Manholes
-
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
మూత తెరిస్తే మూడినట్టే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగింపునకు జలమండలి చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మ్యాన్న్హోళ్ల మూత తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపాటి వర్షాలకు డ్రైనేజీల పొంగిపొర్లడం.. ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే లోతైన మ్యాన్ హోళ్లతో పాటు సుమారు 22 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్ బిగించింది. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, రెడ్ మార్కు ఏర్పాటు చేస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (ఈఆర్టీ), మాన్సూన్ సేఫ్టీ టీం (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీం (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు వినియోగించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేక టీంలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటార్ ఏర్పాటు చేసింది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగించనున్నారు. వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేసే విధంగా ఆదేశాలు జారీ చేసింది. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ టీంలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు ఎయిర్‌టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉంచడంతో పాటు మ్యా¯న్న్హోళ్ల నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు చేపట్టింది. సీవరేజీ బృందం ఏర్పాటు.. మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందాన్ని జలమండలి ఏర్పాటు చేసింది. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించే వి«ధంగా ఆదేశాలు జారీ చేసింది. లీకేజీ, వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవిధంగా చర్యలకు తీసుకుంటుంది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా, ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313కి ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చని, వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. మ్యాన్‌హోళ్ల మూత తెరిస్తే నేరమే.. ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా చట్ట ప్రకారం నేరమని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలను అతిక్రమించి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయిస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్మికులకు శిక్షణ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై జలమండలి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై సూచనలు ఇవ్వడంతో పాటు పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపైనా అవగాహన కల్పిస్తుంది. విస్తృత ప్రచారం వర్షాకాలంలో సీవరేజీ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి? ఎలా నడుచుకోవాలి? అనే అంశాలపై జలమండలి విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చూట్టింది. స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌హెచ్ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కలి్పస్తోంది. టెలివిజన్, ఎక్స్(ట్విటర్), ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కఠినంగా వ్యవహరిస్తాం.. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రాస్ ప్రస్తుత వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్పిట్ల మూతలు తెరిచే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ రోనాల్డ్‌రాస్ హెచ్చరించారు. మ్యాన్ హోల్స్, క్యాచ్ పిట్స్ మూతలు తెరిచి ఉండటంతోనే ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. అనధికార వ్యక్తులు మ్యాన్‌హోల్స్ మూతలను తెరిచినా, తొలగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. మ్యాన్‌హోల్స్ వల్ల ఎక్కడైనా వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్ 040– 2111 1111ను సంప్రదించాలన్నారు. -
సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లతో ప్రాణాలు పోతున్నాయ్.. అయినా!
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో సెప్టిక్ ట్యాంకులు, మురుగు నీటిపైపులైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లు కార్మికుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. నైపుణ్య శిక్షణ లేని కార్మికులను కొందరు ప్రైవేటు యజమానులు, కాంట్రాక్టర్లు వీటిల్లోకి దించి వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నా.. సంబంధిత యంత్రాంగాలు చోద్యం చూస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో జరిగిన దుర్ఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఇంజినీరింగ్ స్టాఫ్‌కాలేజీ ఆఫ్ ఇండియా.. జలమండలి సౌజన్యంతో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలకు భద్రతను కల్పిస్తూ.. వారిలో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేవారు విధిగా ఈ శిక్షణ పొందాల్సి ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్మికులకు ప్రాణ సంకటం.. మహానగరం పరిధిలో సుమారు ఏడువేల కిలోమీటర్ల పరిధిలో మురుగునీటి పారుదల వ్యవస్థ అందుబాటులో ఉంది. వీటిపై 2.5 లక్షల మ్యాన్‌హోళ్లున్నాయి. వీటితోపాటు శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ నెట్వర్క్ లేకపోవడంతో లక్షలాది గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల్లో సెప్టిక్ ట్యాంకులను నిర్మించుకున్నారు. మురుగు సమస్యలు తలెత్తిన ప్రతిసారీ వీటిని శుద్ధి చేయడం, ఖాళీ చేసే పనుల్లో పాలుపంచుకుంటున్న కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో ప్రమాదకరమైన మీథేన్ విషవాయువు పేరుకుపోవడంతో అందులోకి దిగినవారు ఊపిరాడక మరణిస్తున్నారు. మానవ ప్రమేయం లేకుండా సాంకేతికత ఆధారంగా వీటి శుద్ధికి ప్రాధాన్యమివ్వాలని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన విషయం విదితమే. చదవండి: ‘కేంద్రం’ కొనదట..కొనుగోలు కేంద్రాలుండవ్ శిక్షణలో ముఖ్యాంశాలు.. ► జలమండలి నుంచి లైసెన్సు పొందిన కాంట్రాక్టర్లు మాత్రమే నైపుణ్య శిక్షణ పొందిన కార్మికుల ఆధ్వర్యంలో సెప్టిక్ ట్యాంకులను శుద్ధి చేయాలి. వీటిలోకి దిగే కార్మికులకు సంబంధింత కాంట్రాక్టరు.. భద్రత ఉపకరణాలు ఎయిర్ కంప్రెసర్లు, ఎయిర్‌లైన్ బ్రీతింగ్ పరికరాలు, గ్యాస్ మాస్క్, ఆక్సిజన్ సిలిండర్ విధిగా ఉండాలి. ► అత్యవసర మెడికల్ ఆక్సిజన్ కిట్ అందుబాటులో ఉంచాలి. నైలాన్ రోప్ ల్యాడర్, రిఫ్లెక్టింగ్ జాకెట్, నైలాన్ సేఫ్టీ బెల్ట్, సేఫ్టీ హ్యామ్స్, సేఫ్టీ ట్రైపాడ్ సెట్, సెర్చ్‌లైట్, సేఫ్టీ టార్చ్, పోర్టబుల్ ఆక్సిజన్ కిట్లను అందజేయాలి. ►ఫస్ట్‌ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. సెప్టిక్ ట్యాంకులు, మ్యాన్‌హోళ్లలో పేరుకుపోయిన ప్రమాదకర వాయువులను గుర్తించే గ్యాస్ మానిటర్ వినియోగించాలి. దీంతో ఏ స్థాయిలో వాయువులున్నాయో తెలుసుకోవచ్చు. క్లోరిన్ మాస్కులు అందుబాటులో ఉంచాలి. సెప్టిక్ ట్యాంకులను జలమండలి కాల్‌సెంటర్ 155313/14420కు కాల్చేసి శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయించుకోవాలి. ప్రతి మూడేళ్లకోసారి సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. చదవండి: ఊపిరి పణంగా.. ఉద్యమం ఉధృతంగా.. -
బండీకూట్ అనే నేను..
నగరానికి వచ్చేశా... సోమవారం సాయంత్రం రామ్‌నగర్ రహదారిలో ట్రయల్ రన్లో పాల్గొన్నాను. మ్యాన్‌హోల్స్‌ను చిటికెలో శుభ్రం చేసేశాను. త్వరలోనే నగరంలోని అన్ని మ్యాన్‌హోల్స్‌ను క్లియర్ చేసేందుకు సిద్ధమవుతున్నాను. నా పనితీరు, సామర్థ్యం గురించి చెబుతా మరి – సాక్షి, విశాఖపట్నం హాయ్... సిటిజన్స్... ఐయామ్ బండీకూట్.. వెర్షన్ 2.0.. మేడిన్ ఇండియా.. నీ స్పెషల్ ఏంటి బండీకూట్..? ఇన్నాళ్లూ.. ఎంతో మంది మనుషుల ప్రాణాలు హరించిన మ్యాన్‌హోల్స్‌ని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఒంటిచేత్తో శుభ్రం చేయగలను. ఎలాంటి పనులు చెయ్యగలవ్..? ఒక మ్యాన్ హోల్ శుభ్రం చేయడానికి స్కావెంజర్లు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా..? సఫాయి కార్మికులు లోపలికి దిగి, శుభ్రం చేసి తిరిగి పైకి చేరుకునే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తుంటారు. నేనలా కాదు.. ఒన్స్ ఇన్ ఫీల్డ్ మ్యాన్‌హోల్ క్లీన్ అవ్వాల్సిందే. అవునా.. మరి నీకేం కాదా...? జీవీఎంసీ పరిధిలో 781 కిలోమీటర్ల యూజీడీ నెట్ వర్క్ ఉంది. నగర పరిధిలో మొత్తం 38,700 మ్యాన్‌హోల్స్ ఉన్నాయి. వీటిని క్లియర్ చేసేందుకు 500 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. మ్యాన్ హోల్ క్లియర్ చేసేందుకు లోపలికి దిగుతున్న కార్మికులు అందులోంచి ఉత్పన్నమయ్యే విషవాయువుల కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. నేను రోబో కదా ఏ చిన్న ప్రమాదానికి గురికాకుండానే క్లీన్ చేసేస్తాను. నీ ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది.? ఎలా పనిచేస్తావ్..? నేను స్పైడర్ టెక్నాలజీతో పనిచేస్తాను. మ్యాన్‌హోల్ బ్లాక్ అయితే సెన్సార్ ద్వారా సమాచారం తెలుసుకొని అధికారులు నన్ను ఆ మ్యాన్‌హోల్ దగ్గరికి తీసుకెళ్తారు. నాలో ఇన్‌బిల్ట్ కెమెరా ఉంటుంది. నైట్ విజువల్‌తో రాత్రి సమయంలోనూ మ్యాన్‌హోల్ లోపల స్పష్టంగా కనింపిచేలా వాటర్‌ప్రూఫ్ కెమెరాలు నాలో ఉన్నాయి. ముందుగా... కెమెరాల ద్వారా.. ప్రోబ్లెమ్ ఎక్కడో గుర్తిస్తాను. మీకు చేతులున్నట్లుగానే.. నాకూ ఉంటాయి. అవి బయట 45 సెంటీమీటర్ల విస్తీర్ణంతో కనిపిస్తాయి. కానీ.. మ్యాన్హోల్లోకి వెళ్లాక.. ఎంత కావాలంటే అంత పెద్దగా విస్తరించగలను. ఎక్కడ బ్లాక్ అయిందో దాన్ని నిమిషాల వ్యవధిలో శుభ్రం చేసేస్తాను. అవరోధాల్ని బయటికి తీసి పారేస్తాను. 30 నుంచి 50 అడుగుల లోతున్న మ్యాన్ హోల్స్‌ని క్లియర్ చేయగలను. ఎంత టైమ్‌లో క్లియర్ చేయగలవు.? సాధారణంగా ఒక మ్యాన్హోల్ని ఇద్దరు సఫాయి కారి్మకులు 3 గంటలు క్లీన్ చేస్తారు. నేను గంటకు రెండు చొప్పున ఏకధాటిగా.. 4 గంటల్లో 8 మ్యాన్ హోల్స్‌ని క్లియర్ చేయగలను. ముందుగా మ్యాన్‌హో ల్లో ఉత్పన్నమయ్యే అమ్మోనియం నైట్రేట్, మీథేన్, హైడ్రోక్లోరిక్ సలై్ఫడ్.. ఎంత మోతాదులో ఉన్నాయని గుర్తించి బరిలో దిగుతాను. వైజాగ్ ఎప్పుడు వచ్చావ్..? ∙పైలట్ ప్రాజెక్టుగా నన్ను తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం రామ్‌నగర్ రహదారిలో జీవీఎంసీ కమిషనర్ జి.సృజన, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు, నీటి సరఫరా విభాగం ఎస్ఈ వేణుగోపాల్ పర్యవేక్షణలో ట్రయల్ రన్లో పాల్గొన్నాను. నా పనితీరుని కమిషనర్ మెచ్చుకున్నారు తెలుసా.. ఇంతకీ మా వీధిలోకి ఎప్పుడొస్తావ్..? నెలరోజుల్లో నగరమంతటా తిరుగుతా.. మీ మ్యాన్‌హోల్స్ మొత్తం క్లీన్ చేస్తా. మురుగు ముంచెత్తకుండా క్లియర్‌గా ఉంచుతా. (చదవండి: గ్యాస్‌తో పంటకు నీరంట..!) రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్ -
‘మరిన్ని రోబోటిక్ యంత్రాలు అందుబాటులోకి’
సాక్షి, హైదరాబాద్ : మ్యాన్‌హోల్‌లోని చెత్తను తొలగించే రోబోటిక్ యంత్రాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్ హైటెక్‌సిటీలో ప్రారంభించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మొట్ట మొదటిసారిగా హైటెక్ సిటీలో చెత్తను తీసే రోబోటిక్ యంత్రాన్ని తీసుకొచ్చామని అన్నారు. గతంలో మ్యాన్‌హోల్స్ లోని చెత్త తీసే క్రమంలో దురదృష్టవశాత్తు పలువురు కార్మికులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ యంత్రం తొడ్పడుతుందని తెలిపారు. అలాగే కొత్త టెక్నాలజీతో తయారైన రోబోటిక్ యంత్రం ద్వారా పూడికతీత పనులు చేస్తున్నామని, ఈ యంత్రంతో 24 గంటలు పని చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి నాలుగు కెమెరాలతో పాటు రోబోటిక్ లెగ్స్, ఆర్మ్స్, యూజర్ ఇంటర్ ఫేస్ డిస్ప్లేకు అనుసంధానంగా ఉంటాయన్నారు. ఈ రోబో యంత్రాలకు రహేజా సంస్థ సహకారం అందించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో నగరంలో మరిన్ని రోబోటిక్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, జోనల్ కమిషనర్ హరి చందన హాజరయ్యారు. -
మ్యాన్హోల్లోకి మరమనిషి..!
గచ్చిబౌలి: మ్యాన్‌హోల్‌లో పూడిక తీసే కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టు కోవాల్సిందే. లోపలికి దిగిన కార్మికులు విష వాయువుల బారిన పడి మృతి చెందిన సంఘటనలు ఎన్నో చూశాం. ఇకపై కార్మికుల స్థానంలో రోబోలు మ్యాన్హోల్లోకి దిగి పూడిక తీయనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రోబోతో పూడిక తీత పనులు ప్రారంభించింది. ఈ పనుల కోసం జెన్ రోబోటిక్స్ సంస్థ తయారు చేసిన ‘బండికూట్’అనే రోబోను జీహెచ్ఎంసీ ఉపయోగించింది. కేరహేజా గ్రూపు సీఎస్ఆర్లో భాగంగా ఈ రోబోను జీహెచ్ఎంసీకి అందించింది. ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, హరియాణా, మహారాష్ట్రల్లో ఈ రోబోను ఉప యోగించి లోతైన మ్యాన్‌హోల్స్‌లో పూడిక తీస్తున్నారు. సోమవారం రాయదుర్గంలో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో బండికూట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూడికతీత ఇలా.. ముందుగా మ్యాన్హోల్లోకి రోబోటిక్ యూనిట్‌ను పంపుతారు. రోబోలోని కెమెరాలు లోపల పూడిక ఏ భాగంలో ఉందో అవి పసికడతాయి. పైన ఆపరేటర్ వద్ద ‘యూజర్ ఇంటర్ ఫేస్ ప్యానల్’లో అన్ని దృశ్యాలు కనిపిస్తాయి. దీని ఆధారంగా ఆ ప్యానల్‌పై ఉన్న బటన్లను నొక్కుతూ పూడికను బయటకు తీస్తారు. చేయి ఆకారంలో ఉన్న ఆర్మ్ పైప్‌లైన్ మ్యాన్‌హోల్‌లోని బురద, మట్టిని బకెట్లోకి వేస్తుంది. ఈ ఆర్మ్ 1.2 మీటర్ల వరకు సాగుతుంది. మ్యాన్‌హోల్‌పైన ఉన్న ఆపరేటర్ మట్టి, బురదను బయటకు తీస్తే, పైకి వచ్చిన బకెట్‌ను క్లీనర్ ఖాళీ చేసి మళ్లీ లోపలకు పంపిస్తారు. దీంతో కార్మికులను లోపలికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. విష వాయువులను పసిగడుతుంది.. మ్యాన్‌హోల్‌లో లిథియం, కార్భన్ మోనాక్సైడ్, అమోనియా లాంటి విషవాయువుల తీవ్రత ఎంత ఉందో ప్యానల్లో చూపిస్తుంది. ఎక్కువ మోతాదులో ఉంటే రెడ్ లైట్ వస్తుంది. వీటి తీవ్రత ప్రమాదకరంగా ఉన్నట్లయితే అలారం కూడా మోగుతుంది. దీంతో మ్యాన్‌హోల్ సమీపంలో నిలబడి ఉన్న ఆపరేటర్, క్లీనర్లు కొద్దిసేపు పక్కకు జరిగేందుకు వీలుంటుంది. బండికూట్ ప్రత్యేకతలు.. బండికూట్ రోబో ఖరీదు రూ.32 లక్షలు. దీనిని కార్బన్ ఫైబర్ బాడీతో తయారు చేయడం వల్ల తక్కువ బరువుగా ఉంటుంది. దీంతో తేలికగా మరో చోటికి తరలించవచ్చు. 8 మీటర్లు అంటే 24 అడుగుల లోతు మ్యాన్‌హోల్‌లో పూడిక తీస్తుంది. మట్టి, బురదను బయటకు తీసుకొచ్చే బకెట్ కెపాసిటీ 16 లీటర్లు ఉంటుంది. 3 కేవీఏ కెపాసిటీ గల జనరేటర్ సాయంతో పనిచేస్తుంది. 4 చక్రాలు ఉన్న బండికూట్కు 4 కెమెరాలు ఉంటాయి. -
ఎన్నాళ్లీ నరకం?
సాక్షి, కడియం (తూర్పుగోదావరి) : వాడుక నీరు గొట్టాల్లోకి వెళ్లి అక్కడి నుంచి ఎవరో ఒకరి ఇంటి ఆవరణలోకి వస్తోంది. లేకపోతే మ్యాన్‌హోల్స్ నుంచి లీకై నేరుగా రోడ్డు మీదకే చేరుతోంది. దుర్వాసనతో కూడిన ఆ మురుగు నీటిలో ఇటుకలు వేసి వాటి మీద నుంచి అక్కడి ప్రజలు నడవాల్సిన దుస్థితి. ఇదీ మోడల్‌గా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించిన దుళ్ళ గ్రామంలోని ఎర్రకాలనీ, బీసీ కాలనీల్లోని పరిస్థితి. ఈ నరకం నుంచి తమకు విముక్తి కలిగించండి మహాప్రభో అంటూ వాటిని చూసేందుకు వచ్చిన అధికారులు, నాయకులను స్థానికులు వేడుకొంటున్నారు. అప్పటి మంత్రి నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షించిన పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షణలో సాగిన ఈ నిర్లక్ష్య నిర్మాణం కారణంగా తాము పడుతున్న కష్టాలను కనిపించిన ప్రతి ఒక్కరికీ వారు వివరిస్తున్నారు. కేవలం రెండంటే రెండు వర్షాలు కురిశాయో లేదో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేసినంత మేరా అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక భారీ వర్షాలు కురిస్తే ఎంతటి దుర్భర పరిస్థితులుంటాయోనని దుళ్ళ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కూలికి వెళ్తేనే కానీ రోజు గడవని ఆ కుటుంబాలు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా ఏర్పడిన మురికి కూపంలో బతకలేక తల్లడిల్లుతున్నారు. నిర్మాణ సమయంలో వచ్చిన అధికారులు కానీ, నాయకులు కానీ ఇప్పుడు కనిపించడం లేదని, తమ ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థకు గొట్టాలు ఏర్పాటు చేసేందుకు జరిపిన తవ్వకాల్లో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు కూడా దెబ్బతిన్నాయి. పనులు జరుగుతున్నంతసేపూ నీటిని విడుదల చేయకుండా కాంట్రాక్టర్లు, అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. తీరా ఇప్పుడు తాగునీరు విడుదల చేస్తూంటే ఎక్కడికక్కడ నీరు లీకైపోతోంది. ముఖ్యంగా బీసీ కాలనీలో మొత్తం తాగునీటి పైపులైన్ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. దీంతో నెల రోజులుగా నీటిని విడుదల చేయడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం తలాతోకా లేకుండా, ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడకుండా చేసిన పనులకు దుళ్ళలో జరిగిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పరాకాష్టగా కనిపిస్తోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► దుళ్ళ గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి వాడిన పైపులైన్ల సామర్థ్యం వాస్తవంగా సరిపోతుందా? ► పనులు చేసిన కాంట్రాక్టర్లకు తగిన అనుభవం ఉందా? ► పనులు జరుగుతున్నప్పుడు అసలు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు పర్యవేక్షించారా? ► మోడల్‌గా నిర్మించామని చెబుతున్నారు. ఒకవేళ విఫలమయితే ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉందా? ► ప్రస్తుతం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సక్రమంగా పని చేయడం లేదు. ఇందుకు కాంట్రాక్టర్లపై తీసుకునే చర్యలేమిటి? ► ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తీసుకునే తక్షణ చర్యలేమిట ► మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో సదరు నీరు బయటకు వెళ్లే మార్గం అత్యంత ప్రధానమైనది. అటువంటి అవకాశం లేకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించేందుకు ఎలా సిద్ధమయ్యారు? ఉండలేకపోతున్నాం అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం వేసిన పైపులు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. మురుగునీరు వెనక్కి తన్నుకొస్తోంది. ఇంట్లోకి కూడా దుర్వాసన వస్తోంది. వీధుల్లో కూడా అదే పరిస్థితి. ఉండలేకపోతున్నాం. మా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. ఏ డ్రైనూ లేనప్పుడే బాగుంది. – జి.వెంకటలక్ష్మి మరీ దారుణం మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేదు. కానీ పనులు మాత్రం చేసేశారు. అవి కూడా అత్యంత దారుణంగా చేశారు. అసలు ఈ గొట్టాల నిర్మాణం చూస్తే ఇందులో నుంచి నీరు ఎలా వెళ్తుందని వేశారో అర్థం కావడం లేదు. అధికారులు, నాయకులు ఇక్కడకొచ్చి చూస్తే మా బాధలు అర్థమవుతాయి. – ఎం.కుమారి -
మురుగు కాల్వల శుభ్రతకు ఆధునిక టెక్నాలజీ
-
మ్యాన్‌హోల్స్ శుద్ధికి రోబో
సాక్షి, హైదరాబాద్: మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్న పారిశుద్ధ్య కార్మికుల జీవితాలకు భద్రత, భరోసా నిచ్చేందుకు రోబోలు అందుబాటులోకి వచ్చాయి. కేరళలో ప్రయోగాత్మకంగా కొందరు యువ ఇంజనీర్లు తయారు చేసిన రోబోలు ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల జల బోర్డుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కేరళ వాటర్ అథారిటీ ఇప్పటికే ఇలాంటి 50 రోబోలకు ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిసింది. యువ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగిస్తోన్న జెన్‌రోబోటిక్స్ అనే సంస్థ ఈ రోబోలను తయారు చేసింది. ఈ రోబోకు బ్యాండీకూట్ అనే పేరుపెట్టింది. ఈ అరుదైన రోబోకు పేటెంట్ హక్కులు పొందేందుకు సంస్థ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. దేశ వ్యాప్తంగా 2014–17 మధ్యకాలంలో మురుగునీటి పైప్లైన్లపై ఉన్న మ్యాన్‌హోళ్లలోకి దిగి సుమారు 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు మృత్యువాతపడ్డారు. దీంతో తమ ఇంజనీర్ల బృందం ఈ అధునాతన రోబో తయారీకి శ్రీకారం చుట్టి ్టనట్లు మెకానికల్ ఇంజనీర్, జెన్‌రోబోటిక్స్ సీఈఓ విమల్ గోవింద్ అన్నారు. తమ బృందంలో ఐటీ, మెకానికల్ ఇంజనీర్లు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ రోబో పని చేస్తుందిలా.. ఈ బ్యాండీకూట్ రోబో తయారీకి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. రోబో బరువు దాదాపు 80 కిలోలు. మ్యాన్‌హోళ్లలో మనుషులు దిగే అవసరం లేకుండా ఈ రోబో శుద్ధి ప్రక్రియ నిర్వహిస్తుంది. మ్యాన్హోల్లోకి వెళ్లే రోబో విడిభాగాల బరువు 30 కిలోలు. ముందుగా ఈ రోబోకున్న వైరును మురుగు ప్రవాహానికి అడ్డంకులున్న మ్యాన్హోల్లోకి పంపిస్తారు. దీనికున్న కెమెరా లోపలి పరిస్థితిని ఫొటోలు తీస్తుంది. ఈ ఫొటోలు బయట స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీంతో మురుగు ప్రవాహానికి ఎక్కడ ఆటంకాలున్నాయో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత జెట్పైప్ సాయంతో రోబో మ్యాన్హోల్లోకి వెళ్లి ప్రవాహానికి ఉన్న ఆటంకాలను నిమిషాల వ్యవధిలో తొలగిస్తుంది. మూడు గంటలపాటు ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిని ఈ రోబో 30 నిమిషాల్లోనే పూర్తిచేస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని వారు కూడా ఈ రోబోను ఆపరేట్ చేయవచ్చని చెప్పారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి సైతం ఈ రోబోలు ఉపయుక్తంగా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదనలు పంపామని, వీటి పనితీరుపై ప్రజెంటేషన్ సైతం ఇచ్చినట్లు వారు వివరించారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ సైతం ఈ బ్యాండీకూట్ రోబో ఉత్తమమైనదిగా అభివర్ణించిందన్నారు. తమ రోబో విశిష్టతలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ రోబోటిక్స్ రీసెర్చ్ జర్నల్‌లోనూ ప్రచురించారని నిర్వాహకులు తెలిపారు. -
మృత్యు‘హోల్స్’
ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో తెరిచి ఉంచిన నల్లా గుంతలు ఎక్కడికక్కడ మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. ఆయా వీధుల్లోని ఇరుకు సందుల్లో సైతం పెద్ద పెద్ద నల్లా గుంతలను తెరిచి ఉంచడంతో స్థానికులు ప్రమాదాల బారీన పడుతున్నారు. ఎవరైన తెలియని వ్యక్తులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చారంటే ఆ గుంతల్లో పడాల్సిందే. ప్రదాన దహదారులు, చిన్న చిన్న గళ్లిలో కూడా మ్యాన్ హోల్స్ .. మృత్యు హోల్స్‌గా మారుతున్నాయి. నల్లాల గుంతలు ఎక్కడ పడితే అక్కడ తెరిచి ఉంచడంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. అంతేకాకుండా గతంలో పెద్ద బజార్‌లోని ఓ వీధిలో రాత్రి వేళలో లోతైన నల్లాగుంత పైకప్పు లేకపోవడంతో అది గమనించని ఓ వ్యక్తి అ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు వీటి బారిన పడుతున్నా సంబంధింత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హడవిడి సృష్టించే అధికారులకు మిగతా సమయాలలో ప్రజల భద్రతను గాలికొదిలేస్తున్నారన్నారు. అప్పట్లో అధికారులు అఘా మేఘాలమీద స్పందించి తప్పనిసరిగా నల్లా గుంతలకు పైకప్పులు వేసుకోవాలని సూచించారు.