రంఘియా: ఇంటర్నెట్ యుగంలోనూ అనాగరిక చర్యలు ఏదో ఒక చోటు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై దారుణాలు ఆగడం లేదు. హర్యానాలో ఓ బాలికను లక్ష రూపాయిలకు అమ్మేశారు. అసోంలోని కంపూర్ జిల్లా దుహివాల గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకుంటానని ఎర వేసి ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. హర్యానా తీసుకెళ్లి ఆ అమ్మాయిని మరొకరి అమ్మేశాడు.
బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి బాధితురాలిని సొంత గ్రామానికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నరుల్ హుసేన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
లక్ష రూపాయిలకు బాలిక అమ్మకం
Published Sun, Jun 1 2014 6:24 PM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM
Advertisement
Advertisement