sell
-
ఆ ప్రేమ జంట టీ దుకాణానికి వినియోగదారుల క్యూ!
మన దేశంలో టీ అంటే ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో.. తేనీరులో అనేక రకాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంటే ఇష్టం. ఏదిఏమైనా టీ లేకుండా చాలామందికి రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఒక ప్రేమ జంట విక్రయిస్తున్న టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ప్రేమ జంట తయారు చేసే టీ, వారు ఏర్పాటు చేసిన టీ స్టాల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జార్ఖండ్‌లోని రాంచీలో వీరు ఈ వినూత్న టీ దుకాణాన్ని నడుపుతున్నారు. ప్రేమ జంట మనీష్, పుతుల్ కుమారి ఇద్దరూ కలసి ఈ టీ స్టాల్‌ను ప్రారంభించారు. ఓ కంపెనీలో కలుసుకున్న వీరు ఈ రోజు సొంతగా టీ దుకాణాన్ని నిర్వహిస్తున్నారు.మనీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను శారదా గ్లోబల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశానని, ఆ తర్వాత గోద్రెజ్ టెక్ మహీంద్రాలో పనిచేశానని తెలిపారు. అదే సమయంలో పుతుల్‌ను కలిశానని, తాము ప్రస్తుతం రిలేషన్షిప్లో ఉన్నామన్నారు. తాము ఏదో ఒక వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని ఈ టీ స్టాల్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం రాంచీలోని తమ స్టాల్ ఎంతో ఆదరణ పొందుతున్నదని, ఇక్కడికి టీ తాగడానికి చాలామంది వస్తుంటారని తెలిపారు.తమ పాకెట్ మనీతో ఈ స్టాల్ ఓపెన్ చేశామని మనీష్ తెలిపారు. చిన్నగా వ్యాపారం ప్రారంభించి, క్రమంగా దానిని విస్తరించాలనుకున్నామన్నారు. తాము మట్టి కుండలో రకరకాల టీలను అందిస్తామని తెలిపారు.ప్రస్తుతం తాము రోజూ సాయంత్రం టీ దుకాణం తెరిచి, 500 కప్పుల టీలు విక్రయిస్తున్నామని తెలిపారు. రాంచీలో మరిన్ని టీ స్టాల్స్ తెరవాలనేది తమ కల అని, ఏ పని అయినా ప్రాణం పెట్టి చేస్తే విజయం సాధిస్తామని మనీష్ తెలిపారు. తాము ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నామని, భవిష్యత్తులో ఈ సంబంధాన్ని కొనసాగిస్తామని మనీష్ పేర్కొన్నారు. -
జడ్చర్లలో అమానుషం.. కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి
సాక్షి, మహబూబ్‌నగర్: మానవ సంబంధాలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిపైనే దాడులు చేసుకుంటూ హతమార్చుకుంటున్నారు. డబ్బు మోజులో పడి పేగు బంధాలను తెంచేసుకుంటున్నారు. తాజాగా కాసుల కోసం కక్కుర్తిపడి కన్నబిడ్డలను కిడ్నాప్ చేసి బేరానికి పెట్టాడో తండ్రి. భార్య ఫిర్యాదు, పోలీసుల అప్రమత్తతో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ అమానుష ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో వెలుగుచూసింది. పట్టణంలోని గౌరీ శంకర్ కాలనీలో నివాసం ఉండే రఫీ తన ముగ్గురు కూతుళ్లను మాయ మాటలు చెప్పి కారులో హైదరాబాద్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను కిడ్నాప్ చేశానని తనకు డబ్బు కావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆమె వెంటనే జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి రఫీ ఫోన్‌ను ట్రాక్ చేశారు. హైదరాబాదులోని యాకత్‌పురాలో అతని లోకేషన్ కనిపించగా.. వెంటనే పోలీసుల బృందం అక్కడికి చేరుకుంది. ఓ కారులో నిర్బంధించి ఉన్న పిల్లలను.. పోలీసులు రక్షించారు. అయితే రూ. 9 లక్షలకు పిల్లల్ని బేరం కుదుర్చుకున్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసుల అప్రమత్తతో కథ సుఖాంతం అయ్యింది. పిల్లలను విక్రయించాలనుకున్న తండ్రికి బంధువులు కాలనీవాసులు దేహ శుద్ధి చేశారు. -
ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది ఇళ్ల విక్రయాలు (అన్నిరకాల విభాగాలు) మొత్తం మీద 5 శాతం పెరిగాయి. 3,29,907 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇది పదేళ్ల గరిష్ట స్థాయి. మధ్యస్థ, ప్రీమియం విభాగంలో ఇళ్లకు నెలకొన్న డిమాండ్ అమ్మకాల్లో వృద్ధికి దారి తీసింది. అయితే రూ.50 లక్షల్లోపు బడ్జెట్ ఇళ్ల అమ్మకాలు (అందుబాటు ధరల) అంతక్రితం ఏడాదితో పోలిస్తే 16 శాతం తగ్గాయి. 97,983 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022లో ఈ విభాగంలో అమ్మకాలు 1,17,131 యూనిట్లుగా ఉన్నాయి. రూ.50 లక్షల్లోపు ఇళ్ల సరఫరా (కొత్త వాటి నిర్మాణం) గతేడాది 20 శాతం తగ్గింది. ఇది కూడా విక్రయాలు తగ్గేందుకు ఒక కారణం. మొత్తం ఇళ్ల అమ్మకాల్లో అందుబాటు ధరల ఇళ్ల వాటా 37 శాతం నుంచి 30 శాతానికి పరిమితమైంది. ఈ వివరాలను నైట్‌ఫ్రాంక్ ఇండియా విడుదల చేసింది. రూ.కోటిపైన ఖరీదైన ఇళ్ల అమ్మకాలు 2022లో 27 శాతం పెరగ్గా, 2023లో 34 శాతం వృద్ధిని చూశాయి. అమ్మకాల గణాంకాలు.. ► హైదరాబాద్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు మొత్తం మీద గతేడాది 6 శాతం పెరిగి 32,880 యూనిట్లుగా ఉన్నాయి. 2022లో 31,406 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ► ముంబైలో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు (రూ.50లక్షల్లోపు) 6 శాతం తగ్గి 39,093 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీద ఇళ్ల అమ్మకాలు 2 శాతం పెరిగి 86,871 యూనిట్లకు చేరాయి. ► బెంగళూరులోనూ అందుబాటు ధరల ఇళ్లు 46 శాతం క్షీణించి 8,141 యూనిట్లకు పరిమితమయ్యాయి. అన్ని విభాగాల్లోనూ ఇళ్ల అమ్మకాలు ఒక శాతం పెరిగి 54,046 యూనిట్లుగా ఉన్నాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు 3 శాతం పెరిగి 60,002 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ అందుబాటు ధరల ఇళ్ల విక్రయాలు 44 శాతం తగ్గాయి. 7,487 యూనిట్లు అమ్ముడయ్యాయి. ► పుణెలో ఇళ్ల అమ్మకాలు 13 శాతం వృద్ధితో 49,266 యూనిట్లకు చేరాయి. ► చెన్నైలో 5 శాతం అధికంగా 14,920 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► కోల్‌కతాలో 16 శాతం అధికంగా 14,999 ఇళ్ల యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఖరీదైన ఇళ్లకు ఆదరణ ఇళ్ల విక్రయాల పరంగా 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దేశ బలమైన ఆర్థిక మూలాల నేపథ్యంలో దీర్ఘకాల పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లలో నమ్మకం నెలకొంటోంది. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, గడిచిన దశాబ్ద కాలంలో ఇళ్ల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో కొంత ఒత్తిడి నెలకొంది. ఇది విక్రయాల్లో ప్రతిఫలిస్తోంది. –ఎండీ శిశిర్‌బైజాల్ ,నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ బలమైన పనితీరు వడ్డీ రేట్లు పెరగడం, నిర్మాణ వ్యయాలు పెరగడం, అంతర్జాతీయ అనిశి్చతులు, ఇళ్ల ధరలు పెరుగుదల వంటి ఆరంభ సవాళ్లు గతేడాది ఉన్నప్పటికీ, రియల్ ఎస్టేట్ రంగం అసాధారణ పనితీరు చూపించింది. కరోనా సమయంలో నిలిచిన డిమాండ్ కూడా తోడు కావడంతో ప్రాపర్టీ మార్కెట్ అసాధారణ స్థాయికి చేరుకుంది. 2023 ఏప్రిల్ నుంచి వడ్డీ రేట్ల పెంపును ఆర్బీఐ నిలిపివేయడం కూడా కొనుగోలుదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. కొనుగోలుదారుల్లో సానుకూల ధోరణితో మధ్యస్థ ప్రీమియం, ఖరీదైన ఇళ్లకు బలమైన డిమాండ్‌ను తీసుకొచ్చింది. ధరలు పెరగడంతో బడ్జెట్ ఇళ్ల (అఫర్డబుల్) విభాగం సవాళ్లను ఎదుర్కొంటోంది. –వికాస్ వాధ్వాన్, ప్రాప్‌టైగర్ గ్రూప్ సీఎఫ్‌వో హైదరాబాద్‌లో ఇళ్లకు భలే గిరాకీ హైదరాబాద్: రియల్ ఎస్టేట్‌కు హైదరాబాద్ ప్రముఖ మార్కెట్‌గా వృద్ధి చెందుతోంది. 2023 సంవత్సరానికి ఇళ్ల అమ్మకాల పరంగా దేశంలో హైదరాబాద్ రెండో అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా నిలిచింది. 2022 సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 49 శాతం పెరిగాయి. 2022లో హైదరాబాద్‌లో 35,372 ఇళ్ల యూనిట్లు అమ్ముడు పోగా, 2023లో 52,571 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్ తర్వాత అమ్మకాల్లో ఎక్కువ వృద్ధి హైదరాబాద్‌లోనే నమోదైంది. 2023 చివరి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలు 20,491 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందు జూలై–సెపె్టంబర్ త్రైమాసికంలో అమ్మకాలు 14,191 యూనిట్లతో పోలిస్తే 44 శాతం వృద్ధి నమోదైంది. 2022 చివరి త్రైమాసికం విక్రయాలు 10,335 యూనిట్లతో పోలిస్తే రెట్టింపైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో నూతన ఇళ్ల సరఫరా 2023లో అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7 శాతం తగ్గింది. 2022లో 82,801 యూనిట్లు సరఫరాలోకి రాగా, 2023లో 76,819 యూనిట్లు ప్రారంభం అయ్యాయి. ఈ వివరాలను ప్రముఖ ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్ టైగర్ డాట్ కామ్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాలకు సంబంధించిన వివరాలతో వార్షిక నివేదికను విడుదల చేసింది. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రముఖ పట్టణాల్లో గతేడాది 4.10 లక్షల ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 33% వృద్ధి నమోదైంది. -
క్యాపిటల్ అసెట్ అంటే?
గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 2 (14)లో ‘క్యాపిటల్ అసెట్’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. ♦ అసెసీకి ఉన్న ఆస్తి ♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు ♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. ♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. ♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్ అసెట్ కాదో.. అంటే వేటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్ అసెట్‌గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్ అసెట్ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్ చేస్తారు. ♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్ అసెట్‌గా పరిగణిస్తారు. ♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) ♦బాండ్లు.. గిల్ట్ బాండ్లు, స్పెషల్ బేరర్ బాండ్లు, గోల్డ్ స్కీముకి సంబంధించిన బాండ్లు. ♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్ లిమిట్ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. ♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. -
ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయొచ్చా?
స్టార్ హెల్త్ ప్రస్తుత ధర: రూ. 524 టార్గెట్: రూ. 653 ఎందుకంటే: 2006లో కార్యకలాపాలు ప్రారంభించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్.. దేశీయంగా తొలి స్టాండెలోన్ ఆరోగ్య బీమా రంగ కంపెనీ. ఆరోగ్యం, వ్యక్తిగత ప్రమాద బీమా సేవలకు తోడు.. దేశ, విదేశీ ప్రయాణ బీమా ప్రొడక్టుల (సర్వీసుల)ను సమకూరుస్తోంది. 14,200 ఆసుపత్రులతో ఒప్పందం ద్వారా భారత్‌లో అతిపెద్ద ఆరోగ్య బీమా సర్వీసులు నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికం(క్యూ2)లో నికర ఆర్జనా ప్రీమియం (ఎన్ఈపీ)వార్షికంగా దాదాపు 15% జంప్‌చేసి రూ. 3,206 కోట్లకు చేరింది. ఇందుకు రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ విభాగం సాధించిన రెండంకెల వృద్ధి దోహదపడింది. దీంతో కంబైన్డ్ రేషియో వార్షిక ప్రాతిపదికన 1.3 శాతం మెరుగుపడి 99.2 శాతాన్ని తాకింది. రిటైల్ హెల్త్ ప్రీమియంలో పటిష్ట పురోగతి, కొత్త ప్రొడక్టుల విడుదల, డిజిటలైజేషన్‌పై నిలకడైన దృష్టి, విస్తారిత పంపిణీ నెట్వర్క్, కొత్త బ్యాంకస్యూరెన్స్ భాగస్వామ్యాలు (పాలసీల విక్రయంలో బ్యాంకులతో ఒప్పందాలు), మెరుగైన సాల్వెన్సీ రేషియో వంటి అంశాలు భవిష్యత్‌లో కంపెనీ పటిష్ట పనితీరు చూపేందుకు సహకరించను న్నాయి. డిజిటలైజేషన్ బాటలో ఇటీవల డైనమిక్ యూపీఐ క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. తద్వారా కొత్తగా హెల్త్ ఇన్సూ రెన్స్ కొనుగోలు లేదా హెల్త్ పాలసీ కొనసాగింపు (రెన్యువల్)ను సులభంగా చేపట్టేందుకు వీలును కల్పించింది. రిటైల్ హెల్త్ విభాగంలో 33% వాటాతో మార్కెట్ లీడర్‌గా కంపెనీ నిలుస్తోంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రస్తుత ధర: రూ. 640 టార్గెట్: రూ. 740 ఎందుకంటే: ప్రయివేట్ రంగ కంపెనీ హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విభా పడాల్కర్తో పాటు.. సీఎఫ్‌వో నీరజ్ షాతో ఇటీవలే సమావేశమయ్యాం. తద్వారా కంపెనీలో వృద్ధికి సంబంధించి చోటు చేసుకుంటున్న కీలక అంశాలు, మొత్తంగా జీవిత బీమా రంగంలో పరిస్థితులు తదితరాలపై అభిప్రాయాలకు తెరతీశారు. వీటి ప్రకారం కంపెనీ మార్కెట్లో తనకున్న వాటాను మరింత సుస్థిరం చేసుకోనుంది. ఇందుకు వ్యూహాత్మకంగా టెక్నాలజీ వినియోగం, కస్టమర్‌కు సేవల అందుబాటు (ఎక్స్పీరియన్స్), బ్రాండ్‌ను పటిష్టపరచుకోవడం, సిబ్బంది అందించే ప్రత్యేక సర్వీసులు వంటివి సహకరించనున్నాయి. వీటికితోడు కొత్త ప్రొడక్టుల విడుదల జత కలవనుంది. బీమా రంగ బిల్లులో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, సవరణలు ఆరోగ్య బీమా విభాగానికి ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం కస్టమర్ల ఆరోగ్య బీమా అవసరాలకు తాజా బిల్లు తగిన మార్గాలను చూపనుంది. వెరసి కొత్త ప్రొడక్టులను రూపొందించడం, కస్టమర్లకు అనుగుణమైన సర్వీసులందించడం తదితర అంశాలలో బీమా రంగ కంపెనీలకు మరింత వెసులుబాటు లభించనుంది. ఇది దేశీయంగా బీమా సేవల వ్యవస్థ మరింత వేళ్లూనుకునేందుకు తోడ్పాటునివ్వనుంది. రూ. 5 లక్షలలోపు పాలసీలలో 15–17 శాతం చొప్పున వృద్ధి నమోదవుతోంది. అయితే అధిక టికెట్ పరిమాణంగల పొదుపు పాలసీలు తగ్గడంతో సర్దుబాటు ప్రాతిపదికన ఈ ఏడాది (2023–24) మొత్తం వార్షిక ప్రీమియం (ఏపీఈ) 12–13 శాతం చొప్పున పుంజుకునే వీలుంది. మాతృ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చానల్ ద్వారా 60 శాతం అమ్మకాలను సాధిస్తుండటం కంపెనీకి కలిసొచ్చే అంశం! -
ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్‌మైట్రిప్ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్‌మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
రికార్డు ధరకు నెపోలియన్ టోపీ
నెపోలియన్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే ధరించిన టోపీ వేలంలో కొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం పారిస్‌లో దీనిని వేలం వేయగా, దాదాపు రెండు మిలియన్ యూరోలకు అంటే రూ.17 కోట్ల ధర పలికి, సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ టోపీ 1.932 మిలియన్ యూరోలకు అమ్ముడైంది. 2014లో ఇదే నెపోలియన్ టోపీ 1.884 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యింది. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించింది. ఈ నెపోలియన్ టోపీని బైకార్న్ అని పిలుస్తారు. దీనిపై ఫ్రెంచ్ జెండాలోని నీలం, తెలుపు, ఎరుపు రంగులతో పాటు నెపోలియన్ సంతకం ఉంటుంది. ఇంతవరకూ ఈ టోపీ గత ఏడాది మరణించిన ప్రముఖ వ్యాపారవేత్త జీన్-లూయిస్ నోయిసీజ్ యాజమాన్యంలో ఉంది. నోయిసీజ్ దగ్గర పలు నెపోలియన్ జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. కాగా ఈ టోపీ రిజర్వ్ ధర కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ధర పలికిందని పారిస్‌లోని ఫాంటైన్‌బ్లూలోని వేలం హౌస్ తెలిపింది. నెపోలియన్ తన 15 సంవత్సరాల పాలనా కాలంలో మొత్తం 120 టోపీలను ధరించాడని చెబుతారు. అయితే తాజాగా అమ్ముడైన ఈ టోపీ ఎంతో ప్రత్యేకమైనదని వేలం నిర్వాహకులు తెలిపారు. వేలం హౌస్ తెలిపిన వివరాల ప్రకారం నెపోలియన్ చక్రవర్తి తన పదవీకాలం మధ్యలో ఈ ప్రత్యేకమైన టోపీని ధరించాడు. ఆ సమయంలోని ఇతర అధికారుల మాదిరిగా కాకుండా, నెపోలియన్ తన టోపీని ఒక పక్కకు ధరించేవాడు. ఇది అతనికి ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఈ టోపీ కారణంగానే యుద్ధ సమయంలో అతని దళాలు అతనిని సులభంగా గుర్తించేవి. ఫ్రెంచ్ విప్లవం సమయంలో నెపోలియన్ కీలకంగా ఎదిగాడు. ఇది కూడా చదవండి: శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు మూహూర్తం ఖరారు -
అప్పులు ఊబిలో తండ్రి.. రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!
అలీగఢ్: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది. అలీగఢ్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి? -
ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!
వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తేలింది. సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్మన్ స్కాట్లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్పై వేటు కూడా వేసింది. చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి! -
గూగుల్ సీఈవో చిన్ననాటి ఇల్లు విక్రయం.. కన్నీటి పర్యంతమైన తండ్రి
చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తను పుట్టి పెరిగిన ఇంటిని విక్రయించారు. ఆ ఇంటిని కొనుగోలు చేసిన తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ ఈ విషయం వెల్లడించారు. ఆస్తి పత్రాల అప్పగింత సమయంలో ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. ‘ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలని అన్వేషిస్తుండగా చెన్నైలోని అశోక్ నగర్లో ఓ ఇల్లు ఉందని తెలిసింది. అది గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పుట్టి, పెరిగిన చోటని తెలియడంతో కొనుగోలు చేయాలని వెంటనే నిర్ణయించుకున్నా’అని మణికందన్ అన్నారు. ‘మన దేశానికి సుందర్ పిచాయ్ గర్వకారణంగా నిలిచారు. ఆయన నివసించిన ఇంటిని కొనుగోలు చేయడమంటే నా జీవితంలో గొప్ప ఆశయం సాధించినట్లేనని ఆనందం వ్యక్తం చేశారు. ఆస్తి పత్రాలు అందజేసే సమయంలో సుందర్ తండ్రి రఘునాథ పిచాయ్ కన్నీటి పర్యంతమయ్యారని చెప్పారు. ‘వారి ఇంటికి వెళ్లినప్పుడు సుందర్ తల్లి స్వయంగా ఫిల్టర్ కాఫీ చేసి తీసుకువచ్చారు. ఆయన తండ్రి ఆస్తి పత్రాలు ఇవ్వబోయారు’వారి నిరాడంబర వ్యవహార శైలి చూసి ఆశ్చర్యపోయా. రిజిస్ట్రేషన్ ఆఫీసు వద్ద రఘునాథ గంటలపాటు వేచి ఉన్నారు. ఆస్తి పత్రాలను నాకు అప్పగించడానికి ముందు అన్ని పన్నులను ఆయనే చెల్లించారు. పత్రాలను నా చేతికి ఇచ్చేటప్పుడు ఆయన ఉద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు’అని మణికందన్ చెప్పారు. 1989లో ఐఐటీ ఖరగ్‌పూర్‌కు వెళ్లేవరకు సుందర్ పిచాయ్ కుటుంబం ఆ ఇంట్లోనే ఉంది. 20 ఏళ్లు వచ్చే వరకు సుందర్ పిచాయ్ ఆ ఇంట్లోనే గడిపినట్లు పొరుగు వారు చెప్పారు. సుందర్ గత ఏడాది చెన్నైలోని ఆ ఇంటికి వచ్చారు. -
ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం: చైనా
బీజింగ్: ఏడాదికి పైగా యుద్ధంలో తలమునకలైన రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోమని చైనా ప్రకటించింది. చైనా మిత్ర దేశమైన రష్యా యుద్ధం కారణంగా సాయుధ సంపత్తిని భారీగా కోల్పోవడం తెలిసిందే. దాంతో రష్యాకు చైనా భారీగా ఆయుధాలు సరఫరా చేయవచ్చని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి. అలాంటి ఉద్దేశమేమీ తమకు లేదని చైనా విదేశాంగ మంత్రి క్విన్ కాంగ్ శుక్రవారం ప్రకటన చేశారు. పౌర, సైనిక వాడకం రెండింటికీ పనికొచ్చే వస్తువులను రష్యాకు ఎగుమతి చేయడంపైనా నియంత్రణ విధిస్తామన్నారు. యుద్ధంలో తమది తటస్థ పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే యుద్ధం మొదలైనప్పటి నుంచీ రాజకీయంగా, ఆర్థికంగా, నైతికంగా రష్యాకు చైనా మద్దతుగానే నిలుస్తూ వస్తోంది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో చైనా దన్ను రష్యాకు ఎంతగానో ఆసరా అయింది. అదే క్రమంలో రష్యాకు ఆయుధాలు కూడా సమకూర్చేందుకు చైనా సన్నద్ధమవుతున్నట్టు తమకు నిఘా సమాచారముందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. చదవండి: పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
ఉప్పు అమ్మకాల నుంచి తప్పుకున్న హిందుస్థాన్ యూనీలివర్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ ప్రధాన వ్యాపారేతర ఆటా (పిండి), ఉప్పు విభాగాల నుంచి తప్పుకుంటోంది. తమ అన్నపూర్ణ, కెప్టెన్ కుక్ బ్రాండ్లను సింగపూర్‌కు చెందిన ఉమా గ్లోబల్ ఫుడ్స్‌కి విక్రయిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ డీల్ విలువ రూ. 60.4 కోట్లు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించింది. ఈ రెండు బ్రాండ్లను దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రెండింటి టర్నోవరు రూ. 127 కోట్లుగా నమోదైంది. ఇది కంపెనీ మొత్తం టర్నోవరులో ఒక్క శాతంలోపే ఉండటం గమనార్హం. సింగపూర్‌కి చెందిన రియాక్టివేట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్‌కు ఉమా గ్లోబల్ ఫుడ్స్ అనుబంధ సంస్థ. -
యస్ బ్యాంక్‌లో వాటాలకు కార్లైల్‌కి గ్రీన్ సిగ్నల్
ముంబై: యస్ బ్యాంక్‌లో 9.99 శాతం వరకూ వాటాలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు ది కార్లైల్ గ్రూప్, యాడ్వెంట్లకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యస్ బ్యాంక్‌లో రూ. 8,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ ఏడాది జూలైలో ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో 5 శాతానికి మించి వాటాలు తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. కార్లైల్, యాడ్వెంట్ ప్రతిపాదనలపై రిజర్వ్ బ్యాంక్ రెండు వేర్వేరు లేఖల ద్వారా నవంబర్ 30న ‘షరతులతో కూడిన ఆమోదం‘ తెలిపినట్లు బ్యాంక్ వెల్లడించింది. చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్ కంపెనీ -
సాఫ్ట్‌బ్యాంక్.. పేటీఎం వాటా విక్రయం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్)లో 4.5 శాతం వాటా విక్రయానికి సాఫ్ట్‌బ్యాంక్ సన్నాహాలు చేస్తోంది. బ్లాక్‌డీల్ ద్వారా ఈ వాటాను 20 కోట్ల డాలర్లకు(సుమారు రూ. 1,627 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్వీఎఫ్ ఇండియా హోల్డింగ్స్ ద్వారా పేటీఎంలో సాఫ్ట్‌బ్యాంక్ 17.5 శాతం వాటాను కలిగి ఉంది. తద్వారా అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. షేరుకి రూ. 555–601.55 ధరల శ్రేణిలో వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. పేటీఎమ్ ఐపీవో తదుపరి లాకిన్ గడువు ముగియడంతో సాఫ్ట్‌బ్యాక్ వాటా విక్రయ సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. షేరు పతనం బీఎస్ఈలో పేటీఎం షేరు బుధవారం(16న) 4 శాతం పతనమై రూ. 601.55 వద్ద ముగిసింది. ఈ ధరలో షేర్లను విక్రయిస్తే సాఫ్ట్‌బ్యాంక్‌కు 21.5 కోట్ల డాలర్లు లభిస్తాయి. 2017 చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌బ్యాంక్ 160 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తదుపరి ఐపీవోలో 22 కోట్ల డాలర్ల విలువైన ఈక్విటీని విక్రయించింది. పేటీఎమ్‌లో ప్రస్తుత సాఫ్ట్‌బ్యాంక్ వాటా విలువ 83.5 కోట్ల డాలర్లుగా లెక్కతేలుతోంది! చదవండి: భారత్‌లోని ఉద్యోగులకు ఇవే కావాలట.. సర్వేలో షాకింగ్ విషయాలు! -
పండగ సీజన్: తగ్గేదేలే అంటున్న కంపెనీలు, పుల్ జోష్‌లో ఆ రంగం!
న్యూఢిల్లీ: పండుగల సీజన్ కావడంతో కంపెనీలు ప్రకటనలను హోరెత్తిస్తున్నాయి. వినియోగ డిమాండ్‌ను అనుకూలంగా మలుచుకునేందకు తమ ఉత్పత్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ కామర్స్, ఫ్యాషన్, అప్పారెల్, ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీలు ఈ పండుగల సీజన్ కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను 15–20 శాతం పెంచాయి. దీన్నిబట్టి కంపెనీలు విక్రయాలకు సంబంధించి నిర్ధేశించుకున్న లక్ష్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దసరా నుంచి పండుగల సీజన్ మొదలు కాగా, ఇప్పటికే ఈ విభాగాల్లో విక్రయాలు అంచనాలను మించాయి. దీంతో కంపెనీలు సైతం తగ్గేదేలా అంటూ ప్రకటనలకు మరింత ఖర్చు చేస్తున్నాయి. ‘‘ఈ కామర్స్, అప్పారెల్, ఫ్యాషన్, ప్రీమియం ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, బ్యూటీ, వెల్నెస్ ఉత్పత్తులు, వినోద, జ్యుయలరీ సంస్థలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికం కోసం తమ ప్రకటనల బడ్జెట్‌ను (నిధుల కేటాయింపులు) 15–20 శాతం పెంచాయి. పండుగల డిమాండ్‌కు అనుకూలంగానే ఇది ఉంది. ఈ కేటగిరీల్లో ఇప్పటి వరకు విక్రయాలు లక్ష్యాలను మించి నమోదయ్యాయి’’అని మీడియా టెక్నాలజీ స్టార్టప్ ఆర్డీ అండ్‌ఎక్స్ నెట్వర్క్ చైర్మన్ ఆశిష్ భాసిన్ తెలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగంలో మాత్రం ప్రకటనల పరంగా ఆచితూచి అనుసరించే ధోరణి ఉన్నట్టు చెప్పారు. ఇక ముందూ కొనసాగొచ్చు.. పండుగల సమయాల్లో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తుంటారు. గత రెండు సంవత్సరాల్లో కరోనా ప్రభావం కొనుగోళ్ల డిమాండ్‌పై చూపించింది. కానీ, ఈ ఏడాది వైరస్ ప్రభావం ఏమీ లేదు. సాధారణ ఆర్థిక కార్యకలాపాల మద్దతుతో వినియోగ డిమాండ్ పట్టణాల్లో బలంగానే ఉంది. దీంతో విక్రయాలు గణనీయంగానే నమోదవుతున్నాయి. దీపావళి వరకు ఈ కొనుగోళ్లు జోరుగా ఉంటాయని జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్, బ్రాండింగ్ డైరెక్టర్ సుమన్ గద్దె తెలిపారు. ఆ తర్వాత పండుగల సీజన్ కూడా కలిసొస్తుందని అన్నారు. విస్తృత స్థాయిలో ఉత్పత్తులు, వాటిపై ఆఫర్లను ఈ సీజన్లో అందిస్తున్నట్టు ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. అన్ని మాధ్యమాల్లో తమ ఉత్పత్తులకు సంబంధించి విస్తృతమైన ప్రచారం చేపట్టినట్టు వెల్లడించారు. ఈ సీజన్లో ఎక్కువే.. ‘‘మా జ్యుయలరీ బ్రాండ్లు తనిష్క్, మియా, జోయ, కార్ట్‌లేన్‌కు సంబంధించి ప్రకటనలపై చేసే ఖర్చు గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో పెరిగింది’’అని టాటా గ్రూపు కంపెనీ టైటాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అజయ్ చావ్లా తెలిపారు. ఎగువ మధ్య తరగతి, ఖరీదైన విభాగాల్లో వినియోగదారుల ఆసక్తి పెరిగినట్టు చెప్పారు. దీంతో మరింత మంది కస్టమర్లను ఆకర్షించడం ద్వారా, మెరుగైన వృద్ధి అంచనాలను చేరుకునే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపారు. విచక్షణారహిత వినియోగ విభాగంలో ఇప్పటి వరకు డిమాండ్ బలంగా ఉన్నట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇది ప్రకటనలపై అధిక వ్యయాలకు మద్దతునిస్తున్నట్టు చెప్పాయి. ఫ్రెంచ్ అప్పారెల్ బ్రాండ్ సెలియో సీఈవో సత్యేన్ మొమాయ మాట్లాడుతూ.. దసరా సమయంలో పెట్టుబడులపై మంచి రాబడులు రావడంతో ప్రకటనల బడ్జెట్‌ను 25 శాతం పెంచినట్టు ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
జేసీ ఫ్లవర్స్‌కు యస్ బ్యాంక్ మొండి రుణాలు.. విలువ రూ. 48,000 కోట్లు
న్యూఢిల్లీ: ఒత్తిడిలో పడిన మొండి రుణాలను విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు యస్ బ్యాంక్ తాజాగా వెల్లడించింది. ఎంపిక చేసిన మొత్తం రూ. 48,000 కోట్ల రుణాలను యూఎస్‌కు చెందిన ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి విక్రయించనున్నట్లు పేర్కొంది. ఈ రుణాల పోర్ట్‌ఫోలియోకు జేసీ ఫ్లవర్స్ ఏకైక బిడ్డర్‌గా నిలిచినట్లు తెలియజేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పారదర్శక బిడ్డింగ్ విధానాలను అవలంబిస్తూ స్విస్ చాలెంజ్ పద్ధతిలో బిడ్లకు ఆహ్వానం పలికినట్లు బ్యాంక్ వెల్లడించింది. ప్రాథమిక(బేస్) బిడ్డింగ్‌కు జులైలోనే జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీ మాత్రమే రేసులో నిలిచినట్లు పేర్కొంది. ఇతర బిడ్స్ దాఖలుకాకపోగా.. స్విస్ చాలెంజ్ ప్రాసెస్‌ను ముగించినట్లు తెలియజేసింది. వెరసి ఈ విధానం ప్రకారం గెలుపొందిన జేసీ ఫ్లవర్స్ ఏఆర్సీకి డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలియజేసింది. కాగా.. ఒప్పందం ప్రకారం జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీలో 19.99 శాతం వాటా కొనుగోలుకి బ్యాంక్ తగిన పెట్టుబడులకు సైతం బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకునే సన్నాహాలు ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. చదవండి: పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు -
ఇంటర్‌గ్లోబ్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
బంగారు బాతును కాపాడుకోవాలి!
