చూడగానే వావ్..అనిపిస్తున్న ఈ వర్ణరంజిత చిత్రాలు ఏ చిత్రకారుడి కుంచెలోంచి జాలువారినవో కాదు సుమా! డిజిటల్ కాన్వాస్‌పై కృత్రిమమేధ (ఏఐ)సృష్టించిన అద్భుతాలివి. దేన్నైనా సృష్టించగలగడం మనిషికి మాత్రమే ఉన్న ప్రత్యేకత అని మనం ఇప్పటివరకూ అనుకుంటున్నాం కదా! కృత్రిమ మేధపుణ్యమా అని ఈ సరిహద్దు కూడా చెరిగిపోతోందని ఈ ఫొటోలను చూస్తే అనిపించకమానదు. ఇవి ఓ పికాసో.. ఓ వాన్‌గో.. ఎం.ఎఫ్.హుస్సేన్‌ల కుంచె చేసిన మహిమలని అనిపిస్తోంది కదూ! కానీ, బొట్టో అనే ఓ కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్ గీసిన డిజిటల్ చిత్రాలివి.
ఈ మధ్యనే జరిగిన ఓ వేలంలో 6 ‘బొట్టో’బొమ్మలకు దాదాపు రూ. 9.76 కోట్లు వచ్చాయి. బొట్టో.. ప్రతివారం 350 వరకూ చిత్రాలు గీస్తే, వాటిని చూసి ఏవి బాగున్నాయో? ఏవి బాగాలేవో? చెబుతూ చిత్రకళాప్రియులు ఓటేస్తారు. ఒక్కో చిత్రానికి వచ్చిన ఓట్లు, కామెంట్ల ఆధారంగా బొట్టో తన కళకు మెరుగులు దిద్దుకుంటుందన్నమాట. బొట్టో చిత్రాలకు మీరూ ఓటేయొచ్చు. కాకపోతే ఈ వ్యవహారమంతా క్రిప్టో కరెన్సీతో కూడుకున్నది. వివరాలు https://botto.comలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment