
సాక్షి, నిర్మల్: జిల్లాలోని కడెం మండలం అంబారిపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో ఐదుగురు పెయింటర్లు చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామస్తుల సాయంతో ముందుగా ఇద్దరు పెయింటర్లను ట్యాంక్ నుంచి బయటకు తీశారు. మరో ముగ్గురు కూడా ఉండటంతో తీవ్రంగా శ్రమించి వారిని కూడా సురక్షితంగా పోలీసులు బయటకు తీశారు.
ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన పెయిటర్లు స్పృహ కోల్పోవడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు పెయిటర్లు శనివారం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో పెయింటింగ్ వేయడానికి అందులోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే వారు పెయింట్ వేస్తూ అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment