colour
-
తలకు రంగేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!
తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే.. ఈ రోజుల్లో ఉన్న అతి పెద్ద సమస్యలలో ఇదొకటి. వయసు పైబడిన వారికే కాదు యువతలోనూ జుట్టు తెల్లబడటం గమనిస్తున్నాం. ఇలాంటప్పుడు జుట్టును నల్లబరచడానికి సాధారణంగా కలర్స్ వాడుతుంటారు. కొందరు స్టైల్ కోసం వివిధ రకాల రంగులను ఉపయోగిస్తుంటారు. అవగాహన ఉంటే హెయిర్ కలర్స్ వల్ల వచ్చే సమస్యలను గుర్తించి.. ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రాచీన కాలంలో తెల్లజుట్టు రంగు మార్చడానికి గోరింటాకును ఉపయోగించేవారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. సింథటిక్ హెయిర్ డై లు మాత్రం వందేళ్ల క్రితం పుట్టుకొచ్చాయి. నాటినుంచి వివిధ రకాల హెయిర్ కలర్స్ జుట్టును నల్లబరచడానికి వివిధ మోడల్స్‌లో మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి.తీవ్ర ప్రభావంషాడో కలర్స్‌తో పాటు ఎక్కువగా వినేమాట బ్లాక్ హెన్నా. ఇది కూడా కలరే. హెయిర్‌ని బ్లాక్ చేసే షాంపూలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కలర్స్‌లో అమ్మోనియా ఫ్రీ అని మార్కెటింగ్ చేస్తుంటారు. ఇక పారాటోలిన్, డయమిన్ కెమికల్స్ బ్లాక్ కలర్ రావడానికి ఉపయోగిస్తారు. వీటివల్ల రియాక్షన్స్ వస్తాయి. కొందరికి వెంటనే రియాక్షన్ ప్రభావం చూపుతుంది. వెంటనే మాడుపైన దురద పుడుతుంది.కొందరికి తల, కళ్లు, ముఖం వాస్తాయి. దీర్ఘకాలంలో అయితే పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. మొటిమలు, యాక్నె బాధిస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మెడికేటెడ్ హెయిర్ కలర్ వాడుకోవాలి. బ్లాక్ హెన్నా సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది కూడా హెయిర్ కలరే. మిగతా వాటితో పోల్చితే రెడ్ హెన్నా కొంతవరకు సేఫ్. మాయిశ్చరైజర్ రాసుకోవాలి... హెయిర్ కలర్ వేసుకునేవారు ముందుగా చెవి వెనక జుట్టుకి కొద్దిగా వేసి, ఒకరోజు అలాగే ఉంచి, చెక్ చేసుకోవాలి. కలర్ వేసుకునే ముందు ముఖానికి, మాడుకు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసి, తర్వాత డై వేసుకోవాలి. అప్పుడు కలర్ చర్మానికి అంటినా, డార్క్ అవదు. డై వేసుకోవడానికి ఎవరికి వారుగా కాకుండా మరొకరి సాయం తీసుకోవడం ఉత్తమం.వాష్ చేసుకునేటప్పడు... కలర్ వేసుకున్న తర్వాత శుభ్రపరిచేటప్పుడు ముఖం మీదుగా కాకుండా తల వెనక నుంచే కడగాలి. దీంతో ముఖంపైన కలర్ పడకుండా ఉంటుంది. మెడికేటెడ్ హెయిర్ కలర్స్ మార్కెట్లో దొరికేటంత డార్క్ కలర్‌ని ఇవ్వవు. త్వరగా కలర్ పోతుంది. అందుకే, మార్కెట్లో లభించే వాటికే వెళతారు. కానీ, డై కి ఇచ్చిన ప్రాముఖ్యం మన ఆరోగ్యానికి కూడా ఇవ్వాలనేది గుర్తుంచుకోవాలి. జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు మార్గాలేవీ లేవు కనుక ప్రొటెక్టివ్ మెడికేటెడ్ కలర్స్, షాంపూలను ఉపయోగించడం మేలు. పొడిబారడం ప్రధాన సమస్య...సోరియాసిస్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్కలర్స్ వేసుకునే ముందు మెడికేషన్ తీసుకోవాలి. కలర్ సమస్యతో పాటు ఈ కాలం చలి వల్ల చాలా మంది తల స్నానం చేయరు. లేదంటే స్నానానికి వేడిగా ఉండే నీటిని ఉపయోగిస్తారు. దీంతో చర్మం, వెంట్రుకలు కూడా పొడి బారుతాయి. కలర్స్ వల్ల కూడా మాడు దురద పెడుతుంది. పొడిబారిన మాడు చుండ్రును పెంచుతుంది. యువతలో ఈ సమస్య అధికం.అందుకని, వారానికి రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేసుకొని, మెడికేటెడ్ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. చుండ్రు సమస్య ఉన్నవాళ్లు నూనె రాసి, అలాగే ఉంచకూడదు. వెంట్రుకల మృదుత్వానికి, కలర్‌కి హెన్నా, అలోవెరా... వంటివి తలకు ప్యాక్స్ వేస్తుంటారు. వీటిని రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు స్నానం చేస్తుంటారు. దీనివల్ల సైనస్ సమస్యలు రావచ్చు. తలకు నేచురల్ ప్యాక్స్ వేసుకున్నా గంటలోపు తలను శుభ్రపరుచుకోవడం మంచిది.– డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ (చదవండి: ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
మహాకాళేశ్వరునికి విశేష హారతి.. మువ్వన్నెల వస్త్రం
నేడు(పంద్రాగస్టు) దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వర ఆలయంలో స్వామివారికి విశేష హారతి ఇవ్వడంతోపాటు మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.ఈరోజు తెల్లవారుజామునే మహాకాళేశ్వరుని ముంగిట భస్మహారతి కూడా నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భస్మహారతి అనంతరం మహాకాళేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం మువ్వన్నెల వస్త్రాన్ని సమర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి నుంచే ఆలయం అంతటా ఆకర్షణీయమైన లైట్లను అలంకరించారు. దీంతో ఆలయం మూడు రంగుల కాంతితో వెలుగొందింది. ఆలయం పైభాగంలో జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. ఆలయ పూజారులు తెలిపిన వివరాల ప్రకారం అన్ని హిందూ పండుగలతో పాటు జాతీయ పండుగలను కూడా ఆలయంలో నిర్వహిస్తారు. కాగా భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
ఆకుపచ్చ కూరగాయలు వండేటప్పుడూ రంగు కోల్పోకూడదంటే ..!
ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారాల్లో కీలకమైనవి. ముఖ్యంగా ఆకుకూరలు, బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయాలు ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను ఉంటాయి. ఈ కూరగాయలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ వీటిని వండేటప్పుడు వాటి రంగు విషయమే సమస్య ఉంటుంది. అదేంటంటే..వండేటప్పుడు వాటి శక్తివంతమైన ఆకుపచ్చ రంగును కోల్పోతాయి. ఇది రెసిపీని తక్కువ ఆకర్షణీయంగా ఉండేలా చేస్తుంది. అయితే సరైన వంటపద్ధతులతో ఆకుకూరలు రంగును కోల్పోకుండా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.ఆకుపచ్చ కూరగాయలలో రంగు మార్పుకి కారణం..బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలలో శక్తివంతమైన ఆకుపచ్చ రంగు క్లోరోఫిల్ నుంచి వస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియకు కీలకమైన వర్ణద్రవ్యం. క్లోరోఫిల్ అణువులు ఉష్ణోగ్రత, పీహెచ్ మార్పులకు సున్నితంగా ఉంటాయి. అందువల్లే కూరగాయలు వండినప్పుడు రంగు క్షీణతకు దారితీస్తుందని చెబుతున్నారు. ఎప్పుడైతే ఈ ఆకుపచ్చ కూరగాయాలు ఉష్ణోగ్రతకు గురవ్వుతాయో అప్పుడు దానిలోని క్లోరోఫిల్ అణువు, మెగ్నీషియం అయాన్‌ను కోల్పోయి, ఫియోఫైటిన్గా మారుతుంది. ఫలితంగా మనకు వండిన తర్వాత ఆకుపచ్చ కూరగాయాలు మందమైన ఆలివ్ ఆకుపచ్చ రంగును పోలి ఉంటాయి. అలాగే ఆమ్ల వాతావరణంలో కూడా మరింత వేగవంతంగా రంగును కోల్పోతాయి. రంగు మారకుండా నిరోధించే పద్ధతులు..బ్లాంచింగ్: కూరగాయలు ఆకుపచ్చ రంగును కాపాడుకోవడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతుల్లో ఒకటి బ్లాంచింగ్. ఈ పద్ధతిలో కూరగాయాలను ఉప్పునీటిలో కొద్దిసేపు ఉడకబెట్టడం జరుగుతంది. ఇక్కడ కేవలం క్లోరోఫిల్ క్షీణతను ప్రేరేపించి, మృదువుగా చేసేలా తగినంతగా ఉడికించాలి. ఈ మొత్తం ప్రక్రియకి రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధి పడుతుంది. ఆ తర్వాత షాకింగ్షాకింగ్: బ్లాంచింగ్ చేసిన వెంటనే, కూరగాయలను ఐస్-వాటర్ బాత్కు బదిలీ చేయాలి.. షాకింగ్‌గా పిలిచే ఈ ప్రక్రియలో వంట ప్రక్రియను నిలిపివేసి, శక్తిమంతమైన రంగును లాక్ చేయడంలో సహాయపడుతుంది. ఆకస్మిక ఉష్ణోగ్రత తగ్గుదల కూరగాయలను ఉడికించడం కొనసాగించకుండా వేడిని నిలిపివేస్తుంది. అలాగే వాటి ఆకృతిని, రంగును సంరక్షిస్తుంది.ఆల్కలీన్ నీటితో..వంట నీటిలో కొద్ది మొత్తంలో బేకింగ్ సోడా (ఆల్కలీన్ పదార్ధం) కలపడం వల్ల కూరగాయలు ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవచ్చు. ఆల్కలీన్ వాతావరణం క్లోరోఫిల్‌ను ఫియోఫైటిన్గా మార్చకుండా నిరోధిస్తుంది, తద్వారా ఆకుపచ్చ రంగును కోల్పోకుండా సంరక్షించొచ్చు. ఐతే ఈ పద్ధతిని బహు జాగ్రత్తగా ఉపయోగించాలి.వంట సమయాన్ని తగ్గించడంఆకుపచ్చ కూరగాయలలో రంగు కోల్పోవడానికి ప్రధాన కారణాలలో అతిగా ఉడికించడం ఒకటి. దీనిని నివారించడానికి అవసమైనంత వరకు ఉడికించాలి. అందుకోసం స్టీమింగ్ ప్రక్రియ అద్భుతమైన పద్ధతి. ఈ పద్ధతిలో కూరగాయలు వాటి రంగు, పోషకాలను కోల్పోవు. తక్కువ వ్యవధిలో కూరగాయలను అధిక వేడికి బహిర్గతం చేసి, రంగు, ఆకృతిని కోల్పోకుండా సంరక్షిస్తుంది.ఉప్పునీరు ఉపయోగించడంకూరగాయలను ఉడకబెట్టేటప్పుడు, నీటిలో ఉప్పు కలపడం వల్ల వాటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉప్పు నీటి మరిగే బిందువును పెంచుతుంది మరియు రంగు మార్పులకు కారణమయ్యే ఆమ్లత్వానికి వ్యతిరేకంగా కొంచెం బఫర్‌ను సృష్టిస్తుంది. ఇది కూరగాయల రుచిని కూడా పెంచుతుంది.వంటల్లో ఆమ్ల పదార్థాలను నివారించడంనిమ్మరసం, వెనిగర్ లేదా టొమాటోలు వంటి పదార్థాల కారణంగా వాటి ఆమ్ల స్వభావం రీత్యా ఆకుపచ్చ కూరగాయల రంగును కోల్పోతాయి. అలాంటప్పుడు వీటిని కూర చివరిలో జోడించడం మంచిది. అలాగే ఆకుపచ్చ కూరగాయలను ఉడకబెట్టేటప్పుడు కుండను మూత పెట్టకుండా వదిలివేయడం వల్ల అస్థిర ఆమ్లాలకు గురవ్వవు.త్వరిత వంట పద్ధతులుమైక్రోవేవ్ లేదా స్టైర్-ఫ్రైయింగ్ వండితే.. తక్కువ నీరు, తక్కువ టైంలోనే అయిపోతాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల రంగును సంరక్షించడానికి అద్భుతమైనవి. ఈ పద్ధతుల్లో పరిమితంగా వేడి నీటికి గురి అయ్యేలా చేసి రంగు కోల్పోకుండా చేయొచ్చు.(చదవండి: వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..) -
రంగు మారనున్న వాట్సాప్! త్వరలో అప్డేట్
వాట్సాప్ (WhatsApp) ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు త్వరలో ఆండ్రాయిడ్‌లో రంగు మారనున్నాయి. వాట్సాప్ ఇటీవలి బీటా వెర్షన్లో దీనికి సంబంధించిన మార్పును ఓ ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఇది యూజర్లందరికీ త్వరలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.వాట్సాప్ ఛానెల్ వెరిఫికేషన్ చెక్ మార్క్‌లు మెటాకు చెందిన ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ యాప్‌లైన ఇన్స్టాగ్రామ్ (Instagram), ఫేస్బుక్ (Facebook)లో ఉండే చెక్ మార్క్‌లను పోలి ఉండనున్నాయి. ఫీచర్ ట్రాకర్ WABetaInfo పోస్ట్‌లో ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా వెర్షన్‌ను డౌన్లోడ్ చేసిన టెస్టర్లకు ఇప్పటికే కొత్త బ్లూ చెక్‌మార్క్ అందుబాటులో ఉందని పేర్కొంది .వాట్సాప్‌లో రానున్న కొత్త కలర్ స్కీమ్ కంపెనీ యాప్‌లలో ఏకరూపతను మెరుగుపరుస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ గురించి తెలిసిన యూజర్లకు వారు ఎంగేజ్ చేస్తున్న ఎంటిటీ ప్రామాణికమైనదో కాదో సులభంగా గుర్తించేలా చేస్తుంది.రీడిజైన్ చేసిన వెరిఫికేషన్ టిక్ ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లోని వాట్సాప్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో లేదా వారాల్లో iOSలోని టెస్టర్లకు కూడా అందుబాటులోకి రావచ్చు. అంతిమంగా వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్‌తో సహా అన్ని ప్లాట్‌ఫామ్‌ల కోసం స్థిరమైన అప్డేట్ ఛానెల్లోకి వస్తుంది. -
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్‌గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్‌పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
అంతరిక్షంలోకి దూసుకెళ్లే రాకెట్లు తెలుపు రంగులోనే ఎందుకుంటాయి?
1960 దశాబ్ధంలో చంద్రునిపైకి వ్యోమగాములను తీసుకెళ్లిన సాటర్న్ వీ నుండి నేటి ఫాల్కన్ 9 లేదా ఏరియన్ 5 వరకు చాలా రాకెట్లు తెలుపు రంగులోనే ఉన్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఉన్న సైన్స్ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాకెట్లు ప్రధానంగా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫలితంగా అంతరిక్ష నౌక వేడిగా మారదు. అలాగే లాంచ్ప్యాడ్పై, ప్రయోగ సమయంలో సూర్యుని రేడియేషన్‌కు గురికావడం వల్ల దానిలోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లకు వేడి నుండి రక్షణ దొరుకుతుంది. అధికశాతం అంతరిక్ష నౌకలలో చల్లని ప్రొపెల్లెంట్లను ఉపయోగిస్తారు. చాలా రాకెట్ల మొదటి దశలలో ఉపయోగించే ఆర్పీ-1 ఇంధనంతో పాటు, దాదాపు అన్ని ఇతర ద్రవ ప్రొపెల్లెంట్లు క్రయోజెనిక్ పదార్థాలై ఉంటాయి. వీటిని ద్రవ రూపంలో ఉంచడానికి సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఎంతో అవసరం. ఉదాహరణకు రాకెట్ ఎగువ దశలలో ఉపయోగించే ద్రవ హైడ్రోజన్ -253 ° C (-423 ° F) కంటే తక్కువ ఉష్ణోగ్రతలకు తీసుకురావలసి ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ ఇంధన రకాలతో ఉపయోగించే ఆక్సిడైజర్ -183°C (-297°F) వరకూ చల్లబరిచేలా చూడటం అత్యవవసరం. ఈ ప్రొపెల్లెంట్లను లాంచ్ వెహికల్లోకి పంప్ చేసిన తర్వాత, శీతలీకరణకు మరో మార్గం ఉండదు. అందుకే అవి వేడెక్కడం జరుగుతుంది. దీని వెనుకగల కారణం ఏమిటంటే పలు రాకెట్ ప్రయోగ కేంద్రాలు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే ఉన్నాయి. ఇక్కడ వెచ్చని వాతావరణం వేడి ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. ఇప్పుడు రాకెట్లు ఎందుకు తెలుపు రంగులో ఉంటాయో అర్థమయ్యే ఉంటుంది. స్పెక్ట్రమ్‌లోని అన్ని రంగులలో తెలుపు రంగు అనేది సూర్యకాంతి నుంచి వచ్చే వేడిని గ్రహించకుండా చూడటంలో అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఎండ అధికంగా ఉన్న రోజున తెలుపు రంగు చొక్కా ధరించి, బయట తిరిగినప్పుడు ఈ దృగ్విషయాన్ని ఎవరైనా గమనించవచ్చు. రాకెట్ ఇంజనీర్లు ఈ దృగ్విషయాన్ని ఆధారంగా చేసుకుని.. రాకెట్ అంతర్గత ట్యాంకుల్లోని క్రయోజెనిక్ ప్రొపెల్లెంట్లు వేడెక్కడాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అందుకే లాంచ్ వెహికల్‌కి తెల్లని పెయింట్ వేయడం చవకైన మార్గం అని గుర్తించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా చదవండి: అది ప్రపంచంలోనే అత్యంత విషపూరిత ప్రాంతం.. ఏ జీవికైనా తక్షణం మరణం తధ్యం! -
వీడియో: వెనిస్ మిస్టరీ.. రాత్రికి రాత్రే రంగు మారిపోయింది!
-
అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే..
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) కొత్త రంగులో వస్తోంది. లైమ్ కలర్ వేరియంట్ మే 16 నుంచి భారత్‌లో అమ్మకానికి వస్తోంది. గెలాక్సీ ప్రస్తుతం ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగులలో అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ కానుక.. రూ.64 కోట్లు! ధర, ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కొత్త లైమ్ కలర్ వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది. 8/128 జీబీ ధర రూ. 74,999 కాగా 8/256 జీబీ వేరియంట్ ధర రూ. 79,999. ఈ కొత్త కలర్ వేరియంట్ ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. గెలాక్సీ ఎస్23 కొనేవారికి పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ సీడీ లేదా బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐని ఎంచుకునే వారు నెలకు కేవలం రూ. 3,125 ఈఎంఐతో గెలాక్సీ ఎస్23 ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదనంగా ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఫోన్ యజమానులు రూ.8,000 అప్‌గ్రేడ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు . దీన్న 24 నెలల బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ లేదా హెచ్డీఎఫ్సీ సీడీ పేపర్ ఫైనాన్స్‌తో కలపవచ్చు. అప్‌గ్రేడ్ బోనస్‌ను రూ.5 వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌తో కలపడం మరో ఆప్షన్. దీని వల్ల 8/128 జీబీ వేరియంట్ రూ. 61,999లకు, 8/256 జీబీ మోడల్ ధర రూ.66,999లకు తగ్గుతుంది. ఈ ఆఫర్లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీతో 9 నెలల నో కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు గేమ్ మోడ్‌లో సూపర్ స్మూత్ 6.1 అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50 MP వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా 3,900mAh బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్ట్ 8జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! -
కొత్త రంగుల్లో వెస్పా ఎస్ఎక్స్ఎల్
పుణే: వాహన తయారీ సంస్థ పియాజియో.. వెస్పా ఎస్ఎక్స్ఎల్ వేరియంట్లలో కొత్తగా నాలుగు రంగులను పరిచయం చేసింది. వీటిలో మిడ్నైట్ డిసర్ట్, టస్కనీ సన్‌సెట్, జేడ్ స్ట్రీక్, సన్నీ ఎస్కపేడ్ ఉన్నాయి. ఇప్పటికే ఇవి మార్కెట్లో లభ్యం అవుతున్నాయని కంపెనీ తెలిపింది. ధర తెలంగాణ ఎక్స్‌షోరూంలో రూ.1.32 లక్షల నుంచి రూ.1.51 లక్షల వరకు ఉంది. చదవండి: యాహూ.. అంబులెన్స్ కంటే ముందే వెళ్లా.. నా భార్యను కాపాడుకున్నా! -
బైక్‌కు వేసిన తెల్ల రంగు.. స్నాచర్లను పట్టించింది
సాక్షి,బంజారాహిల్స్: మత్తు పదార్థాలకు అలవాటుపడిన ముగ్గురు యువకులను బైక్ ఆధారంగా పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని సింగాడి బస్తీలో నివసించే ఖాజా పాషా ఇంటర్ చదువుతూ తన స్నేహితులు సబిల్, సొహైల్‌తో కలిసి గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడి మద్యం తాగుతూ బైక్‌పై దూసుకెళ్తూ స్థానికంగా హల్చల్ చేసేవాడు. ప్రత్యేకతను చాటుకోవాలని తన బైక్ వీల్ రిమ్ముకు తెల్ల రంగు వేసి బండిపై తిరిగేవాడు. మూడు రోజుల క్రితం ఇదే బైక్‌పై తన స్నేహితులను కూర్చోబెట్టుకొని వరుసగా ఆరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. సీసీ ఫుటేజీలో బైక్ వీల్ తెల్ల రంగులో ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అన్ని పోలీస్ స్టేషన్ల క్రైం విభాగానికి ఈ సీసీ ఫుటేజీలను పంపించారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు బైక్ ఫొటోల ఆధారంగా అనుమానం ఉన్న ప్రాంతాల్లా పలువురిని వాకబు చేస్తుండగా స్థానికులు ఖాజాపాషా ఇంటిని చూపించారు. పోలీసులు వెళ్లేసరికి ఇంటి ముందు తెల్ల రంగు వీల్‌తో స్నాచర్లు ఉపయోగించిన బైక్ పార్కింగ్ చేసి ఉంది. రాత్రిపూట గంజాయి మత్తులో చేతుల్లో కత్తులు, బ్లేడ్లు పట్టుకొని స్వైర విహారం చేసే ఈ ముగ్గురూ స్నాచర్లని తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. బైక్‌కు వేసిన తెల్ల రంగే స్నాచర్లను పట్టించిందని పోలీసులు తెలిపారు. -
TSRTC: ఆర్టీసీ బస్సు.. అదరహో!
సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు. సొంత డిపోల్లోనే.. ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పట్లో రూ.4 కోట్ల దుబారా.. మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది. -
రంగు మారిన క్వీన్ ఎలిజబెత్ చేతులు.. ఆందోళనలో ప్రజలు
Queen Elizabeth Purple Hands: సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి అయితే ప్రతీది నెట్టింట చక్కర్లు కొట్టడం సహజం. ఒక్కోసారి ఫేక్ వార్తలకు వాళ్లే స్వయంగా బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా క్విన్ ఎలిజబెత్ చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. నవంబర్ 19 న లండన్‌లోని విండ్సర్ కాస్టిల్లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో ఏదో విషయమై క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిద్దరిని ఓ ఫోటో తీయగా, దాన్ని బకింగ్హమ్ ప్యాలెస్ విడుదల చేసింది. వయసు కారణంగా ఇటీవల కొంత కాలంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్విన్ ఎలిజబెత్ చేతులు రంగు మారి కనిపించడంతో ఇంకా తనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే.. ఆ ఫోటోపై రకరకాల అభిప్రాయాలు రావడంతో షేక్స్పియర్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జై వర్మ స్పందిస్తూ.. రెనాడ్స్ అనే వ్యాధి వల్ల అయి ఉండొచ్చు లేదంటే చేతులు చల్లగా అవడం వల్ల ఇలా మారుండచ్చు. జాన్ హోప్కిన్స్ మెడిసిన్ సైట్ ప్రకారం.. కోల్డ్ లేదా స్ట్రెస్ వల్ల చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అలా చేతులు రంగు మారడం సహజమని తెలిపారు. నేషనల్ హెల్త్ సర్వీస్, యూకే ప్రకారం.. అది పెద్దగా సీరియస్ కండిషన్ కాదు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. శరీరానికి కాస్త వేడి తాకితే.. ఆ కండిషన్ మారుతుంది.. అని స్పష్టం చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెట్టడంతో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. The Queen now has zombie hands… wonder why?#boostershot https://t.co/RRVDj31TSd — Matthew Scarsbrook (@mgscarsbrook) November 17, 2021 చదవండి: Pet Dog: కుక్క హెయిర్ డైకి లక్షలు ఖర్చు చేసిన మోడల్, నెటిజన్ల ఆగ్రహం -
ఐపీఎల్ 2021.. టాటా సఫారీ సర్ప్రైజ్ ఎంట్రీ!
త్వరలో దుబాయ్‌లో జరగబోతున్న ఐపీఎల్ 2021 సందర్భంగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేందుకు టాటా సఫారీ సిద్ధమైంది. గత రెండు దశాబ్ధాలుగా భారతీయ రోడ్లపై పరుగులు పెడుతున్న ఈ కారు సరికొత్త రూపంలో దర్శనం ఇచ్చేందుకు బీ రెడీ అంటోంది. గోల్డ్ ఎడిషన్ రెండు దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై టాటా సఫారీలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఈ ఇరవై ఏళ్లలో ఏన్నో కొత్త కార్లు వచ్చినా సఫారీ స్థానం చెక్కు చెదరలేదు. అలాంటి టాటా సఫారీ ఈసారి బంగారు రూపం సంతరించుకోనుంది. గతానికి భిన్నంగా గోల్డ్ ఎడిషన్‌ను తెస్తోంది టాటా మోటార్స్. కొత్త రంగుల్లో ఇరవై ఏళ్లలో టాటా సఫారీలు కేవలం ఐదు రంగుల్లోనే మార్కెట్లోకి వచ్చాయి. అందులో రాయల్ బ్లూ, ట్రోపికల్ మిస్ట్, డేటోనా గ్రే, ఓర్కస్ వైట్, ట్రోపికల్ మిస్ట్ అడ్వెంచర్ వంటి ఐదు రంగుల్లోనే అభిమానులను అలరించింది. కానీ ఈ సారి ఏకంగా పూర్తిగా బంగారు రంగులో రాబోతుంది. ఐపీఎల్ 2021కి టాటా మోటార్స్ అఫీషియల్ స్పాన్సర్‌గా ఉంది. దీంతో ఐపీఎల్ వేదికగా గోల్డ్ ఎడిషన్‌ను పరిచయం చేనుంది. స్పెషల్ ఎడిషన్స్ ఇప్పటికే టాటా సంస్థ ఆల్ట్రోజ్‌లో గోల్డ్ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత సఫారీకి ఈ ఎడిషన్‌ను విస్తరించనుంది. గోల్డ్ ఎడిషన్‌తో పాటు హారియర్ కార్లలో డార్క్ ఎడిషన్‌ను కూడా ప్రత్యేకంగా తెచ్చింది టాటా మోటార్స్. టాటా సఫారీలో 2 లీటర్ టర్బో ఛార్జెడ్ కైరోటీ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 1750 నుంచి 2500 రేంజ్లో ఆర్‌పీఎంని అందిస్తుంది. టాటా సఫారీ ఎక్స్‌షోరూం ధరలు రూ.14.99 లక్షల నుంచి ప్రారంభం అవుతున్నాయి. Tata Safari is officially sponsor of Vivo IPL 2021 and likely to unveiled its GOLD edition in this festive season.@TataMotors @TataSafariIndia @tatasafarigold @IPL#TataSafari #TataSafariGold pic.twitter.com/HsfPCXQVTZ — Team Ignition (@TeamIgnition2) September 14, 2021 చదవండి : Neeraj Chopra: ‘టాటా ఏఐఏ’ బ్రాండ్ అంబాసిడర్‌గా నీరజ్ చోప్రా -
టీడీపీ ఆగడాలు: పంచాయతీ భవనాలకు ‘పచ్చ’ రంగు
పర్చూరు: అధికార పక్షంలో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ‘పచ్చ’ రంగులు వేసుకొని తరించిన నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలోను వారి ఆగడాలు ఆగడం లేదు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం గ్రామ సర్పంచ్‌గా 26 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. దీంతో ఆ పార్టీ నేతలు ఏకంగా పంచాయతీ కార్యాలయానికి గురువారం పచ్చ రంగు వేసేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రటరీ శుక్రవారం పచ్చ రంగును తొలగించి తెలుపు రంగు వేయించారు. ఏడుగుండ్లపాడులో.. ఒంగోలు: సచివాలయాలకు పార్టీ రంగులు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు నానా యాగీ చేసి కోర్టును ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో టీడీపీ మద్దతుదారు సర్పంచ్‌గా గెలుపొందడం, శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందంటూ టీడీపీ నేతలు గ్రామ సచివాలయం బోర్డుకు పసుపు రంగులు వేశారు. చదవండి: బాబు వ్యూహం.. కేశినేనికి చెక్! బాబు ఊకదంపుడు.. జారుకున్న జనం! -
జాతీయ జెండాకు అవమానం
జిల్లా సచివాలయం పైన రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ జెండాకు అవమానం జరిగింది. జెండాలోని తెలుపు వర్ణం కాస్తా పసుపు మయంగా మారినా, అధికారులు గుర్తించలేదు. రంగు మారిన జెండా అంశం కాస్తా ... బుధవారం ప్రసార మాధ్యమాల్లో ప్రసారం కావడంతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సమయం, సందర్భం లేకుండా రంగు వెలిసిపోయిన జెండాను కిందకు దించేసి అప్పటికప్పుడు కొత్త జెండాను తీసుకువచ్చి ఎగురవేయడం కలెక్టరేట్లో చర్చనీయాంశమైంది. - డి. హుసేన్, సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
సముద్రానికి వెండిపూత
‘సంద్రంలో ఆశల హరివిల్లు... ఆనందాలే పూసిన పొదరిల్లు.. అందమైన ఆ లోకంలో అందుకోనా.. ఆదమరిచి కలకాలం ఉండిపోనా..’ అన్నట్టు ఉంది కదూ ఈ చిత్రం. సంద్రమంతా వెండిపూత పూసుకున్నట్టు...ఒళ్లంతా సింగారించుకుని సిటిజనులను కనువిందు చేసింది. జస్ట్ సూరీడు నిద్రలేచే వేళ..సముద్రం వెండివెలుగుల్లో ముస్తాబైంది. కనుచూపు మేరలో వెండివర్ణం సాక్షాత్కరించింది. – డాబాగార్డెన్స్ -
కలర్స్
పాఠశాలల్లో ప్రత్యేక దినోత్సవాలు ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు అవగాహన, ఆనందం సప్తగిరికాలనీ : జీవితం రంగులమయం. సంతోషం, దుఃఖం, హాస్యం, ప్రమాదం.. ఇలా ఒక్కో దానికి ఒక్కో రంగు. జీవితంలో సప్తవర్ణాలది విడదీయరాని బంధం. తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఉదా, నీలం.. దేనికదే ప్రత్యేకం. ఈ రంగులపై ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నాయి. విద్యాసంస్థల్లో రంగుల దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. వారంలో ఒక రోజును ఎంపిక చేసి ఒక కలర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ కలర్స్ డే గురించి కలర్ఫుల్గా తెలుసుకుందాం.. ఒలింపిక్ రంగులు ఒలింపిక్స్ అంటే చాలా మందికి తెలుసు. నాలుగేళ్లకోసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే క్రీడల లోగోలో ఐదు వలయాలు ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో రంగు ఉంటుంది. ఆ రంగు ఒక్కో ఖండాన్ని సూచిస్తుంది. నేటి కాలంలో విద్యాసంస్థలు చేపడుతున్న రంగుల దినోత్సవాల్లో ముఖ్యంగా ఈ ఐదు రంగులకు ప్రాధాన్యతనిస్తున్నారు. పసుపు రంగు–ఆసియా, ఎరుపు–అమెరికా, నీలం–యూరప్, నలుపు–ఆఫ్రిక, ఆకుపచ్చ–ఆస్ట్రేలియా ఖండాలకు సూచికలని విద్యార్థులకు బోధిస్తున్నారు. నిర్వహణ ఇలా.. రంగుల దినోత్సవాలకు వారంలో ఒక రోజు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రోజు ఒక రంగును ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన రంగుల దుస్తులను విద్యార్థులు వేసుకుని వస్తారు. దీంతోపాటు ఆ రంగుకు సంబంధించి ఇంట్లో, బయట కనిపించే ప్రతి వస్తువును పాఠశాలకు తీసుకొస్తారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులందరు ఒక చోటు కూర్చుంటారు. వారు తెచ్చిన వస్తువులను అందంగా ఒక చోట అలంకరిస్తారు. టీచర్స్ ఏం చెబుతారు ఒక చోట కూర్చున్న విద్యార్థులకు ఉపాధ్యాయుల ఆ రంగు ప్రత్యేకతను వివరిస్తారు. ఉదాహరణకు రెడ్ కలర్ తీసుకుంటే...రంగులలో పెద్దన్న పాత్ర రెడ్ అని విద్యార్థులకు చెబుతారు. టమాట, ఆపిల్ రెడ్ కలర్ ఉంటాయని చెబుతారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు కనిపించే ట్రాఫిక్ సిగ్నల్‌లోనూ రెడ్ రంగు ఉంటుందని వివరిస్తారు. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆపాలని తెలుపుతారు. అదే విధంగా రెడ్ సిగ్నల్ ఎక్కడ కన్పించిన ఆది ప్రమాదానికి సంకేతమని వివరిస్తారు. ఇలా రెడ్ కలర్ ప్రాముఖ్యతను వివరిస్తారు. రంగుల సారాంశం ఎరుపు : ప్రమాద హెచ్చరికగా, ఫ్యాషనబుల్ పవర్ఫుల్ ఆరేంజ్ : స్నేహపూరితం, ఉత్సాహవంతం పసుపు : సంతోషం, తెలివికి నిదర్శనం నీలం : మంచి ఆలోచనలకు, ప్రశాంతతకు చిహ్నం నలుపు : కోపానికి, నిరసన, సంతాపానికి, తదితర వాటికి చిహ్నం తెలుపు : శాంతికి చిహ్నం, కొత్తదనానికి నిదర్శనం అంటు ఇవే కాకుండా అన్ని రంగుల సారాంశాన్ని ఇలా విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తారు. హల్చల్గా ముస్తాబు కలర్స్ డే నిర్వహించే రోజు ఆ రంగుతో ముస్తాబు చేస్తారు. బెలూన్లు, కలర్ పేపర్లు, డెకరేషన్ అదే రంగులో అదిరేలా చేస్తారు. రంగులకు సంబంధించిన వస్తువులు, వాటి ప్రత్యేకతను తెలిపేలా అమర్చుతారు. అవగాహన కోసం రంగులపై చిన్న వయసులోనే అవగాహన కల్పించేందుకు వెరైటీగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నేటి కాలంలో కలర్స్‌కు ప్రాముఖ్యత పెరిగింది. ఒక్కో కలర్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. అది ఏమిటో విద్యార్థులకు తెలిపేందుకే ఈ ప్రయత్నం. – ఎల్.రాజయ్య, లెజెండ్ స్కూల్ కరస్పాండెంట్ తెలిసింది శాటర్డే నాడు మా స్కూల్ బ్లూ కలర్ డే చేశారు. మా టీచర్ బ్లూ కలర్ గురించి వివరించారు. స్కూల్లో అందరం బ్లూ డ్రెస్సులు వేసుకొచ్చాం. ఇంకా బ్లూ బెలూన్లు కూడా తెచ్చాం. స్కూల్ ఎన్విరాన్మెంట్ ఆకాశంలా అనిపించింది. – హాసిని వారానికి ఒక రోజు స్కూల్లో వీక్లీ ఒక రోజు కలర్ డేను పెట్టారు. మొన్న రెడ్, నిన్న గ్రీన్ డేలు చేశారు. అందరం చాలా ఎంజాయ్ చేశాం. అసలు మాకు రంగులకు ఒక ప్రత్యేకత ఉంటుందని తెలియదు. స్కూల్ లో రంగుల డేలు చేయడంతో వాటి గురించి తెలిసింది. – ప్రణయ్ -
టీబి డ్యాం నీటి కోసం ఎదురుచూస్తున్న పల్లెవాసులు
