Fire Accident Near Govindaraja Swamy Temple Tirupati - Sakshi
Sakshi News home page

తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం

Published Fri, Jun 16 2023 12:24 PM | Last Updated on Fri, Jun 16 2023 3:27 PM

Fire Accident Near Govinda Rajulu Temple Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసి పడ్డ మం‍టలు చుట్టు పక్కల దుకాణాలకు వ్యాపించగా, సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. మాడవీధిలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన చోటే గోవిందరాజ స్వామి రథం ఉంది.

టీడీపీ విష ప్రచారం
సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే  ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

రథానికి, లావణ్య ఫ్రేమ్స్‌ దుకాణానికి చాలా దూరం ఉందని, మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టీడీపీ నేతలదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మంటలు అంటుకుంది టీడీపీ సానుభూతి పరుడు దుకాణమేనని కానీ దాన్ని తాము రాజకీయం చేయడం లేదని, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు.

వదంతులు నమ్మవద్దు
అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గోవింద రాజస్వామి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.  సోషల్  మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రథాన్ని వెనకకు జరిపి పెట్టామని,  మంటలకు దగ్ధమైన షాపుకు రథానికి చాలా దూరం ఉందని తెలిపారు. పది ఫైర్ ఇంజన్‌లు మంటలను దాదాపు అదుపులోకి తీసుకొచ్చాయని, పది ద్విచక్ర వాహనాలు , ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని తెలిపారు.
చదవండి: ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement