
మ్యాన్ హోల్ టు యమలోకం
రోడ్డు మీద మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి.. ప్రమాదకరంగా వదిలేయడం మనం చాలా చూశాం.. వదిలేశాం.. అయితే, బెంగళూరుకు చెందిన చిత్రకారుడు బాదల్ నజుండస్వామి మాత్రం అలా చూసి, వదిలేయలేదు. మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు ఓ వినూత్న యత్నానికి పూనుకున్నాడు. శుక్రవారం బెంగళూరులో మూత తెరిచి ఉంచేసిన .. ఓ మ్యాన్ హోల్‌ను యముడి నోరుగా చిత్రీకరించాడు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే.. ఈ మ్యాన్ హోల్ నుంచి యముడు నేరుగా హెల్(నరకం)కు తీసుకెళ్లిపోతాడన్నట్లు బొమ్మ వేశాడు.