
అర్జున్@150
ఒక హీరో వంద సినిమాలు చేయడమంటేనే గ్రేట్. అటువంటిది యాక్షన్ కింగ్ అర్జున్ 150 సినిమాల అరుదైన మైలురాయిని చేరుకోవడం సో గ్రేట్. ఈ 150వ చిత్రం మూడు భాషల్లో తెరకెక్కుతోంది. అర్జున్ హీరోగా అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి తెలుగులో ‘కురుక్షేత్రం’, తమిళంలో ‘నిబుణన్’, కన్నడలో ‘విస్మయ’ టైటిల్స్ ఫిక్స్ చేశారు.
దర్శకుడు మాట్లాడుతూ –‘‘అర్జున్ ఇప్పటి వరకూ చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో పోషించారు. ఊహకందని మలుపులు, ట్విస్టులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీలో ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. తెలుగు టీజర్‌ను అతి త్వరలోనే విడుదల చేసి, సినిమాను జూలైలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : నవీన్, సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ, నిర్మాణం: ప్యాషన్ స్టూడియోస్.