– ఆదోనిలో తీవ్రమైన తాగు నీటి ఇబ్బందులు – పక్షం రోజుల్లోనే 37 టీయంసీలు చేరిక కర్నూలు సిటీ: జిల్లాలో నెలన్నర రోజులుగా అడపా దడపా వర్షాలు కురుస్తున్నాయి. కానీ కుంటలు, చెరువుల్లో నీటి నిల్వలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో జిల్లాలోని పశ్చిమ ప్రాంత పల్లెల్లో తాగు నీటి ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నీటి పథకాల ట్యాంకుల్లోని నీటి నిల్వలు అడుగంటిపోయాయి. పశ్చిమ పల్లె వాసుల దాహాం తీర్చే ప్రధాన జలసిరి ఎల్ఎల్సీ కాల్వ. తుంగభద్ర జలాశయంలో నీరు లేకపోవడంతో దాదాపు మూడు నెలల నుంచి కాల్వలకు నీటి విడుదల ఆగిపోయింది. ఈ కాల్వ నీటిపై 17 రక్షిత తాగు నీటి పథకాలు 165 గ్రామాల ప్రజల తాగు నీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. అధికారులేమె వర్షాలు వచ్చాయి..తాగు నీటి ఇబ్బందులు లేవని అంటున్నారు. తాగు నీటి అవసరాలను దష్టిలో పెట్టుకొని ఎల్ఎల్సీకి టీబి డ్యాం నుంచి నీరు విడుదల చేయాలని జల వనరుల శాఖ ఇంజనీర్లకు వినతులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయం తుంగభద్ర డ్యాం. పక్షం రోజులుగా కర్ణాటక పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల సుమారు 37 టీయంసీల నీరు డ్యాంలోకి చేరడం గమనర్హం. భారీగా వరద నీరు చేరుతుండడంతో జిల్లా దిగువ కాల్వ(ఎల్ఎల్సీ) ఆయకట్టుదారుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. దీంతో మొదటగా తాగు నీటి అవసరాల కోసం కాల్వకు నీరు ఇవ్వాలని జల వనరుల శాఖ ఇంజనీర్లు బోర్డును కోరనున్నారు. ఇండెంట్లో పెట్టేందుకు ఇటీవలే జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్ సీహెచ్.విజయమోహన్‌కు నోట్ పెట్టారు. ఇండెంట్ పెట్టేందుకు అనుమతులు ఇస్తే రెండు, మూడు రోజుల్లో ఇండెంట్ పెట్టే అవకాశం ఉంది. తుంగా జలాల కోసం ఆశగా.. కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోని శివమొగ్గ, ఆగుంటె, చిక్కమగళూరు, మొరాళ, తీర్థహళ్ళి, మందగడ్డె ప్రాంతాల్లో 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల డ్యాంలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో పక్షం రోజుల్లోనే డ్యాంలోకి సుమారు 37 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో సుమారు 40 టీయంసీకు చేరింది. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా ఆదోని మున్సిపాలిటిలో తీవ్రమై తాగు నీటి ఇబ్బందులు ఉన్నాయని వినతులు రావడంతో జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్‌కు నోట్ పెట్టారు. డ్యాం నుంచి నీరు విడుదల చేయాలంటే కర్ణాటక ఇండెంట్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టాలి. కర్ణాటక ప్రస్తుతం కూడ బళ్ళారి ప్రాంతాల్లో నెలకొన్న తాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నెల 21వ తేదినే ఇండెంట్ పెట్టనున్నటు తెలిసింది. గతేడాది కూడ ఇదే సమయంలోనే ఇండెంట్ పెట్టారు. గతేడాది జూలై 25 నాటీకి ఎల్ఎల్సీ కాల్వ ఏపీ సరిహద్దుకు నీరు చేరినట్లు అ«ధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్‌కు నోట్ పెట్టాం టీబి డ్యాంకు భారీగానే వరద నీరు వస్తుంది. జిల్లాలోని పశ్చిమ పల్లెల్లో తాగు నీరు ఇబ్బందులు ఉన్నాయని వినతులు వస్తున్నాయి. ఇటీవలే ఆదోని మున్సిపాలిటీ వారు ఎల్ఎల్సీ కాల్వకు నీరు విడుదల అయ్యేలా చూడాలని విన్నివించారు. ఈ విషయం కలెక్టర్‌కు నోట్ పెట్టాం. తాగు నీటికి ఇండేంట్ పెట్టుకునేందుకు కలెక్టర్ ఓకే చెబితే కర్ణాటక వారితో కలిసి ఇండేంట్ పెడతాం. – యస్.చంద్రశేఖర్ రావు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ -
రంగు వెలసిన జీవితం
– పెయింటర్ మారిన సర్పంచ్ సంజామల: ఆయన ఓ గ్రామానికి సర్పంచ్.. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపాల్సిన ప్రజాప్రతినిధి. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు. నేడు బతుకు జీవుడా అంటూ పెయింట్ బ్రష్ పట్టాడు. గ్రామంలో మిద్దెలకు రంగు వేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. సంజామల గ్రామ సర్పంచ్ దీనగాథ ఇది.. మిద్దె పెద్ద వెంకటసుబ్బన్న..గత పంచాయతీ ఎన్నికల్లో సంజామల సర్పంచ్‌గా ఎన్నియ్యాడు. ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరం పూర్తి కావడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోందని భావించి ఆ వర్గం నేతలు సర్పంచ్‌తో మెడికల్ లీవ్ పెట్టించారు. దీంతో ఉప సర్పంచ్‌గా ఉన్న గంగా ఈశ్వరయ్యకు సర్పంచ్‌గా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సర్పంచ్ పదవికి సెలవు పెట్టి పెద్ద వెంకట సుబ్బన్న పెయింటింగ్ వేసే కూలీ పనికి వెళుతున్నాడు. గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఇళ్లకు పెయింటింగ్ వేసే పనుల్లో నిమగ్నమయ్యాడు. గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ ఆనందమ్మ ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఇదిలా ఇలా కనిపించాడు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న సర్పంచ్‌ను తెలుగు తముళ్లు అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ ఒత్తిడి తెచ్చి మెడికల్ లీవ్ పెట్టించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బిర్యానీలో కూడా!
కోల్ కతా: బ్రెడ్ తయారీలో రసాయనాల మోతాదు ఎక్కువగా ఉంటున్నాయని, వాటివల్ల కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిన్న మొన్నటి వరకు గగ్గోలు పుట్టింది. ఆ విషయాన్ని మరువక ముందే ప్రజలందరూ బాగా ఇష్టపడే బిర్యానీలో కూడా రసాయనాలు కలుపుతున్నట్లు తేలింది. దీనిపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించింది. బిర్యానీ తయారీలో సింథటిక్ రసాయనాలను వాడుతున్నట్లు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎమ్ సీ) అధికారులు నిర్ధారించారు. నగరంలో వివిధ రెస్టారెంట్లు, హోటళ్లలో సేకరించిన బిర్యానీలపై నిర్వహించిన పరీక్షల్లో అత్యధిక శాతం కేన్సర్ కారకంగా భావించే మెటానిల్ ఎల్లో అనే పదార్థం ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. బిర్యానీలో బియ్యం పసుపు రంగులోకి మారడానికి సాధారణంగా కుంకుమపువ్వును ఉపయోగిస్తారని కానీ, యజమానులు మెటానిల్ ఎల్లో అనే రసాయనం వాడుతున్నట్లు గుర్తించామని వివరించారు. దీన్ని సాధారణంగా పారిశ్రామిక అవసరాలకు ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వుతో పోలిస్తే మెటానిల్ ఎల్లో ధర తక్కువ కావడం వల్లే రోడ్డు మీద అమ్మే వారి నుంచి హోటళ్ల వరకు దానిని ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ఫుడ్ టెక్నాలజీ నిపుణులు తెలిపారు. కాగా, బ్రెడ్, బన్, పావ్ బాజీ, పిజ్జా తదితర బేకరీ ఐటమ్స్‌లో రసాయనాలను అధికమోతాదులో ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలడం ఇప్పటికే కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. తాజాగా బిర్యానీల్లో కూడా రసాయనాల వినియోగిస్తుండటంతో రాష్ట్ర ఆహార సంస్థకు ఈ విషయమై నివేదికను పంపింది. రసాయనాలు కలిపిన బిర్యానీని తయారుచేస్తున్న హోటళ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను న్యాయసలహాలను కోరింది. -
మనం రంగు మారొచ్చు!
ఊసరవెల్లి గురించి తెలుసుకదూ. చర్మం రంగులు మార్చగలగడం దాని ప్రత్యేకత. అలాగే సముద్రంలో నివసించే అనేక జీవులు ఇతర వేట జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు చర్మం రంగును మారుస్తుంటాయి. అవి ఉన్న ప్రదేశానికి అనుగుణంగా తమ రంగును మార్చుకుని వాటిని వేటాడే జీవులను బోల్తా కొట్టిస్తుంటాయి. ఆ జీవి రంగు అక్కడి ప్రదేశంలో కలిసిపోయి ఉండడంతో వేరే జీవులేవీ వాటిని గుర్తించలేవు. తద్వారా అవి రక్షణ పొందుతాయి. ఇలా చర్మం రంగులను మార్చగలిగే లక్షణం అనేక సముద్ర జీవులకు ఉంది. రంగులు మార్చే చర్మం వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని భావించిన శాస్త్రవేత్తలు ఇలాంటి కృత్రిమ చర్మాన్ని రూపొందించారు. చర్మం రంగు ఎలా మారుతుంది.. ఆక్టోపస్, కొన్ని రకాల చేపలు, ఇతర సముద్ర జీవులు చర్మం రంగును మార్చుకోగలవు. ఆయా జీవుల్లో ఉండే హరితకాలు అనే కణజాలాల వల్ల చర్మం రంగు మారుతుంది. ఈ జీవుల చర్మంపై వర్ణద్రవ్య సంచులు ఉంటాయి. కణజాలం చుట్టూ ఉన్న కండరాలు వర్ణద్రవ్యం సాగేలా చేస్తాయి. అక్కడి పరిసరాలు ఏ రంగులో ఉంటే ఆ రంగుకు అనుగుణంగా ఈ వర్ణద్రవ్యంరంగు మారుతుంది. దీని వల్ల ఆయా జీవుల రంగు పరిసరాల్లో కలిసిపోతుంది. ఈ మార్పులను ఆధారంగా చేసుకుని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని రూపొందించారు. ఎలా రూపొందించారు: రంగులు మారే కృత్రిమ చర్మం రూపొందించేందుకు శాస్త్రవేత్తలు సున్నితమైన, సాగే గుణం ఉన్న కండరాలు కలిగిన చర్మం లాంటి పదార్థాన్ని తయారు చేశారు. ఇది ఎలక్ట్రానిక్ తరంగాల ద్వారా అవసరమైన రూపం, రంగు, పరిమాణంలోకి మారగలదు. ఈ చర్మంలాంటి పదార్థంపై రంగులు గల మచ్చల్ని ఏర్పాటు చేశారు. ఈ పదార్థం పరిమాణం, ఆకారం మారినప్పుడు ఈ మచ్చలు కూడా వెంటనే మారిపోతాయి. ఎలక్ట్రానిక్ తరంగాలకు అనుగుణంగా ఈ మచ్చలు కావాల్సిన రంగులోకి మారిపోతాయి. మరో శాస్త్రవేత్తల బృందం కూడా ఇటీవల ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నే తయారు చేసింది. ఈ పరికరంలో కాంతి, ఉష్ణోగ్రత సెన్సర్లు ఉంటాయి. అవి పరిసరాల్లోని రంగుకు అనుగుణంగా కాంతిని ప్రసరింపజేస్తాయి. పరిసరాల్లో ఏ రంగు ఉంటే ఆ రంగు కాంతిని ఇవి ప్రసరిస్తాయి. ఇలా రంగులు మార్చే చర్మంలాంటి ఉత్తత్తులు అందుబాటులోకి వస్తే సైన్యం, రక్షణ సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. -
హోలీడే...జాలీడే..!
హోలీ..రంగుల వాన. కోప,తాపాలను కాసేపు గట్టుమీద పెట్టి అంతా చిందులేసుకుంటూ చేసుకునే ‘వర్ణ’ సంబరం. కాముని పున్నమి సందర్భంగా జిల్లా అంతటా ఆనందం చిందింది. పట్టణ రోడ్లు మొదలుకొని...పల్లె లోగిళ్ల వరకూ పరస్పరం అభినందనలు చెప్పుకుంటూ..వయో బేధం లేకుండా ఆడారు. పెద్దలు చిన్నపిల్లలై గంతులేస్తే..చిన్నారులు అవధుల్లేని...సందడి చేశారు. డప్పులు మోగించి..నాట్యం చేశారు. కేరింతలతో..కొత్త అందం తెచ్చారు. తీన్మార్ దరువు, ఉత్సాహ పరిచే పాటలకు చిన్నాపెద్ద స్టెప్పులే శారు. కేరింతలు కొడుతూ.. ఈలలు వేస్తూ హోలీరోజు చిందులేశారు. ఉత్సాహంగా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఎన్నికలు సమయం కావడంతో వివిధ పార్టీల నాయకులు వేడుకల్లో ప్రేత్యేక ఆకర్షణగా కనిపించారు. రంగునీళ్లతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. జిల్లాస్థాయి అధికారులు, మహిళలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు.