నటుడి కుమారుడి పెళ్లిపై కామెంట్లు.. ఆమె జీవితం నాశనం అంటూ.. | Actor Napoleon's Son Dhanush Marriage Issue | Sakshi
Sakshi News home page

నటుడి కుమారుడి పెళ్లిపై కామెంట్లు.. ఆమె జీవితం నాశనం అంటూ..

Published Sat, Aug 3 2024 2:03 PM | Last Updated on Sat, Aug 3 2024 2:55 PM

Actor Napoleon's Son Dhanush Marriage Issue

ప్రముఖ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు నెపోలియన్ త్వరలో తన పెద్ద కుమారుడు ధనుష్‌కు వివాహం చేయనున్నాడు. జబ్బు కారణం చేత వీల్‌ ఛైర్‌కే పరిమితం అయిన కుమారుడికి వివాహం చేయడం ఏంటి అంటూ కోలీవుడ్‌లో పెద్ద చర్చ జరుగుతుంది.  చిత్ర పరిశ్రమలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న నెపోలియన్ ఆపై పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అనంతరం పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. అయితే, కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీ, సొంతూరిని విడిచిపెట్టి కుమారుడి ఆరోగ్యం కోసం అమెరికాలో సెటిలైపోయారు.

నెపోలియన్‌ కుమారుడు ధనుష్‌కు నాలుగేళ్ల వయసులోనే 'మస్క్యూలర్ డైస్ట్రోపి' (కండరాల బలహీనత) అనే వ్యాధి వచ్చింది. దీంతో శరీరం అంతా చచ్చుబడి పోయింది. అలా అప్పటి నుంచి వీల్‌ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే, ఇప్పుడు ఆయనకు పెళ్లి చేస్తుండటంతో హాట్‌ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన అక్షయతో ధనుష్‌ వివాహం ఈ ఏడాది నవంబర్‌ నెలలో జరగనుంది. అందుకు జపాన్‌ వేదిక కానుంది. వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే వీడియో కాల్‌ ద్వారా జరిగింది.  అమెరికా నుంచి చెన్నైకు వచ్చేందుకు ధనుష్‌  ఆరోగ్యం సహకరించకపోవడంతో అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొద్దిరోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా నెట్టింట జరుగుతున్న చర్చ వివాదానికి దారి తీస్తుంది. కండరాల బలహీనతతో వీల్‌ చైర్‌కు పరిమితం అయిన కుమారుడికి ఇప్పుడు పెళ్లి చేసి మరో యువతి జీవితాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డబ్బు ఆశ చూపి ఆమె జీవితాన్ని నాశనం చేస్తున్న నెపోలియన్ అంటూ మరికొందరు ఫైర్‌ అవుతున్నారు. పెళ్లి తర్వాత ఆమె కేవలం ఒక నర్సుగా మాత్రమే ధనుష్‌తో ఉండగలదని తెలుపుతున్నారు.  ధనుష్ అరుదైన వ్యాధితో ఇన్నేళ్ల పాటు జీవించడమే గొప్ప విషయం అంటూ చెప్పుకొస్తున్నారు. అతనితో ఆమె సంతోషంగా ఎలా జీవించగలదంటూ ప్రశ్నిస్తున్నారు.

డాక్టర్‌ సలహాతో పెళ్లి
మయోపతి వైద్యుని నుంచి సలహాలు తీసుకున్న తర్వాత ధనుష్‌కు పెళ్లి చేస్తున్నట్లు ఆయన కుటుంబ సన్నిహితులు తెలుపుతున్నారు.  నెపోలియన్ నిర్మించిన మయోపతి ఆసుపత్రి వైద్యుడు డానియల్ ఇలా చెప్పారు. 'కండరాల బలహీనత ఉన్న వ్యక్తులు వివాహానికి పనికిరారని చెప్పడంలో నిజం లేదు. ఇలాంటి జబ్బుతో బాధపడుతున్నవారిలో కొందరు ఇప్పటికే వివాహమై పిల్లలతో జీవిస్తున్నారు.' అని ఆయన చెప్పారు. ధనుష్‌కు వివాహం చేయవచ్చని తాజాగా ఆయన చేసిన కామెంట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ధనుష్‌ గురించి అక్షయ్‌కు అన్నీ తెలుసని డాక్టర్‌ చెప్పారు. వైద్యుల సలహా మేరకు పెళ్లి కుదిరిందని, ధనస్సు, అక్షయ ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుని ఈ పెళ్లి నిర్ణయం తీసుకున్నారని మయోపతి డాక్టర్ డేనియల్ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement