ఇంటికి పెయింటింగ్ వేస్తున్న సర్పంచ్ పెద్ద వెంకటసుబ్బన్న
రంగు వెలసిన జీవితం
Published Tue, Jul 19 2016 5:22 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
– పెయింటర్ మారిన సర్పంచ్
సంజామల: ఆయన ఓ గ్రామానికి సర్పంచ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాల్సిన ప్రజాప్రతినిధి. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు. నేడు బతుకు జీవుడా అంటూ పెయింట్ బ్రష్ పట్టాడు. గ్రామంలో మిద్దెలకు రంగు వేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. సంజామల గ్రామ సర్పంచ్ దీనగాథ ఇది..
మిద్దె పెద్ద వెంకటసుబ్బన్న..గత పంచాయతీ ఎన్నికల్లో సంజామల సర్పంచ్‌గా ఎన్నియ్యాడు. ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరం పూర్తి కావడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని భావించి ఆ వర్గం నేతలు సర్పంచ్‌తో మెడికల్ లీవ్ పెట్టించారు. దీంతో ఉప సర్పంచ్‌గా ఉన్న గంగా ఈశ్వరయ్యకు సర్పంచ్‌గా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్ పదవికి సెలవు పెట్టి పెద్ద వెంకట సుబ్బన్న పెయింటింగ్ వేసే కూలీ పనికి వెళుతున్నాడు. గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఇళ్లకు పెయింటింగ్ వేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఆనందమ్మ ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఇదిలా ఇలా కనిపించాడు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న సర్పంచ్‌ను తెలుగు తముళ్లు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఒత్తిడి తెచ్చి మెడికల్ లీవ్ పెట్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Advertisement
Advertisement