Sandro Botticelli Is The Most Expensive Painting In Newyork Auction - Sakshi
Sakshi News home page

రూ.640 కోట్లు: ‘ఊపిరి’లో పెయింటింగ్‌ సీన్‌ గుర్తుందా.. 

Published Sat, Jan 30 2021 2:18 PM | Last Updated on Sat, Jan 30 2021 3:25 PM

Painting Highest Rate in Newyork Auction - Sakshi

న్యూయార్క్‌: అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ‘ఊపిరి’ సినిమా గుర్తుందా. ఆ సినిమాలో నాగార్జున ఒక పెయింటింగ్‌ను రూ.20 లక్షలకు కొనుగోలు చేస్తే నోరెళ్లబెట్టిన హీరో కార్తీ గుర్తున్నాడు కదా. ఇప్పుడు మీరు కూడా ఈ వార్త చదివితే అలాగే అవుతారు. ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక పాతకాలం నాటి పెయింటింగ్‌ వేలంలో పెడితే అత్యధిక రేటు పలికింది. ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన పెయింటింగ్‌గా నిలిచింది. వేలంలో ఆ పెయింటింగ్‌ అక్షరాల రూ.640 కోట్లు పలికింది. 

వ‌ంద‌ల ఏళ్ల నాటి ఇటలీకి చెందిన చిత్రకారుడు సాండ్రో బొటిసెల్లి ఓ పెయింటింగ్‌ వేశాడు. ఆ పెయింటింగ్‌ను ఇటీవల న్యూయార్క్‌లో వేలం వేశారు. ఆ పెయింటింగ్‌ ఏకంగా రూ.670 కోట్లకు (92.2 మిలియన్‌ డాలర్లు) అమ్ముడవడం విశేషం. ఇట‌లీకి చెందిన సాండ్రో క్రీ.శ‌.1440-1510 మధ్య జీవించాడు. ప్రఖ్యాత చిత్రకారుడిగా పేరుపొందాడు. ఆయన ఎన్నో రకాల పెయింటింగ్‌లు వేశారు. ఈ విష‌యాన్ని వేలం నిర్వాహకులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ వేలంలో సాండ్రో బొటిసెల్లి వేసిన ఎన్నో చిత్రాలు కూడా పెట్టగా.. అందులో ఈ పెయింటింగ్‌కే అత్యధిక ధర పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement