
కోలిగడ్డ వీధిలో రోడ్డు పక్కన ప్రమాదకరంగా నల్లా గుంత
- ప్రమాదకరంగా మ్యాన్‌హోల్స్
- అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలో తెరిచి ఉంచిన నల్లా గుంతలు ఎక్కడికక్కడ మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. ఆయా వీధుల్లోని ఇరుకు సందుల్లో సైతం పెద్ద పెద్ద నల్లా గుంతలను తెరిచి ఉంచడంతో స్థానికులు ప్రమాదాల బారీన పడుతున్నారు. ఎవరైన తెలియని వ్యక్తులు రాత్రి వేళ ఇక్కడకు వచ్చారంటే ఆ గుంతల్లో పడాల్సిందే. ప్రదాన దహదారులు, చిన్న చిన్న గళ్లిలో కూడా మ్యాన్ హోల్స్ .. మృత్యు హోల్స్‌గా మారుతున్నాయి.
నల్లాల గుంతలు ఎక్కడ పడితే అక్కడ తెరిచి ఉంచడంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. అంతేకాకుండా గతంలో పెద్ద బజార్‌లోని ఓ వీధిలో రాత్రి వేళలో లోతైన నల్లాగుంత పైకప్పు లేకపోవడంతో అది గమనించని ఓ వ్యక్తి అ గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలు వీటి బారిన పడుతున్నా సంబంధింత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు హడవిడి సృష్టించే అధికారులకు మిగతా సమయాలలో ప్రజల భద్రతను గాలికొదిలేస్తున్నారన్నారు. అప్పట్లో అధికారులు అఘా మేఘాలమీద స్పందించి తప్పనిసరిగా నల్లా గుంతలకు పైకప్పులు వేసుకోవాలని సూచించారు.కాని నేటి వరకు పట్టణంలోని అన్ని వీధుల్లో పైకప్పులు లేని నల్లా గుంతలే దర్శనమిస్తున్నాయి.
ఇదే విధంగా అధికారులు నిర్లక్ష్య దోరణితో సమస్యను చిన్నదిగా పరిగణిస్తే పెద్ద ప్రమాదాలే జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. నిత్యం నల్లా బిల్లుల బకాయిలకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు నల్లా గుంతల దుస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంత్తైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు.