LS 2024: ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ | Lok Sabha Elections 2024 Sixth Phase Polling Latest Updates And Highlights In Telugu | Sakshi
Sakshi News home page

Lok Sabha 6th Phase Elections: ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్‌

Published Sat, May 25 2024 6:48 AM | Last Updated on Sat, May 25 2024 8:56 PM

Lok Sabha Election 2024: Sixth Phase Polling Updates In Telugu

Updates

  • ఢిల్లీలో గతంతో పోలిస్తే తగ్గిన పోలింగ్ 
  • 7.45 గంటల వరకు 59  శాతం పోలింగ్ నమోదు
  • ఎండవేడికి ఓటింగ్‌కు రాని జనం

 

  • బీహార్ : 53.30
  • హర్యానా: 58.37
  • జమ్మూ కాశ్మీర్: 52.28
  • జార్ఖండ్ :62.74
  • ఢిల్లీ : 54.48 
  • ఒడిశా:60.07
  • యూపీ:54.03
  • వెస్ట్ బెంగాల్ :  78.19

ముగిసిన ఆరో దశ ఎన్నికల పోలింగ్‌

  • సాయంత్రం ఐదు గంటల వరకూ 57.70 శాతం పోలింగ్‌

 

ఢిల్లీ:

సాయంత్రం 5 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 57.70

  • బీహార్- 52.24
  • హర్యానా -55.93
  • జమ్మూ-కాశ్మీర్-51.35
  • జార్ఖండ్- 61.41
  • ఢిల్లీ -53.73
  • ఒడిశా- 59.60
  • ఉత్తరప్రదేశ్ - 52.02
  • పశ్చిమ బెంగాల్- 77.99

మధ్యాహ్నం 3 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 49.2

  • బీహార్- 45.21
  • హర్యానా -46.26
  • జమ్మూ-కాశ్మీర్-44.41
  • జార్ఖండ్- 54.34
  • ఢిల్లీ -44.58
  • ఒడిస్సా- 48.44
  • ఉత్తరప్రదేశ్ - 43.95
  • పశ్చిమ బెంగాల్- 70.19

 

ఢిల్లీ: 
సీపీఎం నేత ప్రకాశ్‌ కారత్‌  ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

ఢిల్లీ: 
సీపీఐ(ఎం) జనరల్‌ సెక్రటరీ సీతారం ఏచూరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

ఢిల్లీ: 

16వ  ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా  ఓటు వేశారు.

 

 

 

ఢిల్లీ:

  • లోక్‌ సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది
  • మధ్యాహ్నం 1 గంట వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదైన పోలింగ్  39.13 శాతం 
  • బీహార్- 36.48%
  • హర్యానా -36.48%
  • జమ్మూ-కాశ్మీర్-35.22%
  • జార్ఖండ్- 42.54%
  • ఢిల్లీ - 34.37%
  • ఒడిస్సా- 35.69%
  • ఉత్తరప్రదేశ్ - 37.23%
  • పశ్చిమ బెంగాల్- 54.80%

పశ్చిమ బెంగాల్‌:

  • బీజేపీ పోలింగ్‌ ఏజెంట్లను  పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించకపోవటంపై మేదినిపూర్‌ బీజేపీ అభ్యర్థి అగ్ని మిత్రా పాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
  • అధికారులతో మాట్లాడి తన పోలింగ్‌ ఏజెంట్‌ను బూత్‌లో కూర్చుబెట్టారు.

 

 

ఢిల్లీ: 
బీజేపీ నేత నుపుర్‌ శర్మ హక్కు వినియోగించుకున్నారు.

 

 

ఢిల్లీ: 

  • కేంద్రమంత్రి  మీనాక్షి లేఖీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

ఢిల్లీ:

  • సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

  • సీడీఎస్‌ చీఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ దంపతులు ఓటు వేశారు. 
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

ఓటేసిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

  • సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తన కుటుంబ సభ్యులతో  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.


     

 

 

  • సీపీఐ(ఎం) సీనియర్‌ నేత బృందా కారత్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

     

 

  • లోక్‌సభ  ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది.

  • ఉదయం 11 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన మొత్తం పోలింగ్ శాతం 25.76

  • బీహార్- 23.67%
  • హర్యానా -22.09%
  • జమ్మూ-కాశ్మీర్-23.11%
  • జార్ఖండ్-27.80%
  • ఢిల్లీ -21.69%
  • ఒడిస్సా-21.30%
  • ఉత్తరప్రదేశ్ -27.06%
  • పశ్చిమ బెంగాల్-36.88%

     

     

హర్యానా:

  • ద్రోణాచార్య  అవార్డు గ్రహిత, రెజ్లింగ్‌ కోచ్‌ మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ ఓటు వేశారు.

 

 

 

  • దిగ్గజ మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


      

ఓటు వేసిన ప్రియాంకా గాంధీ వాద్రా

ఢిల్లీ: 

  • కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


     

 

ఓటు వేసిన ప్రియాంకా గాంధీ కుమార్తె, కుమారుడు
ఢిల్లీ: 

  • ప్రియాంకా గాంధీ కుమారుడు రైహాన్‌ రాజీవ్‌ వాద్రా,కూతురు  మిరాయా వాద్రా  ఓటు వేశారు.
  • ఢిల్లీలోని  ఓ పోలింగ్‌ కేంద్రంలో  వారు ఓటు వేశారు.

 

ఓటేసిన ఎంపీ స్వాతి మలివాల్‌
ఢిల్లీ:

  • ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

     

     

ఓటేసిన మాజీ రాష్ట్రపతి

ఢిల్లీ:

  • మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌ ఓటు వేశారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ఒడిశా:

  • ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఓటు వేశారు. 
  • భువనేశ్వర్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


     

 

ఓటు వేసిన సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ

ఢిల్లీ: 

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్‌ గాంధీ ఓటు వేశారు
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన రాహుల్‌..  అనంతరం తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ ఫొటో దిగారు.
  • తొలిసారి సోనియా గాంధీ కుటుంబం కాంగ్రెసేతర  అభ్యర్థికి ఓటు వేశారు. 
  • ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌,  ఆప్‌లో పొత్తులో బరిలోకి దిగాయి.
  • దీంతో ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌ భారతికి  సోనియా గాంధీ కుటుంబం మద్దతు తెలిపింది.


     

 

 

ఓటువేసిన ఉప రాష్ట్రపతి దంపతులు

ఢిల్లీ: 

  • ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని  ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

 

ఢిల్లీ:

ఢిల్లీలో మందకోడిగా పోలింగ్

ఉదయం 9 గంటల వరకు 58 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో నమోదయిన పోలింగ్ శాతం 10.82

బీహార్- 9.66%

హర్యానా -8.31%

జమ్మూ-కాశ్మీర్-8.89%

జార్ఖండ్-11.74%

ఢిల్లీ -8.94%

ఒడిస్సా-7.43%

ఉత్తరప్రదేశ్ -12.33%

పశ్చిమ బెంగాల్-16.54%

 

 

ఢిల్లీ:

  • ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఓటు వేశారు.
  • ఆయన ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఢిల్లీ:  

  • భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఓటు వేశారు.

 

 

జమ్మూ కశ్మీర్‌:

  • పోలీసులు తీరుకు నిరసనగా పీడీపీ చీఫ్‌, అనంత్‌నాగ్‌- రాజౌరీ అభర్థి మెహబూబా ముఫ్తీ నిరసన దిగారు.
  • ఏ కారణంగా లేకుండా పీడీపీ పోలింగ్‌ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులో​కి తీసుకు​న్నారని ఆమె ఆరోపణలు చేశారు.


     

 

 

ఓటేసిన తెలంగాణ గవర్నర్‌ 
రాంచీ:

  • జార్ఖండ్‌, తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఆయన రాంచీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. 

 

ఢిల్లీ:

ఢిల్లీ మంత్రి అతిశీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు చేశారు


 

 

ఢిల్లీ:

  • రాజ్యసభ డిప్యూటీ  చైర్మన్‌ హరివంశ నారాయణ్‌ సింగ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని  ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు.

 

 ఒడిశా:

బీజేడీ నేత వీకే పాండియన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

భువనేశ్వర్‌లోని ఓ పొలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


 ఢిల్లీ:

  • తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంబీర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో గంబీర్‌ ఓటు వేశారు.

 

జమ్మూ కశ్మీర్‌

  • జమ్మూ కశ్మీర్‌ బీజేపీ చీఫ్‌ రవీందర్‌ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • రాజౌరీ పోలింగ్‌  కేంద్రంలో ఓటు వేశారు.
  • అనంత్‌ నాగ్‌-రాజౌరీ స్థానంలో జమ్మూ కశ్మీర్ నేషనల్‌ కాన్ఫరెస్స్‌ (జేకేఎన్‌సీ) తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు.  
  • పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.

 

ఢిల్లీ:

  • ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ఫేజ్‌-1 పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.
  • ఆయన ఈస్ట్‌ ఢిల్లీ నుంచి  బరిలో దిగారు.
  • ఆయనపై ఆప్‌ కుల్దీప్‌ కుమార్‌ను పోటీకి దింపింది.


     

 

 

ఢిల్లీ

  • న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు చేశారు. 
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఆమె ఆప్‌ అభ్యర్థి సోమనాథ్‌ భారతిపై తలపడుతున్నారు

 

ఢిల్లీ:

  • విదేశాంగ మంత్రి డా.  ఎస్‌ జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.


     

హర్యానా:

  • హర్యానా ముఖ్యమంత్రి నయాబ్‌ సింగ్‌ సైనీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • మీర్జాపూర్‌ గ్రామంలో ఓటు వేశారు.

ఢిల్లీ:

  • ఢిల్లీలో  లోక్‌సభ ఎన్నికల ఆరో విడత  పోలింగ్  కొనసాగుతోంది.
  • ఢిల్లీలోని ఏడు సీట్లకు పోటీపడుతున్న 162 మంది అభ్యర్థులు
  • ఆరవ విడత లో 8 రాష్ట్రాల్లోని 58 సీట్లకు పోలింగ్
  • ఒడిశా అసెంబ్లీలోని 42 సీట్లకూ పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.13 కోట్ల మంది ఓటర్లు
  • 1.14 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు కొనసాగనున్న పోలింగ్
  • ఇప్పటివరకు 25 రాష్ట్రాల్లోని 428 ఎంపీ సీట్లకు ముగిసిన పోలింగ్

ఢిల్లీ:

  • కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • ఢిల్లీలోని ఓ  పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు

 

ప్రజలు  భారీ సంఖ్యలో ఓటు వేయాలి: ప్రధాని మోదీ

  • ఆరో విడుతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని కోరుతున్నా.
  • ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది.. మీ ఓటు కూడా కీలకమైంది.
  • ప్రజలు ఎన్నికల ప్రక్రియలో   పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం
  • మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి: ప్రధాని మోదీ

 

 

  • ఆరో విడత పోలింగ్‌లో ఓటు వేయడానికి ప్రజలు క్యూలైన్లలో నిల్చున్నారు.

  • ఈశాన్య ఢిల్లీలో మనోజ్‌ తివారీ- కన్హయ్య కుమార్‌ బరిలో ఉ‍న్నారు.
  • పురీలో సంబిత్‌ పాత్ర- అరూప్‌ పట్నాయక్‌ పోటీ పడుతున్నారు.
  • హర్యానాలోని కార్నాల్‌లో మనోహర్‌ లాల్‌ కట్టర్- దివ్యాన్షు బుదిరాజా బరిలో ఉన్నారు.
     

హర్యానా: 

  • హర్యానా మాజీ  సీఎం, క​ర్నాల్‌ బీజేపీ అభ్యర్థి మనోహర్‌ లాల్‌ కట్టర్‌  ఓటు హక్కు వినియోగించుకున్నారు.
  • కర్నాల్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు

 

 

లోక్‌సభ ఎన్నికల్లో  ఆరో విడత పోలింగ్‌ ప్రారంభమైంది.

 

  • కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌ ప్రారంభం కానుంది

  • లోక్‌సభ ఎన్నికల్లో ఆరో విడతకు పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 

  • 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో 58 లోక్‌సభ స్థానాలకు శనివారం పోలింగ్‌ జరగనుంది.

     

     

  • హరియాణాలో మొత్తం 10, ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలతో పాటు మశ్చిమ గాల్‌లోని గిరిజన ప్రాబల్య జంగల్‌మహల్‌ ప్రాంతంలోని పలు లోక్‌సభ స్థానాలు వీటిలో ఉన్నాయి.

  • ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ సీట్లలో కూడా పోలింగ్‌ జరగనుంది. 

  • దీంతో 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ పూర్తవనుంది.

     

     

  • మిగతా 57 స్థానాలకు జూన్‌ 1న చివరి విడతతో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. 

  • మండే ఎండల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. 

    బరిలో కీలక నేతలు 
    కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రావు ఇందర్‌జీత్‌ సింగ్, కృష్ణపాల్‌ గుర్జర్‌తో పాటు మేనకా గాంధీ, సంబిత పాత్ర, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (బీజేపీ), రాజ్‌బబ్బర్, కన్హయ్య కుమార్, దీపీందర్‌సింగ్‌ హుడా (కాంగ్రెస్‌), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) తదితర ప్రముఖులు ఆరో విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

     

     

  • హరియాణాలోని కర్నాల్‌ అసెంబ్లీ స్థానం నుంచి సీఎం నాయబ్‌సింగ్‌ సైటీ పోటీ చేస్తున్నారు. 

  • కురుక్షేత్ర సిట్టింగ్‌ ఎంపీ అయిన ఆయన ఇటీవలే సీఎంగా పగ్గాలు చేపట్టడం తెలిసిందే. 

  • ఈ నేపథ్యంలో ఆర్నెల్ల లోపు అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉంది. 

  • మరోవైపు హరియాణా, ఢిల్లీల్లో 2019లో క్లీన్‌స్వీప్‌ చేసిన బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్‌–ఆప్‌ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement