న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి.
కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment