అనంతపురం(గుత్తి): అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉప్పరవీధిలో ఓ పెయింటర్ ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెయింటింగ్ పనులు లేకపోవటం, ఉపాధి దొరక్కపోవటంతో కలత చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.