nepolian
-
నటుడి కుమారుడి పెళ్లిపై కామెంట్లు.. ఆమె జీవితం నాశనం అంటూ..
ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్ త్వరలో తన పెద్ద కుమారుడు ధనుష్‌కు వివాహం చేయనున్నాడు. జబ్బు కారణం చేత వీల్ ఛైర్‌కే పరిమితం అయిన కుమారుడికి వివాహం చేయడం ఏంటి అంటూ కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది. చిత్ర పరిశ్రమలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నెపోలియన్ ఆపై పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అయితే, కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీ, సొంతూరిని విడిచిపెట్టి కుమారుడి ఆరోగ్యం కోసం అమెరికాలో సెటిలైపోయారు.నెపోలియన్ కుమారుడు ధనుష్‌కు నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' (కండరాల బలహీనత) అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఇప్పుడు ఆయనకు పెళ్లి చేస్తుండటంతో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన అక్షయతో ధనుష్ వివాహం ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనుంది. అందుకు జపాన్ వేదిక కానుంది. వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే వీడియో కాల్ ద్వారా జరిగింది. అమెరికా నుంచి చెన్నైకు వచ్చేందుకు ధనుష్ ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.కొద్దిరోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా నెట్టింట జరుగుతున్న చర్చ వివాదానికి దారి తీస్తుంది. కండరాల బలహీనతతో వీల్ చైర్‌కు పరిమితం అయిన కుమారుడికి ఇప్పుడు పెళ్లి చేసి మరో యువతి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్న నెపోలియన్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. పెళ్లి తర్వాత ఆమె కేవలం ఒక నర్సుగా మాత్రమే ధనుష్‌తో ఉండగలదని తెలుపుతున్నారు. ధనుష్ అరుదైన వ్యాధితో ఇన్నేళ్ల పాటు జీవించడమే గొప్ప విషయం అంటూ చెప్పుకొస్తున్నారు. అతనితో ఆమె సంతోషంగా ఎలా జీవించగలదంటూ ప్రశ్నిస్తున్నారు.డాక్టర్ సలహాతో పెళ్లిమయోపతి వైద్యుని నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ధనుష్‌కు పెళ్లి చేస్తున్నట్లు ఆయన కుటుంబ సన్నిహితులు తెలుపుతున్నారు. నెపోలియన్ నిర్మించిన మయోపతి ఆసుపత్రి వైద్యుడు డానియల్ ఇలా చెప్పారు. 'కండరాల బలహీనత ఉన్న వ్యక్తులు వివాహానికి పనికిరారని చెప్పడంలో నిజం లేదు. ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నవారిలో కొందరు ఇప్పటికే వివాహమై పిల్లలతో జీవిస్తున్నారు.' అని ఆయన చెప్పారు. ధనుష్‌కు వివాహం చేయవచ్చని తాజాగా ఆయన చేసిన కామెంట్ నెట్టింట వైరల్ అవుతుంది. ధనుష్ గురించి అక్షయ్‌కు అన్నీ తెలుసని డాక్టర్ చెప్పారు. వైద్యుల సలహా మేరకు పెళ్లి కుదిరిందని, ధనస్సు, అక్షయ ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుని ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నారని మయోపతి డాక్టర్ డేనియల్ తెలిపారు. View this post on Instagram A post shared by Sam Anto (@sam_anto_official) -
స్థితప్రజ్ఞత: నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి..
మహావీరుడు, ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి సెయింట్ హెలీనా అనే దీవిలో యుద్ధ ఖైదీగా ఉన్న కాలమది. ఆయన ఆరోగ్యాన్ని గమనించడానికి ఓ డాక్టర్ని నియమించారు. ఓరోజు నెపోలియన్, డాక్టరూ కలిసి ఓ బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ పోతున్నారు.కాసేపటికి వారిద్దరూ ఓ ఇరుకు మార్గంలోకి చేరుకున్నారు. అప్పుడు ఎదురుగా ఒక సాధారణ మహిళ నడుచుకుంటూ వస్తోంది. పక్కకు తప్పుకుని నెపోలియన్ తనకు దారి ఇస్తారని అనుకుంది ఆ స్త్రీ. కానీ డాక్టర్ ఆమెతో ‘ఇదిగో ఆయన ఎవరనుకున్నావు... నెపోలియన్ చక్రవర్తి. పక్కకు తప్పుకో. ఆయన ముందుకు పోవడానికి నువ్వే పక్కకు తప్పుకోవాలి’ అన్నాడు.వెంటనే నెపోలియన్ ‘ఇప్పుడు మీతో ఉన్నది నెపోలియన్ చక్రవర్తి కాదు. ఓ మామూలు వ్యక్తి అయిన నెపోలియన్. ఇతరులు పక్కకు తప్పుకుని నాకు దారివ్వాల్సిన స్థితి కాదిప్పుడు నాది. ఓ మామూలు స్త్రీ కైనా నేనే పక్కకు తప్పుకుని దారివ్వక తప్పదు. అలా దారివ్వడం వల్ల నేనేమీ బాధ పడబోన’ని చెప్పాడు.నెపోలియన్ తన జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా చూసి పరిస్థితికి తగినట్లే వ్యవహరించిన వ్యక్తి. ‘ఎప్పుడూ గెలుపు నా పక్షమే అని అనుకోను. ఓటమిని చవిచూడడం నాకు తెలుసు. గెలుపోటములను ఒకేలా చూసిన వ్యక్తిని నేను’ అని చెప్పాడు. ఈ మానసిక పరిపక్వత కలవారిని స్థితప్రజ్ఞుడిగా భగవద్గీత చెప్పనే చెప్పింది.విజయం సాధించినప్పుడు విర్రవీగలేదు. పరాభవం పొందినప్పుడు డీలా పడలేదు. రెండిటినీ సమానంగా చూశాడు. స్వీకరించాడు. ఈ మానసిక పరిపక్వత వల్ల జీవితంలో దేన్నయినా అధిగమించవచ్చు. అది మనిషిని దెబ్బతీయదు. పైపెచ్చు ఎప్పుడూ నిలకడగా ఉంచుతుంది. – యామిజాల జగదీశ్ -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
బాప్రే!.... నెపోలియన్ ఖడ్గం వేలంలో రూ. 21 కోట్లు పలికిందట!
Napoleon Sword And Pistol From 1799 Coup: చాలామంది రాజుల కాలం నాటి వస్తువులను సొంతం చేసుకువాలనే కాక వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అవి వేల ఏళ్ల నాటి చరిత్రకు అత్యంత విలువైన ఆనావాళ్లు. అలాంటి ఒక గొప్ప సైన్యాధ్యక్షుడు, ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపొలియన్ 1799లో తిరుగుబాటు చేసినప్పుడు ఉపయోగించిన కత్తి, తుపాకులు తదితర వస్తువులు వేలంలో అత్యధిక ధర పలికాయట. (చదవండి: జైలును ఆర్ట్ సెంటర్‌గా మార్చడం కోసం... కోట్లు సేకరిస్తున్నాడు!!) అసలు విషయంలోకెళ్లితే 1799లో తిరుగుబాటు జరిగినప్పుడు నెపోలియన్ బోనపార్టే తీసుకెళ్లిన ఖడ్గం అతని ఇతర ఐదు తుపాకీలు వేలంలో $2.8 మిలియన్ల(రూ.21 కోట్లు)కి అమ్ముడయ్యాయని యూఎస్ వేలందారులు ప్రకటించారు. ఈ మేరకు ఇల్లినాయిస్కు చెందిన రాక్ ఐలాండ్ వేలం కంపెనీ అమ్మకానికి ఉంచిన ఈ విలువైన వస్తువులను ఒక అజ్ఞాత వ్యక్తికి ఫోన్ ద్వారా విక్రయించినట్లు కంపెనీ అధ్యక్షుడు కెవిన్ హొగన్ తెలిపారు. పైగా ఆ వ్యక్తి నెపోలియన్ ధరించిన వస్తువులను కొనుగోలుచేసి చాలా అరుదైన చరిత్రను తన ఇంటికి తీసుకువెళుతున్నాడు అని హొగన్ అన్నారు. అయితే ఖడ్గం, ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులు విలువ వేలం ప్రారంభంలోనే $1.5 మిలియన్(రూ. 11 కోట్లు) నుండి $3.5 మిలియన్(రూ. 28 కోట్లు)వరకు పలికింది. అంతే కాదు ఈ విలువైన ఆయుధాలను వెర్సైల్స్‌లోని రాష్ట్ర ఆయుధ కర్మాగారానికి డైరెక్టర్‌గా ఉన్న నికోలస్-నోయెల్ బౌటెట్ తయారు చేశారు. అయితే నెపోలియన్ చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన తర్వాత తన ఖడ్గాన్ని జనరల్ జీన్-అండోచే జునోట్‌కి అందించాడని, తదనంతరం జనరల్ భార్య అప్పులు తీర్చడానికి దానిని అమ్మవలసి వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు. పైగా ఈ ఏడాది మేలోనే ఫ్రాన్స్ నెపోలియన్ మరణ ద్విశతాబ్ది వేడుకలను జరుపుకోవడం విశేషం. (చదవండి: అమెరికా నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) -
మొండికేస్తున్న సోమాలియన్లు...
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ పోలీసులకు పట్టుబడిన సోమాలియన్లలో ఒకరు ఇంకా నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయారు. ఇతడితో సహా మొత్తం ఎనిమిది మంది తమ స్వదేశానికి వెళ్లడానికి విముఖత చూపడంతో సిటీ అధికారులు ఐక్యరాజ్య సమితి సహాయం కోరారు. యూనైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ (యుఎన్‌హెచ్‌ఆర్‌సీ) జోక్యంతో ఏడుగురికి వివిధ స్కాండెనేవియన్ దేశాలు శరణార్థులుగా ఆశ్రయం కల్పించగా.. ఒకరికి మాత్రం ఎలాంటి గుర్తింపు లేకపోవడంతో అతను ఇక్కడే ఉండిపోయాడు. అతడికి తోడు మరో ఇద్దరు బంగ్లాదేశీయులు ప్రస్తుతం ఈ డిపోర్టేషన్ సెంటర్లో ఉన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలుగా వీరి డిపోర్టేషన్ ప్రక్రియ ఆగిపోయింది. సక్రమంగా వచ్చి అక్రమంగా మారి... నగరం విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు దేశాలకు చెందిన వారు ఇక్కడికి వస్తున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు అక్రమంగా ఇక్కడే ఉండిపోతున్నారు. మరికొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా వివిధ మార్గాల్లో నగరానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిలో ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో ఉన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే అక్రమంగా స్థిరపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం వివిధ రకాలైన వీసాలపై ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొండికేస్తున్న సోమాలియన్లు... ఈ ఏడాది జనవరిలో చిక్కిన సోమాలియా తదితర దేశాలకు చెందిన వారు డిపోర్టేషన్ సెంటర్‌కు చేరారు. మిలిగిన వారు తమ దేశాలకు వెళ్లిపోగా.. సోమాలియా దేశానికి చెందిన ఎనిమిది మంది మాత్రం తమ స్వదేశానికి వెళ్లేందుకు విముఖత చూపారు. దీంతో వారి విషయంలో అధికారులు యుఎన్‌హెచ్‌ఆర్‌సీ సహాయం తీసుకున్నారు. ఏడుగురి వద్ద సోమాలియా జాతీయులుగా నిరూపించడానికి అవసరమైన పత్రాలు లభించాయి. దీంతో యుఎన్‌హెచ్‌ఆర్‌సీ వీరికి వివిధ స్కాండినేవియన్ దేశాల్లో శరణార్థులుగా ఆశ్రయం కల్పించింది. ఒకరు మాత్రం దాదాపు 13 ఏళ్ల క్రితమే సోమాలియా నుంచి నగరానికి వచ్చేయడంతో ఇతడికి సంబంధించి ఆ దేశ రాయబార కార్యాలయం ఎలాంటి ధ్రువీకరణలు ఇవ్వలేకపోయింది. ఫలితంగా శరణార్థిగా మారే అర్హత లేక డిపోర్టేషన్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇతడితో పాటు దాదాపు రెండున్నర నెలల క్రితం చిక్కిన ఇద్దరు బంగ్లాదేశీయులు కూడా డిపోర్టేషన్ కోసం ఇక్కడికి వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రక్రియలు జరగట్లేదు. ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అప్పటి వరకు వారు సీసీఎస్ ఆ«ధీనంలోనే ఉండాల్సి ఉంది. డిపోర్టేషన్ సెంటర్‌గా సీసీఎస్... అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లో వారిని ఉంచుతారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మారింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. -
స్టూడెంట్ను ప్రేమించి.. ఆపై తెగ నరికాడు!
రష్యన్ నవలాకారుడు, ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్(63) కోపంలో తన ప్రేయసి, మాజీ విద్యార్థిని అయిన అనస్తేసియా యెష్‌చెంకో(24)ను క్షణికావేశంలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై.. ఆమె తల, చేతులు, కాళ్లను వేరుచేశాడు. అంతేకాక అనస్తేసియా శరీరభాగాలను కనిపించకుండా చేసి, ఆ తర్వాత తనను ఎంతగానో ప్రభావితం చేసిన నెపోలియన్ వస్త్రధారణలో బహిరంగంగా ఆత్మహత్య చేసుకోవడానికి పథకం పన్నినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్ శనివారం తాగిన మైకంలో మొయికా నదిలో జారిపడి.. అక్కడి పోలీసులకు చిక్కాడు. అనుమానస్పదంగా కనిసిస్తున్న సోకోలోవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని బ్యాగ్‌ను చెక్ చేయగా.. అందులో కత్తిరించిన మహిళ చేతులు ఉన్నాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు .. యూనివర్సిటీ మాజీ విద్యార్థిని, తన ప్రేయసి అయిన అనస్టేసియా తలలేని శరీరాన్ని(మొండెం) పోలీసులు సొకోలోవ్ ఇంట్లో గుర్తించారు. పోలీసులకు సీసీ కెమెరాలను చెక్ చేయగా.. మొయికా నది సమీపంలో సంచరిస్తూ.. తన బ్యాగ్‌ను నదిలో పారివేసే క్రమంలో కాలుజారి నదిలో పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. దీంతో ఆమెను హతమార్చాననే పోలీసులకు అసలు విషయం చెప్పాడు. నేరాన్ని అంగీకరించిన ప్రొఫెసర్ సొకొలోవ్, అనస్టేసియా హత్యపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారని సమాచారం. ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్, అనస్తేసియా యెష్‌చెంకో రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ యూనివర్సిటీలో ప్రముఖ చరిత్ర విభాగపు ప్రొఫెసర్‌గా ఒలేగ్ సోకోలోవ్కు మంచి పేరుంది. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ బోనపార్టేపై అనేక పుస్తకాలు రాయడంతో పాటు ఆయన చేసిన కృషికిగాను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం 'లీజన్ ఆఫ్ ఆనర్' అవార్డును సొంతం చేసుకున్నారు. సొకోలోవ్ ఇంత దారుణానికి పాల్పడతారని తాము ఎన్నడూ ఊహించలేదని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనస్టేసియాను సొకొలోవ్ హత్య చేసిన నేపథ్యంలో.. ఫ్రెంచ్ అకడెమిక్ ఇన్స్టిట్యూట్ రష్యన్ కిల్లర్ ప్రొఫెసర్‌ను విధుల నుంచి బహిష్కరించింది. సొకోలోవ్, అనస్తేసియా కలిసి ఫ్రెంచ్ చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు పుస్తకాలు కూడా రాశారు. అంతేకాక వీరిద్దరికి చారిత్రక శైలిలో దుస్తులు ధరించడానికి మక్కువ చూపేవారని తెలిసింది. నెపోలియన్ ప్రభావం అధికంగా ఉన్న సొకొలోవ్కు.. నెపోలియన్ తరహా బట్టలు వేసుకోవడమంటే అమితమైన ఇష్టం. అనస్టేసియాను ఆయన 'జోసెఫిన్' అని ఎంతో ప్రేమగా పిలిచేవారని యూనివర్సిటీ విద్యార్థులు గుర్తు చేశారు. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ మొదటి భార్య పేరు జోసెఫిన్ కావడంతో ఆమెను ముద్దుగా ఆ పేరుతో పిలిచేవారు. ఇక ప్రొఫెసర్ సొకోలోవ్ 'హైపోథెర్మియా' అనే వ్యాధితో ఇబ్బంది పడుతూ.. ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారని న్యాయవాది పొచుయేవ్ తెలిపారు. హైపోథెర్మియా వ్యాధి బారిన పడిన వారికి శరీరంలో వేడి జనించడం కన్నా.. వేగంగా వేడిని కోల్పోతారు. దీనివల్ల రోగి శరీర ఉష్ణోగ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి గుండె, నాడీవ్యవస్థతో పాటు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. -
హాలీవుడ్‌కు నెపోలియన్
తమిళసినిమా: కోలీవుడ్‌లో మావీరన్గా పేరుగాంచిన నటుడు నెపోలియన్ హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు డెవిల్స్ నైట్–డాన్ అఫ్ ది నైన్ రుజ్ అనే అమెరికన్ చిత్రం ద్వారా నెపోలియన్ హాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కోలీవుడ్‌లో ప్రతి నాయకుడిగా రంగప్రవేశం చేసి, ఆ తరువాత కథానాయకుడిగా దక్షిణాదిలోని పలు భాషల్లో శతాధిక చిత్రాల్లో నటించిన ఈయన రాజకీయరంగప్రవేశం చేసి ఎంపీ గానూ, కేంద్రమంత్రిగానూ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం అమెరికాలోనే ఎక్కువగా నివశిస్తున్న నెపోలియన్ తొలిసారిగా హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. డెవిల్స్ నైట్ అనే హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. అమెరికాలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరైన టెల్ గణేశన్ కైపా ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి ఎమ్మీ నామినేటెట్ దర్శకుడు శ్యామ్ లోగన్ కరేలి దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు జెసీ జెన్సన్, బాబీలెనిన్, జాక్ సీ, ఫార్మన్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఇది హర్రర్ కథా చిత్రం అని సోమవారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నెపోలియన్ తెలిపారు. -
'నెపోలియన్' మూవీ రివ్యూ
టైటిల్ : నెపోలియన్ జానర్ : క్రైం థ్రిల్లర్ తారాగణం : ఆనంద్ రవి, రవివర్మ, కోమలి సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని దర్శకత్వం : ఆనంద్ రవి నిర్మాత : భోగేంద్ర గుప్తా ఇటీవల తొలి పోస్టర్, టీజర్ నుంచే ఎంతో ఆసక్తి కలిగించిన సినిమా నెపోలియన్. ఓ వ్యక్తి తన నీడ పోయిందంటూ పోలీస్ లను ఆశ్రయించటం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో ఆనంద్ రవి దర్శకుడిగా, నటుడిగా పరిచయం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా మంచి విజయం సాధించటంతో సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకున్న ప్రతినిథి సినిమాకు కథ రచయిత ఈ ఆనంద్ రవి. తానే స్వయంగా డైరెక్టర్ గా, ప్రధాన పాత్రలో తెరకెక్కించిన నెపోలియన్ మరోసారి ప్రతినిథి స్థాయిలో ఆకట్టుకుందా..? దర్శకుడిగా.. నటుడిగా ఆనంద్ రవి విజయం సాధించాడా..? అసలు నీడ పోవటమేంటి..? కథ : సీఐ రవివర్మ(రవివర్మ).. రొటీన్ కేసులను డీల్ చేసి బోర్ కొట్టిన రవివర్మ ఓ ఆసక్తికరమైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో నెపోలియన్ (ఆనంద్ రవి) అనే వ్యక్తి నా నీడ పోయిందంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అతడ్ని పరీక్షించిన పోలీసులు నిజంగానే నీడపడకపోవటం చూసి షాక్ అవుతారు. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కేసు హాట్ టాపిక్ గా మారుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్న నెపోలియన్ మరో షాక్ ఇస్తాడు. తనకు దేవుడు కలలో కనిపించాడని.. నందినగర్ లో చనిపోయిన తిరుపతి అనే వ్యక్తిది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పాడని చెప్తాడు. ఆ కేసును రీ ఓపెన్ చేసిన పోలీసులకు భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి..? చనిపోయిన తిరుపతికి నెపోలియన్ కు సంబంధం ఏంటి..? నెపోలియన్ నీడ ఎలా మాయమైంది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : మూడు కీలక పాత్రల నేపథ్యంలోనే కథ నడవటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవాల్సినదేమీ లేదు. ఉన్నవాళ్లలో సీనియర్ నటుడైన రవివర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవివర్మ ఒదిగిపోయాడు. తొలిసారిగా నటుడిగా మారిన ఆనంద్ రవి పరవాలేదనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన కోమలి నటన ఆకట్టుకున్నా.. ఆ పాత్రకు పరిచయం ఉన్న నటిని తీసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతినిథి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆనంద్ రవి తానే దర్శకుడిగా నటుడిగా పరిచయం అయ్యే సినిమాతో మాత్రం ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా.. పోను పోను సినిమా ఓ మామూలు రివేంజ్ డ్రామాల మారింది. సిద్ధార్థ్ సదాశివుని అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి , నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమా మొదలు పెట్టిన విధానం నేపథ్య సంగీతం సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మైనస్ పాయింట్స్ : కీలక పాత్రల నటన స్క్రీన్ ప్లే - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
కొత్త కాన్సెప్ట్‌తో...
ఆనంద్ రవి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘నెపోలియన్’. కోమలి, రవివర్మ, కేదార్ శంకర్, మధుమణి, గురురాజ్ కీలక పాత్రలు చేశారు. ఆచార్య క్రియేషన్స్, ఆనంద్ రవి కాన్సెప్ట్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్త మడుపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ప్రీ–రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆనంద్ రవి మాట్లాడుతూ– ‘‘నీడ పోయిందని రిపోర్ట్ ఇచ్చే కామన్ మ్యాన్ కథే ఈ చిత్రం. సినిమాకు మంచి క్రేజ్ ఉంది. చిన్న సినిమాగా మొదలై పెద్ద రేంజ్ అయింది. ప్రేక్షకులకు నచ్చుతుంది. సినిమా విడుదలలో çసహకారం అందించిన నిర్మాత ‘బన్నీ’ వాసుగారికి స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో చేసిన చిత్రమిది. అవుట్‌పుట్ బాగా వచ్చింది. యూఎస్, యూకెల్లో కూడా రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు భోగేంద్ర గుప్త. కోమలి, రవివర్మ, సంగీత దర్శకుడు సిద్ధార్థ్ సదాశివుని, కెమెరామేన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి డి. నెపోలియన్ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.