మూత తెరిస్తే మూడినట్టే! | Installation of safety grills on manholes | Sakshi
Sakshi News home page

మూత తెరిస్తే మూడినట్టే!

Published Sun, Sep 10 2023 2:20 AM | Last Updated on Sun, Sep 10 2023 2:20 AM

Installation of safety grills on manholes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్‌ బిగింపునకు జలమండలి చర్యలకు ఉపక్రమించింది.  నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మ్యాన్‌న్హోళ్ల మూత తెరిస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. చిన్నపాటి వర్షాలకు  డ్రైనేజీల పొంగిపొర్లడం.. ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే లోతైన మ్యాన్‌ హోళ్లతో పాటు సుమారు 22 వేలకు పైగా మ్యాన్‌ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్‌ బిగించింది.

ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్‌ చేసి, రెడ్‌ మార్కు ఏర్పాటు చేస్తోంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (ఈఆర్టీ), మాన్‌సూన్‌ సేఫ్టీ టీం (ఎమ్మెస్టీ), సేఫ్టీ ప్రోటోకాల్‌ టీం (ఎస్పీటీ) వాహనాలను రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు వినియోగించే విధంగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేక టీంలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్‌ మోటార్‌ ఏర్పాటు చేసింది. దీని సాయంతో వర్షపు నీటిని తొలగించనున్నారు.

వీరంతా ఆయా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి పనిచేసే విధంగా  ఆదేశాలు జారీ చేసింది. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ టీంలు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. వీటితో పాటు ఎయిర్‌టెక్‌ మిషన్లు సైతం అందుబాటులో ఉంచడంతో పాటు మ్యా¯న్న్‌హోళ్ల నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్‌)ను ఎప్పటికప్పుడు తొలగించే విధంగా చర్యలు చేపట్టింది. 

సీవరేజీ బృందం ఏర్పాటు.. 
మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్‌నుంచి సీవర్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో ఒక సీవరేజీ బృందాన్ని జలమండలి ఏర్పాటు చేసింది. వీరు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో వారి పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షించే వి«ధంగా ఆదేశాలు జారీ చేసింది. లీకేజీ, వాటర్‌ లాగింగ్‌ పాయింట్లను జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసేవిధంగా చర్యలకు తీసుకుంటుంది. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా, ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే జలమండలి కస్టమర్‌ కేర్‌ నంబరు 155313కి ఫోన్‌చేసి సమాచారం అందించవచ్చని, వార్డు కార్యాలయాల్లోనూ నేరుగా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. 

మ్యాన్‌హోళ్ల మూత తెరిస్తే  నేరమే.. 
ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోళ్లపై ఉన్న మూత తెరిచినా, తొలగించినా చట్ట ప్రకారం నేరమని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.  నిబంధనలను అతిక్రమించి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.  అలాంటి వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయిస్తారు. నిందితులకు జరిమానా విధించడంతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముందని  అధికారులు హెచ్చరిస్తున్నారు. 

కార్మికులకు శిక్షణ 
పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే విషయంపై జలమండలి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భద్రతా పరికరాల పనితీరు, ఉపయోగించే విధానం, పారిశుద్ధ్య పనుల్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై సూచనలు ఇవ్వడంతో పాటు పని ప్రదేశాల్లో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు చేసే ప్రథమ చికిత్సపైనా అవగాహన కల్పిస్తుంది. 

విస్తృత ప్రచారం 
వర్షాకాలంలో సీవరేజీ నిర్వహణలో సాధారణ పౌరులు ఎలా ప్రవర్తించాలి? ఎలా నడుచుకోవాలి? అనే అంశాలపై జలమండలి  విస్తృతంగా ప్రచారానికి శ్రీకారం చూట్టింది.  స్థానిక కాలనీల సంఘాలు, ఎస్‌హెచ్‌ గ్రూపుల సభ్యులతో ప్రజలకు అవగాహన కలి్పస్తోంది. టెలివిజన్, ఎక్స్‌(ట్విటర్‌), ఫేస్‌ బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  

కఠినంగా వ్యవహరిస్తాం.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌  
ప్రస్తుత వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ  పరిధిలోని మ్యాన్‌హోళ్లు, క్యాచ్‌పిట్ల మూతలు తెరిచే వారిపై  చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ రోనాల్డ్‌రాస్‌ హెచ్చరించారు. మ్యాన్‌ హోల్స్, క్యాచ్‌ పిట్స్‌  మూతలు తెరిచి ఉండటంతోనే ఇటీవల ప్రమాదాలు జరిగాయన్నారు. అనధికార వ్యక్తులు మ్యాన్‌హోల్స్‌ మూతలను తెరిచినా, తొలగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హెచ్చరించారు. మ్యాన్‌హోల్స్‌ వల్ల ఎక్కడైనా వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌  040– 2111 1111ను సంప్రదించాలన్నారు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement