రికార్డు ధరకు నెపోలియన్‌ టోపీ | Napoleon Bonaparte hat Sells for Record | Sakshi
Sakshi News home page

Napoleon Bonaparte: రికార్డు ధరకు నెపోలియన్‌ టోపీ

Published Mon, Nov 20 2023 7:58 AM | Last Updated on Mon, Nov 20 2023 8:58 AM

Napoleon Bonaparte hat Sells for Record - Sakshi

నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు  నెపోలియన్ సంతకం ఉంటుంది.

ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్‌ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు.  

వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. 
ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement