ఆక్రిలిక్, పేస్టల్ కలర్స్‌తో అందమైన కొలను, సముద్రం ఒడ్డున పిల్లలు కట్టే ఇసుక గూళ్లు.. ఇలా ఏదో ఒకదాన్ని ఆ పెయింటింగ్‌లో ప్రధాన అంశంగా తీసుకుంటారు వినీ. కర్ణాటకలో జరిగే కంబాల బఫెలో రేస్, భయంకరమైన వన్యమృగాల వేట, ఆటలకు సంబంధించిన అంశాలకు కూడా ఆమె తన వేళ్లతో ప్రాణం పోశారు. సౌదీలో ఉండటం వల్ల కావచ్చు.. వినీ చిత్రాల్లో ఎక్కువగా అరేబియన్ జీవన శైలి కనిపిస్తుంది. లాంతరు చేతిలో పట్టుకున్న అరబిక్ మహిళ, ఒంటెల సవారీ, ఎడారి, ఖర్జూర చెట్లు, కాక్టస్ మొక్కలు.. ఇలా ఎన్నో ప్రకృతి నేపథ్యాలు ఈ చిత్రాల్లో కనిపిస్తాయి. 2017లో బహ్రెయిన్‌లో జరిగిన త్రీడీ పెయింటింగ్‌లో గిన్నిస్ రికార్డ్‌ను, 2018లో డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డులను పొందారు వినీ. ఎంచుకున్న కళతో ఓ కొత్త దారి వేసుకుంటూ వినీ తనప్రత్యేకతను చాటుకుంటూ వెళుతున్నారు. – ఆరెన్నార్ -
ఆర్ట్ బై మహిళ
1914లో ‘బాల్టిమోర్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్’ ప్రారంభం అయిన రెండేళ్ల తర్వాత, తొలిసారిగా ఒక మహిళ గీసిన తైల వర్ణ చిత్రాన్ని మ్యూజియం కొనుగోలు చేసింది. అమెరికన్ పోర్ట్రెయిట్ పెయింటర్ శారా మిరియా పీలే వేసిన పెయింటింగ్ అది. నాటి నుంచి నేటికి నూరేళ్లకు పైగా గడిచిపోయాయి. లెక్కేస్తే ఇప్పుడు మ్యూజియంలో 95 వేల కళాఖండాలు ఉన్నాయి. అయితే వాటిలో మహిళలు గీసిన చిత్రాలు కేవలం నాలుగు శాతం మాత్రమే!! ఏమిటి ఇంత అంతరం?! కనీసం సగమైనా లేవు. సగంలో సగమైనా లేవు. ఆ సంగతిని మ్యూజియం దృష్టికి ఎవరు తెచ్చారో, తనకై తను గ్రహించిందో కానీ.. మ్యూజియం ఇప్పుడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. అసమానత్వాన్ని తొలగించాలనుకుంది. 2020లో ఏడాది మొత్తం కేవలం మహిళలు గీసిన చిత్రాలనే కొనుగోలు చేయాలని తీర్మానించుకుంది! ప్రాచీన తైల వర్ణ చిత్రాలు అపురూపమైనవి, అమూల్యమైనవి. వాటి వెల కూడా ఆ స్థాయిలోనే ఉంటుం ది. మరి అంత డబ్బు మ్యూజియంకి ఎలా? ప్రభుత్వాలు ఇవ్వవు. తనే సమకూర్చుకోవాలి. అందుకే మ్యూజియంలో ఉన్న ప్రసిద్ధ పురుష చిత్రకారుల విలువైన పెయింటింగ్‌లను విక్రయించి, అలా వచ్చిన డబ్బుతో మహిళా చిత్రకారుల ఆర్ట్పీస్లను కొనబోతోంది! ఇదొక్కటే కాదు. ఏడాది పొడవునా మ్యూజి యం నిర్వహించే 22 ప్రదర్శనలకూ కేవలం మహిళా ఆర్టిస్టులు గీసిన చిత్రాలనే ఆహ్వానించబోతోంది. ‘‘జరిగిన తప్పును సరిదిద్దుకోడానికే ఈ ప్రయత్నమంతా’’ అని మ్యూజియం డైరెక్టర్ క్రిస్టఫర్ బెడ్ఫోర్డ్ అంటున్నారు. మ్యూజియంలో వేలాడగట్టి ఉన్న పురుష చిత్రకారుడు మార్క్ రాథో పెయింటింగ్ పక్కన ఓ చిత్రకారిణి గీసిన చిత్రాన్ని తీసుకొచ్చి తగిలిస్తే తొలగిపోయే వ్యత్యాసం కాదది.. కొంచెం గట్టిగా, నిజాయితీగా, త్వరితంగా ప్రయత్నించ వలసిన విషయం అని కూడా ఆయన అన్నారు. స్త్రీ, పురుష చిత్రకారులకు ఇచ్చే ప్రాముఖ్యంలోని వివక్షను తొలగించడానికి రూపొందించుకున్న ఈ ‘ఉమెన్ 2020’ కార్యాచరణలో భాగంగా వచ్చే ఏడాది 20 లక్షల డాలర్లతో మహిళా ఆర్టిస్టులు గీసిన చిత్రాలను కొనుగోలు చేయాలని మ్యూజియం లక్ష్యంగా పెట్టుకుంది. -
సీఎం షేక్ హ్యాండ్... కాలితో సెల్ఫీ!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేయి కలిపిన ఈ దివ్యాంగ యువకుడి పేరు ప్రణవ్ ఎంబీ. 22 ఏళ్ల ఈ యువకుడికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే వైకల్యానికి కుంగిపోకుండా దృఢచిత్తంతో చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. కాళ్లతోనే అత్యద్భుత చిత్రాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. వైకల్యం తన దేహానికే కాని మనసుకు లేదని తాజాగా మరోసారి నిరూపించాడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ప్రణవ్ ఔదార్యానికి ముగ్దులైన సీఎం పినరయి విజయన్.. అతడి గురించి తన ఫేస్బుక్ పేజీలో రాశారు. ‘ఈరోజు లెజిస్లేటివ్ కార్యాలయానికి రాగానే కలకాలం గుర్తుండిపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అలాచూర్ ప్రాంతానికి చిత్రకారుడు ప్రణవ్ తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు సాయం అందించేందుకు నా దగ్గరకు వచ్చాడు. అతడికి రెండు చేతులూ లేవు. టీవీ రియాలిటీ షోలో సంపాదించిన మొత్తాన్ని చెక్ రూపంలో అతడు విరాళంగా ఇచ్చాడు. ప్రణవ్‌కు రెండు చేతులుగా నిలిచిన అతడి తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్, స్వర్ణకుమారితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేడీ ప్రసన్న కూడా వచ్చారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం తనకు వంద శాతం ఉందని నాతో ప్రణవ్ చెప్పాడు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది. పలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్ ప్రభుత్వ కాలేజీ నుంచి బీకామ్ పూర్తిచేసిన ప్రణవ్ ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలిపాడు. నాతో చాలా సేపు మాట్లాడాడు. కాలితో సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశాడ’ని విజయన్ పేర్కొన్నారు. సహృదయం చాటుకున్న ప్రణవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాడు ప్రణవ్. గతేడాది వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తన పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని సహాయంగా అందించాడు. ఏప్రిల్ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రణవ్ తొలిసారిగా ఓటు వేశాడు. కుడి కాలి రెండో వేలుతో ఈవీఎం మీట నొక్కి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓనమ్ పండుగ సందర్భంగా ప్రణవ్ గురించి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడి ప్రతిభ, పట్టుదల తనకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయని ట్విటర్ ద్వారా ప్రశంసించాడు. ప్రణవ్ కాలితో గీసిన ఫొటోను తనకు ఇస్తున్న ఫొటోలను సచిన్ షేర్ చేశాడు. -
అడవి కాచిన వన్నెలు
అడవి కాచిన వెన్నెల అడవికే పరిమితం అవుతుంది. డేబ్భయ్ ఏళ్ల వయసులో ఈ గిరిపుత్రిక నేర్చుకున్నచిత్రలేఖనం మాత్రం విశ్వ విధిలో కాంతులు విరజిమ్ముతోంది. ఖండాంతర ఖ్యాతిని సముపార్జిస్తోంది. పుట్టినప్పటి నుంచి డెబ్బై ఏళ్ల వరకు జీవించిందామె. అన్నేళ్లలో తనకు చెప్పుకోవడానికంటూ ఏ ప్రత్యేకతా లేదు. మధ్యప్రదేశ్‌లోని ‘లోరా’ అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది. భర్త, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అడవిలో దొరికే పనులతో బతుకు వెళ్లదీసింది. ఆమెకు నలబై ఏళ్ల వయసులో భర్త పోయాడు. ముగ్గురు పిల్లల్ని ఒక ఇంటి వాళ్లను చేసే బాధ్యత ఆమె భుజాల మీద పడింది. భర్త వదిలి వెళ్లిన ఆ బాధ్యతలను పూర్తి చేసిందామె. అయితే డెబ్బై ఏళ్ల వయసులో ఆమె జీవితం ఆమెకు కూడా తెలియకుండా ఊహించని మలుపు తిరిగింది! ఇప్పుడామెకి ఎనబై ఏళ్లు. ఈ పదేళ్లలో ఆమె అంతర్జాతీయ స్థాయి చిత్రకారిణి అయింది! రాష్ట్రం దాటి బయటకు రాని జీవితం ఆమెది. ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి ఇప్పుడు పారిస్‌లోనూ, ఇటలీలోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లోనూ ప్రఖ్యాత చిత్రకారుల చిత్రాల వరుసలో స్థానం సంపాదించుకున్నాయి. ప్రైజులు కూడా గెలుచుకున్నాయి. దేశంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో అంతకంటే ముందునుంచే ప్రదర్శితమవుతున్నాయి. ఈ ఎనబై ఏళ్ల చిత్రకారిణి పేరు జుధైయా బాయ్ బైగా. ‘‘పెయింటింగ్ నన్ను మరొక ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అక్కడ నేను స్వేచ్ఛావిహంగాన్ని’’ అంటోంది బైగా. ఆమె అంటున్నట్లే ఆకాశమే హద్దుగా తన కుంచె శక్తితో మేధా యుక్తితో సృజనాత్మక లోకంలో విహరిస్తోందామె. జీవితమే థీమ్ బైగా కి బొమ్మలు వేయడానికి థీమ్ గురించి మేధామథనం చేయాల్సిన అవసరమే ఉండదు. తన చుట్టూ కనిపించే సామాన్య గిరిజన జీవితాన్నే కాన్వాస్ మీదకు తెస్తుంది. గిరిజన సంప్రదాయ జీవనశైలికి ప్రతిబింబాలవి. ఒక్కో బొమ్మకు మూడు వందల నుంచి ఎనిమిది వేల వరకు ధర పలుకుతోంది. గ్రామస్థులు ఆమె ధరిస్తున్న రంగురంగుల కొత్త దుస్తులను చూస్తూ ‘‘బైగా అవ్వ జీవితం రంగులమయం అయింది’’ అని చమత్కరిస్తున్నారు. ‘‘ఆమె నుంచి నేర్చుకోవలసింది డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాదు. డెబ్బై ఏళ్ల వయసులో చిత్రలేఖనం నేర్చుకోవడానికి ముందుకు రావడమే’’నన్నారు ఆషిశ్ స్వామి. అడవి బిడ్డలకే సొంతం బెంగాల్‌కు చెందిన ఆషిశ్ ప్రముఖ చిత్రకారుడు, శాంతినికేతన్ విద్యార్థి. ఆషిశ్ తన ఆర్ట్ స్టూడియో ‘జన్‌గాన్ తస్వీర్‌ఖానా’లో ప్రదర్శన కోసం మధ్యప్రదేశ్‌లోని గిరిజన గ్రామాలను సందర్శిస్తూ పదేళ్ల కిందట లోరా వచ్చాడు. ఉచితంగా చిత్రలేఖనం నేర్పిస్తున్నాడని తెలియడంతో పదిహేను మంది మహిళలు నేర్చుకోవడానికి వచ్చారు. డెబ్బై ఏళ్ల బైగా కూడా. ‘‘కుంచె పట్టుకున్న తొలిరోజు నుంచే ఆమె దీక్షతో బొమ్మలు వేసింది. ఒకటి వేసిన తర్వాత మరింకేదో కొత్తగా వేయాలనే తపన కూడా కనిపించేదామెలో. శిక్షణ తీసుకున్న నాగరిక చిత్రకారులకు సాధ్యం కానిది, అడవి బిడ్డలకు మాత్రమే ఒంటపట్టే మెళకువ ఒకటుంది. వాళ్లు అడవిలో సంచరించే జంతువుల కళ్లలోని భావాన్ని ఇట్టే పసిగట్టేస్తారు. బైగా ఆ భావాన్ని బొమ్మలోకి పట్టుకొస్తుంది’’ అన్నాడు ఆషిశ్ స్వామి. ‘నేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదు’ అని ఇప్పటికే ఎందరో నిరూపించారు. జుధైయా బాయ్ బైగా మరోసారి నిరూపించింది, తన కుగ్రామం లోరా పేరును ప్రపంచస్థాయి వేదికల మీదకు తీసుకెళ్లింది. – మంజీర -
చిత్రాల శివుడు
అతనొక అజ్ఞాత కళాకారుడు. స్పష్టంగా మాట్లాడలేడు కాని అందమైన బొమ్మలకు, అనూహ్యమైన ఘటనలకు ప్రాణం పోయగలడు. గడపలకు, గుమ్మాలకు రంగులు వేయడమైతే పుట్టుకతో వచ్చిన విద్య. వాటర్ కలర్స్, ఆయిల్ పెయింట్స్‌తో ప్రముఖ రాజకీయ నాయకుల బొమ్మలను కూడా సొంతంగానే వేస్తున్నాడు. తన బొమ్మలకు గుర్తింపు కావాలని మూగగానే అభ్యర్థిస్తున్నాడు. గాంధీని గాడ్సే షూట్ చేశాడు. ఇందిరా గాంధీని సెక్యూరిటీ గార్డులే పొట్టన పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రాజీవ్‌గాంధీని మానవ బాంబు హతమార్చింది, సంజయ్‌గాంధీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. వీటిని తన రంగులలో చిత్రీకరించాడు నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడ్ల శివకుమార్. రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ జంటను చిత్రీకరించి, సోనియాను అచ్చతెలుగు ఆడపడుచులా నగలతో అలంకరించి, తన సృజనను నిరూపించుకున్నాడు. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న శివకుమార్, పది సంవత్సరాల వయస్సు వరకు బాగానే మాట్లాడేవాడు. ‘‘ఏం జరిగిందో ఏమో తెలియదుకాని, పదో ఏట నుంచి మాట పోయింది’’ అంటారు శివకుమార్ తల్లి సాయిలమ్మ. బుచ్చన్న సాయిలమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం. శివకుమార్ రెండో సంతానం. ఒక అన్న, ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. అనారోగ్యం కారణంగా తండ్రి బుచ్చన్న పది సంవత్సరాల క్రితం మరణించాడు. కుటుంబాన్ని తల్లి ఒంటి చేత్తో పోషించవలసి వచ్చింది. కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పెంచుకొస్తోంది. అన్న మల్లేశ్, చెల్లెలు విజయలక్ష్మి ఇద్దరూ మానసికంగా ఎదగలేదు. ‘‘నాకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం మాత్రమే. మా కుటుంబానికి అండగా ఉండాలంటే, నేను మరింత కష్టపడాలి. ఎవరి సహకారమూ లేకుండానే తలుపులకు రంగులు, గడపలకు ముగ్గులు వేసి, ఎంతో కొంత సంపాదిస్తున్నాను. అప్పుడప్పుడు ముగ్గుల పోటీలో పాల్గొని, చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ నాయకుల బొమ్మలు వేస్తున్నాను’’ అని చెప్పారు 35 ఏళ్ల శివకుమార్. తమ్ముడు సంజయ్ డిగ్రీ వరకు చదివినా ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబం ఒక పాత ఇంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బొమ్మలను గుర్తించి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తే బాగుండునని శివకుమార్ ఆశ. – వైజయంతి పురాణపండ ఫొటోలు: గోరటి శ్రీరాములు, సాక్షి, తెలకపల్లి -
వృత్తి పెయింటర్.. ప్రవృత్తి డ్యాన్స్ మాస్టర్..
సాక్షి, అశ్వారావుపేట : ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో శ్రమిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు అశ్వారావుపేటకు చెందిన యువ నృత్య కళాకారుడు మహ్మద్ యాసిన్. అశ్వారావుపేటలోని ముస్లిం బజారుకు చెందిన మహ్మద్ యాసీన్‌కు చిన్నప్పటి నుంచి నృత్యం అంటే అమితాసక్తి. గొప్ప నృత్యకళాకారుడు కావాలనే కోరిక ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి తోడ్పాటు ఇవ్వలేదు. దీంతో టీవీల్లో వచ్చే నృత్య ప్రదర్శనలు చూస్తూ నృత్య సాధన చేశాడు. ఇలా గొప్ప డ్యాన్సర్ కావాలనే సంకల్పంతో తన నృత్య నైపుణ్యాలను మెరుగు పరుకున్నాడు. పేదరికం వెంటాడినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా గల్లీ స్థాయి నుంచి రంగుల ప్రపంచం(సినిమా రంగం)లోకి అడుగు పెట్టి యువ నృత్య కళాకారుడిగా ఎదిగారు. పొట్ట కూటి కోసం రోజు వారీ కూలీగా పెయింటర్‌గా పని చేస్తూనే ఎంతో మంది చిన్నారులు, పెద్దలకు నృత్యాలు నేర్పిస్తూ తాను ఉపాధి పొందుతూ ప్రశంసలు పొందుతున్నాడు. నిన్న మొన్నటి వరకు గల్లీ డ్యాన్స్ మాస్టర్‌గానే రాణించిన ఈ యువ కళాకారుడు ఓ ద్విభాషా చిత్రానికి (ఇటీవలె ఆడియో రిలీజ్ కాగా, మరో రెండు వారాల్లో సినిమా విడుదల కానున్నది.) కొరియోగ్రాఫర్‌గా పనిచేసి తన సత్తా చాటాడు. ఇలా స్వయంగా నేర్చుకున్న నృత్యాన్ని తనతోపాటు మరో నలుగురికి నేర్పించి, తాను ఉపాధి పొందాలనే ఉద్దేశంతో 2002వ సంవత్సరంలో ‘స్వయంకృషి’ పేరుతో డ్యాన్స్ కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. ఈ సెంటర్లో చిన్నారులకు నృత్యాలు నేర్పిస్తూనే, అడపాదడపా చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టాడు. వాటికి మంచి స్పందన రావడంతో రెట్టింపు ఉత్సహంతో మరింత సాధన చేసి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఉత్సహంతోనే టీవీల్లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ ప్రొగ్రామ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఇలా ప్రయత్నిస్తున్న క్రమంలోనే కొద్ది రోజుల్లోనే ఓ ప్రముఖ టీవీ చానల్లో నిర్వహించిన ‘ఢూం డిగడిగ’ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించాడు. అనంతరం 2005లో డ్యాన్స్ బేబీ డ్యాన్స్, 2008లో ‘ఆట’, ‘ఛాలెంజ్’ ప్రొగామ్స్‌లో పాల్గొన్నాడు. టీవీల్లో ప్రసారమైన ‘ఢీ’ షో, ‘రంగస్థలం’ పోటీల్లో తన శిష్యులకు అవకాశం దక్కింది. డ్యాన్స్ మాస్టర్ సత్య చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో రెండు బహుమతులు సాధించాడు. వాటితోపాటు హైదారాబాద్, ఖమ్మం, రాజమండ్రి, అశ్వారావుపేటలో జరిగిన అనేక కార్యక్రమాల్లో యాసిన్ నృత్యాలతో ఆకట్టుకున్నాడు. తన కోచింగ్ సెంటర్‌తోపాటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో దాదాపు ఇరవై వేల మంది చిన్నారులు, విద్యార్థులకు డ్యాన్స్ కోచింగ్ ఇచ్చాడు. ఇవే కాకుండా వేల సంఖ్యలో ప్రైవేట్, జాతర, శుభకార్యాల్లో నృత్య ప్రదర్శనలు చేశాడు. -
కళాకారుల కళ చెదురుతుంది
సాక్షి, పిడుగురాళ్ల : ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం చేతివృత్తి కళాకారుల జీవనోపాధిపై పెను ప్రభావం చూపుతోంది. కళాకారులు వేసిన చిత్రాలు ఏళ్ల తరబడి నాణ్యతను సంతరించుకుని ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే డిజిటల్ రంగప్రవేశం కళాకారుల బతుకుల్ని చిదిమేసింది. కొద్దిరోజుల్లో చిరిగి, రంగులుపోయే వినైల్, ఫ్లెక్సీ ప్రింటింగ్, స్టిక్కర్ కటింగ్ మిషన్లు, లైటింగ్ బోర్డులపైనే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో కళనే వృత్తిగా నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులకు ఉపాధి కరువైంది. చిత్రకళ తప్ప ఇతర పనులుచేయడం చేతగాకపోవడంతో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కళాకారులు ఇక్కట్లు పడుతూ దయనీయ జీవనం గడుపుతున్నారు. ఉపాధి కోల్పోయిన కళాకారులు... డిజిటల్ ప్రింటింగ్‌తో చిత్రకారులు జీవనోపాధి కోల్పోయారు. నియోజకవర్గంలో సుమారు 100 నుంచి 150 మంది కళాకారులు దుకాణాల ఎదుట బోర్డులు, బ్యానర్లు రాస్తూ, బొమ్మలు వేస్తూ జీవనం సాగించేవారు. ఎన్నికలు వస్తే ఇక ఆర్టిస్టులు రేయింబవళ్లు పదులసంఖ్యలో పనిచేసేవారు. అయితే ఎన్నికల్లో గోడలపై రాతలు, బ్యానర్లు ఉండరాదన్న ఎన్నికల కమిషన్ నియమావళితో 50 శాతం మంది ఆర్టిస్టు ల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కాలక్రమంలో డిజిటల్ ప్రింటింగ్ రంగప్రవేశంతో మిగిలిన 40 శాతం మంది ఆర్టిస్టులకు పనిలేకుండా పోయింది. కొద్దోగొప్పో ఆర్థికస్తోమత ఉన్నవారు డిజిటల్ ప్రింటింగ్ మిషన్లు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తుండగా మరికొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఇళ్లకు రంగులు వేయడానికి వెళుతున్నారు. మరికొందరు కష్టమైనా వేరే వృత్తిని ఎంచుకోలేక పెయింటింగ్ వృత్తినే నమ్ముకుని వారానికి ఒకసారో, రెండుసార్లో వచ్చే పనులకు వెళ్లి రంగులువేసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అక్కడక్కడ పాఠశాల గోడలకు దేశనాయకుల చిత్రాలను గీస్తూ జీవనం సాగిస్తున్నారు. తమకు ప్రభుత్వం రుణాలు మంజూరుచేసి చేయూతనివ్వాలని ఆర్టిస్టులు కోరుతున్నారు. 90 శాతం పనులు తగ్గాయి 35 ఏళ్లుగా ఆర్టిస్టుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కళాకారులకు 90శాతం మేర పనులు తగ్గాయి. డిజిటల్ ఫ్లెక్సీలు రావడంతో అందరూ వాటినే ఏర్పాటుచేసుకుంటున్నారు. దీంతో మాకు పనులు సన్నగిల్లాయి. ప్రభుత్వం చేతివృత్తి కళాకారులకు రుణాలు మంజూరుచేస్తే ఏదొక వ్యాపారం పెట్టుకుని జీవనం సాగిస్తాం. – కె.చెన్నకేశవ, ఆర్టిస్టు, పిడుగురాళ్ల -
ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఎండిపోయిన ఆకుల్లో జీవం చూశాడు. ఆ జీవమే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం కూడా అందుకునేలా చేసింది. విలక్షణమైన శైలితో ఆధునిక చిత్రకళను సమున్నతంగా ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ (80) హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురు చాలా రోజుల క్రితమే చనిపోయారు. బుధవారం సాయంత్రం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుం ఠం, లక్ష్మణ్ ఏలే, ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గుళ్లపల్లి ఎన్ రావు, డాక్టర్ రమేశ్ ప్రసాద్, పలువురు వైద్యులు, చిత్రకారులు అంత్యక్రియల్లో పాల్గొని నివా ళులర్పించారు. చిత్రకళా రంగంలో అపారమైన అనుభవం ఉన్న ఆయన ఎంతోమందికి మార్గదర్శకులు గా నిలిచారని వారు కొనియాడారు. ఆయన మరణం చిత్రకళా రంగానికి తీరని లోటని అన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో పుట్టి పెరిగిన ఆయన హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. సీసీఎంబీతో మొదలు.. మొదట సీసీఎంబీకి రెసిడెన్షియల్ ఆర్టిస్టుగా పని చేశారు. ఎన్నో అపురూప చిత్రకళా ఖండాలను గీయడంతోపాటు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెంట్ ఆర్టిస్టుగా చేరారు. ప్రముఖ చిత్రకారులు లక్ష్మాగౌడ్, తోట వైకుంఠ, దేవరాజ్‌లకు ఆయన సీనియర్. జేఎన్టీయూలో చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లోని ఇరుకు గల్లీలను వాస్తవిక ధోరణిలో చిత్రీకరించే వారు. చదువు పూర్తయ్యాక అప్రెంటిస్ కోసం ఢిల్లీలో ఉండే ప్రముఖ చిత్రకారుడు శ్రీరాం కుమార్ వద్దకు వెళ్లారు. ఆయన వద్ద శిష్యరికంతో తనలో దాగి ఉన్న అసలు సిసలు చిత్ర జగత్తు వెలుగులోకి వచ్చింది. ఆ రోజుల్లోనే పనికిరాని వస్తువులు, పారవేసిన చెత్త చెదారం నుంచి కళా సృజన చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాక తనని ఆటోమొబైల్ స్క్రాప్ ఎంతగా ఆకర్షించిందంటే.. అదే తనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చి పెట్టింది. లలిత కళా అకాడమీ పురస్కారం అందుకునేలా చేసింది. అవశేషం, శిథిలం అనేవి సహజ ఉనికి అన్న భావన ఆయనలో స్థిరపడటం, అక్కడి నుంచి ఆయన స్థిరంగా తనను తాను అన్వేషించుకుని పోయేలా చేసింది. ఆటోమొబైల్ స్క్రాప్ తర్వాత ఆయనను వడలి పోయినవి, రాలిపోయిన ఆకులు ఎంతగానో ఆకర్షించాయి. వాటిని ‘డెడ్ లీవ్స్’అని అన్నప్పటికీ, ఆయనకు అవి మృత ప్రాయం కాదు. మృత్యువు కానే కాదు. ‘మృత్యువు కూడా విశ్వంలో ఒక జీవితమే’అని చెప్పేవారు. సీఎం కేసీఆర్ సంతాపం... చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని తెచ్చి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మట్టితో మాణిక్యం
అతడొక బిచ్చగాడు. మతిస్థిమితం కూడా లేకుండా తిరుగుతాడు. అతడి పేరు మాత్రం రాజు అని ఆ చుట్టుపక్కల వాళ్లు అనుకుంటున్నారు. పది రోజుల క్రితం అటుగా వెళ్తున్న కొందరు అక్కడ జరుగుతున్న ఓ సంఘటన చూసి ఆశ్చర్యంగా నిలబడిపోయారు. జరుగుతున్నదంతా వారి వీడియోలలో బంధించారు. రాజుగా పిలవబడుతున్న ఆ బిచ్చగాడు ఎర్రమట్టి, బురద మట్టిని మట్టిగా కాకుండా, వాటర్ కలర్స్‌గా భావించాడు. గడ్డిని కుంచెగా మలిచాడు. గోడను క్యాన్వాస్గా భావించాడు.అంతే అంతటి మతి స్థిమితం లేని ఆ వ్యక్తి మెదడులో ఏం ఆలోచన బయలుదేరిందో ఏమో కానీ, అందమైన పెయింటింగ్ వేయడం ప్రారంభించాడు. పది నిమిషాలలో అద్భుతమైన పెద్ద పెయింటింగ్ సిద్ధమైపోయింది. విచిత్రమేమిటంటే తనొక చిత్రకారుడినని తనకు తెలియదు. అదే తెలిసి ఉంటే ఎం. ఎఫ్. హుస్సేన్ అంతటి వాడు అయి ఉండేవాడేమోనని ఆయన చిత్రాలను చూస్తున్నవారు భావిస్తున్నారు. అతడు పేజ్ త్రీ వ్యక్తి కూడా కాదు. కేవలం మట్టిమనిషి మాత్రమే. మట్టిలో మాణిక్యం దొరుకుతుందో లేదో తెలియదు కానీ, మట్టితో మాణిక్యాలను తయారుచేస్తున్నాడు ఈ బిచ్చ చిత్రకారుడు. – వైజయంతి -
ప్రాణ భయంతో పరుగులు
రాంబిల్లి(యలమంచిలి): మధ్యాహ్నం రెండు గంటలు... అంతవరకు పనిచేసిన కార్మికులందరూ భోజనాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ముగించారు. అంతలో భారీగా పేలిన శబ్దాలు...ఏమైందోనని చూసేలోపే దూరంగా భీకరంగా పైకి ఎగసిపడుతున్న మంటలు... అరుపులు ...కేకలు...ప్రాణభయంతో పరుగులు తీస్తున్న కార్మికులు... నోటిలో ముద్ద పెట్టుకోకుండానే ఎలా ఉన్న వారు అలాగే పరుగు లంఘించుకున్నారు. రాంబిల్లి మండలం పూడి వద్ద గల ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో సోమవారం అగ్నిప్రమాదం జరగడంతో ఉద్యోగులు, కార్మికులు ప్రాణభయంతో వణికిపోయారు. దట్టంగా పొగ, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మూడునెలల క్రితం ఏíషియన్ పెయింట్ నిర్మాణం పూర్తిచేసుకొని ఉత్పత్తులను ప్రారంభించింది. పెయింట్స్ తయారీకి వినియోగించే మోనోమార్ కెమికల్ నిల్వచేసే ట్యాంకులకు సోమవారం నిప్పు అంటుంది. ట్యాంకులకు సమీ పంలో ఉన్న బ్రాయిలర్ నుంచి మంటలు వ్యాపించి కెమికల్ ట్యాంకునకు వ్యాపించింది. ప్రమాదంలో రెండు పెద్ద ట్యాంకులు పూర్తిగా ఆకారం మారిపోయేలా కాలిపోయాయి. ట్యాంకు మూత ఎగిరి పక్కన పడింది. కెమికల్ ద్రావణం నల్లని దట్టమైన పొగను విరజిమ్ముతూ మంట ఎగసిపడింది. ట్యాంకు పెద్ద శబ్దంతో పేలడంతో కార్మికులు ఒక్కసారిగా గేటువద్దకు పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. లారస్ పరిశ్రమలో అగ్నిమాపక యంత్రం మొదట సంఘటన స్థలానికి చేరుకుంది. ఏపీఐఐసీ వద్ద గల మరో అగ్నిమాపక యంత్రం వచ్చి గ్యాస్‌ను వినియోగించి మంటలను అదుపుచేశారు. వివిధ ప్రాం తాల నుంచి 12 అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలాన్నిచేరుకున్నాయి.15అంబులెన్స్‌లను రప్పిం చా రు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యాజమాన్యం తెలియజేసింది. మంటలను పూర్తిగా అదుపుచేయడంతో కార్మికులు, చుట్టుపక్కల గ్రామా ల ప్రజలు ఊపిరి తీసుకున్నారు. విచారణ జరుపుతున్నట్టు అగ్నిమాపకఅధికారి డి.వి.ఎస్.రాంప్రకాష్ చెప్పారు. యాజమాన్యం తీరుపై అనుమానాలు : ప్రమాదం జరిగిన తరువాత రెండు అంబులెన్స్‌లు పరిశ్రమనుంచి బయటకువెళ్లాయి. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని యానమాన్యం ప్రకటించ డం, మీడియాను సంఘటన స్థలానికి అనుమతించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నిర్మాణం పూర్తి చేసుకోకుండానే... : పరిశ్రమలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేయకుండానే ఉత్పత్తిని ప్రారంభించింది. పరిశ్రమలో పూర్తిస్థాయిలో వసతులు ఏర్పాటు కాలేదు ఏషియన్ పెయింట్స్ పరిశ్రమ అత్యంతకాలుష్యభరిత పరిశ్రమ జాబితాలో ఉంది. రెడ్‌జోన్ పరిశ్రమ కేటగిరీలో పెయింట్స్ పరిశ్రమను ఉంచారు. పరిశ్రమకు ప్రత్యేకంగా అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. రెండుకు మించి అంబులెన్స్‌లు ఉండాలి. పరిశ్రమ చుట్టూ అగ్నిమాపక యంత్రాలు వెళ్లడానికి వీలుగా రోడ్లు ఉండాలి. పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలో ఉండడంతో పూర్తిస్థాయిలో సౌకర్యాలు ఏర్పాటుM >లేదని కార్మికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన కన్నబాబు: వైఎస్సార్సీపీ అభ్యర్థి యు.వి. రమణమూర్తిరాజు (కన్నబాబు) సందర్శించారు. కార్మికులకు ధైర్యం చెప్పా రు. కార్మికుల యోగక్షేమాలపై యాజమాన్యంతో మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి నష్టంజరిగినా పూ ర్తి సహాయం అందించాలని తెలిపారు. టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్‌బాబు, జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కూండ్రపు అప్పారావు, ప్రగడ నాగేశ్వరరావు సంఘటన స్థలాన్ని చేరుకున్నారు. సీఐ విజయనాథ్, ఎస్ఐ చక్రధరరావులు పరిస్థితిని సమీక్షించి విచారణ జరుపుతున్నారు. -
అమ్మ
‘‘భయంగా ఉంది’’ భర్త భుజమ్మీద తల వాల్చుతూ భార్య.‘‘నేనున్నా కదా.. ’’ భార్య చెక్కిలి స్పృశిస్తూ అభయమిచ్చాడు. నిట్టూరుస్తూ అతణ్ణి అల్లుకుపోయింది ఆమె.వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. సొంత ఊళ్లో పెద్దలు తమని వేరు చేస్తారనే భయంతో కొన్ని వందల కిలోమీటర్లు దాటి వచ్చారు. యేడాదిగా ఒక్కో ఊరు.. ప్రస్తుతం ఇక్కడ. ఇప్పుడు ఆమె నిండు గర్భిణి. ఆ ఊళ్లో టీచర్‌గా ఉపాధి దొరికింది అతనికి. పల్లెటూరు. పచారీ కొట్టు అందుబాటులోనే ఉన్నా.. ఆసుపత్రి లేదు. కనీసం ఏడు కిలోమీటర్లు వెళ్లాలి. ఇరుగూపొరుగూ దగ్గరగా లేక విసిరేసినట్టుగానే ఉంది ఇల్లు. అద్దె తక్కువని చేరారు. సమయానికి ఎవరూ రారేమోనన్న భయం ఆమెది. బయటకు బింకంగా కనిపిస్తున్నా లోపల అతనికీ దిగులుగానే ఉంది కాన్పు గురించి. ‘‘ఆకు కూరలు తీసుకోమ్మా... తాజాగా ఉన్నాయ్. నీ బిడ్డక్కూడా మంచిది’’ లేత తోటకూర కట్టల్ని ఏరిఏరి ఇస్తోంది కూరగాయలమ్మ.సిగ్గు.. ఆమె నున్నటి బుగ్గల మీద ప్రతిఫలిస్తోంది గులాబీ రంగుగా. ‘‘చక్కటి పిల్ల. ఆలనాపాలనా ఉంటే ఇంకెంత ఆరోగ్యంగా ఉండేదో’’ మనసులో అనుకుంటూ పైకి అడిగింది‘‘నెలలు నిండినట్టున్నాయ్.. పెద్దవాళ్లెవరూ లేరా తల్లీ’’ అని.తోటకూర కట్టల్ని చేటలో సర్దుకుంటున్నదల్లా ఒక్కసారిగా తలెత్తి చూసింది కూరలగాయలమ్మను.‘‘కొత్తగా వచ్చినట్టున్నారు.. నాలుగు రోజులుగా చూస్తున్నా..! పెద్దవాళ్లెవరూ కనిపించలేదు’’ నింపాదిగా కూరగాయలమ్మ.గబగబా ఆ ఆకుకూరలు తీసుకుని లోపలికి వెళ్లిపోయి తలుపేసుకుంది ఆ అమ్మాయి.‘‘ఇదిగో అమ్మాయ్...మాట...’’అని కూరగాయలమ్మ పిలుస్తున్నా వినకుండా. ‘‘అయ్యో తల్లీ.. ఒక్కదానివే ఎలా నెట్టుకొస్తావ్’’ బాధపడుతూ బుట్ట ఎత్తుకుంది ఇంకో చోటికి. ‘‘మీ అమ్మో.. అత్తో.. మీతో ఉంటే ఇవన్నీ చేసేవారు. తొలిచూలు అపురూపమే వేరు’’ గోరింటాకు పెడ్తూ చెప్తోంది.‘‘సారీ.. అవ్వా.. ఆరోజు నీ మొహమ్మీదే తలుపేసాను. కొత్త కదా... ఎవరు ఎలాంటి వాళ్లో తెలీదు.. ఎవరూ లేరని తెలిస్తే.. ’’ ఆగిపోయింది ఆ అమ్మాయి.‘‘నేనేం తప్పుపట్టుకోలేదు తల్లీ.. నువ్వు నా బిడ్డలాంటిదానివి! ’’ అంది గోరింటాకు పెట్టిన ఆ పిల్ల చేతులను ముద్దుగా చూసుకుంటూ!ఆ అమ్మాయి కళ్లల్లో నీళ్లు.‘‘అరే... ఏంటమ్మా ఇది? చెప్పా కదా..నువ్వు నా బిడ్డ లాంటిదానివని.నీకు పురుడు పోసే బాధ్యత నాది. ఊరుకో తల్లీ.. ఈ టైమ్‌లో అలా కళ్లనీళ్లు పెట్టద్దు’’ ఖాళీ అయిన గోరింటాకుగిన్నెలో చేతులు కడుక్కుని ఆ తడి చేత్తోనే ఆ అమ్మాయి కళ్లు తుడుస్తూ అంది ఆమె.ఆ ఆప్యాయతకు ఆ అమ్మాయిలో గడ్డకట్టుకున్న దుఃఖం కరిగిపోయింది.అంతే ఆమె గుండెలో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్వసాగింది. ఆ పిల్ల తల నిమురుతూ అలాగే ఏడ్వనిచ్చింది. ఆ కాసేపట్లోనే ఆ పెద్దామె మనసులో ఎన్నో జ్ఞాపకాలు.. తన కూతురు... ఇలాగే ఉండేది. ఈ ఇంట్లోనే. కడుపులో ఉన్నది ఆడపిల్లఅని తెలిసి ఆ పిల్ల పెంపకానికి డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టారు. ఇచ్చేట్టు లేమని తెలిసి పురిటికి పుట్టింటికి పంపలేదు. నొప్పులు పడ్తున్నా ఆసుపత్రికీ తీసుకెళ్లలేదు. కడుపులో బిడ్డ పేగుమెడకేసుకుని అడ్డం తిరిగింది. కడుపులోనే పోయింది. వైద్యం అందక తన బిడ్డా ప్రాణం వదిలింది. ఆ విషాదగతం ఆమె కంటా నీరు పెట్టించింది.తేరుకున్న ఆ అమ్మాయి చూసి.. ‘‘అయ్యో.. అమ్మా.. మీరెందుకేడుస్తున్నారు?సారీ.. అమ్మా.. నేనేమైనా బాధపెట్టుంటే ’’ గోరింటాకు చేతి మణికట్టుతో ఆమె కళ్లు తుడుస్తూ నొచ్చుకుంది ఆ అమ్మాయి.తెప్పరిల్లిన ఆమె ‘‘ఛ.. ఛ..అట్లాదింటేం లేదు’’ అని చీర చెంగుతో మొహం తుడుచుకుంటూ ‘‘అన్నం పెట్టనా..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది.‘‘థాంక్స్ దేవుడా.. ఈ అమ్మను ఇచ్చినందుకు’’ కనిపించని ఆ దేవుడికి దండం పెట్టుకుంది ఆ అమ్మాయి. ‘‘అమ్మా...భరించలేను.. నా వల్ల కాదు..’’ నొప్పితో మెలికలు తిరిగిపోతోంది ఆ పిల్ల.‘‘కాస్త ఓర్చుకో ప్లీజ్.. నేను అలా వెళ్లి ఎవరైనా తోడు వస్తారేమో చూస్తా... ’’‘‘నా వల్ల కావట్లేదు... కూరగాయలమ్మ వస్తుందేమో చూడవా ఒకసారి’’ పంటి కింద నొప్పిని భరిస్తూ నడుమ్మీద చేతి ఆసరాతో మంచమ్మీద కూర్చుంటూ అంది.‘‘ఆమె కోసం చూసేంత టైమ్ లేదులేగానీ.. బయటకు వెళ్లి ఎవరినైనా సాయం అడిగొస్తా.. ఆసుపత్రికెళ్లడానికి.. అందాక కాస్త ఓపిక పట్టు’’ అంటూ మంచినీళ్ల చెంబు ఆమెకిచ్చి బయటకు వెళ్లిపోయాడు.అతనలా వెళ్లాడో లేదో.. కూరగాయలమ్మ వచ్చింది.‘‘ఏం తల్లీ.. నొప్పులు పడ్తున్నావా?అయ్యో.. నిన్న రాత్రి ఇక్కడే ఉంటానంటికదా.. పర్లేదు పో అన్నావ్’’ అంటూ గబగబా ఆ అమ్మాయిని పడుకోబెట్టింది.కూరగాయలమ్మను చూడగానే అమ్మాయికి భరోసా వచ్చింది.‘‘అమ్మా... ఇక్కడే ఉంటావ్ కదా..’’ ఓ ధైర్యం కోసం అడుగుతోంది ఆ పిల్ల.‘‘నేనెక్కడికి పోతానమ్మా..నీ చేతిలో పండంటి బిడ్డను పెట్టందే ఎక్కడికీ పోను’’ అంటూ ఆమె నుదిటి మీద చేయి వేసి ధైర్యమిచ్చి... తను వెంటతెచ్చిన పాత గుడ్డల మూట విప్పింది.‘‘అమ్మా....’’ అంటూ అరిచింది అమ్మాయి.‘‘ఏంకాదు... కాస్త ఓపికపట్టు’’ అంటూ ఆ పిల్ల కాళ్లను మలిచి ఎడం చేసింది.ఆ అమ్మాయికి అంతకంతకు నొప్పులు ఎక్కువవుతున్నాయి.. అర్థమవుతోంది కూరగాయలమ్మకు. వంటింట్లోకి వెళ్లి స్టవ్ మీద వేడి నీళ్లు పెట్టింది. మళ్లీ ఈ గదిలోకి వచ్చేటప్పటికే పిల్లకు నొప్పులు ఉధృతమయ్యాయి. ఆ పిల్ల కాళ్లువణుకుతున్నాయి. మొహం ఎర్రబడింది.. చూసింది... నల్లగా తలకట్టు కనబడుతోంది...‘‘తల్లీ.. బిడ్డ బయటకు వస్తోంది.. ఊపిరి ఎగబబీల్చకు.. కిందకు నొక్కు నొప్పిని...’’ చెప్తోంది..అయినా బిగబట్టలేక పైకి పీల్చుకుంది ఆ పిల్ల.కంగారు పడింది కూరగాయలమ్మ.. ‘‘అయ్యో అలా చేయకమ్మా,, బిడ్డకు శ్వాసాడదు.. ’’ తన అనుభవసారం చెప్తోంది..మూడేమూడు పెద్ద నొప్పులు... బిడ్డ కూరగాయలమ్మ చేతిలో పడింది.. కేర్... కేర్.....‘‘ఆడపిల్ల’’ కూరగాయలమ్మ మొహం వెలిగిపోతోంది.అప్పటిదాకా అనుభవించిన నరకం.. మాయమైంది... బిడ్డ ఏడుపు.. ఆ తల్లి మనసును శాంత పరిచింది. హాయిగా కళ్లు మూసుకుంది బాలింత అలసట తీర్చుకునేందుకు.‘‘మాయా... మాయా..’’ పడుకున్న భార్యను లేపాడు.మగతగా కళ్లు తెరిచింది ఆమె. భర్తను చూసింది... అతని వెంట ఉన్న మరో ఇద్దరు ఆడవాళ్లనూ!లేవబోయింది... పక్కన పొత్తిళ్లల్లో బిడ్డ ఒళ్లు విరుచుకుంటూ ...‘‘నీళ్లాడింది కదా బాబూ...’’ అంది వెంట వచ్చిన ఆడవాళ్లలో ఒకామే ఆ బిడ్డను ఎత్తుకుంటూ.‘‘ఎలా?’’ చూశాడు. ‘‘కూరగాయలమ్మ’’ చెప్పింది చిన్న స్వరంతో.‘‘ఎక్కడా?’’ అడిగాడు ‘‘ఇందాకటిదాకా నా పక్కనే ఉందే! వంటింట్లోకెళ్లిందేమో’’ అంది .చూశాడు.. వంటగదిలో లేదు.. ఇంకెక్కడా కనిపించలేదు. తను సాయం కోసం బయటకు వెళ్లొచ్చిన పదినిమిషాల్లోనే ఇదంతా.. ఎలా సాధ్యం? వింతగా.. అయోమయంగా ఉంది అతనికి! - సరస్వతి రమ -
అమ్మానాన్న.. వందల ప్రేమలేఖలు!
వకుళానాయక్ చిత్రకారిణి. అందమైన భావం ఆమె కుంచె నుంచి అద్భుతంగా ఆవిష్కారమవుతుంది. వాస్తవికతకు గీతల్లో రూపమిస్తుంది. ‘ఇది చిత్రకారులందరూ చేసే పనే కదా! కొత్తగా ఏదైనా చేయాలి’ అని వకుళానాయక్ అనుకుంటుండగా.. ఆ అన్వేషణలో యాదృచ్ఛికంగా జరిగిందో సంఘటన. వాళ్ల నాన్నగారు, వాళ్ల అమ్మకు రాసిన ప్రేమలేఖలు వకుళానాయక్ కంటపడ్డాయి. ఆయన ఉత్తరాల్లోని భావుకత, అక్షరాల్లో ఒలికించిన ప్రేమ భావం గొప్పగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని క్షుణ్నంగా చదివారామె. ఆ ఉత్తరంలో వ్యక్తమైన భావానికి రూపమిచ్చారు. అలా ఆమె వేసిన బొమ్మలతో బెంగుళూరులో ప్రదర్శన కూడా పెట్టారామె. భావాల బొమ్మలు నీటి ఉపరితలం మీద పడవ ప్రయాణిస్తుంటుంది. రెండు చేపలు నీటి లోపల ఈదుతూ ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఆరాధనాభావంతో చూసుకుంటూ ఉంటాయి. పడవలో నుంచి ఒక ఎర చేపల మధ్య వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఎరకు కొసన ప్రేమచిహ్నం ఉంటుంది. మరో చిత్రంలో ఒక రాకెట్ ఆకాశం నుంచి నేల వైపు పయనిస్తుంటుంది. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక జెండా. ఆ జెండా మీద ప్రేమ చిహ్నంగా ఎర్రటి హృదయం బొమ్మ. మరో చిత్రంలో ప్రేమగా ముక్కులు రాసుకుంటున్న రెండు రామచిలుకలు. ఇంకో చిత్రంలో రెండు గోరువంకల మధ్య ఫోన్ రిసీవర్ వేళ్లాడుతూ ఉంటుంది. రెండు ప్రేమ పక్షులు చెరొక కాఫీ కప్పులో కూర్చుని ఒకదానిని మరొకటి చూసుకుంటుంటాయి. రోజుకో ప్రేమలేఖ! ‘‘మా అమ్మానాన్న ఉద్యోగరీత్యా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప తరచూ కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన మా అమ్మకు తరచూ ఉత్తరాలు రాసేవాడు. కొన్ని ఉత్తరాల మీద తేదీలను చూస్తే రోజుకొక ఉత్తరం రాసిన రోజులూ ఉన్నాయి వాళ్ల జీవితంలో. ఇప్పటిలా ఫోన్లు ఉన్న రోజులు కావవి. టెలిఫోన్ ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ‘ఫలానా రోజు ఫోన్ చేస్తాను’ అనే సంగతి కూడా ఉత్తరంలో సమాచారం ఇచ్చుకోవాల్సిన రోజులవి. అప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించిన నేస్తాలా ఉత్తరాలు. అందులో ఆయన రాసిన విషయాలకు నేను బొమ్మలు వేశాను. నాన్న పోయాక ఆయన వస్తువులు చూస్తున్నప్పుడు ఈ ఉత్తరాలు దొరికాయి’’ అని వివరించారు వకుళా నాయక్. ఉత్తరాలే కాదు ఏ రకమైన పాత కాగితం కనిపించినా దానికి నప్పే బొమ్మ వేసి ఆ బొమ్మలో ఈ కాగితాన్ని ఇమడ్చడం ఆమె ప్రత్యేకత. పాత దస్తావేజులు, సరుకులు కొన్న చీటీలు, సంగీతం నోట్స్... ఏదైనా సరే... ఆ కాన్సెప్ట్‌కు తగినట్లు బొమ్మ వేసి ఒక డెకరేటివ్ పీస్‌గా మారుస్తారు వకుళ. ఈ ఆర్ట్‌ను వింటేజ్ లవ్ లెటర్స్ ఎగ్జిబిషన్ అంటారు. – మంజీర -
మదిలో నిలిచే మగువల చిత్రాలు
రాయచూరు రూరల్: కుంచెతో కళా నైపుణ్యం ఉట్టి పడేలా, జీవకళ ఉట్టిపడేలా పెయింటింగ్స్ వేయడంలో శశికాంత్ దోత్రేది అందె వేసిన చేయి. ఆయన గీసిన చిత్రాలను చూస్తే ఇది చిత్రమా, ఫోటోనా అనే భ్రమ కలగకమానదు. ఆ స్థాయిలో కుంచె సామర్థ్యాన్ని దోత్రే సొంతం. ఫొటోగ్రఫీని మించి కుంచె ద్వారా చిత్రాలు వేసిన దోత్రేకు ఏ బొమ్మనైనా అదే సర్వస్వమనే తపనతో లీనమై గీస్తారు. శశికాంత్ దోత్రే తండ్రి ఒక చిరుద్యోగి. శశికాంత్ పుట్టి, పెరిగింది, టెన్త్ క్లాస్ వరకు చదువుకుంది రాయచూరు పట్టణంలోనే. తరువాత బదిలీపై మహారాష్ట్రలోని షోలాపూర్‌కు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడ ఉన్నా చిత్ర కళను జీవితాశయంగా ఎంచుకున్నారు. మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పి ముంబాయి జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చేరారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబం, ఫీజులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో మధ్యలో కళాభ్యాసాన్ని ఆపిన దోత్రే ఇంటిలోనే తన కుంచెకు పదును పెట్టారు. వివిధ రకాలైన కాగితాలలో రంగు రంగుల పెన్సిళ్లతో చిత్రాలు వేయడం ప్రారంభించాడు. చిత్రకళకు జీవకళ ఉట్టి పడేలా చేశాడు. జాగర్ పేరుతో దేశ వ్యాప్తంగా 40 నగరాలలో కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇటీవల రాయచూరులోని ఉపాధ్యాయుడు వెంకటేష్ నవలి నివాసంలో తన ప్రతిభను వివరించారు. బల్లపై కూర్చొని పూసలు అల్లుతున్న యువతులు, పూలు కుడుతున్న మహిళ, తిరగలితో ధాన్యం విసరడం, పాతకాలంలో గోళీలు ఆడుతున్న పిల్లలు, వంట చేస్తుంటే తల్లి వెనుక కొడుకు ఉండటం, దుప్పట్లు కుట్టడం, తులసి మొక్కకు నీరు పోస్తున్న మహిళ దృశ్యం సంభ్రమానికి గురిచేస్తాయి. దైనందిన జీవితమే చిత్రం తల్లి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి, కూతురిని ముస్తాబు చేస్తున్న తల్లి, వంట కోసం కాయగూరలు తరుముతున్న దృశ్యం, అల్లికలు వేస్తున్న యువతి, ధాన్యం చెరుగుతున్న స్త్రీ.. ఇలా ఎన్నో పెయింటింగ్స్ కళ ఉట్టి పడుతూ మరులు గొలుపుతాయి. గోరింట పెట్టుకుంటున్న యువతులు, ఇంటివద్ద కట్టపై కూర్చుని మాట్లాడే మహిళలు.. ఇలా పేద, మధ్య తరగతి మానవ జీవితపు పార్శా్వలు చూపరులను ముగ్ధుల్ని చేస్తాయనడంలో సందేహం లేదు. -
రాజు మెచ్చిన చిత్రం
పాదుషా గారికి వైకల్యం ఉంది. ఒక కన్ను కనిపించదు. ఒక కాలు నడవనివ్వదు. అయినా పాలనా వ్యవహారాలు నిర్వర్తించడంలో ఏ లోటూ రానిచ్చేవారు కాదు. ఒకరోజు పాదుషా గారికి తన ముఖచిత్రాన్ని గీయించుకోవాలనే కోరిక కలిగింది. ‘‘ఎవరైతే నాలో ఉన్న శారీరక లోపాలు కనపడకుండా నా చిత్రాన్ని గీస్తారో వాళ్లకు గొప్ప బహుమానాన్ని అందిస్తాను’’ అని ప్రకటించారు. రాజ్యంలోని ప్రముఖ చిత్రకారులందరూ రాజుగారి చిత్రాన్ని గీసేందుకు బారులు తీరారు. చిత్రకారులంతా పాదుషా గారి వైకల్యం కనబడకుండా చిత్రించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. అందులోనుంచి ఒక పల్లెటూరి చిత్రకారుడు ‘‘పాదుషా గారూ! మీరు కోరినట్లుగా మీ చిత్రాన్ని నేను గీస్తాను’’ అని చెప్పాడు. చెప్పినట్లుగా రాజుగారి ముఖచిత్రాన్ని అత్యంత సుందరంగా, రాజుగారు మెచ్చుకునేలా చిత్రీకరించాడు. చిత్రంలో రాజుగారు అశ్వంపై ఆసీనులై బాణం ఎక్కుపెట్టినట్లు చిత్రించి తన చిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. నడవనివ్వని కాలును గుర్రానికి కనపడని వైపు ఉంచి, కనిపించని కన్నును మూసి బాణాన్ని ఎక్కుపెట్టినట్లు చిత్రించి రాజుగారి మన్ననల్ని పొందాడు. రాజుగారు తన ముఖారవిందాన్ని చిత్రంలో చూసుకుని ఎంతో సంతోషించారు. ఆ పల్లె చిత్రకారుడికి ఎన్నో విలువైన బహుమతులతో సత్కరించారు. ఇది కేవలం కథ మాత్రమే కాదు పాఠం. మనమూ ఇతరుల లోపాలను బహిర్గతం కాకుండా చిత్రాలను గీయవచ్చు. దైవానుగ్రహం పొంది ఎన్నో వరాలను పొందవచ్చు. ఒకరి లోపాలను ఎత్తి చూపడం అల్లాహ్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ఎదుటి వారిలోని మంచినే చూడాలి. మనలో ఉన్న లోపాలను తొంగి చూసుకోవాలి. అంతేకాని, ఎప్పుడూ ఎదుటి వారి లోపాలపైనే దృష్టి పెడితే మనం అభాసుపాలవుతాం. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు, బలహీనతలుంటాయి. ఒకరి లోపాలు, బలహీనతలను నలుగురిలో చెప్పి నవ్వులపాలు చేయకుండా ప్రవర్తిస్తే అల్లాహ్ మన లోపాలు, మన బలహీనతలపై ముసుగు వేస్తాడు. – నాఫియా -
పెయింటర్ దారుణ హత్య
కొల్లిపర: పెయింటర్ హత్యకు గురైన సంఘటన కొల్లిపరలో కలకలం రేపింది. అక్రమ సంబంధం నేపథ్యం లోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. కొల్లిపర దళితవాడకు చెందిన పిల్లి రామారావు(48)కు అతని ఇంటికి సమీపంలో నివసించే ఓ వివాహితతో గతంలో అక్రమ సంబంధం ఉండేది. విషయం తెలిసి ఆమె కుటుంబసభ్యులు అతడిపై దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటన తర్వాత ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని వదిలేశారు. అయితే, రామారావు మద్యం తాగి సదరు వివాహిత ఇంటి సమీపానికి వెళుతుండేవాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లిన అతను హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని తెనాలి డీఎస్పీ ఎం. స్నేహిత, తెనాలి రూరల్ సీఐ చినమల్లయ్య, కొల్లిపర ఎస్ఐ కె. శ్రీనివాసరెడ్డి సిబ్బందితో కలసి పరిశీలించారు. ఘటనకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వివాహేతర సంబంధం ఉన్న మహిళ భర్త కంచర్ల ఎలీషా ఇంటి వెనుక నుంచి వచ్చి రోకలి బండతో రామారావుపై దాడి చేశాడని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితుడు ఎలీషా, అతని భార్య పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. -
దేవుడా.. దిక్కెవరు!
మునగపాక(యలమంచిలి): మునగపాక–వాడ్రాపల్లిరోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పెయింటర్ దుర్మరణం చెందాడు. దీంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. దేవుడా ఇక తమకు దిక్కెవరంటూ భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం మండలం లక్కవరం గ్రామానికి చెందిన లక్కవరపు దేముడు(34)పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నాళ్లపాటు విశాఖలో ఉంటూ పనిచేశాడు. ఏడాది క్రితం అచ్యుతాపురం మండలం జగన్నాథపురంలో తన అత్తవారింటి వచ్చి, అక్కడే ఉంటూ పెయింటింగ్ పనులు చేస్తున్నాడు. మంగళవారం రాత్రి వాడ్రాపల్లిలోని పారిపల్లెమ్మ అమ్మవారి పండుగకు బైక్‌పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం తెల్లవారుజామున ఇంటికి వస్తుండగా మునగపాకకు చెందిన కింతాడ దేముడు, కుంది జయలక్ష్మి లిఫ్ట్కావాలని అడగడంతో లక్కవరపు దేముడు వారిని తన బైక్‌పై ఎక్కించుకుని మునగపాక వైపు వస్తున్నాడు. అదే సమయంలో వాడ్రాపల్లి వైపునకు వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్కవరపు దేముడు అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్ వెనుక కూర్చొన్న కింతాడ దేముడు, జయలక్ష్మిలకు తీవ్ర గాయాలు కావడంతో అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్సనిర్వహించి మెరుగైన వైద్యంకోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎస్ఐ స్వామినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారకుడైన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మిన్నంటిన రోదనలు దేముడు మృతి చెందాడన్న విషయం తెలియడంతో అతని కుటుంబ సభ్యులు,బంధువులు అనకాపల్లి వందపడకల ఆస్పత్రికి చేరుకొన్నారు. విగతజీవిగా ఉన్న భర్త దేముడును చూసి భార్య సత్యవతి గుండెలవిసేలా రోదించింది. బందుమిత్రుల రోదనలు మిన్నంటాయి. దేముడికి ధరణి(7), లలిత్(5) అనే పిల్లలున్నారు. చిన్నారులకు దిక్కెవరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అక్కను పిలుచుకొచ్చేందుకు వెళ్తూ..
- రోడ్డు ప్రమాదంలో గార్గేయపురం వాసి మృతి - గ్రామశివారులోనే ఘటన కర్నూలు: మండల పరిధిలోని గార్గేయపురం శివారుల్లోని చెరువుకట్ట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారుడు రెడ్డిపోగు చెంచన్న (26) అక్కడికక్కడే మృతి చెందాడు. పెయింటర్‌గా పనిచేస్తున్న చెంచన్న(26)మునగాలపాడులో ఉన్న అక్కను పండుగకు పిలుచుకొని వచ్చేందుకు శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్(ఏపీ 21 బీహెచ్ 4131)పై బయలుదేరాడు. గ్రామ శివారుల్లోని చెరువు కట్ట దగ్గరకు వచ్చే సరికి వెనుకవైపు నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చెంచన్న అక్కడిక్కడే మరణించాడు. సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు తాలుకా ఎస్ఐ గఫూర్ తెలిపారు. -
విద్యార్థుల సేవలో..
► పాఠశాలకు రంగులు వేయించిన సామాన్యుడు ► సొంత డబ్బుతో విద్యావలంటీర్ నియామకం ఎలిగేడు : విద్యార్థులకు సేవ చేస్తూ.. పలు కార్యక్రమాలు చేపడుతున్నాడు మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంపెల్లి ప్రభాకర్. ఆయన వృత్తిరీత్యా పేయింటర్. ఆయన భార్య కాంపెల్లి విజయ ర్యాకల్‌దేవుపల్లి ఎంపీటీసీగా గెలుపొందారు. సొంతూరులో ప్రాథమికోన్నత పాఠశాలకు ఆర్వీఎం నిధులు కేటాయించి అదనపు తరగతి గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు. తన సొంత డబ్బులతో ఆ గదులకు పేయింటింగ్ వేయించాడు. గదుల్లో వివిధ దేశపటాలు, సందేశాత్మక చిత్రాలను వేశాడు. పాఠశాలలో పూలకుండీని ఏర్పాటు చేశాడు. గోడలపై నీతి సూక్తులను సైతం రాశాడు. వివిధ స్థాయిలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల నుంచి సహాయం తీసుకుని, దాతల సహాయ సహకారాలతో విద్యార్థిని, విద్యార్థులకు ఖరీదైన స్కూల్ యూనిఫాంలు, టైబెల్టులు, షూస్, లంచ్ బాక్సులను సైతం అందించాడు. తన సొంత ఖర్చులతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు వీలుగా ఆటో సౌకర్యం ఏర్పాటు చేశాడు. నర్సాపూర్‌లో ఆంగ్ల బోధనకు సైతం ఒక ప్రయివేటు టీచర్‌ను ఏర్పాటు చేసి వేతనం సైతం చెల్లిస్తున్నాడు. ర్యాకల్‌దేవుపల్లి ప్రాథమికోన్నత, రాములపల్లి ప్రాథమిక పాఠశాలల్లో దాదాపు రూ.60వేలతో తరగతి గదులకు రంగులు వేశాడు. తనవంతు సేవ చేయాలని.. ప్రయివేటు పాఠశాలల మోజులో పడి తమ పిల్లలను తల్లిదండ్రులు పంపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలు వెలవెలబోతున్న తరుణంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షించేలా ఏదైనా చేయాలని ఆలోచన మెదిలింది. దేవాలయాలకన్న మిన్నగా పాఠశాలలే. అందుకు వాటిని అందంగా తీర్చిదిద్దాలని నా ఆకాంక్ష. కాంపెల్లి ప్రభాకర్, పేయింటర్ -
పెయింటర్ ఆత్మహత్య
మర్రిపాలెంః కుటుంబ కలహాలతో ఓ పెయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరిపోసుకుని ప్రాణాలు బలి తీసుకున్నాడు. కంచరపాలెం పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం కప్పరాడ ప్రాంతం మాణిక్యాంబ కాలనీలో పొట్నూరు వినోద్(25) కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. భార్య లావణ్య, ఇద్దరు కుమారులు సంతానంగా ఉన్నారు. కొద్ది రోజులుగా వినోద్ కుటుంబంలో కలహాలు ఉన్నాయి. దీంతో మనస్తాపం చెందిన వినోద్ మంగళవారం ఫ్యాన్ హుక్కు ఉరిపోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఎసై ్స సోమేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని మతదేహం పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు చేశారు. -
రంగు వెలసిన జీవితం
– పెయింటర్ మారిన సర్పంచ్ సంజామల: ఆయన ఓ గ్రామానికి సర్పంచ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాల్సిన ప్రజాప్రతినిధి. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు. నేడు బతుకు జీవుడా అంటూ పెయింట్ బ్రష్ పట్టాడు. గ్రామంలో మిద్దెలకు రంగు వేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. సంజామల గ్రామ సర్పంచ్ దీనగాథ ఇది.. మిద్దె పెద్ద వెంకటసుబ్బన్న..గత పంచాయతీ ఎన్నికల్లో సంజామల సర్పంచ్‌గా ఎన్నియ్యాడు. ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరం పూర్తి కావడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని భావించి ఆ వర్గం నేతలు సర్పంచ్‌తో మెడికల్ లీవ్ పెట్టించారు. దీంతో ఉప సర్పంచ్‌గా ఉన్న గంగా ఈశ్వరయ్యకు సర్పంచ్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్ పదవికి సెలవు పెట్టి పెద్ద వెంకట సుబ్బన్న పెయింటింగ్ వేసే కూలీ పనికి వెళుతున్నాడు. గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఇళ్లకు పెయింటింగ్ వేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఆనందమ్మ ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఇదిలా ఇలా కనిపించాడు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న సర్పంచ్‌ను తెలుగు తముళ్లు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఒత్తిడి తెచ్చి మెడికల్ లీవ్ పెట్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పెయింటింగ్ వేస్తూ కిందపడి వ్యక్తి మృతి
దాబాగార్డెన్స్(విశాఖపట్నం): నగరంలోని దాబాగార్డెన్స్ ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్ హోటల్‌కు పెయింటింగ్ వేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. మృతుడు అమర్నాథ్(42) స్వస్థలం కృష్ణా జిల్లా కొండపల్లి. నెల రోజుల క్రితమే విశాఖపట్నం వచ్చినట్లు తెలిసింది. హోటల్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తోటి పెయింటర్లు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. -
ఎమ్ఎఫ్ హుస్సేన్‌కు గూగుల్ పట్టం
న్యూఢిల్లీ: భారతీయ పికాసో, అరుదైన చిత్రకారుడుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అరుదైన చిత్రకారుడు ఎమ్ ఎఫ్ హుస్సేన్ శతజయంతి ఇవ్వాళ.. సెలబ్రిటీ స్టేటస్ అరుదైన తొలి చిత్రకారుడుగా ఎంత పేరు సాధించాడో.. వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచాడు. స్వయంగా దేశ బహిష్కార శిక్ష విధించుకున్నా.. తుదకంటా.. భారతీయుడిగా ఉంటాననే మాటకు కట్టుబడ్డాడు..ఆయన శత జయంతికి గూగుల్ ఘనంగా నివాళులర్పించింది. భారతీయ లెజెండరీ చిత్రకాడు ఎమ్మ్ ఎఫ్ హుస్సేన్ మహరాష్ట్రలోని పండర్ పూర్ లో సెప్టెంబర్ 17న జన్మించారు. హుస్సేన్ తల్లి అతడు రెండేళ్ల బిడ్డగా ఉన్నప్పుడే మరణించింది. తండ్రి రెండో పెళ్లి చేసుకుని ఇండోర్ వెళ్లిపోయాడు. 1935లో హుస్సేన్ ముంబై సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. మొదట్లో సినిమా హోర్డింగ్ లు, పెయింటింగ్ చేసేవాడు. తర్వాత అంచలంచలుగా ఎదిగి.. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గాంచాడు. భారత దేశపు ప్రసిద్ద చిత్రకారుల సరసన చేరాడు. ఆయన వేసిన చిత్రాలకు ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. 1973 లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ అవార్డుతో సత్కరించింది. 1986లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. హైదరాబాద్ తో అనుబంధం ఎమ్ ఎఫ్ హుస్సేన్ కి హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా పోస్టర్లు చిత్రించే రోజుల్లో ఆయన హైదరాబాద్ లోనే ఉండేవారు. తర్వాత కాలంలో కూడా తరచూ హైదరాబాద్ సందర్శించే వారు. ఆయన పేరిట ఇప్పటికీ నగరంలో సినిమా ఘర్ ఉంది. ఆయన చేతి నుంచి జాలువారిన సినిమా పోస్టర్లు, ఆయన ఉపయోగించిన వస్తువులు ఈ ఇంట్లో భద్రపరిచారు. అరుదైన ఘనతలు భారత్ లో అత్యధిక పారితోషికం తీసుకున్న కళాకారుడిగా.. ఎమ్ ఎఫ్ హుస్సేన్ ఖ్యాతి గాంచాడు. అతని కుంచె నుంచి జాలువారిన ఎన్నో కళాఖండాలు కోట్ల రూపాయల ధర పలికాయి. ఆయన చిత్రాల్లో న్యూడ్ గ్నీన్ లీవ్స్ అండ్ బస్ట్ 106 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోయింది. భారతీయ కరెన్సీలో దీని విలువ 475 కోట్లు. ఇప్పటికీ ఇది ఒక రికార్డు. సినిమాలో... తొలి నాళ్లలో సినిమా పోస్టర్లు, బ్యానర్లు డిజైన్ చేసిన ఎమ్ ఎఫ్ హుస్సేన్.. తర్వాత సినిమా రంగాన్ని వదిలేశారు. అయితే చిత్రకారుడిగా ప్రసిద్ది గాంచిన తర్వాత బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, టబులతో సినిమాలు నిర్మించారు. మాధురీ దీక్షిత్ తో చేసిన గజగామిని, టబుతో నిర్మించిన మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. వివాదాలు.. అరుదైన చిత్రకారుడుగా.. సెలబ్రిటీ స్టేటస్ అందుకున్న ఎమ్ ఎఫ్ హుస్సేన్ జీవితంలో వివాదాలు కూడా చాలా నే ఉన్నాయి. 1990 ప్రాంతంలో ఆయనపై వివాదాల తుఫాన్ రేగింది. హిందూ దేవతా చిత్రాలను అర్థ నగ్నంగా, అసభ్యంగా చిత్రించాడని ఆభియోగాలు నమోదయ్యాయి. 1998లో భజరంగ్ దళ్ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఒక వర్గం మనోభావాలు గాయపడ్డాయన్న ఆరోపణలపై హరిద్వార్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయన ఆస్తులను జప్తు చేసి.. బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో హుస్సేన్ తనకు తాను దేశ బహిష్కరణ శిక్ష విధించుకున్నాడు. ఖతార్ దేశం హుస్సేన్ కు పౌర సత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఖతార్ ఆఫర్ సున్నితంగా తిరస్కరించిన హుస్సేన్ తాను ఎప్పటికీ భారతీయుడినే అని..తన జన్మభూమి భారత్ అని ప్రకటించాడు. చివరికి 2011 జూన్ 9న లండన్ లో గుండెపోటుతో పరాయిగడ్డపై తుది స్వాస విడిచాడు. -
ఉపాధి దొరకలేదని పెయింటర్ ఆత్మహత్య
అనంతపురం(గుత్తి): అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉప్పరవీధిలో ఓ పెయింటర్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెయింటింగ్ పనులు లేకపోవటం, ఉపాధి దొరక్కపోవటంతో కలత చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
-
సెక్రటేరియట్లో పెయింటర్‌కి గాయాలు
హైదరాబాద్: సెక్రటేరియట్‌లోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం ఉన్న ఎల్ బ్లాక్‌లో జరుగుతున్న మరమ్మతుల్లో గురువారం చిన్న అపశ్రుతి చోటు చేసుకుంది. ఎల్ బ్లాక్‌లో రంగులు వేస్తున్న పెయింటర్ ముఖేశ్ ప్రమాదవశాత్తు జారీ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానిక సిబ్బంది వెంటనే స్పందించి సెక్రటేరియట్‌లోని వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం ముఖేశ్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అతడికి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. -
సోదరిని ప్రేమించాడని కడతేర్చాడు
మూడు రోజుల తర్వాత వెలుగులోకి నిందితులు ప్లస్ ఒన్ విద్యార్థులు తిరువళ్లూరు: తన సోదరిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడనే కోపంతో ఓ పెయింటర్‌ను మిత్రుడితో కలసి కడతేర్చిన ఘటన తిరువళ్లూరు జిల్లాలో సోమవారం వెలుగుచూసింది. హత్య జరిగిన మూడు రోజల తర్వాత తాము చేసిన నేరాన్ని పోలీసుల దృష్టికి నింధితులు తీసుకువెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బన్రూటికి చెందిన గురునాథన్(19) నెశపాక్కంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్లస్ టూ విద్యార్థిని మీద మనస్సు పడ్డాడు. ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. దీన్ని ఆ విద్యార్థిని సోదరుడు ప్రభాకరన్(17) గుర్తించాడు. తన సోదరి వెంట పడటం మానుకోవాలని పలుమార్లు గురునాథన్‌ను హెచ్చరించినా ఫలితం కని పించలేదు. ఆగ్రహించిన ప్రభాకరన్ తన స్నేహితులతో కలసి గురునాథన్‌ను కడతేర్చేందుకు పథకం వేశాడు. శుక్రవారం తన మిత్రుడు ఉదయ్(17), ప్లస్ ఒన్ విద్యార్థి విజయకుమార్(18), తొమ్మిదో తరగతి విద్యార్థి కార్తీ(15)లతో కలసి గురునాథన్‌ను కొలపాక్కంకు తీసుకెళ్లారు. అక్కడి ఇటుక బట్టీల వద్ద గురునాథన్‌ను కడతేర్చి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. సోమవారం ప్రభాకరన్, ఉదయ్ ఎంజీఆర్ నగర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. తాము హత్య చేసినట్టు పోలీసు దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహం ఫలాన చోట ఉందని చెప్పారు. ఘటనా ప్రదేశం మాంగాడు స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మాంగాడు పోలీసులు ఉదయ్, ప్రభాకరన్‌లను అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. విజయకుమార్, కార్తీక్‌లను స్కూలుకు వెళ్లి మరీ తరగతి గదిలోనే అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏది అందం..? ఏది వికారం..?
అతను ఓ చిత్రకారుడు. అత నికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడు పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివ రాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. - యామిజాల జగదీశ్ -
ఈ వింత సౌందర్యం ఎక్కడిదో!
పికాసో అనే సుప్రసిద్ధ చిత్రకారుడు సముద్రతీరాన నుంచొని తైలవర్ణ చిత్రం తయారు చేస్తున్నాడు.సముద్రతీరానికి వాహ్యాళికై వచ్చే ప్రేమికులకు రోజా పుష్పాలమ్ముకునే ఒక తోటమాలి, పికాసో వేస్తున్న చిత్రాన్ని తిలకిస్తున్నాడు. కానీ ఆ చిత్రం అంతరార్థం ఏమిటో అతడికి అంతుబట్టలేదు. పికాసో తన చిత్రాన్ని పూర్తి చేసి దానికి తుది మెరుగులు దిద్దుతూ, యథాలాపంగా దాన్నొకసారి, ఒక్క అడుగు ఇవతలికి వేసి చూశాడు. ఇది తాను వేసిన చిత్రమేనా? అని ఎందుకో అనుమానం కలిగి ఆ చిత్రాన్ని మరింత పరీక్షగా చూశాడు అతడికే ఓ రకమైన సంభ్రమానందాలు కలిగినై. మరెవరో వేశారన్నట్టుంది కానీ, తాను వేసినట్లు కనిపించలేదు. నిజమైన కళాకారుడు, కవి ఇలాంటి అనుభూతినే పొందుతారు. చిత్రాన్ని ఎవరో తన చేతులతో గీయించినట్లు కనిపిస్తుందే కానీ, తానే స్వయంగా చిత్రించినట్లు కనిపించదు.తోటమాలి పికాసోను సమీపించి - ‘‘అయ్యా! దీనిని మీరు చిత్రిస్తున్నప్పుడు చూస్తూ ఉండిపోయాను. మీరు మీ పనిలో పూర్తిగా లీనమై ఉన్న సమయంలో మిమ్మల్ని పలకరించడం ఇష్టం లేక ఊరుకున్నాను. నేను అడుగుదామనుకున్న ప్రశ్న ఏమిటంటే ఈ తైలవర్ణ చిత్రం అంతరార్థమేమిటి?’’ అన్నాడు. పికాసో అతడి వంకకు తిరిగి ‘‘నా చిత్రానికి అర్థమేమిటని అడుగుతున్నావు. మరి నిన్ను, నీ బుట్టలోని ఆ చక్కని రోజా పుష్పాలకు అర్థమేమిటని అడిగితే నువ్వేమి చెప్తావు?’’ అన్నాడు పికాసో. ‘‘ఈ సౌందర్యమెక్కడిదో, ఏ లోకం నుండి దిగి వచ్చిందోనని ఆశ్చర్యపోతుంటాను. ఏళ్ల తరబడి ఈ ప్రశ్న నన్ను నేను వేసుకుంటూనే ఉన్నాను. వీటి సౌందర్యం వర్ణనాతీతమని నాకు తెలుసు. కానీ ఇది ఏమిటో, ఎక్కడిదో నాకు తెలియదు’’ అని గద్గద స్వరంతో అన్నాడు తోటమాలి. ‘‘నా పరిస్థితి కూడా అంతే బాబూ’’ అన్నాడు పికాసో. - నీలంరాజు లక్ష్మీప్రసాద్ ‘చరిత్రలో ఈ పేరు మిగిలేనా’ పుస్తకం నుంచి. -
విశ్వగీతాకారుడు
అక్టోబర్ 25న చిత్రకారుడు పికాసో (1881-1973) జయంతి సత్వం: ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్ అవుతావు. సన్యాసివైతే పోప్ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను’. తన కొడుకు చాలా పెద్దపేరున్నవాడు అవుతాడని సర్రియలిజంగా చెప్పదలిచిందేమో, పాబ్లోకు డోనా ఇలా నామకరణం చేసింది: పాబ్లితో డీగో జోస్ శాంటియాగో ఫ్రాన్సిస్కో డి పాలా జువాన్ నెపోమ్యూసినో క్రిస్టీస్ క్రిస్పియానో డి లాస్ రెమెడియోస్ సిప్రియానో డి ల శాంటిసియా ట్రినిడాడ్ రూయిజ్ బ్లాస్కో వై పికాసో లోపెజ్. పూర్వీకులు, బంధుమిత్రులు, క్రైస్తవ సన్యాసులు అందరినీ తన పేరులో కలుపుకున్న పికాసో- మాటలు రాకముందే బొమ్మలు గీయడం మొదలుపెట్టాడు. తండ్రి బ్లాస్కోనే తొలిగురువు. బ్లాస్కో పావురాల్ని పెంచేవాడు. వాటిని చూస్తూ కుమారుణ్ని గీయమనేవాడు. స్పెయిన్ సాంస్కృతిక ఉత్సాహంలో భాగమైన గుర్రాల్ని, బుల్‌ఫైట్ దృశ్యాల్ని కొడుక్కు చూపించేవాడు. ఇవన్నీ పికాసో భావి జీవితాన్ని ప్రభావితం చేశాయి. అలాగే తనతో ఆడిపాడిన చెల్లెలి మరణం కూడా! అందుకే దేవుడు దయ్యంగా కనబడటం మొదలైంది. ‘మనం ఏది చిత్రించాలి? ముఖం మీద కనిపిస్తూ ఉన్నదా? ముఖం లోపల ఉన్నదా? ముఖం వెనుక ఉన్నదా?’ పికాసో కౌమారంలోకి అడుగిడగానే జన్మదినకానుకగా, వాళ్ల నాన్న తాను వాడే కుంచెలు, రంగులు, పేలెట్ బహుమతిగా ఇచ్చాడు. బ్లాస్కో మళ్లీ బొమ్మల జోలికి పోలేదు. ‘నా చిన్నప్పుడు మా అమ్మ ఓ మాట అంటుండేది. నువ్వు సైనికుడివైతే జనరల్‌వు అవుతావు. సన్యాసివైతే పోప్ అవుతావు అని. కానీ నేను చిత్రకారుణ్నయి పికాసోనయ్యాను,’ అన్నాడు సగర్వంగా. ‘శాస్త్రం - దాతృత్వం’, ‘తొలి ప్రార్థన’, ‘ముసలి గిటారిస్టు’, ‘పైప్‌తో పిల్లాడు’, ‘అవెన్‌యాన్ వేశ్యలు’ లాంటి ఎన్నో చిత్రాలు గీశాడు. అంతర్యుద్ధ సమయంలో స్పెయిన్ వినాశనాన్ని ప్రతిబింబిస్తూ ‘గుయెర్నికా’ (1937) వేశాడు. ఫ్రాంకో, జర్మన్ మిత్రపక్షాలు గుయెర్నికా అనే పట్టణంపై మూడు గంటలపాటు జరిగిన బాంబులదాడిలో సుమారు రెండువేల మంది చనిపోయారు. ఎడ్లను సైనికులుగా దౌర్జన్యానికీ, గుర్రాలను ప్రజానీకంగా దుఃఖానికీ ప్రతీకలుగా 7.8 మీటర్ల వెడల్పు, 3.5 మీటర్ల ఎత్తుతో నలుపు, తెలుపుల్లో వేసిన ఈ పెయింటింగు- ఇరవయ్యవ శతాబ్దపు అత్యున్నత చిత్ర సృష్టిగా ప్రశంసలందుకుంది. అయితే, ఈ ప్రతీకలు విమర్శకులు ఊహించినవే తప్ప పికాసో నిర్ధారించలేదు. ఎద్దు ఎద్దే, గుర్రం గుర్రమే... కళను కళగానే చూడమన్నాడు. పికాసో చిత్రకళను సాధారణంగా ఏడు దశలుగా చెబుతారు. బ్లూ పీరియడ్, రోజ్ పీరియడ్, న్యూడ్, క్యూబిజం, ఆఫ్రికన్ ప్రభావం, క్లాసికల్, సర్రియలిజం. నీలిదశలోని చిత్రాలన్నీ నీలిరంగు నేపథ్యాన్ని కలిగివుంటాయి. ఉదాసీనతకూ, విచారానికీ ప్రతీకగావుండే నీలిరంగులోంచి తర్వాత గులాబీ దశలోకి మరలాడు. ఇదంతా ఉత్సాహపూరిత కాలం. అటుపై తానే మూలస్తంభంగా నిలిచి, ప్రచారంలోకి తెచ్చిన సరికొత్తశైలి క్యూబిజంలోకి వచ్చాడు. ఆఫ్రికన్ కళను అనాగరికంగా భావిస్తున్న రోజుల్లో వారి కళాత్మకతను అర్థం చేసుకుని ఆ ప్రభావంలో గీశాడు. ‘అల్ప కళాకారులు అరువు తెచ్చుకుంటారు; గొప్ప కళాకారులు దొంగిలిస్తారు,’ అని గడుసుగా కూడా ఒక మారు చెప్పుకున్నాడు. ఆయన చిత్రకళలో ఏడు దశలున్నట్టే, ఆయన జీవితంలోనూ ఏడుగురు స్త్రీలున్నారు. పడతులపట్ల తన మోహాన్ని పికాసో ఏనాడూ దాచుకోలేదు. ఫెర్నాండో ఓలివేర్, ఎవా గూల్, మేరీ వాల్టర్, డోరా మార్, జాక్వెలిన్ రోకో... ‘నేను ఎవరితో ఉండాలీ అనే అంశాన్ని తేల్చటం కోసం ఇద్దరు ఆడవాళ్లు కొట్టుకోవటం నా జీవితంలో అత్యంత మధురమైన సందర్భం’ అని చమత్కరించాడు. కొన్ని గాఢమైన క్షణాలు, తీవ్రమైన కౌగిళ్ల తర్వాత ఆ ప్రేమలన్నీ ఎడబాటుకే దారితీసేవి. వారి ప్రేమకు శాశ్వతత్వం లేకపోయినా, తన చిత్రాల ద్వారా ప్రియురాళ్లకు శాశ్వతత్వం కల్పించాడు. గుయెర్నికాలో డోరా మార్ కనబడుతుంది. ఇంకా ఆయా దశల్లోని చిత్రాల్లో ఆయా కాలాల ప్రేయసులు దర్శనమిస్తారు. చిత్రకళలోనే కాదు, శిల్పంలో కూడా అసాధారణ ప్రతిభను చూపాడు పికాసో. కాగితంపైనే కాకుండా కుండలు, కలప, చర్మం, పింగాణిని కూడా మాధ్యమంగా ఉపయోగించుకున్నాడు. శాంతికి చిహ్నంగా ప్రపంచం గుర్తిస్తున్నది పికాసో పావురాన్నే! ఆయన చిత్రాల్లో అర్థం కానివే ఎక్కువ. ‘సమకాలీన ప్రపంచంలో ఏదీ అర్థం కాదు, మరి అర్థమయ్యే పెయింటింగు నేనెందుకు వెయ్యాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. అయినా ఒక యుగపురుషుని కీర్తి తన జీవితకాలంలోనే వచ్చిపడింది. కోట్లకు పెయింటింగ్స్ అమ్ముడుకావడం మొదలైంది. వేలంవెర్రిగా జనం అభిమానిస్తుండటం చూసి, నా చిత్రాల్లో మీరు ఊహించుకుంటున్నదేదీ లేదు, అని కూడా చిరాకుపడ్డాడోసారి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన పికాసో నిరాడంబరంగా బతికాడు. సాదాసీదాగా నిక్కరుమీదే పనిచేసుకునేవాడు. సందర్శకులనూ అలాగే కలిసేవాడు. స్పెయిన్‌లో పుట్టి, ఫ్రాన్స్‌లో స్థిరపడిన పికాసో చిత్రకారుడికి పర్యాయపదంగా నిలిచాడు. ఆయనే అన్నట్టు, ‘కళ ఒక అబద్ధం. అయితే సత్యాన్వేషణలో అది మనకు సాయం అందిస్తుంది.’ ‘ఆత్మమీద పేరుకుపోయిన రోజువారీ జీవితపు దుమ్మూ, ధూళిని పరిశుభ్రం చేస్తుంది’. - ఆర్.ఆర్. -
పాపం... ‘పోలీస్’
సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకంతో కార్మికుడి మృతి రాజమండ్రి పేపరు మిల్లులో ఘటన 25 లక్షల పరిహారం చెల్లించాలి: జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ రూ.13 లక్షలు, భార్యకు ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం హామీ రాజమండ్రి: పేపర్ మిల్లు సేఫ్టీ ఆఫీసర్ నిర్వాకం వల్ల ఓ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఎదురపల్లి గ్రామానికి చెందిన మైనపల్లి పోలీస్ (25) ఇంటర్ నేషనల్ పేపర్ మిల్లులో నాలుగు నెలలుగా కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పేపర్ మిల్లు గోడౌన్‌కు 30 అడుగుల ఎత్తులో తాడుకు వేలాడుతూ సున్నం వేస్తుండగా, సేఫ్టీ ఆఫీసర్ రెడ్డి తాడును పట్టుకొని లాగడంతో మైనపల్లి పోలీస్ జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఏడాది క్రితం పెళ్లయింది. గర్భిణి అయిన భార్య పుట్టింట్లో ఉంటోంది. పోలీస్ మృతితో పేపర్‌మిల్లులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, కార్మిక సంఘం నాయకుడు టి.కె. విశ్వేశ్వరరెడ్డి, సీపీఎం నాయకులు టి.అరుణ్ తదితరులు బైఠాయించి బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, సంఘటనకు కారణమైన రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని, అతడి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక దశలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ హెచ్ఆర్ శ్రీనివాసరావు, నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. జక్కంపూడి విజయలక్ష్మి రూ.25 లక్షలు నష్టపరిహారం డిమాండ్ చేయగా, యాజమాన్యం రూ.13 లక్షలు, మృతుడి భార్యకు పేపర్‌మిల్లు కేంటీన్లో ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మికులు, ఉద్యోగులు తదితర నాయకులు ఆందోళన విరమించారు. ఈ ఆందోళనలో పేపర్ మిల్లు కార్మిక నాయకులు బయ్యే జోసఫ్ రాజు, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అంతరంగాల యుద్ధచిత్రం
కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్ 90వ ఏట తాజాగా చిత్రించిన ఒక మహాకుడ్య చిత్రం సాలార్జంగ్ మ్యూజియంలో కొలువై ఉంది. పెయింటింగ్ ఒక్కటే! ఫలకాలు 16. మడతలు 8. ఎత్తు 9 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ‘వార్స్ ఆఫ్ ద రెలిక్స్’ అనే ఈ తెలుపు-నలుపుల చిత్రం ప్రత్యేకత ఏమిటి? పికాసో ‘గెర్నికా’ ప్రత్యక్ష యుద్ధాన్ని కళ్లకు కడితే, కేజీ కుడ్యచిత్రం యుగయుగాల మానవ మస్తిష్కాల అంతరంగ యుద్ధాలను ఆవిష్కరించింది. జగమెరిగిన చిత్రకారుడు ఆయన. విద్యార్థి దశలో గాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ చదువు తర్వాత కోల్‌కతా శాంతినికేతన్లో చేరి చిత్రకారుడిగా ఎదిగారు. మన కళా సంస్కృతులపై పలు పుస్తకాలు రాసి, వాటి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనాపాటి కె.జి.సుబ్రహ్మణ్యన్. కేరళలోని కలపాతిలో పుట్టిన ఆయన పూర్తి పేరు కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్. ఆధునిక చిత్రకళకు సంబంధించి భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడాయన. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్‌తో సత్కరించింది. తొంభయ్యేళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో కళా సృజన సాగిస్తున్న సుబ్రహ్మణ్యన్ సాలార్జంగ్ మ్యూజియంలో తన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో ముచ్చట్లు ఆయన మాటల్లోనే... - కె.జి. సుబ్రహ్మణ్యన్ ప్రసిద్ధ చిత్రకారుడు నేను హైదరాబాద్ వచ్చింది తక్కువసార్లే. అయినా, హైదరాబాద్ అంటే ఇష్టం. ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, అంతే గ్రీనరీ కనిపిస్తుంది. వెరీ నైస్ థింగ్. నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ మరో అందం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కోసం ప్లానింగ్ జరుగుతున్నప్పుడు మెంబర్‌గా ఆ మీటింగ్స్ లో పాల్గొన్నా. సెంటర్ యూనిట్‌ను పెట్టేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్ రెండూ పరిశీలనకు వచ్చాయి. అహ్మదాబాద్ కంటే హైదరాబాదే దేశానికి సెంటర్ పాయింట్ అని, ఆ ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్‌లోనే పెట్టించాలని చాలా తపనపడ్డా. కానీ అది కాస్తా అహ్మదాబాద్‌కి తరలిపోయింది. శిష్యులు కాదు భక్తులు... ఆర్ట్‌కి సంబంధించి హైదరాబాద్ చాలా యాక్టివ్. నేను బరోడాలో ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఎల్జీ గుప్తా ఇక్కడి నుంచి... లక్ష్మా గౌడ్, డీఎల్ఎన్ రెడ్డి, వైకుంఠం వంటి కొందరు యంగ్ ఆర్టిస్టులను అక్కడకు పంపించారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లు నాకు శిష్యులు కాదు, భక్తులు. ఇక్కడ జగదీశ్ మిట్టల్ లోకల్ ఆర్ట్ కలెక్షన్ ఏ మ్యూజియానికీ తీసిపోదు. వెలుగులోకి రాని ఎన్నో కళలకు కాణాచి హైదరాబాద్. ఇదంతా ప్రపంచానికి తెలియాలంటే చాలా పని జరగాల్సి ఉంది. అయితే, దీనికి ప్రభుత్వాన్ని నిందించలేం. ప్రభుత్వం ఇతర పనులతో చాలా బిజీగా ఉంటుంది. దీనివల్ల ఆర్ట్ బ్యాక్ సీట్లోకి వెళ్లిపోతుంది. దీని గురించి పట్టించుకోమని ప్రభుత్వాన్ని అడిగితే, తప్పకుండా చేద్దామంటూ ఒక అకాడమీ పెట్టి చేతులు దులుపుకుంది. హైదరాబాద్‌లో డబ్బున్న ఆసాములు లేరా? సంస్కృతిని పరిరక్షించే బృహత్ కార్యాన్ని వాళ్లు తమ భుజాన వేసుకోవచ్చు కదా! వయసుతో పనిలేదు నాకు తొంభై ఏళ్లు నిండాయి. ఇప్పటికీ బొమ్మలు గీస్తా. నా పని వయసుకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఆర్ట్‌కి వార్ధక్యం లేదు. విశ్వజనీనం ఒక మనిషికి తోటి మనుషులతో, పరిసరాలతో గల అర్థవంతమైన అనుబంధమే నా దృష్టిలో అసలైన ఆర్ట్. దానికి ఎలాంటి పరిమితులూ ఉండవు. అది విశ్వజనీనం. అప్‌కమింగ్ ఆర్టిస్టులు ముందుతరం వాళ్ల అనుభవాలను చదవాలి, సహవాసం చేయాలి, నేర్చుకోవాలనే తపన ఉంటే పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. మన విద్యావిధానం అస్తిత్వమే మారాలి మన ప్రాథమిక విద్యావిధానం ఏమాత్రం పసలేనిది. అది మనుషులను కాదు, కార్మికులను తయారు చేస్తోంది. ఈ చదువు ఆలోచన ఉన్న మనిషిని కాదు, చెప్పిన పని చేసే మరబొమ్మలను తయారు చేస్తోంది. అందుకే మన విద్యా విధానం అస్తిత్వమే మారాలి. అందులో సృజనకు తావుండాలి. - సరస్వతి రమ ఫొటోలు: సృజన్ పున్నా -
ఆత్మహత్యకు యత్నించిన పెయింటర్
-
మ్యాన్ హోల్ టు యమలోకం
రోడ్డు మీద మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి.. ప్రమాదకరంగా వదిలేయడం మనం చాలా చూశాం.. వదిలేశాం.. అయితే, బెంగళూరుకు చెందిన చిత్రకారుడు బాదల్ నజుండస్వామి మాత్రం అలా చూసి, వదిలేయలేదు. మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు ఓ వినూత్న యత్నానికి పూనుకున్నాడు. శుక్రవారం బెంగళూరులో మూత తెరిచి ఉంచేసిన .. ఓ మ్యాన్ హోల్‌ను యముడి నోరుగా చిత్రీకరించాడు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే.. ఈ మ్యాన్ హోల్ నుంచి యముడు నేరుగా హెల్(నరకం)కు తీసుకెళ్లిపోతాడన్నట్లు బొమ్మ వేశాడు. -
సత్వం: సృష్టికర్తల సృష్టికర్త
ఏప్రిల్ 29న చిత్రకారుడు రవివర్మ జయంతి దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించినట్టయితే, మరి ఆ దేవుణ్ని ఎవరు సృష్టించినట్టు? నిరాకారుడైన దేవుడిని ఎలా పోల్చుకోవాలి? భావవాద, భౌతికవాదాల మధ్య జరిగే చర్చల్లో పుట్టే ప్రశ్నలు సాధారణంగా ఇలా ఉంటాయి. దేవుడి ‘ఉనికి’ని ఒప్పుకుంటే గనక, ‘నిరాకారుడైన’ దేవుడికి రూపం ఇవ్వడమనేది మనిషి సృజనశక్తితో సంభవించింది. ఇంకా చెప్పాలంటే, రవివర్మలాంటివాళ్లవల్లే సాధ్యమైంది. ఊహలకు ఒక సాధికార రూపమిచ్చాడు రవివర్మ. దేవుళ్లకు ఒక ఫ్రేమ్ కట్టాడు. ఇక, సరస్వతి అంటే ప్రశాంత చిత్తంతో వీణను మీటుతూ కూర్చున్న నాలుగు చేతుల తల్లే! లక్ష్మి అంటే, ఏనుగులు తొండమెత్తి కొలుస్తుండగా అన్నే చేతులతో తామరపువ్వుమీద నిలబడిన అమ్మే! రాజా రవివర్మ (1848-1906) ఇప్పటి కేరళలో భాగంగావున్న ట్రావెన్కోర్ రాజకుటుంబంలో జన్మించాడు. తను చూసిన పశువులు, రోజువారీ జీవిత వ్యవహారాల్ని పసితనంలో గోడల మీద చిత్రించేవాడు. పాత గాథల్నీ, వాటిల్లో ఇమిడివున్న అంతరార్థాన్నీ ఆకళింపుచేసుకుని తన చిత్రాలకు ముడిసరుకును కూర్చుకునేవాడు. నల- దమయంతి, శంతను-మత్య్యగంధ, శంతను-గంగ, రాధామాధవులు, కంస మాయ, సుభద్రార్జునుల ప్రణయం, ద్రౌపదీ వస్త్రాపహరణం, హరిశ్చంద్రుడి జీవితంలోని విషాదఘట్టం, మేనక -విశ్వామిత్ర, శ్రీకృష్ణ జననం, కృష్ణ రాయబారం, సీతా స్వయంవరం, శ్రీరామ పట్టాభిషేకం, శివపార్వతులతో వినాయకుడు, సింహం పిల్లతో భరతుడు, కీచకుడు సైరంధ్రి, జటాయు వధ, శకుంతల, హంస రాయబారం; ఇలా రామాయణ, మహాభారత ఇతిహాసాలూ, కాళిదాసు కావ్యాలూ ఆయనకు కుంచెనిండా పని కల్పించాయి. పాత్రని మలిచిన మృదుత్వం, ముఖంలో పలికే భావం, సున్నిత శృంగారం, స్కిన్ టోన్, వస్త్రాలు అమర్చిన తీరు, అవయవాల పొందిక, ఆభరణాల సొగసు, రంగుల మేళవింపు, వెలుతురు జాడలు, డీటెయిల్స్, చిత్రాన్ని చూడటానికి కావాల్సిన మూడ్... అన్నీ కుదిరాయి కాబట్టే, భారతీయ చిత్రకళకు రవివర్మ ఆద్యుడు కాగలిగాడు. భారతీయ రంగస్థలం, అటుపైన సినిమా రంగం కూడా ఆయన చిత్రాలు ఇచ్చిన ప్రేరణతో తమ పాత్రల్ని మలుచుకున్నాయి. కొత్త అనుభవం, కొత్త అనుభూతుల కోసం రవివర్మ దేశం మొత్తాన్నీ చుట్టివచ్చాడు. భిన్న నేపథ్యాల్లోంచి వచ్చిన ఎందరో స్త్రీలను ప్రత్యేకంగా గీశాడు. పిల్లాడికి పాలిస్తున్న తల్లి, భర్తకోసం ఎదురుచూస్తున్న భార్య, దీర్ఘాలోచనలో ఉన్న మహిళ, అప్పుడే స్నానంచేసిన మగువ, ఏకాగ్రతతో చదువుతున్న విద్యార్థి, సంగీత కారులు, భిక్షగాళ్ల కుటుంబం... మనదేశం వరకూ లైవ్ మోడల్స్‌ను వాడటం కూడా ఆయనతోనే ప్రారంభమైంది. అందమైన అమ్మాయికి కొలమానం కూడా ఆయన సెట్‌చేశాడు. రవివర్మ చిత్రంలా ఉందనడమే ఒక విశేషణం కదా! బ్రిటిష్‌వాళ్లు కూడా ఆయనతో తమ పొర్ట్రెయిట్స్ గీయించుకునేవారు. చిత్రాలు గీయించుకోవాలన్న విజ్ఞాపనలు ఎక్కువవడంతో ఒక సమయంలో ఆయనకోసం వాళ్ల ఊరిలో కొత్త తపాలా శాఖను ప్రారంభించాల్సివచ్చింది! చిత్రంలో స్వేచ్ఛకూ, వ్యక్తీకరణకూ పెద్దపీట వేసే ఆధునిక విమర్శకులు ‘క్యాలెండర్ ఆర్ట్’ అనీ, ‘ఎకాడమిక్ స్టైల్’ అనీ రవివర్మను నిరసిస్తారు. అదే సమయంలో, ఆయన గీసిన గరిష్ట హద్దును దాటినవాళ్లు ఇంతదాకా లేరని ప్రశంసించేవాళ్లు కూడా ఉన్నారు. అయితే, భారతీయ సంప్రదాయానికి ఐరోపీయ టెక్నిక్‌ను అద్దిన అద్భుతమైన సంగమంగా మాత్రం ఆయన్ని అందరూ ఒప్పుకుంటారు. అందుకే ఆయన పాతవాళ్లలో కొత్తవాడు; కొత్తవాళ్లలో పాతవాడు. ఖరీదైన బెడ్రూముల గోడలు దాటిరాని స్వేచ్ఛాయుత పెయింటింగ్స్కంటే, మామూలు ఇళ్లల్లోకి కూడా వెళ్లగలిగిన రవివర్మ చిత్రాలు నిక్కమైన మన జాతీయ సంపద! -
ఆర్ట్ ప్రపంచాన్ని రక్షిస్తుంది!
- బోస్ కృష్ణమాచారి, చిత్రకారుడు ‘బినాలే’ అంటారు యూరోపియన్స్. ‘బైఏన్యువల్’ అంటారు అమెరికన్స్. ‘బినాలే’ ఒక మొక్కపేరు. విత్తిన రోజు నుంచి రెండేళ్లలోపు పుష్పించి ఫలించి అంతరిస్తుంది. అదేరోజున మళ్లీ మొలకెత్తడం ప్రారంభమవుతుంది. బినాలే అంటే రెండోళ్లకోసారి జరిగే కళల ఉత్సవం కూడా! ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 బినాలేలు సుప్రసిద్ధం. మన దేశంలో 2012లో కేరళలోని సముద్రతీర పట్టణం కోచిలో తొలి బినాలే ప్రారంభమై మూడు నెలలపాటు వైభవోజ్వలంగా జరిగింది. ‘కోచి ముజ్రిస్ బినాలే’ (కెఎంబి)గా విఖ్యాతమైంది. ఈ ‘కెఎంబి’ ఆర్ట్ డెరైక్టర్ బోస్ కృష్ణమాచారి ఇటీవల నగరానికి విచ్చేశారు. భారతదేశానికి తొలిసారిగా బినాలేను విజయవంతంగా పరిచయం చేసిన బోస్ కృష్ణమాచారితో ఇంటర్వ్యూ సారాంశం... మీ గురించి చెప్పండి... మాది కార్పెంటర్ కుటుంబం. చిన్నప్పటి నుంచి ‘రేఖ’ తెలుసు. చెక్కడం తెలుసు. డాక్టర్‌ను కావాలనుకున్నాను. టీనేజ్‌లో తీవ్రమైన జబ్బు చేసింది. కుటుంబం ఆర్థికంగా చితికి పోయింది. చచ్చిబతికిన మనిషిని కదా, కొత్తగా జీవించాలనుకున్నాను. ముంబై జేజే స్కూల్లో చేరాను. నైరూప్య చిత్రాలు, రూప చిత్రాలు, శిల్పాలు, ఇన్స్టలేషన్స్, భవనాల కళాకృతులు, డిజిటల్ ఇమేజెస్, డాక్యుమెంటరీలు... ఇష్టం వచ్చిన పని చేస్తుంటాను. ముంబైలో నివసిస్తున్నాను. ప్రపంచంలో ముఖ్యమైన మ్యూజియంలు, గ్యాలరీలు నా ఆర్ట్‌ను ఆదరిస్తున్నాయి. ఉపన్యాసాలకు ఆహ్వానిస్తుంటాయి. మీరు ఆర్ట్ కలెక్టర్ కూడా కదా... రియల్ ఎస్టేట్, బంగారం, షేర్లలో ఒడిదుడుకులను ఎవరూ అంచనా వేయలేరు. తెలివైన వారు ఆర్ట్‌లో పెట్టుబడి పెట్టి (ఆర్ట్ కలెక్టర్స్‌గా) బాగానే సంపాదిస్తున్నారు. సంపాదనలో అదొక ఉత్తమాభిరుచికి సంబంధించిన మార్గం. నా ధోరణి వేరు. నేను రెండు కారణాలతో కొంటాను. ఎదిగివస్తోన్న ఆర్టిస్ట్‌లను ప్రోత్సహించేందుకు కొంటాను. నాకు నచ్చిన ఆర్ట్ వర్క్‌ను కొంటాను. కానీ, అమ్మను. అవి అలానే ఉంటాయి, మంచి జ్ఞాపకాలను ఇస్తూ! ‘బినాలే’కు ముందూ వెనుకా చెప్పండి... మహారాష్ట్ర కల్చరల్ మినిస్టర్ నన్ను, కొందరు స్నేహితులను పిలిచి రాష్ట్రంలో విద్యావ్యాప్తికి కళాకారుల సహకారాన్ని కోరారు. నా మిత్రుల్లో కొందరు హిందీ సినీనటుల కంటే ఎక్కువగానే సంపాదిస్తారు. వారి పద్ధతుల్లో వారు సమాజానికి తిరిగి ఇస్తూనే ఉంటారు. వాస్తవానికి బిలియనీర్ కంటే పేద కళాకారుడే సమాజానికి ఎక్కువగా సహాయం చేస్తాడు. కళ ద్వారా కళాకారుడికి ఆదరణ, సమాజవికాసం, ఆర్ధికాభివృద్ధి పొందేందుకు బినాలేలు మార్గమని సూచించాం. 1895లో వెనిస్లో ప్రారంభమైన బినాలే దాదాపు 15 దేశాలను కళాత్మకంగా మార్చివేయడం గురించి వివరించాం. ఆ ఆలోచన కోచిలో బినాలేగా ఆచరణకు వచ్చింది. మిత్రులం ప్రపంచ దేశాల బినాలే నిర్వాహకులను, మ్యూజియం క్యూరేటర్లను సంప్రదించాం. స్థానిక, జిల్లా, రాష్ట్ర,కేంద్ర సాంస్కృతిక విభాగాలను కదిలించాం. ‘సెలబ్రిటీలతో విందుకు ఇరవై ఐదువేలరూపాయలు’ ద్వారా కొన్ని లక్షల ఆదాయాన్ని సమకూర్చాం. టాటా, జిందాల్, గూగుల్‌వంటి సంస్థల ద్వారా వారికీ లాభదాయకమైన రీతిలో నిధులు పొందాం. కోచిలోని ప్రతి వ్యక్తీ తన వంతు సేవలు అందించారు. ఫలితంగా భారతదేశంలో తొలి బినాలే సాధ్యమైంది. 23 దేశాలనుంచి 89 మంది ఆర్టిస్ట్‌లు వచ్చారు. చిత్రకారులు, శిల్పులు, ఇన్స్టలేటర్స్, ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ మేకర్స్ తమ కళారూపాలను ప్రదర్శించారు. నృత్యగీతాలు, నాటకాలతో సాయంకాలాలు ఆహ్లాదంగా మారాయి. కోచి కోట, ఎర్నాకుళం చుట్టుపక్కల 14 స్థలాలు సందర్శనీయాలయ్యాయి. 60 గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. రోజూ 500 మంది ఇతర రాష్ట్రాల, విదేశీ టూరిస్ట్‌లు వచ్చారు. మొత్తం సందర్శకులు నాలుగు లక్షల మంది. బినాలే ముందు కోచీ వేరు తర్వాత వేరు. డిసెంబర్ 2014లో రెండవ బినాలేకు ‘కోచీ’ ముస్తాబవుతోంది! ఆర్టిస్ట్‌లకు మీ సలహా... ఎవ్వర్నీ అనుకరించకండి. వర్క్- వర్క్-వర్క్! నిరాశకు లోనుకాకండి. ఆర్ట్‌ను మీరు రక్షిస్తే అది మిమ్ములను, సమాజాన్నీ రక్షిస్తుంది! -పున్నా కృష్ణమూర్తి