కాని నేటి వరకు పట్టణంలోని అన్ని వీధుల్లో పైకప్పులు లేని నల్లా గుంతలే దర్శనమిస్తున్నాయి. ఇదే విధంగా అధికారులు నిర్లక్ష్య దోరణితో సమస్యను చిన్నదిగా పరిగణిస్తే పెద్ద ప్రమాదాలే జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. నిత్యం నల్లా బిల్లుల బకాయిలకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు నల్లా గుంతల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. -
మ్యాన్‌హోల్స్ తెరవవద్దు: జిహెచ్ఎమ్సి
-
ఇక యంత్రాలతోనే క్లీనింగ్
-
ఇక యంత్రాలతోనే క్లీనింగ్
► మనుషులు మ్యాన్‌హోళ్లలో దిగకుండా చర్యలు ► మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ► నగర పారిశుధ్యానికి ఆధునిక వాహనాలు ► ‘స్వచ్ఛ ఆటోల’ పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్ సాక్షి, సిటీబ్యూరో: ఇకముందు మనుషులు మ్యాన్‌హోళ్లలో దిగకుండా చేస్తామని, మెకనైజ్డ్ విధానాలతోనే మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసే విధానాలు అవలంభిస్తామని మున్సిపల్ మంత్రి కేటీ ఆర్ స్పష్టం చేశారు. ఇటీవల మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు మృతి చెందడాన్ని ప్రస్తావిస్తూ, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఇక్కడి పీపుల్స్‌ప్లాజాలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా 176 స్వచ్ఛ ఆటో టిప్పర్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 25 రెఫ్యూజి క్యాంపాక్టర్లు, 18 కొత్త స్వీపింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా జలమండలి ఇప్పటికే ప్రకటించగా, మృతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కూడా ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలోని కోటి మంది జనాభా కోసం పాటుపడుతున్న జీహెచ్ఎంసీ, జలమండలి కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం భరోసాగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పేరుకు మహానగరమైనప్పటికీ కాలుష్యాన్ని వెదజల్లుతున్న చెత్తవాహనాలు.. వాహనాల నుంచి రోడ్లపై పడుతున్న చెత్త వంటి సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి, పారిశుధ్య కార్యక్రమాల సమర్థ నిర్వహణకు 15 ఏళ్లకు పైబడిన కాలం చెల్లిన వాహనాలన్నింటినీ తొలగించి, వాటిస్థానంలోlఅధునాతన వాహనాలు సమకూరుస్తున్నామన్నారు. భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాల్లో డంపర్ బిన్లు లేకుండా చేయాలనేది లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
శేరిలింగంపల్లి : వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్, సర్కిల్-11 అబ్జర్వర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ వి.వి.మనోహర్ అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి సర్కిల్-11 కార్యాలయంలో గురువారం వర్షాల నేపథ్యంలో ఈ సీజన్లో తలెత్తే సమస్యలపై వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం మ్యాన్‌హోల్స్‌పై మూతల ఏర్పాటు, వర్షపు నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే విధంగా వర్షపు నీరు డ్రెయిన్స్ ఉన్న ప్రాంతాల్లో వాటిపై కప్పులు ఉన్నాయా లేదా పరిశీలించి వాటిలో ఎవరు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీలు, కాలనీ మధ్య నుంచి నాలాల్లో పడకుండా ఫెన్సింగ్ ఏర్పాటుతో పాటు వాటిలో పూడికను కూడ తొలగించి వర్షపు నీరు వెళ్లే విధంగా చూడాలన్నారు. జలమండలి విభాగం ఈ సీజన్లో పైప్లైన్ల ఏర్పాటు కోసం రోడ్లను కటింగ్ చేయవద్దన్నారు. ఏ పని చేపట్టినా ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ముందుకు సాగాలన్నారు. దుర్గం చెరువు వర్షపు నీరుతో నిండితే చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అదే విధంగా గాలివానల కారణంగా కూలే ఎలక్ట్రికల్ లైన్లకు మరమ్మతులు చేపట్టేందుకు ఆ విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సీజన్లో వచ్చే సమస్యల పరిష్కారానికి అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన అత్యవసర టీంలతో పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఆయా పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ సందర్బంగా ఏ ఏ విభాగం ఏ పనులు చేపట్టాలో సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఈ మోహన్‌రెడ్డి, ఏసీపీ కష్ణమోహన్, డీఈ రాజ్‌కుమార్, నాగరాజు, జలమండలి డీజీఎం రాజశేఖర్, ఇరిగేషన్ డీఈ యాదగిరి, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్లు రమేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, అర్బన్ బయోడైవర్సిటీ సర్కిల్-11 మేనేజర్ విష్ణువర్ధన్‌రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ జలంధర్‌రెడ్డి, రెమెన్యూ, ఐలా, ప్రాజెక్టు డివిజన్ అధికారులు పాల్గొన్నారు. -
రండి.. పెనునిద్దుర వదిలిద్దాం
► ప్రజల్ని మింగుతున్న రాకాసి నోళ్లను మూయిద్దాం ► మూతల్లేని మ్యాన్‌హోళ్లు, కాపలా లేని క్రాసింగులపై యుద్ధం చేద్దాం ► ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని కడిగేద్దాం ► మీకు అండగా ‘సాక్షి’ నడుస్తుంది సాక్షి, హైదరాబాద్: మూతల్లేని మ్యాన్‌హోల్స్, కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్‌లు, పూడ్చకుండా వదిలేసిన బోరు బావులు, రోడ్ల పక్కన ఎలాంటి రక్షణ లేకుండా నిర్మించిన వరద, మురుగునీటి కాల్వలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి. చినుకుపడితే చాలు చెరువులను తలపించే రోడ్లపై వాహనదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. పాదచారులు మ్యాన్‌హోల్స్‌లో పడి కొట్టుకుపోతున్నారు. ఇటీవలే విశాఖలో నాలాలో పడిపోయిన చిన్నారి అదితి వారం తర్వాత శవమై కనిపించిన ఘటన అందర్నీ కలిచివేసింది. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద కాపాలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు మరణించిన విషాదం ఇంకా గుండెల్ని మెలిపెడుతూనే ఉంది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచెర్లలో బోరుబావులో పడి శివ మరణించిన వైనం కళ్ల ముందే కదలాడుతోంది. ఒక్కటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే అధికారులు, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని వెక్కిరించే అనేక ఉదంతాలు! చలనం లేని ఈ అధికార వ్యవస్థను కదలించేందుకు ఓ అడుగు ముందుకు వేయండి.. మీతో ‘సాక్షి’ వేల అడుగులు వేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. మీ పరిసరాల్లో ఉన్న ప్రమాదకర మ్యాన్‌హోళ్లు, బోరుబావులు, రైల్వే క్రాసింగ్స్ ఫోటోలను, వీడియోలను ‘సాక్షి’కి పంపించండి. వీలైతే అక్షర రూపం ఇవ్వండి. మీ వేదనను, బాధను మాకు రాసి పంపండి. ఊరువాడా, పల్లె, పట్నం ఎక్కడ మీకు సమస్య కనిపించినా తక్షణమే స్పందించి మాకు పంపించండి. జిల్లా పేజీల్లో ప్రముఖంగా ప్రచురిస్తాం. దిగువన పేర్కొన్న చిరునామాకు పంపించండి.. ఫోటోలు, వీడియోలను www.sakshiwar @gmail.com మెయిల్ చేయండి.. వాట్సప్‌లో అయితే ఫోటోలు, వీడియోలను 9010882244 కూ పంపవచ్చు. -
మ్యాన్ హోల్ టు యమలోకం
రోడ్డు మీద మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి.. ప్రమాదకరంగా వదిలేయడం మనం చాలా చూశాం.. వదిలేశాం.. అయితే, బెంగళూరుకు చెందిన చిత్రకారుడు బాదల్ నజుండస్వామి మాత్రం అలా చూసి, వదిలేయలేదు. మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లేందుకు ఓ వినూత్న యత్నానికి పూనుకున్నాడు. శుక్రవారం బెంగళూరులో మూత తెరిచి ఉంచేసిన .. ఓ మ్యాన్ హోల్‌ను యముడి నోరుగా చిత్రీకరించాడు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే.. ఈ మ్యాన్ హోల్ నుంచి యముడు నేరుగా హెల్(నరకం)కు తీసుకెళ్లిపోతాడన్నట్లు బొమ్మ వేశాడు.