Kurukshetra
-
గయతో పాటు ఈ ప్రాంతాల్లోనూ పిండ ప్రదానాలు
న్యూఢిల్లీ: పితృ పక్ష అమావాస్యనాడు పెద్దలకు పిండ ప్రదానం చేయడమనేది హిందువుల్లో ఆచారంగా వస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 2న పితృపక్ష అమావాస్య. పెద్దలకు పిండ ప్రదానం చేయడం ద్వారా వారి ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతుంటారు. అలాగే పిత్ర దోషం కూడా తొలగిపోతుందని అంటారు. పిండ ప్రదానం చేసేందుకు దేశంలోని గయతో పాటు కొన్ని ప్రాంతాలు శ్రేష్టమైనవని చెబుతారు. అవి ఎక్కడెక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.1. హరిద్వార్హరిద్వార్లోని నారాయణి శిల దగ్గర పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేసేవారిపై పూర్వీకుల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని, వారి జీవితంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయని చెబుతుంటారు.2.బుద్ధగయబీహార్లోని ఫల్గు నది ఒడ్డున ఉన్న బుద్ధగయ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేసేందుకు విదేశాల నుండి కూడా తరలివస్తారు. విష్ణుపురాణం, వాయుపురాణాలలో దీనిని మోక్షభూమి అని పేర్కొన్నారు. దీనిని విష్ణు నగరి అని కూడా అంటారు. విష్ణువు స్వయంగా పితృదేవత రూపంలో ఇక్కడ ఉన్నాడని, బ్రహ్మ స్వయంగా తమ పూర్వీకులకు ఇక్కడే పిండప్రదానాన్ని చేశారని చెబుతారు. Foreigners perform Pitru Paksha Tarpan rituals at GayaGaya is Mokshbhumi and it attracts sanatan dharma followers across the world Our rituals Our traditions 🔥🙏🏼 pic.twitter.com/Nru3esLfUo— Viक़as (@VlKAS_PR0NAM0) September 30, 20243. కురుక్షేత్రహర్యానాలోని కురుక్షేత్రలో పితృపక్ష అమావాస్య రోజున పిండ ప్రదానం చేయడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. మహాభారతంలోని వివరాల ప్రకారం ధర్మరాజు తన కుటుంబ సభ్యులకు ఇక్కడే పిండప్రదానం చేశాడు.4. కాశీకాశీలో పిండప్రదానం చేయడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతుంటారు. కాశీలోని పిశాచ మోచన్ కుండ్ సమీపంలో మూడు మట్టి పాత్రలను ఉంచి, పిండ ప్రదానం చేస్తారు. ఆరోజున నలుపు, ఎరుపు, తెలుపు జెండాలను ఎగురవేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షప్రాప్తి కలుగుతుందంటారు. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.ఇది కూడా చదవండి: 31నే దీపావళి.. తేల్చిచెప్పిన కాశీ పండితులు -
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
హరియాణాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానంలో ఎన్నికల పోరు రణరంగాన్నే తలపిస్తోంది. సాధారణంగా ముఖాముఖి పోరు సాగే ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం బీజేపీ, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి మాత్రం గెలుపు కోసం చెమటోడుస్తోంది. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచి్చన ప్రముఖ పారిశ్రామిక వేత నవీన్ జిందాల్‌కు టికెటిచి్చంది. ఇండియా కూటమి అభ్యరి్థగా ఆప్ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్ఎల్డీ తరఫున జాట్ నాయకుడు అభయ్ చౌతాలా పోటీ పడుతున్నారు. హరియాణా ముఖ్యమంత్రి నాయ»Œ æసింగ్ సైనీ ఇటీవలి దాకా ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నారు.కురుక్షేత్రలో 2004, 2009ల్లో నవీన్ జిందాల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014, 2019ల్లో బీజేపీ భారీ విజయాలు సాధించింది. కురుక్షేత్రలో జాట్ సామాజికవర్గ ప్రాబల్యమున్న స్థానం. 17.88 లక్షల మంది ఓటర్లలో జాట్లు 14 శాతముంటారు. బ్రాహ్మణులు, సైనీలు చెరో 8 శాతం, సిక్కులు 6 శాతం, అగర్వాల్ సామాజికవర్గం 5 శాతం ఉన్నారు. అభయ్ చౌతాలా జాట్ నాయకుడు కాగా జిందాల్, సుశీల్ గుప్తాలది బనియా సామాజికవర్గం. పోరు బీజేపీ, ఆప్ మధ్యేనని తొలుత భావించినా ఐఎన్ఎల్డీ నుంచి జాట్ నేత రంగంలోకి దిగడంతో పోరు త్రిముఖంగా మారింది. బీజేపీకి రైతుల సెగగత రెండుసార్లూ బీజేపీ భారీ మెజారిటీలు సాధించినా, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా పారీ్టపై ప్రస్తుతం వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికితోడు రైతు సమస్యలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మరింత సమస్యగా మారాయి. ఇటీవలి రైతుల ఆందోళనలు ఆ పార్టీ పుట్టి ముంచుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. పైగా ఆ సందర్భంగా వేలాది రైతులపై కేసులు పెట్టడం బీజేపీకి చాలా వ్యతిరేకంగా మారింది. భారతీయ కిసాన్ యూనియన్ (చారిణి) ఇప్పటికే చౌతాలాకు మద్దతిచ్చింది. ఈ యూనియన్ ఊరూరా రైతులతో సమావేశాలు నిర్వహించి మరీ ఐఎన్ఎల్డీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఆప్ కూడా రైతులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువత, మహిళలకు నెలకు రూ.వేయి ఆరి్ధక సాయం వంటి హామీలతో దూసుకెళ్తోంది. ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.జిందాల్ పొలం బాట బీజేపీకి ఎదురు గాలి వీస్తున్న సంకేతాలు అందుతుండటంతో పార్టీ అభ్యర్థి జిందాల్ ప్రచార శైలిని మార్చారు. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ట్రాక్టర్లు నడపడం, వరి పొలాల్లోకి దిగి రైతులతో మాట్లాడటం వంటివి చేస్తున్నారు. తన సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు భారీగా ఉపాధి కలి్పస్తానని హామీ ఇస్తున్నారు. కురుక్షేత్రలో ఈ నెల 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ఎన్నికల ‘కురుక్షేత్రం’.. మూటలు మోసిన కుబేరుడు!
Naveen Jindal: ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆకట్టుకోవడానికి రకరకాల ఫీట్లు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అపర కుబేరుడు, జిందాల్ స్టీల్స్ ఛైర్మన్ నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్‌లో కొనసాగారారు. 2004, 2009 ఎన్నికల్లో కురుక్షేత్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. కొద్దిరోజుల కిందటే కాషాయ కండువా కప్పుకొన్న నవీన్ జిందాల్ అదే కురుక్షేత్ర నుంచి బీజేపీ టికెట్‌తో రంగంలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ జిందాల్.. స్థానిక మార్కెట్ యార్డులో మూటలు మోయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 50 కేజీల గోధుమ మూటను ఎత్తుకుని లారీలోకి లోడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే స్వయంగా తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. హర్యానాలోని మొత్తం 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా ఆరో విడతలో అంటే మే 25వ తేదీన పోలింగ్ జరగనుంది. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయడానికి అటు ఎన్డీఏ, ఇటు ప్రతిపక్ష కూటమి పట్టుదలతో ఉన్నాయి. దీనికి అనుగుణంగా ప్రచార వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. हरियाणा के किसान, देश की जान...🙏 pic.twitter.com/WNdJZduS1P — Naveen Jindal (@MPNaveenJindal) April 17, 2024 -
బీజేపీలో చేరిన స్టీల్ టైకూన్.. గంటల్లోనే టికెట్!
పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆదివారం భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. అలా చేరారో లేదో కొన్ని గంటల వ్యవధిలోనే ఆయనకు బీజేపీ టికెట్ ప్రకటించింది. హర్యానాలోని కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గం నుంచి రంగంలోకి దించింది. అంతకుముందు రోజు నవీన్ జిందాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్'లో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘నేను పదేళ్లు కురుక్షేత్ర నుంచి ఎంపీగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాను. కాంగ్రెస్ నాయకత్వానికి, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేడు రాజీనామా చేస్తున్నాను’ అన్నారు. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికైన నవీన్ జిందాల్ న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరారు. పార్టీతో జిందాల్ అనుబంధం దేశ ఆర్థిక వ్యవస్థను పెంపొందించే ప్రభుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళుతుందన్నారు. దేశంలోని ప్రముఖ జిందాల్ స్టీల్ & పవర్ (JSP) గ్రూప్‌నకు నవీన్ జిందాల్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీకి వ్యవస్థాపక ఛాన్సలర్‌గా కూడా ఉన్నారు. పోలో, స్కీట్ షూటింగ్ వంటి క్రీడల్లో జాతీయ గుర్తింపును సాధించారు. శాస్త్రీయ కూచిపూడి కళాకారిణి షల్లు జిందాల్‌ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నవీన్ జిందాల్ 2004 నుంచి 2014 వరకు కురుక్షేత్ర లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. 2014 జాతీయ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రాజ్ కుమార్ సైనీపై ఓటమిని ఎదుర్కొన్నారు. తదనంతరం 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. -
దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..
హర్యానాలో ఒక దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిన కథనం ప్రకారం..హర్యానాలో జుగ్ను అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తులు కత్తులతో దాడి చేసి..చేయి నరికేశారు. అనంతరం నిందితులు ఆ చేయిని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సదరు బాధితుడిని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాధితుడి నుంచి వాగ్ములం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లుతెలిపారు. ఐతే ప్రత్యక్ష సాక్షలు బాధితుడు జుగ్న కురుక్షేత్ర హవేలి వెలుపల కూర్చొని ఉండగా... సుమారు పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి కత్తులతో దాడి చేసినట్లు చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..) -
దూరం చేసే అహంకారం
అహంకారం... అయిన వాళ్ళనే కాదు, కానివాళ్లనూ దూరం చేస్తుంది. అందరితో వ్యతిరేకతను పెంచి, సమాజానికి దూరంగా బతికేలా చేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులను ఏ సమాజమూ గుర్తించదు. ఏ మనిషీ గౌరవించడు. సరికదా, అవసరమయినపుడు ఆదుకునేవారు లేక అలాంటి వ్యక్తులు నానా ఇబ్బందులూ పడతారు. నిత్య జీవితంలో చాలామంది తమ గురించి, తమ ఆలోచనల గురించి గొప్పగా ఊహించుకుంటూ, తాము అందరికంటే ఉన్నతులమని, తమకంటే గొప్ప వారు మరొకరు లేరని భ్రమిస్తూంటారు. చేస్తున్న ప్రతిపనిలోనూ తమ గొప్పతనాన్ని చాటుకుంటూ, తాము ఇతరులకు భిన్నమని, ఇతరులకంటే తాము చాలా ఎక్కువమని భావిస్తూ వాస్తవానికి దూరంగా జీవిస్తారు. వారిలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగుతారు. తమలోని వాపును కూడా మహాబలమని భ్రమిస్తారు. అణకువతో ఓ మెట్టు దిగుదామన్న విషయాన్ని అటుంచి దానిని అవమానంగా భావిస్తారు. ఇలా అంతర్యామికీ, అంతరాత్మకూ మధ్య ఉన్న ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువే అహంకారం. దానినే మనం గర్వమని కూడా పిలుస్తుంటాం. వినమ్రతకు అహంకారం బద్ధ వ్యతిరేకం. గర్విష్టికి భగవంతుడు ఆమడదూరంలో ఉంటాడు. ముందు ‘నేను’ అనే మాయ నుంచి బయట పడితే, ఆ తరువాత తన దరికి చేర్చుకుంటానంటాడు. నిజానికి ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడమే. మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తం మలినమవుతుంది. అదే అహంకారం పాలు ఎక్కువైతే మానవత్వమే మంటకలసి పోతుంది. ఎవరిలో అహంకారం ప్రవేశిస్తుందో అలాంటి వారు అధోగతి పాలవుతారు. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, అదేవిధంగా అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం మృగ్యమైపోతుంది. మనిషికి బుర్ర నిండా వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుంచి రాక్షసత్వంలోకి మనిషిని నెట్టేస్తుంది. గర్వం లేదా అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో వారి గతి అధోగతే. మనిషిలో గర్వం, అహంకారం కొంచెం ఉన్నా అవి మనిషిని నిలువునా ముంచేస్తాయి. గర్వంతో కూడిన విజయం ఎల్లప్పుడూ శాశ్వతం కాదు. అలాంటి విజయం వలన తాత్కాలిక ఆనందం పొందినప్పటికీ, సమస్యలు వచ్చినప్పుడు మనకు తోడుగా ఎవరూ ఉండరని గుర్తుంచుకోవాలి. నాది, నేను అనే భావనలు మనిషిలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచుతాయి. ఈ రెండు భావనలను మనసు నుంచి తుడిచేస్తే జీవితంలో ఎలాంటి విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. దుర్యోధనుడి విపరీతమయిన అహంకారం వల్లే మహా భారత సంగ్రామం జరిగింది. గర్వితుడయిన దుర్యోధనుడి అహంకారం వల్ల పాండవులకు ధర్మంగా రావల్సిన రాజ్యం కూడా రాకుండా పోయింది. అంతేకాదు ద్రౌపది వస్త్రాపహరణానికి, కౌరవ సేనల అకృత్యాలకు, జూదంలో ధర్మరాజును మాయతో గెలిచిన తీరుకు... ఇలా అన్నింటికీ దుర్యోధరుని అహంకారమే కారణమయ్యింది. ఆ అహంకారం వల్లే సాక్షాత్తు శ్రీ కృష్ట భగవానుడు యుద్ధం వద్దని వారించడానికి వచ్చినా దుర్యోధనుడు వినలేదు.. కయ్యానికి కాలు దువ్వి , తాను నాశనమవడమే కాకుండా ఏకంగా కురు వంశం నాశనమవ్వడానికి కారణమయ్యాడు. ఇలా దుర్యోధనుడే కాదు మన పురాణాలలో అనేక మంది పురాణ పురుషులు అహంకారంతో తమ నాశనాన్ని తామే కోరి తెచ్చుకున్నారు. గర్వమనేది మనిషిని పూర్తిగా నిర్వీర్యుడ్ని చేసి, పతనానికి పునాది వేస్తుంది. కనుక ఎవరైనా ఒకరిపై గెలిచామనే గర్వంతో ఆనందిస్తున్నారంటే వారిలో మానసిక వైకల్యం ఉన్నట్టుగానే భావించాలి. గర్వం నాశనానికి తొలి మెట్టు. మనిషిలో గర్వం అనే అగ్నిని రాజేస్తే, ఆ తర్వాత అది దుఃఖానికి కారణమవుతుంది. మనషి బతికి ఉన్నప్పుడే నేను, నాది అనే భావనలు కలుగుతాయి. మరణించాక శ్మశానంలో రాజైనా,సేవకుడైనా,ధనికుడైనా, పేదవాడైనా ఒక్కటే. అందువల్ల ఈ భూమి మీద బతికున్నంత కాలం ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా జీవించడానికి కృషి చేయాలి. గర్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో దరి చేరనివ్వకుండా సచ్ఛీలతతో తమకున్నదానిలో ఇతరులకు సహాయం చేసేవాడే నిజమైన విజేత అవుతాడన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. విధేయత, అణకువ లాంటి లక్షణాలు మనుషులను విజయతీరాలకు తీసుకువెళతాయి. అందువలన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరినప్పటికీ గర్వం, తలకెక్కించు కోకుంటే అసలైన విజయం సొంతం అవుతుంది. గర్వం లేనివారు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో తప్పక విజయం సాధిస్తారు. గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మనిషికి ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే చిన్న చూపు ఉన్నట్లే. కనుక గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. అహంకారం అనేది ఎక్కడో ఉండదు. అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. ఇది అనేక అనర్థాలకు మూలకారణమవుతుంది. ఉన్న పళంగా ఆకాశానికి ఎత్తేసి, ఆ ఆకాశం నుంచి ఒక్క ఉదుటన పాతాళంలోకి తోసేస్తుంది. అహంకారం ఉన్న వ్యక్తులెవరైనా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటారు. – దాసరి దుర్గా ప్రసాద్ -
కీచక భర్త: నవవధువుపై సామూహిక అత్యాచారం
సాక్షి, న్యూఢిల్లీ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. మూఢనమ్మకాల కారణంగా ఓ నవవధువు సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ ఘటన కురుక్షేత్రలోని బాబైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. రెండు వారాల క్రితం ( సెప్టెంబర్ 12) మఖేష్, అమేధి (పేర్లు మార్చాం)లకు వివాహమైంది. అయితే, శోభనం రాత్రి గదిలోకి వెళ్లిన అమేధి(22)కి ఆమె భర్త పాలలో మత్తు మందు కలిపి తాగించాడు. అమేధి స్పృహ కోల్పోయిన తర్వాత ముఖేష్, అతని సోదరుడు, బావ, మరో నలుగురు తాంత్రికులు యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల నరకయాతన అనంతరం యువతి అక్కడి నుంచి బయటపడిందని పోలీసులు వెల్లడించారు. బాధితురాలు తన తండ్రితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కురుక్షేత్ర మహిళా పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ అయిందనీ, ఎఫ్ఐఆర్ నమోదు చేశామని స్టేషన్ ఆఫీసర్ శీలవతి తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. కాగా, అత్తమామలు, ఆడపడుచు, తాంత్రిక పూజల కోసం వచ్చిన నలుగురు దుండగులు యవతిపై అఘాయిత్యం జరగడానికి ముఖ్య కారణంగా పోలీసులు భావిస్తున్నారు. -
విదేశీ పాలన వల్లే మహిళలకు ఈ దుస్థితి
కురుక్షేత్ర : విదేశీయుల పాలన కారణంగానే భారతదేశంలో ప్రస్తుతం మహిళలకు గౌరవం దక్కడం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. దేశంలో 50% జనాభా ఉన్న మహిళల్ని కచ్చితంగా గౌరవించాలన్నారు. హరియాణాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం గురువారం నిర్వహించిన 30వ స్నాతకోత్సవానికి ఆయన హాజరై ప్రసంగించారు. ఎన్ని సంప్రదాయాలు ఉన్నా విదేశీయుల పాలన ప్రభావంతోనే దేశంలో మహిళలకు గౌరవం దక్కడం లేదని వెంకయ్య స్పష్టం చేశారు. దేశాన్ని భారత మాతగా, చదువును సరస్వతిగా పూజించే దేశంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం హింసను ఆశ్రయించకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. దేశంలోని వేరే ప్రాంతాలకు సంబంధించి కనీసం ఓ భాషను నేర్చుకోవాలని వెంకయ్య విద్యార్థులకు సూచించారు. -
అభిమన్యుడిగా నిఖిల్ గౌడ
-
ముగ్గురు చిన్నారులను చంపించిన తండ్రి
కురుక్షేత్ర : కన్న తండ్రే కాలయముడయ్యాడు. వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. హర్యానాలో కురుక్షేత్ర జిల్లా పెహోవాలోని సర్ససా గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు చిన్నారులు సమీర్(11), సమర్(4), కోడలు సిమ్రాన్(8) ఆదివారం నుంచి కనిపించకుండా పోయారు. తల్లి సుమన్ దేవి ఇచ్చిన సమాచారంతో బంధువు రాజేశ్ మాలిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనూ మాలిక్, సుమన్ దేవిల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. సోనూ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని సుమన్‌దేవి ఆరోపించారు. పిల్లల కిడ్నాప్ వ్యవహారంలో అనుమానితులు తండ్రి సోనూ మాలిక్, మరో బంధువు జగదీప్ మాలిక్‌ని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోనూ మాలిక్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడంతో, పిల్లలను మట్టుపెట్టాలని తనకు చెప్పడంతో ఈ నేరాన్ని చేసినట్టు జగదీప్ మాలిక్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. పిల్లల మృతదేహాలను పంచకుల అటవీ ప్రాంతంలో వెలికి తీశారు. పిల్లల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అప్పుడు సీత.. ఇప్పుడు ద్రౌపది!
సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది? అనడిగితే... చాలామంది అంజలీదేవి పేరు చెబుతారు. ‘లవకుశ’ సినిమాలో అంత అద్భుతంగా నటించారామె. నాటి తరంలో సీత పాత్రలో అంజలీదేవి మెప్పిస్తే నేటి తరంలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా మెప్పించారు నయనతార. ఆ సినిమా తర్వాత నయనతార గ్లామరస్ క్యారెక్టర్స్‌కి మాత్రమే కాదు.. నటనకు అవకాశమున్న సంప్రదాయబద్ధమైన పాత్రలూ చేయగలరనే అభిప్రాయం బలపడింది. ఇప్పుడీ బ్యూటీకి కన్నడ ‘కురుక్షేత్ర’లో ద్రౌపదిగా నటించే ఛాన్స్ వచ్చిందట. తమిళంలో బిజీగా ఉన్న నయనతార ఈ చిత్రంలో నటించే విషయమై హామీ ఇవ్వలేదట. అయితే మంచి అవకాశం కాబట్టి డేట్స్ అడ్జస్ట్ చేసి, గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఊహించవచ్చు. ఈ నెల 23న ‘కురుక్షేత్ర’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఒకవేళ నయన అంగీకరిస్తే, ‘సూపర్’ తర్వాత కన్నడంలో ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. ఇందులో దుర్యోధనుడిగా దర్శన్, భీష్ముడిగా అమ్రీష్, కర్ణుడిగా రవిచంద్రన్ నటించనున్నారు. -
150వ చిత్రమని ముందు తెలీదు!
– అర్జున్ ‘‘నేను చిత్ర పరిశ్రమకి వచ్చి 36 ఏళ్లవుతోంది. ‘జైహింద్–2’ తర్వాత నేను హీరోగా చేస్తున్న చిత్రమిది. ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఇది నా 150వ చిత్రమని తెలీదు. చిత్రీకరణలో ఉన్నప్పుడు తెలిసింది. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన దర్శక–నిర్మాతలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు’’ అని నటుడు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ నిర్మించిన ‘కురుక్షేత్రం’ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అర్జున్ మాట్లాడుతూ – ‘‘బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయకూడదనుకున్నా. కానీ, కథ విన్నాక చేసే తీరాలనుకున్నా. ఇప్పటివరకు 20–30 సినిమాల్లో పోలీస్‌గా నటించాను. కానీ, ఆ సినిమాల్లో లేని అంశాలు ఇందులో ఉన్నాయి. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘అర్జున్‌గారు గొప్ప నటుడే కాదు. అందరికీ ఇన్స్పిరేషన్. ఆయన కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలో నేను నటించడం గౌరవంగా భావిస్తున్నా. తెలుగులో ‘జవాన్’ చిత్రంలో విలన్‌గా చేస్తున్నా’’ అని నటుడు ప్రసన్న అన్నారు. జూలైలో సినిమా విడుదల చేయాలనుకుంటున్నట్లు నిర్మాతలు తెలిపారు. అరుణ్ వైద్యనాథన్, సహ నిర్మాత అరుల్ రాజ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి: సంగీతం: నవీన్, నిర్మాణం: ప్యాషన్ స్టూడియోస్. -
అర్జున్@150
ఒక హీరో వంద సినిమాలు చేయడమంటేనే గ్రేట్. అటువంటిది యాక్షన్ కింగ్ అర్జున్ 150 సినిమాల అరుదైన మైలురాయిని చేరుకోవడం సో గ్రేట్. ఈ 150వ చిత్రం మూడు భాషల్లో తెరకెక్కుతోంది. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి తెలుగులో ‘కురుక్షేత్రం’, తమిళంలో ‘నిబుణన్’, కన్నడలో ‘విస్మయ’ టైటిల్స్ ఫిక్స్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ –‘‘అర్జున్ ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తెలుగు టీజర్‌ను అతి త్వరలోనే విడుదల చేసి, సినిమాను జూలైలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, నిర్మాణం: ప్యాషన్ స్టూడియోస్. -
ప్రతి రాష్ట్రంలో ఆలయం నిర్మిస్తాం
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బాలాజీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలయం కోసం స్థలాన్ని కేటాయించింది.. నిర్మాణానికి సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మీడియాకు తెలిపారు. డిజైన్లు, ఆలయ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని.. అతి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఇప్పటికే హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మితమైతున్న బాలాజీ ఆలయం మరో ఆరునెల్లో సిద్దమైతుందని తెలిపారు. టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు టీటీడీ లేఖ రాసినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి మహరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నైల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవం మరో వైపు ఈనెల 31 నుంచి నవంబర్ 8 వరకూ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం' నిర్వహించనున్నారు. ఢిల్లీ లో తొలి సారి వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు.