ప్రతీకాత్మక చిత్రం
ముంబై: పేదరికంతో అల్లాడిపోతున్న ఓ తల్లి తన పసికందును రూ 1.78 లక్షలకు అమ్ముకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో మహిళకి సహకరించిన మరో నలుగురితో పాటు శిశువును కొనుగోలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం... షిర్డీ పట్టణానికి చెందిన 32 ఏళ్ల మహిళ పేదరికంతో బతుకు భారంగా జీవనాన్ని కొనసాగిస్తోంది.ఈ క్రమంలో ఆమె సెప్టెంబరులో ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఓ పక్క తన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా, ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకునే స్థోమత కూడా తనకు లేదని బాధపడుతూ చివరికి ఆ పాపని అమ్మలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో అహ్మద్‌నగర్, థానేలో ఒకరు పొరుగున ఉన్న ముంబైలోని ములుండ్‌కు చెందిన ముగ్గురు మహిళలు పాప విక్రయానికి ఆ మహిళకు సహకరించారు. ఆ వ్యక్తికి ఎలాంటి చట్టబద్ధమైన లాంఛనాలు పూర్తిచేయకుండానే వారు రూ 1.78 లక్షలకు శిశువను విక్రయించారు. ఈ విషయమై సమాచారం అందడంతో వ్యక్తి ఇంటిపై దాడులు చేపట్టగా శిశువు కనిపించాడు. దీంతో నేరానికి పాల్పడిన పసిబిడ్డ తల్లి సహా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.