John Adams
-
అమెరికా మాజీ అధ్యక్షుడి లేఖ ..వేలంలో ఎంత పలికిందంటే..
యూఎస్ మాజీ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ రాసిన లేఖ హాట్ టాపిక్‌గా మారింది. వేల ఏళ్ల నాటి లేఖ వేలంలో లక్ష్లల్లో అమ్ముడుపోయి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ అంతలా ఆకర్షించేంతగా ఆ లేఖలో ఏముంది. ఎవరికీ ఆడమ్స్ ఆ లేఖ రాశారు? వివరాల్లోకెళ్తే..అమెరికి రెండొవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ సంతకంతో కూడిన ఓ లేఖ వెలుగులోకి వచ్చింది. అది ఓ టీనేజ్ వధువు రాసిన లేఖ కావడంతో మరింత విశేషం సంతరించుకుంది. ఆయన ఆ వధవుని ఆశ్వీరదిస్తూ ఓ సన్నిహితుడి మాదిరిగా మంచి విషయాలు ఆమెకు ఆ లేఖలో బోధించారు. ఆ లేఖ రాసినప్పడూ ఆయన వయసు 89 ఏళ్లు. కాగా, ఆ వధువు వయసు 19 ఏళ్లు. ఆ లేఖను మాజీ అధ్యక్షుడు ఆడమ్స్ డిసెంబర్ 14, 1824లో రాశారు ఇక ఆ లేఖలో నా స్నేహితుడు జడ్డిపీటర్స్తో వధువు 19 ఏళ్ల రాబిన్సన్ కొత్త సంబంధం ఏర్పరుచుకుంటున్నందుకు సంతోషిస్తున్నా. మీరిద్దరూ అన్ని కార్యక్రమాలను జయప్రదంగా కలిసి చేయాలి. అలాగే వధువుని ఉద్దేశిస్తూ నువ్వు ఏ మూలల నుంచి వచ్చావో వాటిని ఎప్పటికీ మరిచిపోకు అని రాశారు. ఆ లేఖ ఓ ఫ్రెండ్ షిప్ ఆల్బమ్‌లో ఉంది. అందులోనే ఆ యువ జంటకు సంబంధించిన జ్ఞాపకాల తాలుకా ఫోటోలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆ వధువు తన భర్తతో కలిసి ఫిలడెల్పియాకు వెళ్లడానికి సిద్ధమవుతుండటంతో..ఆమె నివాసం బ్రెయిన ట్రీ పట్టణం కావడంతో.. ఆ నేపథ్యాన్ని మరచిపోవద్దని అధ్యక్షుడ ఆడమ్స్ నూతన వధువు రాబిన్సన్కి సూచించారు. ఈ లేఖ జూన్‌లో రాబ్ కలెక్షన్ ద్వారా జరిగిన వేలంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి దాన్ని రూ. 32 లక్షలకు కొనుగోలు చేసినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. స్వయంగా రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖ.. మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. నమ్మశక్యంగా అనిపించలేదు. విచారణలో అది ఆడమ్స్ నుంచి వచ్చినదేనని నిర్ధారణ అయ్యినట్లు తెలిపారు. ఆయన రాసిన విధానం మనసుకి హత్తుకుందని వేలం నిర్వాహకుడు నాథన్ రాబ్ తెలిపారు. -
ఒకేరోజు ఇద్దరు మాజీ అధ్యక్షుల మృతి
నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ పాలిత దేశమే. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని, అరాచక పాలన సాగించిన బ్రిటన్.. అమెరికాలోనూ అదే తంతు కొనసాగించింది. బ్రిటన్ రాచరికపు పాలనలో ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్ పాలనపై అమెరికా తొందరగానే మేల్కొని, పోరాడడంతో చివరకు 1776 జూలై 4 న స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా వాసులు ఒక రోజు ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు. పెద్ద పెద్ద భవంతులను లైట్లతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యారు. సరిగ్గా అదే రోజు ఇద్దరు అధ్యక్షుల మరణం.. అయితే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అగ్ర నేతలకే అమెరికా అధ్యక్ష పీఠం దక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యానికి మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నియ్యారు. రెండో అధ్యక్షుడిగా జాన్ ఆడమ్స్, మూడో అధ్యక్షునిగా థామస్ జెఫర్ సన్ ఎన్నికై అమెరికాకు విశిష్ట సేవలు అందజేశారు. ఈ నేతల చావులోనూ కాస్త పోలికలు ఉండటం మనం గమనించాలి. అదేంటంటే.. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఒకే రోజు(1826 జూలై 4)న మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్(రెండో అధ్యక్షుడు), జెఫర్ సన్(మూడో అధ్యక్షుడు) ఇద్దరూ మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమెరికా వాసులు వీరిని స్మరించుకుంటారు.