బీజేపీకి అధికార వ్యతిరేకత
ఐఎన్‌ఎల్‌డీకి జాట్ల దన్ను
ఆప్ సుడిగాలి ప్రచారం
హరియాణాలోని కురుక్షేత్ర లోక్‌సభ స్థానంలో ఎన్నికల పోరు రణరంగాన్నే తలపిస్తోంది. సాధారణంగా ముఖాముఖి పోరు సాగే ఈ నియోజకవర్గంలో ఈసారి మాత్రం బీజేపీ, ఆప్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి మాత్రం గెలుపు కోసం చెమటోడుస్తోంది.
ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచి్చన ప్రముఖ పారిశ్రామిక వేత నవీన్ జిందాల్‌కు టికెటిచి్చంది. ఇండియా కూటమి అభ్యరి్థగా ఆప్ నుంచి సుశీల్ గుప్తా, ఐఎన్‌ఎల్‌డీ తరఫున జాట్ నాయకుడు అభయ్ చౌతాలా పోటీ పడుతున్నారు. హరియాణా ముఖ్యమంత్రి నాయ»Œ æసింగ్ సైనీ ఇటీవలి దాకా ఇక్కడ బీజేపీ ఎంపీగా ఉన్నారు.
కురుక్షేత్రలో 2004, 2009ల్లో నవీన్ జిందాల్ కాంగ్రెస్ తరఫున గెలిచారు. 2014, 2019ల్లో బీజేపీ భారీ విజయాలు సాధించింది. కురుక్షేత్రలో జాట్ సామాజికవర్గ ప్రాబల్యమున్న స్థానం. 17.88 లక్షల మంది ఓటర్లలో జాట్లు 14 శాతముంటారు. బ్రాహ్మణులు, సైనీలు చెరో 8 శాతం, సిక్కులు 6 శాతం, అగర్వాల్ సామాజికవర్గం 5 శాతం ఉన్నారు. అభయ్ చౌతాలా జాట్ నాయకుడు కాగా జిందాల్, సుశీల్ గుప్తాలది బనియా సామాజికవర్గం. పోరు బీజేపీ, ఆప్ మధ్యేనని తొలుత భావించినా ఐఎన్‌ఎల్‌డీ నుంచి జాట్ నేత రంగంలోకి దిగడంతో పోరు త్రిముఖంగా మారింది.
బీజేపీకి రైతుల సెగ
గత రెండుసార్లూ బీజేపీ భారీ మెజారిటీలు సాధించినా, కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా పారీ్టపై ప్రస్తుతం వ్యతిరేకత తీవ్రంగా ఉంది. దీనికితోడు రైతు సమస్యలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మరింత సమస్యగా మారాయి. ఇటీవలి రైతుల ఆందోళనలు ఆ పార్టీ పుట్టి ముంచుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
పైగా ఆ సందర్భంగా వేలాది రైతులపై కేసులు పెట్టడం బీజేపీకి చాలా వ్యతిరేకంగా మారింది. భారతీయ కిసాన్ యూనియన్ (చారిణి) ఇప్పటికే చౌతాలాకు మద్దతిచ్చింది. ఈ యూనియన్ ఊరూరా రైతులతో సమావేశాలు నిర్వహించి మరీ ఐఎన్‌ఎల్‌డీకి మద్దతివ్వాలని కోరుతోంది. ఆప్ కూడా రైతులకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, యువత, మహిళలకు నెలకు రూ.వేయి ఆరి్ధక సాయం వంటి హామీలతో దూసుకెళ్తోంది. ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సుడిగాలి ప్రచారం చేస్తున్నారు.
జిందాల్ పొలం బాట
బీజేపీకి ఎదురు గాలి వీస్తున్న సంకేతాలు అందుతుండటంతో పార్టీ అభ్యర్థి జిందాల్ ప్రచార శైలిని మార్చారు. ముఖ్యంగా రైతులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ట్రాక్టర్‌లు నడపడం, వరి పొలాల్లోకి దిగి రైతులతో మాట్లాడటం వంటివి చేస్తున్నారు. తన సంస్థల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు భారీగా ఉపాధి కలి్పస్తానని హామీ ఇస్తున్నారు. కురుక్షేత్రలో ఈ నెల 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment