ఓ తల్లి తన 9 ఏళ్ల కుమార్తెను విక్రయిస్తానంటూ ముందుకు రావటంతో తిరుపతి నగరంలో కలకలం రేపింది.
ఓ తల్లి తన 9 ఏళ్ల కుమార్తెను విక్రయిస్తానంటూ ముందుకు రావటంతో తిరుపతి నగరంలో కలకలం రేపింది. జిల్లాలోని బంగారుపాళ్యంకు చెందిన భానుప్రియ తన తొమ్మిదేళ్ల కుమార్తెతో శుక్రవారం చిత్తూరు బజారువీధికి చేరుకుంది. అక్కడ చుట్టుపక్కల వారితో కూతురిని విక్రయిస్తానంటూ బేరానికి పెట్టింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ప్రస్తుతం భానుప్రియను విచారిస్తున్నారు.