
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!
కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్‌లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..
1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు.
శారద మురళీధరన్ పోస్ట్‌లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది.
ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్ని
అలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.
రంగు తక్కువ అనేభావం మాయం..
సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక పాత్రల్లో పనిచేశారు.
(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్)