prestige group
-
టీటీకే ప్రెస్టీజ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్చేంజీ ఆఫర్
ముంబై: వంటగది ఉపకరణాల తయారీ సంస్థ టీటీకే ప్రెస్టీజ్ ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రెస్టీజ్ ఉత్పత్తుల ధరపై 24–66% వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్చేంజీ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్లు తమ పాత వంట సామాగ్రిని తీసుకొచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రారంభమైన ఈ అద్భుతమైన ఆఫర్ జూన్ 30 వరకు కొనసాగుతుంది. ‘‘మా కస్టమర్లు బ్రాండ్‌కు విధేయులు. ఈ బంపర్ ఆఫర్ ద్వారా వారితో బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు ఆకర్షణీయమైన డీల్స్‌లో అత్యుత్తమ ఉత్పత్తులు అందిస్తున్నాము’’ అని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ దినేష్ గార్గ్ తెలిపారు. -
ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే!
న్యూఢిల్లీ: రియల్టీ రంగ సంస్థ ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేసింది. వెరసి అమ్మకాల్లో 16 శాతం వృద్ధిని ఆశిస్తోంది. దక్షిణాదిన పటిష్ట కార్యకలాపాలు కలిగిన కంపెనీ ఇటీవల ముంబై మార్కెట్లో ప్రవేశించింది. గతేడాది(2021–22) అమ్మకాల బుకింగ్స్ 90 శాతం పుంజుకున్నాయి. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,382 కోట్లను అధిగమించాయి. ఈ బాటలో ప్రస్తుత ఏడాదిలో కనీసం రూ. 12,000 కోట్ల విలువైన బుకింగ్స్‌ను సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ పేర్కొన్నారు. ఇంతకంటే ఎక్కువ వృద్ధినే అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే వివిధ ప్రాజెక్టులను ఎంత త్వరగా అనుమతులు లభించేదీ అన్న అంశం ఆధారంగా లక్ష్యాలను చేరుకోగలమని వివరించారు. చదవండి: టెస్లా మరో ఘనత: ఆనందంలో ఎలాన్ మస్క్ -
బ్లాక్‌స్టోన్‌తో ‘ప్రెస్టీజ్’ మెగా డీల్!
న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం ప్రెస్టీజ్ గ్రూప్ తాజాగా రుణ భారం తగ్గించుకునేందుకు, భవిష్యత్ వృద్ధి ప్రణాళికల్లో భాగంగా వివిధ వాణిజ్య అసెట్స్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉంది. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 12,000 కోట్ల నుంచి రూ.13,500 కోట్ల దాకా ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ భారీ ఒప్పందం ప్రస్తుత త్రైమాసికంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టీజ్ ఎస్టేట్ సుమారు 8 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్క్‌లు (నిర్మాణం పూర్తయినవి), దాదాపు 4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న తొమ్మిది మాల్స్ (ఇప్పటికే కార్యకలాపాలు జరుగుతున్నవి) విక్రయించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇక నిర్మాణంలో ఉన్న మరో 3–4 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ ప్రాజెక్టుల్లో 50 శాతం దాకా వాటాలను కూడా విక్రయించవచ్చని వివరించాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఈ అసెట్స్ ఉన్నాయి. మొత్తం 16 మిలియన్ చ.అ. విస్తీర్ణమున్న ఆఫీస్ పార్కులు, తొమ్మిది మాల్స్, రెండు హోటళ్లతో కలిపి ఉన్న పోర్ట్‌ఫోలియో విలువ దాదాపు 1.6–1.8 బిలియన్ డాలర్ల మేర ఉండవచ్చని పేర్కొన్నాయి. భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి.. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రుణభారం ప్రస్తుతం రూ. 8,000 కోట్ల స్థాయిలో ఉంది. ప్రతిపాదిత లావాదేవీ ద్వారా వచ్చే నిధుల్లో కొంత భాగాన్ని రుణాలను తీర్చివేసేందుకు కంపెనీ ఉపయోగించనుంది. అలాగే, భవిష్యత్ వృద్ధి అవకాశాల కోసం మిగతా నిధులను వినియోగించనుంది. భారీ విలువ డీల్..: ఒకవేళ ప్రెస్టీజ్ గ్రూప్, బ్లాక్‌స్టోన్ మధ్య డీల్ కుదిరితే రియల్టీలో వేల్యుయేషన్‌పరంగా అత్యంత భారీ ఒప్పందంగా నిలవనుంది. కొన్నాళ్ల క్రితం డీఎల్ఎఫ్ తమ కమర్షియల్ పోర్ట్‌ఫోలియోలో 33% వాటాను సింగపూర్ సార్వభౌమ ఫండ్ జీఐసీకి రూ. 9,000 కోట్లకు విక్రయించింది. అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్ ఇప్పటిదాకా భారత రియల్ ఎస్టేట్ రంగంలో 8 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. -
టెన్నిస్ కోర్ట్ లాకర్లలో కోట్ల సంపద
యశవంతపుర: బెంగళూరులోని బౌరింగ్ ఇన్స్టిట్యూట్ (టెన్నిస్ కోర్ట్) పాలకమండలి కార్యాలయంలో క్రీడాకారులు టెన్నిస్ సామగ్రి, దుస్తులు దాచుకునే లాకర్లలో రూ.100 కోట్లకు పైగా విలువైన సొత్తు బయటపడింది. ఇది బెంగళూరులో స్థిరపడిన రాజస్తానీ పారిశ్రామికవేత్త, ఫైనాన్షియర్, ప్రెస్టీజ్ కంపెనీ భాగస్వామి అయిన అవినాశ్ అమరలాల్కు చెందినదిగా గుర్తించారు. బెంగళూరులో టైర్ల షోరూంను నడుపుతున్న అవినాశ్ ఏడాది క్రితం ఇక్కడ మూడు లాకర్లను తీసుకుని వాటిల్లో రూ.3.60 కోట్ల నగదు, రూ.7.8 కోట్ల విలువైన వజ్రాలు, 650 గ్రాముల బంగారు బిస్కెట్లు, రూ.80 లక్షల విలువైన వాచీలు, రూ.100 కోట్ల ఆస్తి పత్రాలు, రూ.కోటి విలువైన చెక్కులను దాచాడు. ఎందుకు బద్దలు కొట్టారు? టెన్నిస్ కోర్టు అధికారులు లాకర్ గదుల నవీకరణలో భాగంగా అవినాశ్‌కు చెందిన మూడు లాకర్లను బద్దలు కొట్టి చూడగా ఈ సొత్తు బయట పడింది. విషయం బయటకు పొక్కకుండా చేస్తే రూ.5 కోట్లు ఇస్తామంటూ బౌరింగ్ క్లబ్ కార్యదర్శి ప్రకాశ్‌కు కొందరు వ్యక్తులు ఆశ చూపారు. అయితే, ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. ఇది తమ పరిధిలోని విషయం కాదని ఖాకీలు చెప్పడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలిపారు. వారు వచ్చి సొత్తును స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. అవినాశ్ ఎందుకు స్పందించలేదు? పక్షం రోజుల క్రితం టెన్నిస్ కోర్టు యాజమాన్యం ఇచ్చిన నోటీసులకు అవినాశ్ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇంత సొత్తును ఇక్కడే ఎందుకు దాచారనే అంశంపైన కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. అవినాశ్ అమరలాల్ ప్రెస్టీజ్ గ్రూప్‌లో భాగస్వామి. ఈయనకు ఫైనాన్షియర్‌గా బెంగళూరులో పెద్ద పేరుంది. బడా బాబులు, సంస్థలకు 30 శాతం వడ్డీపై అప్పులిచ్చేవాడు. -
రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్
ప్రెస్టిజ్ గ్రూప్ సీఎఫ్ఓ వెంకట్ కె. నారాయణ సాక్షి, హైదరాబాద్ : రీట్లతో పెట్టుబడిదారులకు ప్రతి నెలా ఆదాయంతో పాటు, ఆ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. అందుకే చాలా నిర్మాణ సంస్థలు రీట్లను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని ప్రెస్టిజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఫైనాన్స్ అండ్ సీఎఫ్ఓ వెంకట్ కె. నారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కాకపోతే నిబంధనలు, స్టాంప్ డ్యూటీ, పన్నుల విధానంలోనే ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరో 6-8 నెలల్లో దేశంలోని పలు వాణిజ్య, ఆఫీసు స్పేస్‌ను రీట్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. ► ప్రస్తుతానికైతే ప్రెస్టిజ్ ప్రాజెక్ట్‌లు దక్షిణాదిలోనే ఉన్నాయి. 65 మిలియన్ చ.అ.ల్లో 68 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. ఇందులో ఆఫీసు స్థలం 8.46 మిలియన్ చ.అ., షాపింగ్ మాల్స్ స్థలం 2.88 మిలియన్ చ.అ. ఉంది. ఏటా ఆఫీసు స్థలం నుంచి రూ.430 కోట్లు, మాల్స్ నుంచి 254 కోట్లు అద్దె వస్తుంది. తొలి విడతగా ఈ ప్రాజెక్ట్‌లను రీట్లకు తీసుకొస్తున్నాం. మొత్తం 7 షాపింగ్ మాల్స్ కాగా.. ఇందులో ప్రెస్టిజ్, సుజాన కంపెనీల జాయింట్ వెంచర్ అయిన హైదరాబాద్‌లో ది ఫోరం సుజనా మాల్ కూడా ఉందని ఆయన చెప్పారు. ► మరో 8 మిలియన్ చ.అ. ఆఫీసు స్పేస్ నిర్మాణ దశలో ఉంది. రెండేళ్లలో ఈ స్థలాన్ని కూడా రీట్లలోకి తీసుకొస్తాం. ఆఫీసు స్పేసుల్లో కంటే షాపింగ్ మాళ్లలోనే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్, రిక్రియేషన్, గేమింగ్ జోన్స్ ఇలా ప్రతిదాంట్లోనూ ఆదాయం ఉంటుంది. ► {పస్తుతం హైదరాబాద్‌లో అప్పా జంక్షన్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 4 ప్రాజెక్ట్‌లున్నాయి. ఇందులో కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రాజెక్ట్‌లను సెప్టెంబర్ ముగింపు నాటికి ప్రారంభిస్తాం. రెండేళ్లలో మరో మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం. ► 2015-16లో ప్రెస్టిజ్ గ్రూప్ నుంచి రూ.5,013 కోట్ల విక్రయాలు చేశాం. ఈ ఏడాది రూ.3,518 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రెస్టిజ్ కొనుగోలుదారుల్లో 8-10 శాతం ఎన్నారైలే. మిగతా వారిలో వ్యాపారులు, స్థానికులు. ► ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే దగ్గర్లో రెసిడెన్షియల్ ఎలా ఉంది? అనేది చూస్తాం. అదే రెసిడెన్షియల్ అయితే ఏ సెగ్మెంట్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు? ఏ లోకేషన్లో కట్టాలి. వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తాం. -
‘డిస్నీ’ థీమ్‌తో ప్రెస్జీజ్ సరికొత్త వెంచర్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ తన సరికొత్త వెంచర్‌ను ఆదివారం ప్రకటించింది. ప్రెస్టీజ్ లేక్‌సైడ్ హాబిటట్ పేరిట నిర్మించనున్న ఈ గృహసముదాయం ‘డిస్నీ’ థీమ్‌తో ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. వైట్‌ఫీల్డ్‌లోని వర్తూరులో ఈ గృహసముదాయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ గృహసముదాయంలోని ప్రతి గృహంలోని చిన్నారుల గదిని డిస్నీ పాత్రలతో కూడిన పెయింటింగ్స్‌తో రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను డిస్నీ యూటీవీతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. కేవలం గోడలపైనే కాకుండా చిన్నారుల కోసం తయారు చేసిన ఫర్నీచర్, టేబుల్‌వేర్, దుప్పట్లపై కూడా డిస్నీ పాత్రలను, కథలను పొందుపరచనున్నట్లు వెల్లడించారు. త ద్వారా తమ వెంచర్లోకి ప్రవేశించే ప్రతి చిన్నా రి తన బాల్యాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తం 102 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ వెంచర్లో 271 విల్లాలు, 3,428 అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.