Former US President John Adams Private Letter To Teenage Bride Sold For Rs 32 Lakh - Sakshi
Sakshi News home page

John Adams Private Letter: అమెరికా మాజీ అధ్యక్షుడి లేఖ ..వేలంలో ఎంత పలికిందంటే..

Published Tue, Jul 4 2023 3:06 PM | Last Updated on Tue, Jul 4 2023 5:36 PM

Former US President Private Letter To Teenage Bride Sold For Rs 32 Lakh - Sakshi

యూఎస్‌ మాజీ అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ రాసిన లేఖ హాట్‌ టాపిక్‌గా మారింది. వేల ఏళ్ల నాటి లేఖ వేలంలో లక్ష్లల్లో అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అంతలా ఆకర్షించేంతగా ఆ లేఖలో ఏముంది. ఎవరికీ ఆడమ్స్‌ ఆ లేఖ రాశారు? 

వివరాల్లోకెళ్తే..అమెరికి రెండొవ అధ్యక్షుడు జాన్‌ ఆడమ్స్‌ సంతకంతో కూడిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది ఓ టీనేజ్‌ వధువు రాసిన లేఖ కావడంతో మరింత విశేషం సంతరించుకుంది. ఆయన ఆ వధ​వుని ఆశ్వీరదిస్తూ ఓ సన్నిహితుడి మాదిరిగా మంచి విషయాలు ఆమెకు ఆ లేఖలో బోధించారు. ఆ లేఖ రాసినప్పడూ ఆయన వయసు 89 ఏళ్లు. కాగా, ఆ వధువు వయసు 19 ఏళ్లు. ఆ లేఖను మాజీ అధ్యక్షుడు ఆడమ్స్‌  డిసెంబర్‌ 14, 1824లో రాశారు

ఇక ఆ లేఖలో నా స్నేహితుడు జడ్డిపీటర్స్‌తో వధువు 19 ఏళ్ల రాబిన్సన్‌ కొత్త సంబంధం ఏర్పరుచుకుంటున్నందుకు సంతోషిస్తున్నా. మీరిద్దరూ అన్ని కార్యక్రమాలను జయప్రదంగా కలిసి చేయాలి. అలాగే వధువుని ఉద్దేశిస్తూ నువ్వు ఏ మూలల నుంచి వచ్చావో వాటిని ఎప్పటికీ మరిచిపోకు అని రాశారు. ఆ లేఖ ఓ ఫ్రెండ్‌ షిప్‌ ఆల్బమ్‌లో ఉంది. అందులోనే ఆ యువ జంటకు సంబంధించిన జ్ఞాపకాల తాలుకా ఫోటోలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆ వధువు తన భర్తతో కలిసి ఫిలడెల్పియాకు వెళ్లడానికి సిద్ధమవుతుండటంతో..ఆమె నివాసం బ్రెయిన ట్రీ పట్టణం కావడంతో.. ఆ నేపథ్యాన్ని మరచిపోవద్దని అధ్యక్షుడ ఆడమ్స్‌ నూతన వధువు రాబిన్సన్‌కి సూచించారు.

ఈ లేఖ జూన్‌లో రాబ్‌ కలెక్షన్‌ ద్వారా జరిగిన వేలంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి దాన్ని రూ. 32 లక్షలకు కొనుగోలు చేసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. స్వయంగా రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖ.. మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నమ్మశక్యంగా అనిపించలేదు. విచారణలో అది ఆడమ్స్‌ నుంచి వచ్చినదేనని నిర్ధారణ అయ్యినట్లు తెలిపారు. ఆయన రాసిన విధానం మనసుకి హత్తుకుందని వేలం నిర్వాహకుడు నాథన్ రాబ్‌ తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement