Queen Elizabeth Purple Hands: సోషల్‌మీడియా వాడుకలో వచ్చినప్పటి నుంచి ఏ విషయాన్ని దాచలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అందులో కొన్ని వాస్తవాలు, మరికొన్ని అవాస్తవాలు ఉంటున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి అయితే ప్రతీది నెట్టింట చక్కర్లు కొట్టడం సహజం. ఒక్కోసారి ఫేక్ వార్తలకు వాళ్లే స్వయంగా బదులిచ్చిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా క్విన్ ఎలిజబెత్ చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. నవంబర్ 19 న లండన్‌లోని విండ్‌సర్ కాస్టిల్‌లో డిఫెన్స్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్‌తో ఏదో విషయమై క్వీన్ ఎలిజబెత్ భేటీ అయ్యారు. ఆ సమయంలో వారిద్దరిని ఓ ఫోటో తీయగా, దాన్ని బకింగ్‌హమ్ ప్యాలెస్ విడుదల చేసింది. వయసు కారణంగా ఇటీవల కొంత కాలంగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్విన్ ఎలిజబెత్ చేతులు రంగు మారి కనిపించడంతో ఇంకా తనకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు.
అయితే.. ఆ ఫోటోపై రకరకాల అభిప్రాయాలు రావడంతో షేక్‌స్పియర్ మెడికల్ సెంటర్‌కు చెందిన డాక్టర్ జై వర్మ స్పందిస్తూ.. రెనాడ్స్ అనే వ్యాధి వల్ల అయి ఉండొచ్చు లేదంటే చేతులు చల్లగా అవడం వల్ల ఇలా మారుండచ్చు. జాన్ హోప్‌కిన్స్ మెడిసిన్ సైట్ ప్రకారం.. కోల్డ్ లేదా స్ట్రెస్ వల్ల చేతులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అలా చేతులు రంగు మారడం సహజమని తెలిపారు. నేషనల్ హెల్త్ సర్వీస్, యూకే ప్రకారం.. అది పెద్దగా సీరియస్ కండిషన్ కాదు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. శరీరానికి కాస్త వేడి తాకితే.. ఆ కండిషన్ మారుతుంది.. అని స్పష్టం చేసింది. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారడంతో నెటజన్లు తమకు తోచినట్లుగా కామెంట్లు పెట్టడంతో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
The Queen now has zombie hands… wonder why?#boostershot https://t.co/RRVDj31TSd
— Matthew Scarsbrook (@mgscarsbrook) November 17, 2021
చదవండి: Pet Dog: కుక్క హెయిర్ డైకి లక్షలు ఖర్చు చేసిన మోడల్, నెటిజన్ల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment