chops off hands
-
దారుణం: ఆకస్మికంగా ఓ వ్యక్తిపై దాడి.. చేయి నరికి..
హర్యానాలో ఒక దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఈ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిన కథనం ప్రకారం..హర్యానాలో జుగ్ను అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తుల వ్యక్తులు కత్తులతో దాడి చేసి..చేయి నరికేశారు. అనంతరం నిందితులు ఆ చేయిని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సదరు బాధితుడిని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బాధితుడి నుంచి వాగ్ములం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీఫుటేజ్‌లు పరిశీలిస్తున్నట్లుతెలిపారు. ఐతే ప్రత్యక్ష సాక్షలు బాధితుడు జుగ్న కురుక్షేత్ర హవేలి వెలుపల కూర్చొని ఉండగా... సుమారు పది నుంచి పన్నెండు మంది వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి కత్తులతో దాడి చేసినట్లు చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: భార్య కళ్లేదుటే ఘోరం..చావు బతుకుల మధ్య కొట్టుకుంటూ..) -
యువకుని చేతులు నరికిన..చిన్నారి తండ్రి
బతిండా(పంజాబ్): తన 7 నెలల కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుని రెండు చేతులు నరికేశాడు ఓ తండ్రి. పోలీసులు తెలిపిన వివరాలు..పమ్మా సింగ్ కూతురు, 7 నెలల చిన్నారిని ఏప్రిల్ 2014లో పర్మిందర్ సింగ్ రేప్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.చిన్నారి తండ్రి పమ్మా సింగ్, పర్మిందర్ సింగ్‌లు ఇద్దరూ కోట్లీ అబ్లూ గ్రామంలో నివాసముంటున్నారు. ఈ కేసు విషయమై మంగళవారం బతిండా జిల్లా కోర్టులో వీరిద్దరూ విచారణకు హాజరయ్యారు. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత పమ్మా కేసులో రాజీకి వద్దమని పర్మిందర్తో అన్నాడు. దీనికోసం చర్చిద్దామని తన బైక్ పై పర్మిందర్తో కలిసి పమ్మాసింగ్ గ్రామానికి బయలుదేరాడు. జుంబా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే పమ్మా, ఆ యువకున్ని చెట్టుకు కట్టేశాడు. పదునైన ఆయుధాలతో రెండు చేతులను నరికి వేశాడు. గమనించిన స్థానికులు పర్మిందర్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పమ్మా సింగ్ పై హత్యాయత్నం కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.