ఎల్ఐసీ దేశానికి ఎంతో ఇచ్చింది. ఇంకెంతో ఇవ్వనుంది. మరి ప్రభుత్వం దానికి తిరిగి ఏమిస్తోంది? నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలనూ, కార్పొరేషన్లనూ ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేయడం ఒక విధానంగా పెట్టుకున్న కేంద్రం... అక్షయ పాత్రలాంటి ఎల్ఐసీనీ ప్రైవేటీకరించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 1956లో ప్రభుత్వం సమకూర్చిన ఐదు కోట్ల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి 66 ఏళ్లలో రూ. 31 వేల కోట్లు ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఇచ్చింది ఎల్ఐసీ. 2022 మార్చి 31 నాటికి రూ. 40,84,826 కోట్లు దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిగా పెట్టింది. అదే సమయంలో పేద, మధ్య తరగతి ప్రజలకు చౌకగా బీమా సౌకర్యాన్నీ కల్పిస్తూ వచ్చింది. అయినా ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను ప్రభుత్వం అమ్మివేసింది. ఈ మధ్య ఎన్టీఆర్ఐను ప్రారంభిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహెచ్ఈఎల్ (భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్) ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) లేకుండా దేశ ప్రగతిని ఊహించుకోలేమనీ, ఎల్ఐసీ గత 66 ఏళ్లలో అద్భుతంగా రాణిస్తోందనీ కితాబు ఇచ్చారు. అటువంటి అద్భుత సంస్థ ‘యోగక్షేమం వహామ్యహం’ (ప్రజల యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను) అనే నినాదంతో మొదలై 2022 సెప్టెంబర్ 1 నాటికి 66 ఏళ్ళు పూర్తి చేసుకుని 67వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1956లో ఎల్ఐసీ ఆవిర్భవించిన నాటి నుండి ‘ప్రజల పొదుపు ప్రజా సంక్షేమానికి’ అనే నినాదంతో, ఉన్నత లక్ష్యాలతో పనిచేయబట్టే... నేడు ప్రజల, పాలసీ దారుల చిరస్మరణీయమైన నమ్మకం చూరగొంది. అడుగడుగునా తనను నమ్మి తన మీద భరోసా పెట్టుకున్న ఖాతాదారులకు అభయం ఇచ్చి, ఎల్ఐసీ దేశీయ జీవిత బీమా రంగంలో మార్కెట్ మేకర్‌గా తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022 మార్చి 31 నాటికి ఎల్ఐసీ రూ. 40,84,826 కోట్ల పెట్టుబడులను మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టింది. ఇందులో రూ. 28,85,569 కోట్ల నిధులను హౌసింగ్, నీటిపారుదల సౌకర్యాల కల్పనకూ; కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలకూ కేటాయించింది. 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూ. 14,23,055 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఐసీ సమకూర్చింది. దేశ అంతర్గత వనరుల సమీకరణలలో ఎల్ఐసీ వాటా 25 శాతం పైమాటే! 2021–22 ఆర్థిక సంవత్సరంలో క్లెయిముల చెల్లింపుల రూపేణా దాదాపు లక్ష కోట్ల మేరకు పాలసీ దారులకు చెల్లించింది. 99 శాతం క్లెయిముల పరిష్కారం రేటుతో క్లెయిముల పరిష్కారంలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా పేరెన్నికగన్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే (ఏప్రిల్ నుండి జూన్ లోపల) 85,298 కోవిడ్ డెత్ క్లెయిములను పరిష్కరించి, రూ. 2,334 కోట్లు పాలసీదారుల వారసులకు చెల్లించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 614 శాతం ఎక్కువ. నిమిషానికి 41 పాలసీలను విక్రయిస్తూ, 2021–22 ఆర్థిక సంవత్సరంలో 2 కోట్ల 17 లక్షల పాలసీలను ఎల్ఐసీ సేకరించింది. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం నికర ప్రీమియం ఆదాయం పెరిగింది. 22 సంవత్సరాల పోటీ తర్వాత కూడా ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం అంశంలో మార్కెట్ వాటాలో 65 శాతం కలిగి ఉంది. పాలసీల సంఖ్యలో దాదాపు 74 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇది అపూర్వమైన ఘనత. ఏ దేశంలో లేని విధంగా... ఒకే కంపెనీ, అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీ, మార్కెట్ ఆధిపత్యాన్ని కలిగి ఉండటం ఒక్క ఎల్ఐసీ విషయంలో మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రూ. 36,000 కోట్లు లాభం ఆర్జించిన ఎల్ఐసీ సంస్థ, ఈ ఏడాదిలో రూ. 42,000 కోట్లు లాభాలు ఆర్జించింది.గత ఏడాది జూన్ నాటికి ఎల్ఐసీ ఆస్తులు రూ. 38.13 లక్షల కోట్లు కాగా, ఇప్పుడవి రూ. 42 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 23 ప్రయివేటు బీమా కంపెనీల మొత్తం ఆస్తుల కన్నా 3 రెట్లు ఆస్తులు, ఎల్ఐసీ సంస్థ కలిగి ఉంది. రెండో అతిపెద్ద ప్రయివేటు జీవిత బీమా కంపెనీ ఎస్బీఐ లైఫ్‌తో పోలిస్తే, ఎల్ఐసీ ఆస్తులు 16 రెట్లు ఎక్కువ. దేశంలో మొత్తం మ్యూచ్యువల్ ఫండ్ల ఆస్తుల కన్నా, ఎక్కువ ఆస్తులను ఎల్ఐసీ కలిగి ఉంది. 2021–22లో పాలసీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 98 శాతం 15 రోజుల వ్యవధిలోనే పరిష్కరించి అత్యుత్తమ పారదర్శక సంస్థగా నిలిచింది. ‘ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకం ద్వారా అతి తక్కువ ప్రీమియంతో ప్రజలకు బీమా రక్షణ కల్పిస్తోంది. కార్పొరేట్ నిర్వహణలో ఎల్ఐసీ అనేక అవార్డులు, రివార్డులు పొందింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ ఎల్ఐసీనే మార్కెట్లను ఆదుకుంది. ‘మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్’. ‘బెస్ట్ బ్రాండ్ అవార్డ్’తో సహా ప్రతిష్టాత్మకమైన 25 అవార్డులను ఎల్ఐసీ సొంతం చేసుకుంది. అనేక సార్లు అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణకు ‘బంగారు నెమలి‘ను పొందింది. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలై ఉన్న అస్తవ్యస్త పరిస్థితుల నడుమ ఎల్ఐసీని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేశారు. దాంతో తర్వాత కాలంలో ఎల్ఐసీ షేర్ విలువ దాదాపు 28 శాతం తగ్గిపోయింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఎల్ఐసీ సంస్థ ఏనుగు వలే శక్తి మంతమైనది అయినప్పటికీ, అది నాట్యం చేయలేదని కొందరు మార్కెట్ పండితులు ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. అయితే, జేపీ మోర్గాన్ సంస్ధ తన తాజా నివేదికలో, ఎల్ఐసీ నిజ విలువను, శక్తిని గుర్తించడంలో మార్కెట్ విఫలమైందని వ్యాఖ్యానించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో ఎల్ఐసీ నూతన వ్యాపార వృద్ధి రేటు 95 శాతంగా ఉంది. కాగా, ప్రయివేటు బీమా కంపెనీల వృద్ధి దాదాపు 48 శాతం మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా ఎల్ఐసీ వృద్ధి రేటు 63 శాతం కాగా, ప్రయివేటు కంపెనీల వృద్ధి రేటు 38 శాతంగా ఉంది. తాజాగా ఎల్ఐసీ ఫార్ట్యూన్ గ్లోబల్ –500 కంపెనీల జాబితాలో చోటు సంపాదించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి లిస్ట్ అయిన కంపెనీల ఆదాయం, లాభాల ఆధారంగా తయారు చేసిన ఈ జాబితాలో లిస్టింగ్ అయిన రెండు నెలల లోపలే ఎల్ఐసీ 98వ స్థానం పొందింది. ఎల్ఐసీ వ్యాపారాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఎల్ఐసీ షేర్ విలువ కూడా పెరుగుతోంది. దేశంలో ద్రవ్యోల్బణం దౌడుతీస్తోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి నానాటికీ క్షీణిస్తోన్న పరిస్థితుల్లో సైతం ఎల్ఐసీ చక్కని ప్రదర్శన చేస్తోంది. ప్రయివేటు బీమా సంస్థలు మెట్రోలు, మహానగరాలకే పరిమితమయినా... ఎల్ఐసీ గ్రామీణ ప్రాంతాలకూ తన సేవలను విశేషంగా అందిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుండి ఎల్ఐసీకి 48.22 శాతం ఏజెంట్లు ఉండగా, వారి ద్వారా ఎల్ఐసీకి మొత్తం పాలసీలలో 21.46 శాతం, ప్రీమియంలో 15.6 శాతం వ్యాపారం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలను, బలహీన వర్గాలను విస్మరిస్తే తలెత్తే ప్రతికూల ప్రభావం ఈ గణాంకాల ద్వారా అర్థమవుతుంది. ఎల్ఐసీ వ్యాపారాన్ని గమనిస్తే 28.89 శాతం పాలసీదారులు సాలీనా లక్ష కంటే తక్కువ సంపాదన గలవారు. 43 శాతం పాలసీదారుల వార్షిక ఆదాయం రూ. లక్ష నుండి రెండు లక్షల మధ్యలో ఉన్నది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఐసీ పాలసీల సగటు ఏడాది ప్రీమియం రూ. 25,000 కాగా, ప్రయివేటు కంపెనీ లలో ఇది రూ 1,06,000 గా ఉంది. దీనిని విశ్లేషించినప్పుడు ప్రైవేటు బీమా కంపెనీలు పెద్ద పాలసీలపై దృష్టి పెడితే, ఎల్ఐసీ సంస్థ ఒక్కటే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బీమా రక్షణ కలిగిస్తోందని స్పష్టమవుతోంది. పెద్ద ప్రీమియం పాలసీలు, అర్బన్ వ్యాపారం బీమా సంస్థలకు లాభసాటి గనుక, ఎల్ఐసీలో వాటాలు కొన్న పెట్టుబడిదారులకు అధిక లాభాలను తెచ్చి పెట్టే వ్యాపారం వైపు సంస్థ పరుగులు పెట్టవలసి వస్తే అది భారతదేశ గ్రామీణ పేద, బలహీన వర్గాల ప్రయోజనాలకు భంగకరం అవుతుంది. 40 లక్షల మంది ఎల్ఐసీ షేర్ హోల్డర్ల ప్రయోజనాల కన్నా, 40 కోట్ల పాలసీదారుల ప్రయోజనాలూ, విశాల దేశ ప్రయోజనాలే పరమావధిగా ఎల్ఐసీ బోర్డు అడుగులు వేయాలి. ప్రజల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకత నడుమ ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలు మాత్రమే ప్రస్తుతానికి అమ్మడం జరిగింది. ఎల్ఐసీ కేంద్ర ప్రభుత్వానికి అక్షయ పాత్ర లాంటిది. 1956లో ప్రభుత్వం ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలతో కార్యకలాపాలు ప్రారంభించి... ఇప్పటివరకూ 31 వేల కోట్ల రూపాయలు కేంద్రానికి డివిడెంట్ చెల్లించింది. నిరంతరం, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం నిధులు అందిస్తూనే ఉంది. అటువంటి బంగారు బాతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది పోయి తెగనమ్మే ప్రయత్నాలు చేయడం సరికాదు. ప్రభుత్వం తన విధానాన్ని పునస్సమీక్షించుకుంటుందని ఆశిద్దాం. పి. సతీష్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు ‘ 94417 97900 -
ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు. చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్ -
ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై గైడ్‌లైన్స్ జారీ.. ఇకపై..
సాక్షి, అమరావతి: ఆన్లైన్లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఏఫీఎఫ్‌డీసీకి (ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) సర్వీస్ ప్రొవైడర్ బాధ్యతల నిర్వహణ అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్‌డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాలి. అన్ని థియేటర్లు,ప్రయివేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారానే అమ్మకాలు చేపట్టాలి. విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రం సర్వీస్ చార్జీ వసూలు చేయాలి. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలి. కొత్త సినిమా విడుదల నేపథ్యంలో వారం ముందు నుంచి మాత్రమే టిక్కెట్లు అమ్మకాలు జరపాలి. చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి -
ప్రధాని మోదీ పర్యటన.. కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకున్న జపాన్ ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కీలకంగా మారనుంది. ఈ పర్యటన జరిగిన వారంలోపే.. భారత్‌కు క్షిపణులు, జెట్లతో సహా శక్తివంతమైన సైనిక పరికరాలను ఎగుమతి చేసేందుకు సిద్ధమైంది జపాన్ ప్రభుత్వం. నివేదిక ప్రకారం.. భారతదేశం, ఆస్ట్రేలియాతో పాటు కొన్ని యూరోపియన్, ఆగ్నేయాసియా దేశాలకు ఆయుధాలను ఎగుమతులు చేయడానికి జపాన్ ప్రభుత్వ ఆ దేశ ఆయుధాలపై ఎగుమతులపై ఉన్న నిబంధనలను సడలించనుంది. కాగా మంగళవారం టోక్యోలో జరిగిన సమావేశంలో రక్షణ తయారీతో సహా ద్వైపాక్షిక భద్రత, రక్షణ సహకారాన్ని మెరుగుపరచడానికి క్యాడ్ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ ప్రధాని ప్యూమియో కిషిదాను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరగడం విశేషం. గతంలో దాదాపు 47 సంవత్సరాల తర్వాత 2014లో జపాన్ ప్రధాని షింజో అబే పరిపాలన రక్షణ ఎగుమతులను నిషేదించే నిబంధలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, ఇది ఇప్పటికీ ప్రాణాంతక ఆయుధాల ఎగుమతులను నిషేధిస్తుంది. తాజాగా జపాన్ ప్రభుత్వం ఈ చట్టానికి మరిన్ని సడలింపులు తీసుకురానుంది. దీని ద్వారా భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జపాన్ స్వీయ-రక్షణ దళాలు, భారత సైన్యం మధ్య అక్విజిషన్ క్రాస్-సర్వీసింగ్ అగ్రిమెంట్ సెప్టెంబర్ 2020లో పలు ఒప్పందాలు జరిగాయి. చదవండి: Elon Musk: అప్పుడు డేటింగ్‌తో చిచ్చు రాజేశావ్! ఇప్పుడేమో ఇలా.. -
Crime News: బుల్లెట్ బండి మీద కన్నేశారు
పంజగుట్ట: రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలు దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను పంజగుట్ట క్రైమ్ టీం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుండి ఐదు లక్షలు విలువచేసే నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏలూరు జిల్లా, జగ్గారెడ్డిగూడెంకు చెందిన దేవ సన్ని అలియాస్ మహేష్ (26) ఓ రెస్టారెంట్లో వెయిటర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. సూర్యాపేట జిల్లా, ఆత్మకూరుకు చెందిన బి.మనోహర్ (21) ఇతనికి నాలుగు సంవత్సరాలుగా స్నేహితులు. త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ద్విచక్రవాహనాలు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఖరీదైన వాహనాలు దొంగిలిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు దొంగతనం చేద్దామనుకున్నారు. నగరానికి వచ్చి సరూర్‌నగర్, హయత్‌నగర్, జూబ్లీహిల్స్‌తోపాటు గత ఏప్రిల్ నెలలో పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాఫర్అలీ బాగ్‌లో ఒక వాహనం దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం పంజగుట్ట క్రైమ్ ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగిలించిన వాహనంపై నిందితులు పట్టుబడ్డారు. పత్రాలు చూపించమంటే పొంతనలేని సమాధానాలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించగా గతంలో చేసిన దొంగతనాలగూర్చి వివరించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు ఎలా అమ్మలి, కొనే వారు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తుండగానే పోలీసులకు దొరికిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. (చదవండి: 24 గంటలు ఆగాలంటూ..) -
యువతికి సాయం చేస్తానని నమ్మించి..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బెంగళూరు వచ్చిన యువతిని సహాయం చేస్తానని మాయమాటలు చెప్పి విక్రయించడానికి ప్రయత్నించిన నిందితుడిని కెంపేగౌడ ఎయిపోర్టు పోలీసులు అరెస్టు చేసారు. కోలారుకు చెందిన యువతి ఇంట్లో గొడవపడి బెంగళూరుకు వచ్చి మెజెస్టిక్‌లో కూర్చుని ఉండగా ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న నాగేశ్ యువతిని పలకరించి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దేవనహళ్లికి తీసుకువచ్చాడు. ఆపై యువతిపై అత్యాచారం చేసి తరువాత ఢిల్లీకి తీసుకెళ్లి వ్యభిచార గృహానికి విక్రయించాలని పథకం వేశాడు. అయితే ఎయిర్‌పోర్టులో నాగేశ్, యువతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పసికందు అమ్మకం: తండ్రి అరెస్టు
భువనేశ్వర్: పసికందు అమ్మకం ఘటనలో తండ్రి అరెస్టయిన ఘటన జాజ్‌పూర్ జిల్లాలో సంచలనం రేకిత్తించింది. ఇదే వ్యవహారంలో ఇద్దరు మధ్యవర్తులు, మరో ఇద్దరు కొనుగోలుదారులు అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో శిశువుని కొనుగోలు చేసిన దంపతులు(కైలాస్ బారిక్, సస్మిత బారిక్), శిశువు అమ్మకానికి బేరం కుదిర్చిన అంగన్వాడీ కార్యకర్త ప్రభాషినీ దాస్, ఆమె సోదరుడు దీపక్ దాస్, శిశువును అమ్మకానికి పెట్టిన తండ్రి నటవర బెహరా ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. జాజ్‌పూర్ జిల్లాలోని ధర్మశాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని సనొరాయిపొడా గ్రామానికి చెందిన నటవర బెహరా భార్య కాంచన్ బెహరా ధర్మశాలఆరోగ్య కేంద్రంలో ఈ నెల 27వ తేదీన ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 28వ తేదీన డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లింది. అదే రోజు శిశువు తండ్రి నటవర బెహరా కేంద్రాపడా జిల్లాలోని మహాకలపడా ప్రాంతానికి చెందిన దంపతులకు రూ.12 వేలకు తన బిడ్డను అమ్మేశాడు. శనివారం సాయంత్రం ఈ సంఘటన వెలుగుచూడడంతో జిల్లా శిశు సంరక్షణ అధికారులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. దీనిపై కొత్తొపూర్ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు దాఖలైంది. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శనివారం రాత్రి శిశువుని కొనుగోలు చేసిన వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పూర్తి దర్యాప్తు అనంతరం ఆదివారం ఉదయం సదరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నటవర్, కాంచన్ దంపతులకు ఈ బిడ్డ నాలుగో సంతానం కాగా రోజువారీ కూలి పనులతో బతుకు భారమవుతుండడంతోనే శిశువును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. తమ అభ్యర్థన మేరకే అంగన్వాడీ కార్యకర్త బిడ్డను దత్తత తీసుకునే వారిని సంప్రదించిందని దంపతులు తెలిపారు. -
రూ.62 వేలకు నలుగురు పిల్లల అమ్మకం.. రెండేళ్ల తర్వాత
చెన్నై: కొందరి నిస్సహాయతని మరికొందరు అవకాశంగా మార్చుకుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే బయట ప్రపంచంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ దంపతులకి మాయమాటలు చెప్పి వారి పిల్లలని విక్రయించి ఆ చిన్నారుల దగ్గర వెట్టి చాకిరి చేయించుకున్నాడు ఓ మేకల యజమాని. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ భాగోతం బయటపడింది. వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన ఓ దంపతులు రెండేళ్ల క్రితం తమ నలుగురు పిల్లలను మేకల యజమాని గోవిందరాజన్‌కి రూ.62,000 మొత్తానికి విక్రయించారు. గోవిందరాజన్ ఆ దంపతులతో.. పేదరికంతో బాధపడుతున్న మీరు ఆర్థికంగా బాగుపడతారని హామీ ఇచ్చి వారి పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని నమ్మించి కొనుగోలు చేశాడు. కానీ ఆ చిన్నారుల చేత వెట్టి చాకిరి చేయించుకునే వాడు. మేకలకు మేత కోసం ఆ పసి వాళ్లని రోజుకు 10 కిలోమీటర్లకు పంపేవాడు. అంతటితో ఆగకుండా వారిని దుర్భాషలాడేవాడు. ఓ రోజు, మందలోని మేకలలో ఒకటి తప్పిపోయినందుకు ఆ పిల్లలని తీవ్రంగా హింసించాడు. చివరికి ఓ స్వచ్ఛంద సంస్థ చొరవతో ఆ నలుగురి పిల్లలకి ఆ వ్యక్తి నుంచి విముక్తి లభించింది. పిల్లలను తల్లిదండ్రుల వద్దకు చేర్చుతామని స్వచ్ఛంద సంస్థ తెలిపింది. చదవండి: పెళ్లి ఊరేగింపులో అపశ్రుతి.. తృటిలో తప్పింది లేదంటే వరుడికి.. -
పేదరికంతో అల్లాడిపోతున్న తల్లి ..మూడు రోజుల పసికందుని..
ముంబై: పేదరికంతో అల్లాడిపోతున్న ఓ తల్లి తన పసికందును రూ 1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మహిళకి సహకరించిన మరో నలుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం... షిర్డీ పట్టణానికి చెందిన 32 ఏళ్ల మహిళ పేదరికంతో బతుకు భారంగా జీవనాన్ని కొనసాగిస్తోంది.ఈ క్రమంలో ఆమె సెప్టెంబరులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదని బాధపడుతూ చివరికి ఆ పాపని అమ్మలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అహ్మద్‌నగర్, థానేలో ఒకరు పొరుగున ఉన్న ముంబైలోని ములుండ్‌కు చెందిన ముగ్గురు మహిళలు పాప విక్రయానికి ఆ మహిళకు సహకరించారు. ఆ వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తిచేయకుండానే వారు రూ 1.78 లక్షలకు శిశువను విక్రయించారు. ఈ విషయమై సమాచారం అందడంతో వ్యక్తి ఇంటిపై దాడులు చేపట్టగా శిశువు కనిపించాడు. దీంతో నేరానికి పాల్పడిన పసిబిడ్డ తల్లి సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. చదవండి: భార్య కేసు పెట్టడంతో భర్త ఆత్మహత్య -
ఆ వ్యాపారానికి స్వస్తి పలికిన రిలయన్స్...!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఎస్‌లోని చిట్టచివరి షేల్ గ్యాస్ ఆస్తులను సైతం విక్రయిస్తోంది. ఇందుకు వీలుగా డెలావేర్ కంపెనీ ఎన్సైన్ ఆపరేటింగ్–3 ఎల్ఎల్సీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. అనుబంధ సంస్థ రిలయన్స్ ఈగిల్ఫోర్డ్ అప్‌స్ట్రీమ్ హోల్డిం గ్‌కు చెందిన షేల్ గ్యాస్ ఆస్తులను విక్రయించేందుకు డెలావేర్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. దీంతో యూఎస్‌లోని మొత్తం షేల్ గ్యాస్ ఆస్తుల నుంచి తప్పుకున్నట్లేనని ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా ఉత్తర అమెరికా షేల్ గ్యాస్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు తెలియజేసింది. 2010– 2013 మధ్య కాలంలో మూడు భాగస్వామ్య సంస్థలలో ఆర్ఐఎల్ వాటాలు కొనుగోలు చేసింది. -
ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!
నిన్న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు షాక్ గురయ్యారు. ఏడుగంటల పాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్ పూర్తిగా నిలిచిపోయింది. సర్వర్స్‌లో నెలకొన్న సాంకేతిక సమస్య కారణంగా వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో నిలిచిపోయిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫేస్బుక్ టెక్నాలజీ ఆఫీసర్ స్పందిస్తూ యూజర్ల అందరికి క్షమాపణలను తెలియజేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను తిరిగి మాన్యువల్‌గా పునరుద్ధరించడంతో సుమారు 7 గంటల సమయం పట్టిన్నట్లు వెల్లడించారు. ఒక్కసారిగా ఫేస్బుక్ సర్వర్లు డౌన్ అవ్వడంతో బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకమ్‌బర్గ్ సుమారు 7 బిలియన్డాలర్లకు పైగా నష్టపోయాడని పేర్కొంది. ఫేస్బుక్ యూజర్లకు మరో షాక్...! ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో షాక్ గురైన యూజర్లకు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ మరో షాకిచ్చింది. ఫేస్బుక్ గ్లోబల్ నెట్వర్క్స్ అంతరాయం కల్గిన సమయంలో హ్యకర్లు డార్క్ వెబ్ హ్యాకర్ ఫోరమ్‌లో ఫేస్బుక్ యూజర్ల డేటాను విక్రయించారని నివేదించింది. ఫేస్బుక్ యూజర్ల చిరునామా, పేరు, ఈ-మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్లను అమ్మకానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం దాదాపు 1.5 బిలియన్ ఫేస్బుక్ ఖాతాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి వచ్చినట్లు రష్యన్ ప్రైవసీ అఫైర్స్ నివేదించింది. కొంతమంది హ్యాకర్లు ఫేస్బుక్ వినియోగదారుల డేటాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు నిర్ధారణలు ఉన్నాయి. ఫేస్బుక్ యూజర్ల డేటాను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేద్దామనుకున్న ఓ వ్యక్తికి హ్యాకర్లనుంచి 5,000 డాలర్లను చెల్లించగా తిరిగి ఎటువంటి డేటాను పొందలేదని ఆ వ్యక్తి రిపోర్ట్చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరలో, కొంతమంది హ్యాకర్లు తమ వద్ద 1.5 బిలియన్ ఫేస్బుక్ యూజర్ డేటా ఉందని పేర్కొంటూ పోస్ట్ చేసారు. స్పందించిన ఫేస్బుక్..! ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ ఐనా సమయంలో యూజర్ల డేటా అసలు లీక్ అవ్వలేదని ఫేస్బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. యూజర్ల డేటాకు డోకా లేదని వెల్లడించింది. యూజర్ల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఫేస్బుక్ చర్యలను తీసుకుంటుందని తెలిపింది. ఎందుకైనా మంచిది ఇలా చేస్తే బెటర్..! ఫేస్బుక్ యూజర్లు తమ డేటాను చోరికి గురిఅవ్వకుండా ఉండడం కోసం 2 అథనిటికేషన్ పాస్‌వర్డ్‌ను యూజర్లు తమ ఖాతాలకు ఏర్పాటు చేయడం మంచిది. అంతేకాకుండా స్ట్రాగ్ పాస్‌వర్డ్‌లను కూడా తమ ఫేస్బుక్ అకౌంట్లకు ఏర్పాటు చేసుకోవాలని పలు టెక్నికల్ నిపుణులు వెల్లడిస్తున్నారు. “Data of Over 1.5 Billion Facebook Users Sold on Hacker Forum Information of over 1.5 billion Facebook users being sold on popular hacking-related forum, potentially enabling cybercriminals and unscrupulous advertisers to target Internet users globally” https://t.co/JE8uSJbOg9 — Amrita Bhinder 🇮🇳 (@amritabhinder) October 4, 2021 చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
సర్కారు భూములు అమ్మాలని కేబినెట్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం భూముల అమ్మకం ప్రతిపాదనకు ఎట్టకేలకు మోక్షం లభించినట్టు కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు వీలుగా, ప్రభుత్వ భూములను అమ్మి నిధులు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా ఈ మేరకు ప్రతిపాదనలకు మాత్రమే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై చర్చించిన మంత్రివర్గం కరోనా కష్టాల నుంచి బయటపడేందుకు గాను ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనకు అనుమతి ఇచ్చింది. రూ.50 వేల కోట్లకు అవకాశం ఉన్నా.. రాష్ట్రంలో ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో, ఎంత విలువైన భూములున్నాయన్న వివరాలను రెవెన్యూ శాఖ ఇప్పటికే ప్రభుత్వానికి ఇవ్వగా, వాటిలో తక్షణం అమ్మడానికి వీలున్న భూముల వివరాలను క్రోడీ కరించడంపై రెవెన్యూ వర్గాలు దృష్టి్ట పెట్టాయి. రాజధాని హైదరాబాద్ శివార్లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ.50 వేల కోట్ల వరకు నిధులు సమీకరించుకునే అవకాశ ముందనే ఓ అంచనా ప్రభుత్వం వద్ద ఉన్నా... ప్రస్తుతానికి 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల వరకు సమీకరించుకోవడానికి ప్రభుత్వం పరిమితం కానుందనే చర్చ జరుగు తోంది. ఈ మేరకు కార్యాచరణ త్వరలోనే ప్రారం భం కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శివార్లపైనే ఆశలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ప్రభుత్వ భూములున్నప్పటికీ హైదరాబాద్ శివార్లలోని భూములపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే భూములకు సంబంధించిన ప్రత్యేక నివేదికను కూడా రెవెన్యూ శాఖ నుంచి తెప్పించుకుంది. ఇటీవల సుప్రీంకోర్టులో కేసు గెలిచిన కోకాపేటలోని దాదాపు 200 ఎకరాలు, మేడ్చల్, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో ఉన్న ఇవాక్యూ (కాందిశీకులు) భూములు, ఇజ్జత్‌నగర్‌లో 35 ఎకరాలు, హైటెక్స్ సమీపంలో 8 ఎకరాలు, తెల్లాపూర్‌లో 50 ఎకరాలు....ఇలా అమ్మకానికి అనువుగా ఉన్న భూముల వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉంది. తాజాగా భూముల అమ్మకానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని సీఎస్‌ను ఆదేశించడంతో ఇప్పుడు ఈ భూముల అమ్మకానికి షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి అని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైన్డ్ భూములు కూడా... రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను గతంలో భూమి లేని పేదలకు అసైన్‌చేశారు. ఈ భూముల్లో కనీసం 30 శాతం ఇప్పుడు ఆ పేదల చేతుల్లో లేవని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయా భూములను కూడా ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాలని, ఇందుకు గాను అసైనీలకు పరిహారం చెల్లించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆయా భూముల్లో కబ్జాలో ఉన్న వారి సామాజిక స్థితిగతులతో కూడిన నివేదికను కూడా తెప్పించుకుంది. ఇలా సేకరించిన అసైన్డ్ భూము లను వీలును బట్టి వేలం వేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకు గాను తొలి దశలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపి స్తోంది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావి ర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్‌చేసిన భూములకు గాను 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలి స్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. గృహ నిర్మాణ సంస్థ భూములు సైతం.. గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.8,504 కోట్ల వ్యయంతో 46,565 యూనిట్లను నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2008 నుంచి 2011 వరకు రూ.6,301 కోట్లను వెచ్చించి పలు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టారు. ఆ తర్వాత ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో ఆర్థిక సంక్షోభం రావడం, ప్రాజెక్టును కొనసాగించడం కష్టసాధ్యమని 2013లోనే మంత్రివర్గ ఉపసంఘం తేల్చడంతో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ కార్పొరేషన్‌కు ఉన్న రూ.1,070 కోట్లకు పైగా అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. ఇందుకు గాను బ్యాంకుల్లో తనఖా ఉన్న ప్రాజెక్టులు, భూములను విడిపించింది. ఈ కార్పొరేషన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 3,337 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ గృహాలు, భూములను అమ్మడం ద్వారా నిధులను సమీకరించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రభుత్వ భూముల అమ్మకంపై రెండేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైన సర్కారు ఈ ఏడాది దాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. రాజధాని శివార్లలోని విలువైన భూములతో పాటు అసైన్డ్, గృహనిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోని భూములు అమ్మే అవకాశం ఈ ప్రక్రియ మొదలైతే దశల వారీగా రూ.50,000 కోట్ల వరకు సమీకరించుకునే అవకాశం ఉంది. రెండేళ్లుగా పన్నేతర ఆదాయం ప్రతిపాదిస్తున్నా.. భూములు అమ్మడం ద్వారా నిధులు సమీకరించుకోవాలన్న ప్రతిపాదన గత రెండేళ్ల నుంచీ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు ఆయా సంవత్సరాలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో కూడా పన్నేతర ఆదాయాన్ని ప్రతిపాదించారు. కానీ గత రెండేళ్లలో అనివార్య కారణాల వల్ల ఇది సాధ్యం కాలేదు. అయితే, 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను ప్రభుత్వం చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్క లను పరిశీలిస్తే పన్నేతర ఆదాయం ఎప్పుడూ రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు చూపెట్టగా.. 2020–21లో అయితే రూ.5 వేల కోట్లు కూడా దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్ల పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. అప్పుడు కూడా ప్రభుత్వ భూములను అమ్మే ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో 2021–22 సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభు త్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు తప్పనిసరి అని స్పష్టమవుతోంది. నిరుపయోగంగా ఉన్న గృహ నిర్మాణ సంస్థ భూములతో పాటు డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా సేకరించిన భూములు, కోకాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న భూములను అమ్మ కానికి పెట్టి రూ.10 వేల కోట్ల వరకు రాబట్టే అవకాశా లున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. -
పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొనేశాడు
ముంబై : పాలు అమ్మడానికి వేరే ఊరికి వెళ్లాల్సి వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆటోలు లేదా ట్రక్కులు, లేదా మోటార్ సైకిల్ మీదనో వెళ్తుంటారు. కానీ మహారాష్ట్రలోని భివాండికి చెందిన ఓ రైతు మాత్రం ఏకంగా హెలికాప్టర్‌నే కొనేశాడు. ఇందుకోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు చేశాడు. వివరాల ప్రకారం..జనార్దన్ భోయిర్ అనే రైతు ఈ మధ్యే పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన బిజినెస్‌ను విస్తరించుకునేందుకు పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరచూ వెళ్లాల్సి వచ్చేది. అయితే ఆయన వెళ్లే ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ సదుపాయం లేకపోవడంతో రైళ్లు, బస్సుల్లో వెళ్తుండేవాడు. దీంతో సమయం ఎక్కువగా వృధా అవుతుండటంతో స్నేహితుడి సలహా మేరకు ఓ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశాడు. ఇప్పటికే హెలికాప్టర్‌ను తన గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్స్ వేశారట. 2.5 ఎకరాల స్థలంలో హెలికాఫ్టర్ కోసం ప్రొటెక్టివ్ వాల్‌ను నిర్మించాడు. మార్చి 15న హెలికాప్టర్‌ను జనార్థన్ ఇంటికి డెలీవరీ చేస్తామని అధికారులు తెలిపారు. వ్యవసాయం, డైరీ బిజినెస్‌లతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసే జనార్థన్‌కు దాదాపు రూ 100 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వృద్ధురాలు తన పొలానికి వెళ్లేందుకు హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు లోన్ ఇప్పించాలని రాష్ష్ర్టపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే. చదవండి : (వైరల్ : 'హెలికాప్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి') (అరుదైన దృశ్యం: పాముకు నీరు తాగించాడు..) -
ఆర్ఐఎల్ సెల్ - ఎయిర్టెల్, ఎస్బీఐ.. బయ్
ముంబై: దేశంలోనే రెండో పెద్ద మనీ మేనేజింగ్ కంపెనీ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ.. గత ఏడు నెలలుగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులలో పలు మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగా ఇటీవల భారీగా ర్యాలీ చేసిన కొన్ని కౌంటర్లలో అమ్మకాలు చేపట్టగా.. వెనకడుగులో ఉన్న కొన్ని కంపెనీలలో వాటాలు కొనుగోలు చేస్తూ వచ్చింది. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఈడీ, సీఐవో ప్రశాంత్ జైన్ ఒక ఇంటర్వ్యూలో తమ పెట్టుబడు తీరుతోపాటు.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేదీ వివరించారు. జైన్ తెలిపిన వివరాలు, అభిప్రాయాల ప్రకారం.. నిఫ్టీలో 26 స్టాక్స్ ఈ ఏడాది మార్చి 24 మొదలు అక్టోబర్ 30వరకూ హెచ్డీఎఫ్సీ ఏఎంసీ నిఫ్టీ-50కు ప్రాతినిధ్యంవహించే కనీసం 26 బ్లూచిప్ స్టాక్స్‌లో విక్రయాలు చేపట్టింది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు సరికొత్త గరిష్టాలవైపు ప్రయాణించిన నేపథ్యంలో పోర్ట్‌ఫోలియోలను పునర్నిర్మించుకుంది. మార్చి 24న 7,511కు పతనమైన నిఫ్టీ అక్టోబర్ చివరికల్లా 11,642కు చేరింది. దీంతో నిఫ్టీ పీఈ 34ను దాటేసింది. 10ఏళ్ల సగటు పీఈ 22.6 రెట్లుకావడం గమనార్హం. ఫలితంగా మార్చి కనిష్టాల నుంచి 120 శాతం ర్యాలీ చేసిన ఆర్ఐఎల్ కంపెనీలో6.57 లక్షల షేర్లను విక్రయించింది. ఈ బాటలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సిప్లా, టాటా మోటార్స్, విప్రో, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, బ్రిటానియా, ఏషియన్ పెయింట్స్, టైటన్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, హెచ్‌డీఎఫసీ తదితరాలలో కొంతమేర వాటాలను తగ్గించుకుంది. ఈ కౌంటర్లు 28-110 శాతం మధ్య ర్యాలీ చేశాయి. చదవండి: (ఎవరెడీ- వొడాఫోన్ ఐడియా జోరు) పెట్టుబడుల జాబితా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ ఉన్నాయి. మార్చి నుంచి చూస్తే కోల్ ఇండియా 10 శాతం క్షీణించగా.. ఎయిర్టెల్ 7 శాతం, ఎస్బీఐ 3 శాతం చొప్పున మాత్రమే వృద్ధి చూపాయి. ఇదే విధంగా కొన్ని పీఎస్‌యూ బ్యాంకులు చౌకగా లభిస్తుంటే.. మంచి టెక్నాలజీ కలిగిన అతిపెద్ద బ్యాంకులు కొన్ని అందుబాటులో ట్రేడవుతున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ రంగం నుంచి రిటర్నులు లభించే అవకాశముంది. కాగా.. గత నెలలో 107 స్టాక్స్‌లో వాటాల విక్రయాన్ని చేపట్టగా.. 68 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. చదవండి: (సెన్సెక్స్‌ప్రెస్- 44,000 దాటేసింది!) ఫార్మాలో హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఇటీవల సన్ ఫార్మా, సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలలో వాటాలు పెంచుకోగా.. హిందాల్కో, మిశ్రధాతులో సైతం అదనపు పెట్టుబడులు చేపట్టింది. ఇదేవిధంగా టీసీఐ, ఆర్ఈసీ, చోళమండలం, టాటా కన్జూమర్, ఎండ్యూరెన్స్ తదితర కౌంటర్లలో వాటాలు సొంతం చేసుకుంది. మిడ్ క్యాప్ స్టాక్స్‌లో భారత్ ఫోర్జ్, కెమ్‌కాన్ స్పెషాలిటీ, డాబర్ ఇండియా, ఈఐహెచ్- రైట్స్, ఎంఆర్ఎఫ్, ఎన్ఎండీసీ, సన్ టీవీలలో వాటాలు మొత్తంగా విక్రయించింది. తాజాగా ఏబీ ఫ్యాషన్, సైయెంట్, డిక్సన్ టెక్నాలజీస్, ఫినొలెక్స్ కేబుల్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ తదితరాలలో ఇన్వెస్ట్ చేసింది. -
భారత్‌లో యాపిల్ అమ్మకాలు సూపర్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు భారత్‌లో గణనీయంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం రూ. 13,756 కోట్లకు చేరాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 10,674 కోట్లతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. 2019–20లో భారత్‌లో విక్రయాలపై యాపిల్ నికర లాభం రూ. 926 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 262 కోట్లు. భారత ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ల మార్కెట్లో శాంసంగ్, వన్‌ప్లస్ వంటి సంస్థలకు మరింత గట్టి పోటీనివ్వడంపై యాపిల్ దృష్టి పెడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌లోనే ఐఫోన్ 11 ఫోన్ల అసెంబ్లింగ్‌ను మొదలుపెట్టింది. ఈమధ్యే దేశీయంగా తమ తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఆన్లైన్ స్టోర్‌కి మంచి స్పందన లభించిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల పేర్కొన్నారు. కొత్త ఐఫోన్ 12కి ప్రి–ఆర్డర్లు వెల్లువెత్తడమూ కంపెనీకి లాభించినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. చదవండి: ఐఫోన్13 ఫీచర్లు హల్చల్ -
అంబానీ ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధం!
సాక్షి,ముంబై: అప్పుల సంక్షోభంలో పడిదివాలా బాటపట్టిన అనిల్ అంబానీకి మరో షాక్ తగలనుంది. రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ (ఆర్సిఎల్) ఆస్తులు విక్రయానికి రంగం సిద్దం చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి, ఆసక్తి ఉన్నవర్గాలనుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. దాదాపు 20వేల కోట్ల రూపాయల బకాయిల కోసం కీలక ఆస్తులను విక్రయించే ప్రక్రియను ప్రారంభించాయని సీఎన్‌బీసీ నివేదించింది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లెండర్స్ తరపున ఈ ప్రక్రియను చూడనున్నాయి. ఆర్సీఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)లను ఆహ్వానించింది. ఈ బిడ్లను సమర్పించేందుకు తుది గడువు 2020 డిసెంబర్ ఒకటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ అనుబంధ సంస్థలలో ఆర్సిఎల్ వాటాల్లో కొంత భాగానికి లేదా మొత్తం విక్రయించనుంది. ఇందులో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో 51 శాతం వాటా, రిలయన్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ ఫైనాన్షియల్ లిమిటెడ్‌లో 100 శాతం వాటా, రిలయన్స్ అసెట్ రీ కన్స్ట్రక్షన్లో 49శాతం వాటా, ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 20 శాతం వాటా, రిలయన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌లో 100 శాతం వాటాతోపాటు సంస్థ ఇతర ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులను అమ్మి బకాయిగా జమ కట్టుకోనుంది. అయితే తాజా పరిణామంపై రిలయన్స్ స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన అతిపెద్ద బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి. దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం చర్యలు తీసుకోవాలని రిజర్వుబ్యాంకును కోరగా, దీన్ని ఆర్బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
కీలక నిర్ణయం : సంతల్లో షావోమి
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తమ విక్రయాలను విస్తరించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐస్టోర్ ఆన్ వీల్స్ అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామీణ భారతీయ వినియోగదారులను చేరుకోవాలని యోచిస్తోంది. దేశంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో టాప్ బ్రాండ్ షావోమి ట్రావెలింగ్ స్టోర్ ప్రారంభించింది. అంటే గ్రామీణులకు చేరువయ్యేలా నిర్దిష్ట ప్రదేశాల్లో ఆగుతూ, వారాంతపు సంతలు, ఉత్సవాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తూ షావోమి సంత నిర్వహిస్తుందన్నమాట. ఇందులో స్మార్ట్ఫోన్లతోపాటు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ఇయర్ ఫోన్లు, సన్ గ్లాసెస్, పవర్ బ్యాంకులు ఇలా పలు ఉత్పత్తులను విక్రయించనున్నట్లు షావోమి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. "ఎంఐస్టోర్-ఆన్-వీల్స్" ను ప్రారంభించడం సంతోషంగా ఉందని షావోమి ఇండియా సీఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. మూవింగ్ స్టోర్ ద్వారా రీటైల్ అనుభవాన్ని గ్రామీణులకు చేరువ చేస్తున్నామని ట్వీట్ చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టును కేవలం 40 రోజుల్లో పూర్తి చేసిన తమ ఆఫ్‌లైన్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులకు తాము 100 శాతం కట్టుబడి ఉన్నామని మరో ట్వీట్ లో జైన్ వెల్లడించారు. అన్ని ఉత్పత్తులను ఇండియాలో తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇ్ండియా, మేక్ ఫర్ ఇండియన్స్, మేడ్ బై ఇండియన్స్ అంటూ ట్వీట్ చేశారు. తమ స్టోర్-ఆన్-వీల్స్ అవుట్లెట్లు ప్రస్తుత కరోనా సమయంలో పూర్తిగా సురక్షితంగా ఉంటాయని ఎంఐ ఇండియా సీఓఓ మురళీకృష్ణన్ తెలిపారు. అతిపెద్ద సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్వర్క్ ఉన్న తాము ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకోనున్నామని చెప్పారు. కాగా కరోనా సంక్షోభం, లాక్ డౌన్, ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, చైనా ఉత్పత్తులపై నిషేధం డిమాండ్ లాంటి ఎదురుదెబ్బల మధ్య కూడా షావోమి జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది. "Mi"les to go before we sleep! Excited to launch "#MiStore-on-wheels", an innovative concept that brings #retail experience to the heart of #India, connecting villages through a moving store. So proud of our #offline #team who completed this project in just 40 days. I ❤️ Mi pic.twitter.com/7OECCNnlgb — Manu Kumar Jain (@manukumarjain) September 21, 2020 -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్‌లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్‌ను కేటాయించడమైంది. -
సైరస్ మిస్త్రీకి స్వల్ప ఊరట
న్యూఢిల్లీ: కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్, మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి పాక్షిక ఉపశమనం లభించింది. టాటా సన్స్ సంస్థలో ఆయన వాటాలను విక్రయాలకు నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీఏటీ) అడ్డకట్ట వేసింది. తన వాటాలను విక్రయించాల్సింది టాటాసన్స్ ఒత్తిడి తేలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ శుక్రవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తుది విచారణను సెప్టెంబర్ 24కు వాయిదా వేసింది. టాటా సన్స్‌ను ప్రైవేటు కంపెనీగా మార్పు అంశంపై ఈ కేసులో తుది వాదనల తరువాత నిర్ణయిస్తామని తెలిపింది. టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపునకు వ్యతిరేకంగా మిస్త్రీ దాఖలు చేసిన ఎన్‌సీఎల్‌టీఏటీ స్వీకరించింది. ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ తొలగింపు సరైనదేనని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. ఎన్ సీఎల్ టీలో న్యాయమూర్తులు ప్రకాశ్ కుమార్, సేనపతిల బెంచ్ తీర్పును సైరస్ సవాల్ చేశారు. టాటా సన్స్ గత 101 సంవత్సరాలుగా 1917 నుంచీ టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందని టాటాసన్స్ న్యాయవాది వాదించారు. కాగా గత ఏడాది టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి ఉద్వాసనకు గురైన అనంతరం టాటా గ్రూప్‌లో మెజారిటీ స్టాక్ హోల్డర్స్ మిస్త్రీ కుటుంబం షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ వాటా కొనుగోలు దారుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. -
శ్రీకృష్ణుడికే పంగనామాలు
ఓజిలి : ఆలయ పూజారి తాను పూజించే శ్రీకృష్ణుడికే పంగనామాలు పెట్టి దేవుడి మాన్యం భూములను గుటకాయాస్వాహా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. మొత్తం 7.55 ఎకరాల భూమిలో వచ్చే ఫలసాయాన్ని పూజారి ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తూ ఆ భూములను రెవెన్యూ రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి విక్రయించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా దేవదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. ఓజిలి మండల పరిధిలోని ముమ్మాయపాళెం గ్రామంలో 1947 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని గ్రామస్తులు నిర్మించుకున్నారు. అప్పట్లో సర్వేనంబర్ 239–2, 246–2లలో 1.66 ఎకరాలు మాగాణి పొలాన్ని గ్రామస్తులు విరాళంగా ఇవ్వగా, ప్రభుత్వం 305–2లో5.89 ఎకరాల మెట్ట భూమిని దేవాలయానికి కేటాయించింది. అప్పటి నుంచి మందిరంలో ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. ఈ భూములను ఆలయ పూజారికి గ్రామస్తులు అప్పగించారు. భూముల్లో వచ్చే ఫలసాయంతో దేవునికి దీపారాధన జరుగుతుండేది. ఈ క్రమంలో 1995లో మందిరం గాలివానలకు కూలిపోయింది. అప్పటి నుంచి మందిరం మొండిగోడలకు పరిమితమైంది. దేవుడి భూములు మొత్తం శ్రీకృష్ణ మందిరం పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయి. గతంలో దేవుడి మాన్యంలో గంగ కాలువ వెళ్లడంతో ప్రభుత్వం రూ.28,500 నగదును పూజారి, కమిటీ పేరుతో మంజూరు చేసింది. అప్పట్లో ఈ నగదును స్వాహా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. మందిరం భూములపై పూజారి కన్నుపడి అనుకున్నదే తడవుగా గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు కాసులు ముట్టజెప్పి రికార్డులను పూజారి పేరుతో మార్పుచేశారు. దీంతో ఈ భూములను హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి సుమారుగా రూ.80 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో పూజారి పొలంపై స్టే తెచ్చేందుకు హైదరాబాద్‌కు వెళ్లిన్నట్లు సమాచారం. ఆలయ భూములను పరిరక్షించాల్సిన దేవాదాయశాఖ అధికారులు మిన్నకుండిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్తులు ఆర్డీఓ శీనానాయక్, తహసీల్దార్ సత్యవతిలకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు స్పందించి ఆలయభూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. రికార్డులు పరిశీలించి చర్యలు శ్రీకృష్ణుడి భూముల రికార్డులు తారుమారు జరిగిన విషయం నాదృష్టికి వచ్చింది. గ్రామస్తులు భూముల విషయాన్ని ఫిర్యాదు చేశారు. రెవెన్యూ పత్రాలను పరిశీలించి రికార్డులు తారుమారు చేసిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. – సత్యవతి, తహసీల్దార్, ఓజిలి భూములు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రీకృష్ణ మందిరానికి చెందిన 7.55 ఎకరాల భూములను ఆలయ పూజారి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో శ్రీకృష్ణ మందిరం పేర్లు తొలగించి పూజారి పేరు నమోదు చేసుకున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు ఆలయం శిథిలావస్థలో ఉంది. ధూప దీప నైవేద్యాలు లేవు. భూములను రూ.80 లక్షలకు విక్రయించేందుకు పూజారి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అధికారులు స్పందించి దేవుడి భూములను కాపాడాలి. – మామిడి భక్తవత్సలరావు, సర్పంచ్, ముమ్మాయపాళెం నా దృష్టికి రాలేదు కృష్ణ మందిరం భూముల విషయం నాదృష్టికి రాలేదు. మందిరం భూముల విషయాన్ని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటాం. భూములు విక్రయించకుండా చర్యలు చేపడుతాం. – రమణారెడ్డి, దేవదాయశాఖ ఈఓ, ఓజిలి -
పోషించలేక కన్నకూతురినే అమ్మేసిన తల్లిదండ్రులు
-
బిగ్ టీవీని విక్రయించిన ఆర్‌కామ్
సాక్షి, ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన, అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) సోమవారం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ టు హోం (డీటీహెచ్) సర్వీసుల రంగంలో ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమించిన సంస్థగా పేరొందిన బిగ్ టీవీ విక్రయాన్ని కూడా ఆర్ కాం పూర్తి చేసింది. నష్టాలను తగ్గించుకునే పనిలో ఇప్పటికే 2,3జీ సేవలకు గుడ్ బై చెప్పిన ఆర్‌కాం బిగ్ టీవీని అమ్మేసింది. తన ప్రత్యక్ష-హోం (డిటిహెచ్) అనుబంధ సంస్థ రిలయన్స్ బిగ్ టీవీని వీకాన్ మీడియాకు విక్రయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వీకాన్ మీడియా అండ్ టెలివిజన్ లిమిటెడ్ (VMTL)తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రిలయన్స్ బిగ్ టీవీలోని మొత్తం వాటా వీకాన్ సొంతమవుతుందని వెల్లడించింది. అన్ని వర్తక బాధ్యతలతో పాటు కాంట్రాక్ట్ రుణాలు కూడా కొనుగోలు సంస్థకే చెందుతాయని ఆర్‌కాం ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ బిగ్ టీవీ మొత్తం వాటాతో పాటు, దాదాపు 500 మంది ఉద్యోగులను కూడా వీకాన్ సొంతం చేసుకుటుందని భరోసా ఇచ్చింది. ఈ ఒప్పందం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థలు, ఆర్‌కామ్ లెండర్లు, ఇతర సంబంధిత సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని చెప్పింది. అవసరమైన బ్యాంకు హామీలను సమర్పించిన తరువాత ప్రస్తుత డీటీహెచ్ లైసెన్స్ సమాచార మరియు బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా పునరుద్ధరించబడుతుందని ఓ ప్రకటనలో తెలిపింది. 1.2 మిలియన్ల కస్టమర్ల బిగ్ టీవీ సేవలను వినియోగదారులు నిరంతరాయంగా సేవలను పొందుతారనీమ వివరించింది. ఈ విక్రయం ద్వారా వచ్చే నిధుల ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోనున్నట్టు తెలిపింది. అలాగే కంపెనీ రుణదాతలు, వాటాదారులతో సహా షేర్ హోల్డర్స్ అందరికి లబ్ది చేకూరుతుందని చెప్పింది. మరోవైపు ఈ వార్తలతో ఆర్‌కాం ఇవాల్టి మార్కెట్లో 6శాతానికిపైగా నష్టపోయింది. -
ప్రేమ.. ఖరీదు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటువంటి వాళ్లని చూసినప్పుడు ప్రేమ గుడ్డిది.. అందులో సందేహం లేదనిపిస్తుంది. ప్రేమ పేరుతో వంచించిన యువకుడు.. మోసాన్ని కూడా నిజమని నమ్మి.. అతని కోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధపడ్డ యువతి.. ఇది ఒక యధార్థ గాథ. బిహార్‌లో జరిగింది. ఆశ్చర్యం, బాధ తెప్పించే ఘటన వివరాలివి. 21 ఏళ్ల బిహార్ యువతి 2 లక్షల రూపాయలకు తన కిడ్నీ అమ్ముకునేందుకు ఢిల్లీలోని ఒక ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ మాట్లాడుకున్నాక.. సర్జరీ కోసం వైద్యులు ఢిల్లీకి రమ్మని చెప్పారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్న పోలీసులకు ఈ కాల్‌పై అనుమానం కలిగింది. కిడ్నీ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానం పోలీసులకు వచ్చింది. వెంటనే అధికారులు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్యూ)కు సమాచారం అందించి.. కిడ్నీ అమ్మకాన్ని నిలిపాలని సూచించించారు. అక్కడకు వెళ్లిన డీసీడబ్యూ అధికారులకు యువతి చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించాయి. ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు రూ. 2 లక్షలు కావాలి.. అందుకోసం కిడ్నీ అమ్ముకునేందుకు సిద్ధమయినట్లు తెలిపింది. దాదాపు మూడేళ్లుగా ఒక వ్యక్తిని ప్రేమించానని.. అతను కూడా తనను ప్రేమించినట్లు యువతి తెలిపింది. ఇదిలా ఉండగా.. అతనికి ఈ మధ్యే ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని తెలిపింది. ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొమ్మంటే.. రూ. 2 లక్షలు కావాలని డిమాండ్ చేసినట్లు ఆమె చెప్పింది. అతను కోరిన మొత్తం ఇచ్చేందుకే కిడ్నీ అమ్ముకుంటున్నానని తెలిపింది. యువతి చెప్పిన మాటలకు షాక్ తిన్న డీసీడబ్యూ అధికారులు ఆమె ప్రియుడిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
సింగ్ బ్రదర్స్‌కు సుప్రీం మరో షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఫోర్టిస్ ఆస్తులను విక్రయించే విషయంలో సింగ్ బ్రదర్స్‌కు సుప్రీంకోర్టు మరోసారి షాకిచ్చింది. ఈ విషయంలో స్టేటస్ కో స్థితిని కొనసాగించాలని గురువారం సుప్రీం పునరుద్ఘాటించింది. ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్.. బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల వద్ద తనఖాకు ఉంచిన షేర్లను విక్రయించేందుకు జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా తనఖాలో ఉన్న షేర్లను అమ్మివేసేందుకు బ్యాంకులకు (ఎస్ బ్యాంకు, యాక్సిస్బ్యాంకు) సైతం కోర్టు అనుమతి నిరాకరించింది. వీటితోపాటు నాన్ఎన్కంబర్డ్ షేర్ల విక్రయంపైనా కోర్టు నిషేధాజ్ఞలను కొనసాగాతాయని స్పష్టం చేసింది. అక్టోబర్ 31 న కేసు తుది విచారణ వరకు వారి ఆస్తులను ఏమాత్రం తొలగించకుండా ఉండాలని సుప్రీం ఆదేశించింది. ఆస్తుల విక్రయానికి సంబంధించి సుప్రీం కోర్టులో ప్రమోటర్లు సింగ్ బ్రదర్స్‌కు చుక్కెదురు కావడంతో ఫోర్టిస్ హెల్త్‌కేర్ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. ఈ షేరు దాదాపు6.6 శాతం పతనాన్ని నమోదు చేసింది. కాగా ఔషధ సంస్థ డైచీ శాంక్యో నుంచి వాస్తవాలు దాచి, తప్పడు నివేదికలు అందించిన కేసులో ర్యాన్‌బ్యాక్సీ ప్రమోటర్లు భారీ నష్టపరిహారాన్ని ఎదుర్కొంటున్నారు. రూ .2,562 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని 2016లో సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశించింది. వడ్డీతో సహా మొత్తం ఇది రూ .3,500 కోట్లకు చేరింది. అలాగే డైచీ శాంక్యో పిటీషన్ మేరకు ఆగస్టు 11 ఫోర్టిస్ ఆస్తులను, షేర్లను అమ్మడానికి వీల్లేదని సుప్రీం ఆదేశించింది. ఫోర్టిస్‌లో వాటాలను విక్రయించడానికి అనుమతి కోసం ఆగస్టు 23న సింగ్ సోదరులు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తిదారు ఎన్టీపీసీకి ఓఎఫ్ఎస్ షాక్ తగిలింది. ప్రభుత్వ డిజ్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. షేరుకు రూ .168 చొప్పున ప్రభుత్వం 7 వేల కోట్ల రూపాయల మేరకు 5 శాతం వాటాను విక్రయిస్తోంది. దీంతో ఎన్టీపీఎస్ షేరు 3 శాతానికి పైగా క్షీణించింది. ఓఎఫ్‌ఎస్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర సోమవారం ముగింపు రూ. 173తో పోలిస్తే 3 శాతం తక్కువ! ప్రప్రభుత్వ రంగ విద్యుత్ దిగ్గజం ఎన్టీపీసీలో ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయ ఆఫర్ ఫర్ సేల్ మొదలుకానుంది. షేరుకి రూ. 168 ధరలో 5 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 7,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఓవర్-సబ్ స్క్రిప్షన్ ద్వారా మరో 5 శాతం సాధించనున్నట్టు ఆ అధికారి తెలిపారు. కాగా.. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ ఆఫర్ బుధవారం ఓపెన్ కానుంది. సంస్థాగత ఇన్వెస్టర్లు ఈరోజు బిడ్డింగ్ చేసుకునే అవకాశం. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.8,800 కోట్లను సాధించింది. ముఖ్యంగా ఎల్ అండ్ టిలో వాటాలు విక్రయం, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (ఎస్‌యుటిఐఐ), ఒక వాటాల పునర్ కొనుగోలు సహా ఆరు కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ నిధులను ఆర్జించింది. ప్రభుత్వ రంగాలలో వాటాల విక్రయాల ద్వారా 2017-18లో రూ. 72,500 కోట్ల లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మైనారిటీ వాటాల విక్రయాల నుండి 46,500 కోట్ల రూపాయలు, పంచవర్ష పెట్టుబడి సంస్థల జాబితా నుండి రూ. 15,000 కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 11,000 కోట్లను సమకూర్చుకోనుంది. -
మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ
-
మాల్యాకు మరో షాకివ్వనున్న ఈడీ
న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఈడీ మరో షాక్ ఇవ్వనుంది. రెండు కంపెనీల్లో మాల్యాకు సంబంధించిన షేర్లను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. యునైటెడ్ స్పిరిట్స్, యూబీసీఎల్ కంపెనీల్లో షేర్ల అమ్మకాలపై దృష్టిపెట్టినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ రెండుకంపెనీల్లో విజయ్ మాల్యా షేర్లను అమ్మేందుకు ఈడీ రంగం సిద్ధం చేస్తోంది.. ఇందుకు పీఎంఎల్ఏ కోర్టును అనుమతిని కోరనుంది. ఈ విక్రయం ద్వారా రూ. 17000 వందలకోట్ల నిధులను ఈడీ రాబట్టనుంది. వీటిని విచారణ పూర్తయ్యేంతవరకు ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యాలని భావిస్తున్నట్టు ఎకనామిక్స్ టైమ్స్ నివేదించింది. డిసెంబర్ లో మాల్యానుదేశానికి తిరిగి రప్పించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. కాగా జూన్ 30, 2017 నాటికి విజయ్ మాల్యా యునైటెడ్ స్పిరిట్స్‌లో 0.01 శాతం వాటాను యూబీసీఎల్ లో 8.08 శాతం వాటానుకలిగి వున్నాడు. -
డేటా అమ్ముతాం రండి!
► వాన్నాక్రై సృష్టికర్తల ప్రతిపాదన ► నెలకింత చెల్లించండని బ్లాగ్ పోస్ట్ ► జూలైలో డేటా విడుదల! సాక్షి నాలెడ్జ్ సెంటర్: వాన్నాక్రై గుర్తుందా? వందల దేశాల్లోని కంప్యూటర్లను, వాటిలోని సమాచారాన్ని సీజ్ చేసి మరీ డబ్బులు డిమాండ్ చేసిన ఈ ర్యాన్సమ్వేర్ సృష్టికర్తలు షాడో బ్రోకర్స్ మరో సంచలనానికి తెరలేపారు. అగ్రరాజ్యం అమెరికా తాలూకూ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) మొదలుకుని అనేక మందికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని.. నెలకింత అని సబ్స్క్రిప్షన్ ఫీజు కడితే దాన్ని అందరికీ ఇచ్చేస్తామని ప్రకటించారు. షాడో బ్రోకర్స్ తాజా ప్రతిపాదనకు ఎంత మంది స్పందిస్తారో? ఎలాంటి సమాచారం బయటకొస్తుందో ప్రస్తుతానికి సస్పెన్స్. కాకపోతే వాన్నాక్రై కంటే ముందు ఈ హ్యాకర్ల బృందం నడిపిన వ్యవహారం మాత్రం ఆసక్తికరమైందే. అదేమిటో మీరే చూడండి. వాన్నాక్రై ర్యాన్సమ్వేర్ ప్రపంచ దేశాలను వణికించేందుకు చాలా నెలల ముందే.. కచ్చితంగా చెప్పాలంటే గత ఆగస్టులోనే షాడో బ్రోకర్స్ ఓ ప్రకటన చేసింది. ప్రపంచం మీద కన్నేసేందుకు ఎన్ఎస్ఏ సిద్ధం చేసిన కొన్ని టూల్స్ తమ వద్ద ఉన్నాయని.. ఆన్లైన్ వేలం ద్వారా వీటిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చని అప్పట్లో ప్రకటించింది. కానీ వేలానికి పది లక్షల బిట్‌కాయిన్స్ చెల్లించాల్సి ఉండటంతో పెద్దగా స్పందన రాలేదు. దీంతో షాడో బ్రోకర్స్ తర్వాతి నెలల్లో నాలుగు సెట్ల హ్యాకింగ్ టూల్స్ విడుదల చేసింది. వాన్నాక్రై వెనుక ఉన్న ఎటర్నల్ బ్లూ వీటిల్లో ఒకటి. మిగిలిన మూడింటి పరిస్థితి ఏమిటి? వాటినెవరైనా వాడుతున్నారా? ఇదే నిజమైతే వాటి ప్రభావమేమిటి? అన్నది రానున్న కాలంలో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంచితే.. తాజాగా గత నెలలోనే షాడో బ్రోకర్స్ ఒక బ్లాక్ ద్వారా నెలవారీ సబ్స్క్రిప్షన్ మోడల్ తాలూకూ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారీ ఎత్తున సమాచారం(బ్యాంక్ అకౌంట్ల వివరాలు మొదలుకుని.. వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, వీడియోలు ఏమైనా కావచ్చు) కావాలనుకునే వారు అందుకోసం 20 వేల డాలర్ల విలువ చేసే జెడ్ క్యాష్ డిజిటల్ క్రిప్టో కరెన్సీ చెల్లించాల్సి ఉంటుంది. వంద జెడ్క్యాష్ కాయిన్లకు సమానమైన ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత వచ్చే జూలైలో రెండు దఫాలుగా సబ్స్క్రైబర్లు అందరికీ ఈ సమాచారం అందుతుంది. ఆ సమాచారంతో వాళ్లేం చేసుకుంటారో తమకు సంబంధం లేదని షాడో బ్రోకర్స్ అంటున్నా.. కొనుక్కునే వారు కచ్చితంగా బ్లాక్‌మెయిలింగ్, లేదా చోరీ వంటి అక్రమ మార్గాలకు పాల్పడతారన్నది గ్యారెంటీ! బిట్ కాయిన్లకు బదులుగా జెడ్క్యాష్ కాయిన్లను వాడటంపై కూడా షాడో బ్రోకర్స్ ఓ వివరణ ఇచ్చింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన డార్పా, ఇజ్రాయెల్ కలసి సృష్టించిన ఈ జెడ్ క్యాష్ కాయిన్లు బిట్కాయిన్ల కంటే సురక్షితమైనవని అంటోంది. మిగలిన సంగతులు ఎలా ఉన్నప్పటికీ ఎటర్నల్ బ్లూ లాంటి మరిన్ని టూల్స్ కూడా ఈ సమాచారంలో ఉంవచ్చన్న అంశం మాత్రం సైబర ప్రపంచాన్ని కలవర పరిచేదే! -
అక్షయ తృతియ: ఒక్క రూపాయికే బంగారం!
న్యూఢిల్లీ : నోట్ల రద్దు తర్వాత అలీబాబాకు చెందిన పేటీఎం ఓ రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇప్పటికే అన్ని రకాల డిజిటల్ సర్వీసులు అందిస్తున్న పేటీఎం మరో కొత్తరకం సర్వీసులతో మన ముందుకు వచ్చింది. ఇంకా ఒక్క రోజుల్లో అక్షయ తృతీయ కావడంతో, ఎంఎంటీసీ-పీఏఎంపీతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న పేటీఎం 'డిజిటల్ గోల్డ్' ను లాంచ్ చేసింది. దీంతో ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారానే బంగారం కొనడం, అమ్మడం వంటి సేవలను కస్టమర్లకు అందించనుంది. ఈ సేవల్లో భాగంగా అతి తక్కువ ధర ఒక్క రూపాయికే బంగారం కొనుగోలుచేసుకోవచ్చని పేటీఎం పేర్కొంది. తమ పేటీఎం మొబైల్ వాలెట్స్ ను వాడుకుంటూనే వినియోగదారులు 24 క్యారెట్ల 999.9 స్వచ్ఛత బంగారాన్ని ఆన్ లైన్ లో కొనుకోవచ్చిన ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ చెప్పింది. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎంఎంటీసీ-పీఏఎంపీలోనూ సెక్యుర్ గా గోల్డ్ ను ఐదేళ్ల పాటు స్టోర్ చేసుకోవచ్చని పేర్కొంది. నాణేల రూపంలోనూ కస్టమర్ల అభ్యర్థన మేరకు ఇళ్ల వద్దకు గోల్డ్ ను డెలివరీ చేస్తామని పేర్కొంది. ఎంఎంటీసీ-పీఏఎంపీకి తిరిగి ఆన్ లైన్ లోనూ ఈ గోల్డ్ ను అమ్ముకోవచ్చట. బంగారానికి భారతీయుల పెట్టుబడుల సాధనంగా ఎంతో ప్రాముఖ్యత ఉందని, బంగారంలో డిజిటల్ గా పెట్టుబడులు పెట్టడానికి తాము సులభతరంగా సేవలందిస్తామని పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. మార్కెట్ ఆధారిత ధరలతోనే ఇంటర్నేషనల్ క్వాలిటీ బంగారాన్ని అమ్మడానికి, కొనడానికి కస్టమర్లకు అవకాశముంటుందన్నారు. ఒక్క రూపాయికి కూడా బంగారం కొనుక్కునే అవకాశం వినియోగదారులకు కల్పిస్తామని విజయ్ శేఖర్ చెప్పారు. 20వేల వరకు బంగారం కొనుగోళ్లకు ఎలాంటి కేవైసీ వివరాలను అందించాల్సినవసరం ఉండదు. -
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 కమింగ్ బ్యాక్
సియోల్: దక్షిణ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. బ్యాటరీ పేలుళ్లతో అమ్మకాలను నిలిపివేసిన రి ఫర్బిష్డ్ గెలాక్సీ నో్ట్ 7 అమ్మకాలను మొదలుపెట్టనున్నట్టు మంగళవారం వెల్లడించింది. ఇతర రి ఫర్బిష్డ్ స్మార్ట్ ఫోన్ అమ్మకాలతో కలిపి వీటిని కూడా విక్రయించనున్నట్టు తెలిపింది. అయితే పునరుద్ధరించిన ఈ స్మార్ట్ఫోన్లను ఎపుడు, ఏ యే దేశాల్లో విక్రయించాలనేది ఇంకా నిర్ణయించలేదని ఒక ప్రకటనలో తెలిపింది. లోకల్ డిమాండ్, రెగ్యులేటరీ అధికారులు, విక్రయదారులతో సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మూడు మిలియన్ యూనిట్లను విక్రయించాలని ఆలోచిస్తున్నట్టు పేర్కొంది. కాగా 2016 ఆగస్టులో లాంచ చేసిన గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వైఫల్యం కారణంగా శాంసంగ్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ స్మార్ట్‌ఫోన లో అమర్చిన బ్యాటరీలు చార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోయిన ఘటనలు నమోదు కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నాలుగు మిలియన్ల ఫోన్లను శాంసంగ్ రీకాల్ చేసింది. లిథియం అయాన్ బ్యాటరీ పేలుళ్ల కారణంగా 5.42 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. -
అమ్మకానికి మాల్దీవులు.. భారత్ గుండెల్లో రైళ్లు?
-
మఠం ఆస్తులను అమ్ముకుంటున్న పీఠాధిపతి
-
అమ్మకానికి మాల్దీవులు.. భారత్ గుండెల్లో రైళ్లు?
న్యూఢిల్లీ: దక్షిణాసియా దేశమైన మాల్దీవులు 26 ద్వీపాల సమూహం. ఆ ద్వీపాల్లో ఒకదాన్ని అమ్మకానికి పెట్టింది మాల్దీవులు. దీంతో మాల్దీవులకు అతి చేరువలో ఉన్న భారత్‌కు ఇరుగుపొరుగులో మరో భద్రతా సమస్య ఏర్పడినట్లే. మాల్దీవుల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అబ్దుల్లా యమీన్ ప్రభుత్వం సౌదీ అరేబియాకు 'ఫాఫు' అనే ద్వీపాన్ని అమ్మాలని యోచిస్తోంది. ఈ విషయంపై మాట్లాడిన మాల్దీవుల్లోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ దేశంలో వహబిజంను దేశంలో మరింత విస్తరింపజేసే విధంగా ఉందని పేర్కొంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నా ఓ పరాయి దేశానికి భూమిని అమ్మడానికి ప్రభుత్వం వెనకాడటం లేదని తెలిపింది. గతంలో ఇతర దేశస్థులకు మాల్దీవుల్లో భూమిని అమ్మితే వారిని ఉరి తీసేవారు. ఆ నిబంధనలను 2015లో చేసిన రాజ్యంగా సవరణ ద్వారా సడలించారు. అతి తక్కువ భూభాగం కలిగి ఉండే మాల్దీవుల్లో విదేశీయులకు భూమిని అమ్మడాన్ని అక్కడి ప్రజలు కూడా నిరసిస్తున్నారు. ఫాఫు ద్వీపం కొనుగోలు గురించి సౌదీ కింగ్ త్వరలోనే మాల్దీవుల పర్యటనకు రానున్నారు. మాల్దీవుల్లో సౌదీ భూమిని అమ్మడానికి చాలా కారణాలు ఉన్నాయి. సౌదీ ప్రతి ఏటా 300మంది మాల్దీవియన్లకు విద్యకు సంబంధించిన స్కాలర్షిప్లను అందిస్తోంది. ఇప్పటికే 70 శాతం మందికిపైగా మాల్దీవియన్లు వహబిజాన్ని స్వీకరించారు. భారత్‌కు చుట్టూ ఉన్న పొరుగుదేశాల్లో ప్రధానమంత్రి పర్యటించని ఒకే ఒక దేశం కూడా మాల్దీవులే. మాల్దీవుల్లోని అంతర్గత వ్యవహారాల కారణంగా భారత ప్రభుత్వం వారితో సంబంధాలు పెట్టుకునేందుకు ఇష్టపడలేదు. కానీ, ఇకపై ఆ దేశంతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరాన్ని తాజా పరిస్ధితులు కల్పించాయి. వచ్చే ఏడాది మాల్దీవుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల తర్వాత భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ధృడమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
అంబాసిడర్ బ్రాండ్ అమ్మేశారు..
కోలకత్తా: అంబాసిడర్..ఒకపుడు ఈ పేరు వింటేనే.. అదో రాజసం..దర్పం...దశాబ్దం క్రితం వరకు ఒక వెలుగు వెలిగిన ఈ ఐకానిక్ కారు బ్రాండ్‌ను ఓ విదేశీ కార్ల సంస్థసొంతం చేసుకుంది. దేశీయ కార్ మేకర్ హిందుస్తాన మోటార్స్ అంబాసిడర్ కారు బ్రాండ్ ను ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యుగోట్‌కు విక్రయించింది. ఈ మేరకు సి కె బిర్లా గ్రూప్ యాజమాన్యంలోని హిందూస్థాన్ మోటార్స్ శుక్రవారం రూ .80 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ ట్రేడ్ మార్క్ అమ్మకం ద్వారా వచ్చి న ఆదాయాన్ని ఉద్యోగులు , రుణదాతల బకాయిలను క్లియర్ చేయడానికి ఉపయోగించనున్నట్టు సికె బిర్లా గ్రూప్ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ప్యుగోట్ ఈ బ్రాండ్ ను ఇండియాలో పునరద్ధరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏడు దశాబ్దాల క్రితం అంబాసిడర్ కార్ల ఉత్పత్తిని హిందుస్తాన్ మోటార్స్ లాంచ్ చేసింది. మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ కి కొద్ది మార్పులు చేసిదీన్ని మార్కెట్ లో ప్రవేశపెట్టింది. 1960 -70 దశకాల్లో ఒక వెలుగు వెలిగింది. భారత రోడ్లపై అంబాసిడర్ వాహనాల ఆధిపత్యం కొనసాగింది. దాదాపు 1980లో మారుతి 800 రాక అంబాసిడర్‌కు భారీ దెబ్బ తగిలింది. ఎంతగా అంటే...1980 మధ్యకాలంలో 24వేల అంబాసిడర్ వాహన విక్రయాలు నమోదు కాగా, 2013-14 నాటికి విక్రయాలు 2,500 స్థాయికి పడిపోయాయి. కాగా ఈ కార్ల ఉత్పత్తి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయింది. -
టెలినార్‌ను కొంటున్నది ఎవరు?
న్యూఢిల్లీ : చౌకైన ఆఫర్లతో తక్కువ కాలంలోనే ఎక్కువమంది టెలికాం ఖాతాదారులను ఆకర్షించుకునేందుకు భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టెలినార్ ప్రస్తుతం పూర్తిగా అయోమయంలో పడిపోయింది. భారత్ యూనిట్లో తమకొచ్చే నష్టాలు తట్టుకోలేక, ఇక ఇక్కడ తమ వ్యాపారాలు కొనసాగించలేక, ఎలాగైనే భారత్ బిజినెస్‌ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీనికోసం మూడో టెలికాం దిగ్గజగా ఉన్న ఐడియా సెల్యులార్తో చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. తమ భారత్ యూనిట్‌ను నగదు రహితంగా ఐడియా సెల్యులార్కు విక్రయించేందుకు చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఈ డీల్ ఓకే అయితే దేశంలో మూడో అతిపెద్ద టెలికాం దిగ్గజంగా ఉన్న ఐడియా చేతికి నార్వేకు చెందిన ఈ టెలికాం ఆపరేటర్ స్థానిక వ్యాపారాలన్నీ దక్కనున్నాయని సమాచారం.. ఎలాంటి వాస్తవ చెల్లింపులు లేకుండా టెలినార్ రుణాలను, ఆస్తులను మార్పిడి చేసుకునేలా ఈ రెండు కంపెనీలు చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ చర్చలు సఫలీకృతం కాకపోవచ్చని కంపెనీకి సంబంధించిన మరో వ్యక్తి చెప్పారు. మరో రూ.36,000కోట్లను తన రుణభారంగా మార్చుకునేందుకు ఐడియా సెల్యులార్ సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటికే అక్టోబర్ ఆక్షన్‌లో స్పెక్ట్రమ్ కొనుగోలుకు అదనంగా రూ.13,000 కోట్లను ఐడియా సెల్యులార్ వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలినార్ ఇండియాకు ఇప్పటికే రూ.1,900 కోట్లను స్పెక్ట్రమ్ చెల్లింపులుగా కేంద్రానికి చెల్లించాల్సి ఉంది. అంతేకాక ఫైనాన్సియల్ ఇన్స్టిట్యూషన్స్కు రూ.1,800 కోట్లు బాకీ పడి ఉంది. అయితే ఇటు టెలినార్, ఐడియా సెల్యులార్ రెండు కూడా ఈ విషయంపై స్పందించడం లేదు. ఒకవేళ ఐడియా చేతికి టెలినార్ దక్కితే కొన్ని కీలక సర్కిళ్లలో 1800 ఎంహెచ్‌జడ్ బ్యాండ్‌లో 4జీ స్పెక్ట్రమ్ ఈ కంపెనీకి ప్రయోజనంగా మారనుంది. మరోవైపు టెలినార్ కంపెనీ తన ఇండియా బిజినెస్‌ల నుంచి వైదొలగుతుందని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు. -
ఐడియా కు రిలయన్స్ జియో భారీ ఎఫెక్ట్
-
ఐడియాకు జియో దెబ్బ
ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద మొబైల్ టెలికం సేవల సంస్థ ఐడియా కు రిలయన్స్ జియో ఎఫెక్ట్ భారీగా తాకనుంది. రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సంస్థ పెర్ ఫామెన్స్ వీక్ గా ఉండనుందనే అంచనాల నేపథ్యంలో మలేషియన్ టెలికాం కంపెనీ ఆక్సియాటా తన వాటాను అమ్మేందుకు యోచిస్తోంది. జియో ఉచిత సేవల కారణంగా మరో మూడేళ్లపాటు ఐడియా పనితీరు మందగించే అవకాశమున్నట్లు మలేసియన్ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐడియాలో తన 20శాతం వాటాను (2 బిలియన్ల డాలర్ల విలువ) విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు గతంలో టెలీకాం మలేషియా, ఆక్సియాటా వాటాను తిరిగి కొనుగోలుకోసం ఐడియా సెల్యులర్ మాతృ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ను సంప్రదించింది. (ఆదిత్యా బిర్లా గ్రూపు ఐడియాలో 40 శాతం వాటా ఉంది) అయితే దానికి తిరస్కరించడంతో ఇతర కొనుగోలుదారులకోసం చూస్తోంది. ఈ మేరకు బోర్డు తీర్మానాన్ని కూడా ఆమోదించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై స్పందించడానికి ఐడియా, ఆక్సియాటా సంస్థలు నిరాకరించాయి. కాగా పెద్ద నోట్ల రద్దుతో రూ.100- 200 మధ్య ఐడియా రిచార్జ్ లు గణనీయంగా తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇప్పటికే 2 శాతం క్షీణించిన ఐడియా ఆదాయం ఈ క్వార్టర్ లో 4-5 శాతం వరకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఆక్సియాటా వాటా విక్రయిస్తే..ఐడియాకు మరిన్ని కష్టాలు తప్పవని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలతో మార్కెట్ లో ఐడియా కౌంటర్ బలహీనపడింది. సుమారు 3.28 శాతం నష్టాలతో కొనసాగుతోంది. మొబైల్ బిల్లులను రద్దయిన నోట్లతో చెల్లించడానికి డిశెంబర్ 15 వరకు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. -
అమెరికా సబ్సిడరీ వాటా అమ్మనున్న ఐటీసీ
ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ దిగ్గజం, సిగరెట్ ఉత్పత్తి మేజర్ ఐటీసీ అమెరికాలోని తన సబ్సిడరీ సంస్థ 'కింగ్ మేకర్ మార్కెటింగ్' లో పూర్తి వాటాను విక్రయించాలని భావిస్తోంది. అమెరికా మార్కెట్ లో ఐటీసీ సిగరెట్ ఉత్పత్తులను విక్రయించే ఈ కంపెనీలోని వాటా విక్రయానికి (24 మిలియన్ డాలర్లు) రూ.160 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ ప్రతిపాదనకు కార్పొరేట్ నిర్వహణ కమిటీ ఆమోదం లభించిందనీ బీఎస్ఈ ఫైలింగ్ లో ఐటీసీ తెలిపింది. అక్టోబర్ 8, 2016 న ఈ ఒప్పందం నమోదు చేయబడిందనీ, ఈ డీల్ ముగిసిన అనంతరం అమెరికా లోని కింగ్ మేకర్ మార్కెటింగ్ సంస్థతో తమ సబ్సిడరీ ముగుస్తుందని స్పష్టం చేసింది. కాగా అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రం కేంద్రంగా కింగ్ మేకర్ మార్కెటింగ్ సేవలు అందిస్తోంది. కింగ్ మేకర్ మార్కెటింగ్ లో ఏస్, చెకర్స్ , హెచ్ఐ వాల్, గోల్డ్ క్రెస్ట్ బ్రాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ వార్తలతో ఐటీసీ షేర్ 1,85 శాతం లాభపడి రూ 240.85 వద్ద ట్రేడవుతోంది. -
9 నుంచి మాంసం, చేపల విక్రయాలు నిషేధం
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రజారోగ్యం దృష్ట్యా ఈనెల 9నుంచి 25వ తేదీ వరకు నగరంలో మాంసాహారం, చేపల అమ్మకాలు, జంతువథను నిషేధిస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. 16 రోజులపాటు కబేళాను కూడా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. మాంసాహార విక్రయదారులు ఈ విషయాన్ని గ్రహించి సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించినట్లైతే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
అప్పుడే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి
-
'లేసిడీ లా రోనా' కు డిమాండ్ తగ్గింది!
న్యూయార్క్ః అన్ కట్ డైమండ్స్ అంటే మనసు పారేసుకోని వారుండరు. ముఖ్యంగా బడా వ్యాపారులు అటువంటివి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయా? ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తుంటారు. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన, శతాబ్ద కాలంనాటి ముడి వజ్రం.. 'లేసిడీ లా రోనా' కు మాత్రం ఇప్పుడు ఆ డిమాండ్ లేకుండా పోయింది. లండన్ లోని ప్రముఖ వేలం సంస్థ సౌత్ బే.. లుకారా డైమండ్ కార్పొరేషన్ కు చెందిన అతిపెద్ద 1,109 క్యారెట్ల వజ్రాన్ని అమ్మకానికి పెట్టగా.. కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వేలాన్నే నిలిపివేయాల్సి వచ్చింది. సుమారు వందేళ్ళు దాటిన 'లేసిడీ లా రోనా' వజ్రాన్ని కొనేవారే కరువయ్యారు. అతిపెద్ద అన్ కట్ డైమండ్ కు మార్కెట్లో డిమాండ్ లేకుండా పోవడం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు అద్దంపట్టింది. లుకారా డైమండ్ ను వజ్రాల వ్యాపారులు కొనేందుకు ఆసక్తి చూపక పోవడం మార్కెట్లో సంచలనమే రేపింది. 1,109 క్యారెట్ల ఆ అన్ కట్ డైమండ్ రిజర్వ్ ధర సుమారు రూ. 470 కోట్లుగా నిర్ణయించి, వేలానికి పెట్టిన సౌత్ బే సంస్థ... అంతకన్నా ఎక్కువ ఎవ్వరూ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో ఏకంగా వేలాన్నే ఆపేయాల్సి వచ్చినట్లు తెలిపింది. రూ. 470 కోట్ల విలువైన వజ్రాన్ని వేలానికి పెడితే.. ఓ వ్యక్తి రూ. 410 కోట్ల వరకూ ఆఫర్ చేశారని, అసలు ధరకన్నా తక్కువకు అడగడంతోనే వజ్రం వేలం ఆపాల్సి వచ్చిందని లుకారా కంపెనీ సీఈవో విలియం లాంబ్ తెలిపారు. నిజానికి ఆ వజ్రానికి ఎంతో డిమాండ్ ఉందని.. అది అమ్ముడుపోకపోవడం తమను ఎంతో నిరాశ పరిచిందని లాంబ్ తెలిపారు. కొన్నాళ్ళ తర్వాత మరోసారి వజ్రాన్ని వేలానికి పెడతామన్న ఆయన.. ఆ తేదీని మరోసారి వెల్లడిస్తామన్నారు. వాంకోవర్ ఆధారిత లుకారా షేర్ల విలువ తగ్గిపోవడంతోనే ఈపరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు. -
కేజీ ఉల్లిపాయలు 50 పైసలే!
ఔరంగాబాద్ః ఉల్లి... రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టించి, అమ్మకానికి తెచ్చేసరికి ధరాఘాతం ఆవహించడం రైతన్నను కుదేలు చేస్తోంది. టన్నులకొద్దీ ఉల్లిపాయలు అమ్మినా.. వందల్లో కూడ డబ్బు చేతికి రాకపోవడం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అధః పాతాళానికి పడిపోయిన ఉల్లి ధరలను చూసి, ఔరంగాబాద్ లాసూర్ హోల్ సేల్ మార్కెట్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మార్కెట్ కు తెచ్చిన 450 కేజీల ఉల్లిపాయలను అమ్మగా... కేవలం 175 రూపాయలు మాత్రమే రావడం అక్కడి రైతును తీవ్ర ఆవేదనకు గురి చేసింది. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే ఎందుకా అని ఆశ్చర్యపోయేవాడినని, నిజంగా ప్రస్తుత ఉల్లి ధరలు చూస్తే.. ఏ రైతులైనా ఆత్మ హత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని... చిన్నతనంలో ఉల్లి పంటను పండించిన ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ తాలూకా రైతు అంటున్నారు. అతిపెద్ద ఉల్లిపాయల హోల్ సేల్ మార్కెట్లలో ఒకటైన మారాఠ్వాడా లోని లాసూర్ మార్కెట్లో మంచి నాణ్యత కలిగిన ఉల్లిపాయలు తీవ్ర ధరాఘాతానికి గురై.. వేలంలో 100 కేజీలకు 500 నుంచి 600 రూపాయలు ధర పలకడం రైతును నట్టేట ముంచింది. దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధి చెందిన నాసిక్ ఉల్లి మార్కెట్లో కూడ సరఫరాలో పెరుగుదలతో ధర తీవ్రంగా పడిపోయి, క్వింటాల్ కు 720 రూపాయలు పలకడం ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలామంది రైతులకు తాము పండించిన పంటను నిల్వ చేసుకునే అవకాశం లేదని, ఎకరానికి 50 వేల నుంచి 80 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు... మార్కెట్లో ధర పలకకపోవడంతో తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తోందని, కనీసం పెట్టుబడి ఖర్చులు కూడ తిరిగి రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరువు కారణంగా చాలామంది చెరకు రైతులు కూడ ఈసారి ఉల్లిపంటను ఆశ్రయించారని, ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం రైతులనుంచి ఉల్లి కొనుగోలు చేయాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15,000 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసి, రైతులకు సాగులో సహాయపడతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు బిజేపీ ప్రాంతీయ ప్రతినిధులు చెప్తున్నారు. ఏది ఏమైనా డిమాండ్, సప్లైల్లో సమతుల్యత లేకపోవడమే ధర పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. -
కుమార్తెను అమ్మకానికి పెట్టిన తల్లి
ఓ తల్లి తన 9 ఏళ్ల కుమార్తెను విక్రయిస్తానంటూ ముందుకు రావటంతో తిరుపతి నగరంలో కలకలం రేపింది. జిల్లాలోని బంగారుపాళ్యంకు చెందిన భానుప్రియ తన తొమ్మిదేళ్ల కుమార్తెతో శుక్రవారం చిత్తూరు బజారువీధికి చేరుకుంది. అక్కడ చుట్టుపక్కల వారితో కూతురిని విక్రయిస్తానంటూ బేరానికి పెట్టింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ప్రస్తుతం భానుప్రియను విచారిస్తున్నారు. -
మళ్లీ అలాంటి నిర్ణయమే తీసుకున్న అమెరికా
వాషింగ్టన్: గతంలో తీసుకున్న నిర్ణయమే భారత్‌ను కలవరపెడుతుండగా అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైనిక దాడులకు ఉపయోగించే ఏహెచ్-1జెడ్ వైపర్ హెలికాప్టర్లను పాకిస్థాన్‌కు విక్రయించనుంది. మొత్తం తొమ్మిది ఈ తరహా హెలికాప్టర్లను పాక్ కు విక్రయించాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు పెంటగాన్ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఫైటర్ జెట్ ఎఫ్-16 విమానాలను పాక్ విక్రయించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీసుకున్న నిర్ణయం భారత్‌కు మింగుడు పడకముందే తాజా నిర్ణయం మరోసారి ఆలోచనలో పడేసినట్లయింది. పాక్ విక్రయించనున్న ఈ హెలికాప్టర్ల ధర కనీసం 170 మిలియన్లు ఉండనుంది. -
నన్ను ఎవరైనా కొనుక్కోండి.. ఓ ఐఐటీ విద్యార్థి !
న్యూ ఢిల్లీ: ఉద్యోగం కోసం బయోడేటా, అర్హత పత్రాలతో అభ్యర్థులు కంపెనీల చుట్టూ తిరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఓ ఐఐటీ విద్యార్థి మాత్రం వినూత్నంగా ఆలోచించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఈ -కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం కోసం ప్రయత్నించిన అతను.. ఆ వెబ్సైట్లోనే తాను అమ్మకానికి ఉన్నానంటూ తన ప్రొఫైల్ ఉంచాడు. అందులోనే తన రెజ్యూమ్ మొత్తాన్ని కూడా అప్లోడ్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చదువుకున్న ఆకాశ్ నీరజ్ మిట్టల్ ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. అయితే అది అందరిలా చేస్తే విశేషం ఏముంది అనుకున్నాడో ఏమో.. వెబ్సైట్లో తాను అమ్మకానికి ఉన్నానంటూ పూర్తి వివరాలు అందించాడు. తనకు రేటు కూడా ఫిక్స్ చేసుకున్నాడు. రూ. 27,60,200 గా తన ధరను నిర్ణయించుకున్న మిట్టల్.. ఫ్రీ డెలివరీ, లైఫ్ టైం వారెంటీ అంటూ ఆఫర్‌ను కూడా ప్రకటించాడు. దేశంలోని మేధావులతో పోటీ పడినప్పుడు.. మిగతావారితో పోల్చితే మనం ఏదైనా కొత్తగా చేయాలని మిట్టల్ భావించాడని అతని జూనియర్ బజాజ్ తెలిపాడు. మరి ఎంతో వినూత్నంగా అలోచించిన మిట్టల్‌కు ఫ్లిప్‌కార్ట్ స్వాగతం పలుకుతుందని అతని సన్నిహితులు భావిస్తున్నారు. -
'మా యుద్ధ విమానాలు పాక్‌కు అవసరం'
వాషింగ్టన్: పాకిస్థాన్‌కు యుద్ధ విమానాలు అమ్మడాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించుకుంది. భారత్‌కు విషయం ఆందోళన కలిగిస్తుందని తాము భావించడంలేదని చెప్పింది. పైగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు ఈ విధంగా తమ సహాయం పాకిస్థాన్‌కు అవసరం అని చెప్పింది. నాలుగు రోజుల కిందట ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను పాకిస్థాన్‌కు అమ్ముతున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా చర్యను తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో పెంటగాన్ ప్రెస్ కార్యదర్శి పీటర్ కుక్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మేం పాకిస్థాన్‌కు యుద్ధవిమానాలు అమ్మడం ఆ దేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కునేందుకు అదనపు బలంగా పనిచేస్తుంది. అది వారి జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కూడా. ఇది భారత్‌కు ఆందోళన కలిగిస్తుందని మేం భావించడం లేదు. మేం పాకిస్థాన్‌తో ఉన్న సంబంధాలను, భారత్‌తో ఉన్న సంబంధాలను వేర్వేరుగా చూస్తున్నాం. ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. తన సామర్థ్యాలను పెంచుకోవడం ముఖ్యమైన అంశంగా మేం భావిస్తున్నాం' అని ఆయన అన్నారు. -
ఆ ఇంట్లో దెయ్యాలున్నాయ్..!
ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న నేటి తరుణంలోనూ...దెయ్యాలూ, భూతాలకు భయపడుతున్నవారు మెండుగానే కనిపిస్తున్నారు. అదీ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ అటువంటి నమ్మకాలకు కొదవ లేదు. సైతాన్లు వేధిస్తున్నాయని, దెయ్యాలు పట్టి పీడిస్తున్నాయని, ఆస్తులు అమ్ముకొనే వారు కొందరైతే... ప్రాణాలు తీసుకునేవారు మరి కొందరు. అటువంటి ఘటనే తాజాగా బ్రిటన్‌లో వెలుగు చూడటం అందర్నీ విస్మయ పరుస్తోంది. ఓ సైతాను తనను గాయపరుస్తోందని, తీవ్రంగా వేధిస్తోందని అందుకే తన ఇల్లు అమ్మకానికి పెట్టానని బ్రిటన్‌కు చెందిన 43 ఏళ్ళ వెనెస్సా మిచెల్ వెల్లడించింది. అందుకు తనవద్ద ఎన్నో ఆధారాలు ఉన్నాయంటోంది. ఎస్సెక్స్ సెయింట్ ఓసిత్ లో నివసించే ఆమె... ఏకంగా దెయ్యాల భయంతో స్వంత ఇంటిని అమ్మకానికి పెట్టి కాటేజీకి మారిపోయింది. తన ఇల్లు ఓ భయానక ప్రదేశమని, దెయ్యాలకు, భూతాలకు కేంద్రమని, అనేక సంఘటనలు తాను ఎదుర్కొన్నట్లు చెప్తోంది. గర్భిణిగా ఉన్నపుడు దెయ్యం తనను వెనకనుంచీ బలవంతంగా తోసేదని, నేలపై రక్తం చారికలే అందుకు నిదర్శనమని వెనెస్సా సాక్ష్యాలను సైతం చూపిస్తోంది. తన ఇల్లు మధ్యయుగంలో అధికారిక జైలుగా ఉండేదని, 16వ శతాబ్ద కాలంలో ఇంగ్లాండ్ లోని ప్రసిద్ధ మంత్రగత్తె అక్కడ ఉండేదని, ఎనిమిదిమందిని చంపిందన్న నేరారోపణతో అనంతరం ఆమె చంపబడినట్లు చరిత్ర సాక్ష్యాలున్నాయంటోంది. అయితే అటువంటి ఇంట్లో తాను 11 సంవత్సరాల నుంచీ ఉంటున్న వెనెస్పా.. ఇటీవల ఓ మేక రూపంలోని దుష్టశక్తి తన జీవితంలోకి ప్రవేశించిందని అందుకే ఇంటిని వేలానికి పెట్టానని అంటోంది. మేక ముఖం ఫోటోల్లో కనిపించడమే కాక, సీసీ టీవీ ఫుటేజ్ లో కూడ బయట పడిందని అంటోంది. తనకు... తన కొడుకు మధ్య నల్లటి ఆకారం నిలబడటం తాను స్వయంగా చూశానంటోంది. మేకలో ఏదో ఆత్మ ప్రవేశించి ఉండొచ్చిని, అదే తమను వేధిస్తోందని వెనెస్సా నమ్ముతోంది. నిజానికి వెనెస్సా ఆ ఆకర్షణీయమైన ఇంటిని చూసి అప్పట్లో మనసు పారేసుకుందట, గ్రామానికి మధ్యలో, చూసేందుకు ఆకట్టుకునే ఆ ఇల్లు నిజానికి ఎప్పుడూ అమ్మకానికే ఉండేదని.... తాను కొనుగోలు చేసేప్పుడు ఎందరో తనను హెచ్చరించారని అంటోంది. అయితే అప్పట్లో అటువంటి విపరీత ధోరణులను తాను నమ్మకపోవడం వల్లే ఇల్లు కొనుగోలు చేశానని, పదకొండేళ్ళపాటు ఇంట్లో నివసించి అనేక ప్రయోగాలను చేశానని చెప్తోంది. ఇల్లు కట్టినప్పటినుంచీ ఎవ్వరూ ఆర్నెల్లకు మించి అందులో నివసించలేదని ఆమె తెలుసుకుంది. వందేళ్ళ క్రితం ఓ కుటుంబం 150 యూరోలకు ఈ ఇంటిని కొనుగోలు చేసి, కొంతకాలం తర్వాత దాన్ని వదిలించుకొనేందుకు కేవలం 50 యూరోలకే విక్రయించినట్లు తెలిసిందంటోంది. ప్రస్తుతం తానుకూడా ఇంటిని అమ్మకానికి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ ఇంట్లో ఏవో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు ఎన్నో నిదర్శనాలు తనకు కనిపించాయని చెప్తోంది. 2004 లో 148 యూరోలకు ఆ ఇంటిని కొనుగోలు చేసిన వెనెస్సా... దానికి దెయ్యాల చరిత్ర ఉందని గ్రహించలేకపోయానంటోంది. -
నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ(30) అనే మహిళ తన నవజాత శిశువును గురువారం సాయంత్రం అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలిసిన మహిళా సమాఖ్య సభ్యులు శిశుసంక్షేమ శాఖ అధికారులతో సంఘటన స్థలానికి వెళ్లారు. అంజమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెకు కొంత ఆరిక్థ సహాయం చేశారు. అంజమ్మకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా పదిరోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులతో కలసి బిడ్డను అమ్మకానికి పెట్టింది. బిడ్డను పోషించడం ఇబ్బందిగా మారితే శిశు సంక్షేమ శాఖకు శిశువును అప్పగిస్తామని అధికారులు ఆమెకు సూచించారు. ప్రస్తుతానికైతే శిశువు విక్రయాన్ని ఆపారు. -
కొడుకులను అమ్మకానికి పెట్టిన తండ్రి
-
10 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు: గంగ్వార్
హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీ నుండి సీసీఐ పత్తి కొనుగోళ్లను ప్రారంభిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ వెల్లడించారు. రైతుల సాయంతోనే దళారి వ్యవస్థను అడ్డుకోగలమని ఆయన అన్నారు. పత్తి అమ్మిన వారం లోపే రైతు ఖాతాలో డబ్బులు పడేలా అధికారులను సూచించారు. అమీర్‌పేట సెస్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన పత్తి రైతుల సదస్సుకు కేంద్ర జౌళి శాక మంత్రి సంతోష్ గంగ్వార్, దత్తాత్రేయలు హాజరయ్యారు. మద్దతు ధర ఇంకా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేయటంతో... మద్దతు ధరపై మరోసారి ప్రధానితో కలిసి చర్చిస్తామని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. -
ఆన్లైన్లో తెలంగాణ హస్తకళలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తెలంగాణ హస్త కళా ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించేందుకు రంగం సిద్దమైంది. ఫిలిగ్రి, డోక్ర, నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, పోచంపల్లి, గద్వాల చీరలు, వరంగల్ కార్పెట్లు తదితర చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ విస్తరణ ద్వారా కళాకారులకు ఉపాధి మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ వాణిజ్య సంస్థ 'గో కార్ట్' తో తెలంగాణ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. సాఫ్ట్వేర్ రూపకల్పన, సంస్థాగత ఏర్పాట్లు పూర్తి కావడంతో మరో పక్షం రోజుల్లో ఆన్లైన్లో హస్తకళా ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మరో అంతర్జాతీయ ఆన్లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ కూడా తెలంగాణ హస్త కళల ఉత్పత్తుల అమ్మకాలపై ఆసక్తి చూపుతోంది. మరో ఆన్లైన్ వాణిజ్య సంస్థ ఫ్లిప్‌కార్ట్ కేవలం విక్రయాలకు పరిమితం కాకుండా కేటలాగ్స్ తయారీ, ప్యాకేజింగ్, కొరియర్ చేయడం తదితరాలపై ఉత్పత్తిదారులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకువచ్చింది. త్వరలో నూతన షోరూంలు అంతర్జాతీయంగా ఆన్లైన్ విక్రయాలతో పాటు రాష్ట్రంలో షోరూంల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ప్రస్తుతం 'లేపాక్షి' గా పిలుస్తున్న హస్త కళల అభివద్ధి సంస్థకు తెలంగాణలో ఎనిమిది విక్రయ షోరూంలు ఉన్నాయి. వరంగల్ మినహా మిగతా షోరూంలన్నీ హైదరాబాద్‌లోనే కేంద్రీకృత మయ్యాయి. ఈ షోరూంల ద్వారా ఏటా రూ.40 కోట్ల మేర హస్తకళల ఉత్పత్తుల లావాదేవీలు జరుగుతున్నాయి. కరీంనగర్, మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో త్వరలో నూతన షోరూంలు ప్రారంభం కానున్నాయి. యాదాద్రి, భద్రాచలం, హైటెక్స్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ షోరూంలు ఏర్పాటు చేయాలని హస్త కళల అభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందించింది. అయితే సిబ్బంది కొరత మూలంగా షోరూంలకు బదులుగా ఫ్రాంఛైజీలు నెలకొల్పాలని తాజాగా నిర్ణయించింది. -
రూపాయి రికవరీ...
55 పైసల లాభంతో 66.10 వద్ద క్లోజింగ్ ముంబై: ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడంతో మంగళవారం రూపా యి గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే 55 పైసల పెరుగుదలతో 66.10 వద్ద ముగిసింది. ఒక్క రోజే రూపాయి ఇంతగా పెరగడం ఏడు నెలల వ్యవధిలో ఇదే తొలిసారి. దేశీ స్టాక్‌మార్కెట్ కోలుకోవడం, ఈక్విటీ.. డెట్ మార్కెట్లలోకి కొత్తగా నిధుల రాకతో డాలర్ల సరఫరా మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. -
వేలానికి ఐవోసీ వాటాలు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో యూపీఏ సర్కారు కంటే రెండు రెట్లు వేగంతో వెళుతోన్న మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ)లో 10 శాతం వాటాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం (ఆగస్టు 24న) స్టాక్ మార్కెట్లలో ఈ వాటాలను విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ విక్రయాల ద్వారా దాదాపు రూ. 9, 500 కోట్ల ధనం ప్రభుత్వానికి సమకూరుతుంది. ప్రస్తుతం ఐవోసీలో కేంద్ర ప్రభుత్వానికి 68.57 శాతం వాటా ఉంది. విడదలవారీగా పెట్టుబడుల ఉపసంహరణను అమలు చేయాలనుకుంటున్న సర్కారు.. రూ.69, 500 కోట్లను సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే సోమవారం 10 శాతం వాటాను విక్రయిస్తున్నది. ఇలా ప్రభుత్వం ఐవోసీ వాటాలను విక్రయించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఆర్థిక, చమురు శాఖల మంత్రులు అరుణ్ జైట్లీ, ధర్మేంద్రప్రధాన్ లు విక్రయానికి సంబందించిన అన్ని వ్యవహారాలను ఇప్పటికే పూర్తిచేశారు. మరోవైపు ఓఎన్ జీసీ, ఎన్ఎండీసీ, నాల్కొ, పీఎస్‌యూ లాంటి డజనుకుపైగా ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను విక్రయించేందుకు పెట్టుబడుల ఉపసంహరణ శాఖ కసరత్తులు చేస్తున్నది. -
మూడు నెలల బాలుడి విక్రయం
నాయుడుపేట (నెల్లూరు జిల్లా) : రెండు రోజుల క్రితం విక్రయించబడిన మూడు నెలల బాలుడిని ఐసీడీఎస్ సీపీడీవో, జిల్లా శిశు సంరక్షణ అధికారులు మంగళవారం గుర్తించారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం కోరుమంచివారికండ్రిగ గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సీతలపూడి బాబయ్య, క్రిష్ణమ్మ దంపతులు సంతానం లేకపోవడంతో రెండు రోజుల క్రితం ఒక బాలుడిని తీసుకొని వచ్చారు. కాగా ఈ విషయం తెలిసిన అధికారులు దంపతులను వివరణ కోరగా నాయుడుపేట మండల కేంద్రానికి చెందిన బూబమ్మ అనే మహిళ దగ్గర నుంచి తీసుకొని వచ్చామని తెలిపారు. దీంతో అధికారులు పోలీసుల సహాయంతో విచారణ కోసం బూబమ్మ ఇంటికి వెళ్లగా ఆమె పరారైనట్లు పోలీసులు తెలిపారు. బూబమ్మ ఎవరి దగ్గర నుంచి బాలుడిని తీసుకొచ్చి విక్రయించిందో తెలియాల్సి ఉంది. అయితే పిల్లలు లేని ఆ దంపతులు బూబమ్మ దగ్గర నుంచి బాలుడిని రూ. 70వేలకు కొన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలు బూబమ్మ కోసం గాలిస్తున్నారు. కాగా బాలుడిని నెల్లూరులోని శిశు విహార్‌కు తరలించనున్నట్లు శిశు సంరక్షణ అధికారులు తెలిపారు. -
మంటగలసిన మాతృత్వం
-
అప్పుల బాధతో బిడ్డలను అమ్మేసిన రైతు
-
కొడుకును అమ్ముకున్న కాంట్రాక్ట్ కార్మికుడు?
కాగజ్‌నగర్ టౌన్: ఓ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో కొడుకును అమ్ముకున్న ఘటన ఆలస్యం గా వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీకి చెందిన కాంట్రాక్టు కార్మికుడు ఎస్పీఎంలో పని చేసేవాడు. మిల్లు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయన భార్య ప్రైవేట్ ఆసుపత్రిలో నాలుగురోజుల క్రితం మగ శిశు వుకు జన్మనిచ్చింది. ఆస్పత్రికి చెల్లించాల్సిన రూ. 13 వేలు కట్టలేక బిడ్డను విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారితో బేరం కుదుర్చుకున్నాడు. దీనికి కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఉద్యోగి మధ్యవర్తిత్వం నెరిపి నట్లు పలువురు చెబుతున్నారు. ఆ వ్యాపారి ఆస్పత్రి బిల్లుతోపాటు కొంత నగదు అందజేసి శిశువును తీసుకెళ్లినట్లు తెలిసింది. -
తవ్వుకో.. అమ్ముకో!
పెద్దేముల్: అనుమతి లేకున్నా అక్రమంగా తవ్వకాలు.. ఆపై అధికారుల అండదండలు.. సహజ సంపదను కొల్లగొట్టే ఘనులకు ఇంకేం కావాలి. సరిగ్గా జిల్లా పశ్చిమ ప్రాంతంలో సుద్దగనుల తరలింపులో ఇదే తంతు జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు లేనప్పటికీ ఎకరాలకొద్దీ ప్రభుత్వ, అటవీ భూముల్లో అక్రమంగా సుద్దను తవ్వేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం అధికార గణానికి తెలిసినప్పటికీ.. లోపాయికారీ ఒప్పందంతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో సర్కారుకు కోట్ల రూపాయలు నష్టం కలుగుతుండగా.. అక్రమార్కులకు, స్థానిక అధికారులకు మాత్రం కాసుల పంట కురిపిస్తోంది. జిల్లా పశ్చిమ ప్రాంతమైన పెద్దేముల్, ధారూరు, మోమిన్‌పేట్ మండలాల్లో సుద్దగనులు పుష్కలంగా ఉన్నాయి. వీటిపై కన్నేసిన స్థానిక నాయకులు కొందరు అక్రమంగా సుద్ద, ఎర్రరాయిని తవ్వేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతి తీసుకుని మైనింగ్ చేపడితే సర్కారు ఖజానాకు ఆదాయం సమకూరేది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు ఉపక్రమించిన అక్రమార్కులు.. దాదాపు 10వేల టన్నుల సుద్దను తోడేశారు. మారుపల్లి, రుద్రారం, తట్టేపల్లి, ఓగులాపూర్ తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపినట్లు స్పష్టమవుతోంది. స్థానికులే సూత్రధారులు.. సుద్ద, ఎర్రరాయి అక్రమ తవ్వకాల్లో స్థానికుల పాత్ర అధికమని తెలుస్తోంది. ఆయా గ్రామాల్లోని కొందరు వ్యక్తులే ఈ తవ్వకాలు జరుపుతున్నదనేది బహిరంగ రహస్యం. ఈ తంతు గనుల శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో తవ్వకాల వ్యవహారం సాఫీగా సాగుతోంది. ఇలా రోజుకు 30 నుంచి 40 లారీల సుద్దను తోడేస్తున్నట్లు తెలుస్తోంది. రాయల్టీకి ఎగనామం.. గనుల తవ్వకాల్లో ప్రభుత్వానికి గరిష్టంగా మూడోవంతు రాయల్టీ రూపంలో చెల్లించాలి. కానీ ప్రభుత్వ అనుమతులు లేకుండానే తవ్వకాలు జరుపుతుండడంతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇటీవల మారేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 170లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపి టన్నులకొద్దీ సుద్దను మాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాస్తవానికి సుద్ద తవ్వకాలకు సంబంధించి టన్నుకుగాను ప్రభుత్వానికి రూ.110 చెల్లించాలి. అదేవిధంగా ఆఫ్ వైట్ సుద్దకు రూ.44 ఇవ్వాలి. కానీ ఈ సొమ్ము సర్కారు ఖాతాలో జమకాకపోవడంతో భారీ నష్టమే జరుగుతోంది. రోజుకు గరిష్టంగా రూ.2లక్షలు.. నెలలో రూ.60 లక్షల రెవెన్యూ నష్టం జరుగుతున్నట్లు అంచనా. వారిపై చర్యలేవీ..? సుద్ద తవ్వకాలపై ఫిర్యాదులందడంతో ఇటీవల అధికారులు దాడులు జరిపారు. దీంతో మారేపల్లిలో 1500 టన్నుల విలువైన సుద్దను పట్టుకున్నారు. కానీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆ తర్వాత మరో 5వేల టన్నుల సుద్ద అక్రమంగా తరలించినప్పటికీ అధికారుల మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. రుద్రారం, గోపాల్పూర్ గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్ర అటువైపు చూడడం లేదు. ఇందోల్ గ్రామంలో పేదలకిచ్చిన అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. -
స్వామి సొమ్మును ఇతర పనులకెలా....
-
పసికందును అమ్మకానికి పెట్టారు!
-
లక్ష రూపాయిలకు బాలిక అమ్మకం
రంఘియా: ఇంటర్నెట్ యుగంలోనూ అనాగరిక చర్యలు ఏదో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. హర్యానాలో ఓ బాలికను లక్ష రూపాయిలకు అమ్మేశారు. అసోంలోని కంపూర్ జిల్లా దుహివాల గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకుంటానని ఎర వేసి ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హర్యానా తీసుకెళ్లి ఆ అమ్మాయిని మరొకరి అమ్మేశాడు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి బాధితురాలిని సొంత గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నరుల్ హుసేన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
3 నెలలు.. 300 ఎకరాలు!
భూములను తెగనమ్మిన ‘స్వగృహ’ సాక్షి, హైదరాబాద్: అన్ని వసతులతో కూడిన గృహ సముదాయాలు నిర్మించి తక్కువ ధరకే ప్రజలకు అమ్మే లక్ష్యంతో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఏర్పాటైంది. అయితే, ఇళ్లను నిర్మించి అమ్మటం కంటే.. ఏకంగా భూములనే అమ్మేందుకు ఆ కార్పొరేషన్ ఇప్పుడు ఆసక్తి చూపింది. గత 3 నెలల్లో రికార్డు స్థాయిలో 300 ఎకరాలను తెగనమ్మేసింది. తద్వారా రూ.90 కోట్ల వరకు నిధులు సమకూర్చుకుంది. బ్యాంకు రుణాలు చెల్లించాల్సిన గడువు దగ్గరపడుతున్నందన ఆ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనూ ఈ- వేలంలో భూ విక్రయాల కార్యక్రమం కొనసాగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు ప్రాంతాల్లోనూ కొత్త ప్రభుత్వాలు వస్తే భూములు అమ్మడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండటంతో.. ఆ లోపే ఈ తంతు పూర్తి చేయాలనే ఆలోచనతో గత 3 నెలలుగా కార్పొరేషన్ ఇదే పనిలో ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేక అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌పై బ్యాంకుల నుంచి ఒత్తిడి తీవ్రం కావటంతో.. తమ ఆధీనంలోని భూములనమ్మి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణాలు తీర్చేందుకు సాయం కోరితే.. భూములమ్మి అప్పులు తీర్చుకొమ్మంటూ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఉచిత సలహా ఇచ్చింది. దాంతో అధికారులు ఈ వేలం ద్వారా భూముల అమ్మకం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే.. భూముల అమ్మకానికి మళ్లీ అనుమతి తీసుకోవాల్సి వస్తుందని, అందుకు ఆ ప్రభుత్వాలు అనుకూలంగా లేకపోతే బ్యాంకు రుణాలు చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధికారులు.. ఈ లోపే ‘ఈ వేలం’ ద్వారా సాధ్యమైనన్ని భూములను అమ్మే పనిలో పడ్డారు. ఇప్పటికే తాండూరులో 150 ఎకరాలు, నల్లగొండలో 40 ఎకరాలను అమ్మేశారు. మహబూబ్‌నగర్, తణుకు, కర్నూలు, శ్రీకాళహస్తి, కాకినాడ తదితర ప్రాంతాల్లోనూ పలు విక్రయాలు చేశారు. ఇదే మంచి అవకాశమని భావించిన రాజకీయ నేతలు కొందరు కొన్నిచోట్ల తక్కువ ధరకే వాటిని సొంతం చేసుకున్నారు. ఇంకా కార్పొరేషన్‌కు దాదాపు 1350 ఎకరాల వరకు భూమి ఉంది. ఇందులో మరికొంత భూమిని అమ్మేందుకు యత్నించినా అనుకున్నంత స్పందన రాకపోవటంతో పాటు పరిపాలనపరమైన జాప్యం వల్ల అమ్మలేకపోయారు. దాంతో వాటిపై కొత్త ప్రభుత్వాల ఆదేశాల మేరకు నడుచుకోవాలని అధికారులు నిర్ణయించారు. సమీపిస్తున్న బ్యాంకుల డెడ్‌లైన్: ప్రస్తుతం వివిధ బ్యాంకుల్లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు దాదాపు రూ. 1100 కోట్ల మేర అప్పు ఉంది. ఈ మొత్తాన్ని ఈ సెప్టెంబరు లోపు తీర్చాల్సి ఉంది. వన్‌టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులు ఈ గడువు విధించాయి. డిమాండ్ ఉందని సంస్థ గుర్తించిన 10 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ఆ ఇళ్లను అమ్మి అప్పు తీర్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.