దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి.. | Haryana Mans Hand Chopped Off By Unidentified People Took IT Away | Sakshi
Sakshi News home page

దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..

Published Tue, Jan 10 2023 10:14 AM | Last Updated on Tue, Jan 10 2023 10:16 AM

Haryana Mans Hand Chopped Off  By Unidentified People Took IT Away - Sakshi

హర్యానాలో ఒక దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిన కథనం ప్రకారం..హర్యానాలో జుగ్ను అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తులు కత్తులతో దాడి చేసి..చేయి నరికేశారు.

అనంతరం నిందితులు ఆ చేయిని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సదరు బాధితుడిని లోక్‌నాయక్‌ జై ప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాధితుడి నుంచి వాగ్ములం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నిందితులను గుర్తించేందుకు సీసీఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లుతెలిపారు. ఐతే ‍ప్రత్యక్ష సాక్షలు బాధితుడు జుగ్న కురుక్షేత్ర హవేలి వెలుపల కూర్చొని ఉండగా... సుమారు పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి కత్తులతో దాడి చేసినట్లు చెబుతున్నారని పోలీసులు అన్నారు.  

(చదవండి: భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement