యువకుని చేతులు నరికిన..చిన్నారి తండ్రి | Man chops off hands of youth accused of raping his 7-month-old daughter | Sakshi
Sakshi News home page

యువకుని చేతులు నరికిన..చిన్నారి తండ్రి

Published Wed, Apr 20 2016 10:58 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

యువకుని చేతులు నరికిన..చిన్నారి తండ్రి - Sakshi

యువకుని చేతులు నరికిన..చిన్నారి తండ్రి

బతిండా(పంజాబ్): తన 7 నెలల కూతురుపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుని రెండు చేతులు నరికేశాడు ఓ తండ్రి. పోలీసులు తెలిపిన వివరాలు..పమ్మా సింగ్ కూతురు, 7 నెలల చిన్నారిని ఏప్రిల్ 2014లో పర్మిందర్ సింగ్ రేప్ చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.చిన్నారి తండ్రి పమ్మా సింగ్, పర్మిందర్ సింగ్లు ఇద్దరూ కోట్లీ అబ్లూ గ్రామంలో నివాసముంటున్నారు.
 
ఈ కేసు విషయమై మంగళవారం  బతిండా జిల్లా కోర్టులో వీరిద్దరూ విచారణకు హాజరయ్యారు. కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత పమ్మా కేసులో రాజీకి వద్దమని పర్మిందర్తో అన్నాడు. దీనికోసం చర్చిద్దామని తన బైక్ పై పర్మిందర్తో కలిసి పమ్మాసింగ్ గ్రామానికి బయలుదేరాడు. జుంబా గ్రామానికి సమీపంలోకి చేరుకోగానే పమ్మా, ఆ యువకున్ని చెట్టుకు కట్టేశాడు. పదునైన ఆయుధాలతో రెండు చేతులను నరికి వేశాడు.

గమనించిన స్థానికులు పర్మిందర్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. పమ్మా సింగ్ పై హత్యాయత్నం కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు. అతను పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement