రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్ | Forum Mall in Hyderabad into rits | Sakshi
Sakshi News home page

రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్

Published Fri, Jun 19 2015 11:33 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్ - Sakshi

రీట్స్‌లోకి హైదరాబాద్‌లోని ఫోరం మాల్

ప్రెస్టిజ్ గ్రూప్ సీఎఫ్‌ఓ వెంకట్ కె. నారాయణ
 
 సాక్షి, హైదరాబాద్ : రీట్లతో పెట్టుబడిదారులకు ప్రతి నెలా ఆదాయంతో పాటు, ఆ స్థిరాస్తి విలువ కూడా పెరుగుతుంటుంది. అందుకే చాలా నిర్మాణ సంస్థలు రీట్లను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయని ప్రెస్టిజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, ఫైనాన్స్ అండ్ సీఎఫ్‌ఓ వెంకట్ కె. నారాయణ ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. కాకపోతే నిబంధనలు, స్టాంప్ డ్యూటీ, పన్నుల విధానంలోనే ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరో 6-8 నెలల్లో దేశంలోని పలు వాణిజ్య, ఆఫీసు స్పేస్‌ను రీట్స్‌లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంకా ఏమన్నారంటే..

► ప్రస్తుతానికైతే ప్రెస్టిజ్ ప్రాజెక్ట్‌లు దక్షిణాదిలోనే ఉన్నాయి. 65 మిలియన్ చ.అ.ల్లో 68 ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. ఇందులో ఆఫీసు స్థలం 8.46 మిలియన్ చ.అ., షాపింగ్ మాల్స్ స్థలం 2.88 మిలియన్ చ.అ. ఉంది. ఏటా ఆఫీసు స్థలం నుంచి రూ.430 కోట్లు, మాల్స్ నుంచి 254 కోట్లు అద్దె వస్తుంది. తొలి విడతగా ఈ ప్రాజెక్ట్‌లను రీట్లకు తీసుకొస్తున్నాం. మొత్తం 7 షాపింగ్ మాల్స్ కాగా.. ఇందులో  ప్రెస్టిజ్, సుజాన కంపెనీల జాయింట్ వెంచర్ అయిన హైదరాబాద్‌లో ది ఫోరం సుజనా మాల్ కూడా ఉందని ఆయన చెప్పారు.

► మరో 8 మిలియన్ చ.అ. ఆఫీసు స్పేస్ నిర్మాణ దశలో ఉంది. రెండేళ్లలో ఈ స్థలాన్ని కూడా రీట్లలోకి తీసుకొస్తాం. ఆఫీసు స్పేసుల్లో కంటే షాపింగ్ మాళ్లలోనే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పార్కింగ్, రిక్రియేషన్, గేమింగ్ జోన్స్ ఇలా ప్రతిదాంట్లోనూ ఆదాయం ఉంటుంది.

► {పస్తుతం హైదరాబాద్‌లో అప్పా జంక్షన్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం 4 ప్రాజెక్ట్‌లున్నాయి. ఇందులో కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ప్రాజెక్ట్‌లను సెప్టెంబర్ ముగింపు నాటికి ప్రారంభిస్తాం. రెండేళ్లలో మరో మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తాం.

► 2015-16లో ప్రెస్టిజ్ గ్రూప్ నుంచి రూ.5,013 కోట్ల విక్రయాలు చేశాం. ఈ ఏడాది రూ.3,518 కోట్ల టర్నోవర్‌ను సాధించాం. వచ్చే ఏడాది రూ.4,000 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రెస్టిజ్ కొనుగోలుదారుల్లో 8-10 శాతం ఎన్నారైలే. మిగతా వారిలో వ్యాపారులు, స్థానికులు.

► ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు కమర్షియల్ ప్రాజెక్ట్ అయితే దగ్గర్లో రెసిడెన్షియల్ ఎలా ఉంది? అనేది చూస్తాం. అదే రెసిడెన్షియల్ అయితే ఏ సెగ్మెంట్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు? ఏ లోకేషన్‌లో కట్టాలి. వారి ఆర్థిక పరిస్థితులను అంచనా వేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement