మిర్యాలగూడ (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన అంజమ్మ(30) అనే మహిళ తన నవజాత శిశువును గురువారం సాయంత్రం అమ్మకానికి పెట్టింది. ఈ విషయం తెలిసిన మహిళా సమాఖ్య సభ్యులు శిశుసంక్షేమ శాఖ అధికారులతో సంఘటన స్థలానికి వెళ్లారు. అంజమ్మకు కౌన్సెలింగ్ ఇచ్చి ఆమెకు కొంత ఆరిక్థ సహాయం చేశారు.
అంజమ్మకు ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా పదిరోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇంట్లో పూట గడవడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులతో కలసి బిడ్డను అమ్మకానికి పెట్టింది. బిడ్డను పోషించడం ఇబ్బందిగా మారితే శిశు సంక్షేమ శాఖకు శిశువును అప్పగిస్తామని అధికారులు ఆమెకు సూచించారు. ప్రస్తుతానికైతే శిశువు విక్రయాన్ని ఆపారు.
నవజాత శిశువును అమ్మకానికి పెట్టిన తల్లి
Published Thu, Jan 21 2016 7:11 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM
Advertisement
Advertisement