
కికా రంగంలోకి దిగితే ఇలాగే ఉంటుంది. చిన్నప్పుడే మొదలైంది పెయింటింగ్ మీద ఆసక్తి.. అలా మొదలైన ప్రయాణం ఇదిగో ఇలాంటి చిత్రవిచిత్రమైన బాడీ పెయిటింగ్ టెక్నిక్‌ల దాకా చేరింది. నిజమా లేక భ్రమా అన్నట్లుగా బాడీ పెయింటింగ్ టెక్నిక్‌ను వాడటంలో సెర్బియాకు చెందిన మిర్జానా కికా మిలోసెవిక్‌ది అందె వేసిన చేయి.. మోడళ్లను వాడదు.. అన్నీ ప్రయోగాలు తనపైనే.. అదిరిపోలే.. అందుకే సోషల్ మీడియాలో తనకు తెగ క్రేజ్ ఉంది.


