
రూపాయి రికవరీ...
ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడంతో మంగళవారం రూపాయి గణనీయంగా బలపడింది..
55 పైసల లాభంతో 66.10 వద్ద క్లోజింగ్
ముంబై: ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడంతో మంగళవారం రూపా యి గణనీయంగా బలపడింది. డాలర్‌తో పోలిస్తే 55 పైసల పెరుగుదలతో 66.10 వద్ద ముగిసింది. ఒక్క రోజే రూపాయి ఇంతగా పెరగడం ఏడు నెలల వ్యవధిలో ఇదే తొలిసారి. దేశీ స్టాక్‌మార్కెట్ కోలుకోవడం, ఈక్విటీ.. డెట్ మార్కెట్లలోకి కొత్తగా నిధుల రాకతో డాలర్ల సరఫరా మెరుగుపడటం తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.