Tirupati Temple
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (ఆదివారం) 77,260 మంది స్వామివారిని దర్శించుకోగా 24,223 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.12 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నంద్యాల జిల్లా: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేశారు, భక్తులకు రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్న అధికారులు ... శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం భక్తుల రద్దీతో సందడిగా మరినా శ్రీశైలం క్షేత్రం రేపు (24-12-24) ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.25-12-2024 మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది. -
Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 14 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న ( శనివారం ) 72,411 మంది స్వామివారిని దర్శించుకోగా 27,677 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.44 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 3 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమల ఆలయంపై చంద్రబాబు మరో కుట్ర
-
తిరుమల లో ఇతను చేసిన పనికి శ్రీలీల ఏం చేసిందో చూస్తే..!
-
తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
-
చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. చదవండి: బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
తిరుపతిలో అగ్ని ప్రమాదం..
సాక్షి, తిరుపతి: తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోవింద రాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫోటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగసి పడ్డ మంటలు చుట్టు పక్కల దుకాణాలకు వ్యాపించగా, సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయంతో పరుగులు తీశారు. మాడవీధిలో రాకపోకలను నిలిపివేశారు అధికారులు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన చోటే గోవిందరాజ స్వామి రథం ఉంది. టీడీపీ విష ప్రచారం సంఘటన ప్రాంతంలో సహాయక చర్యల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫైర్ ఇంజన్ అధికారులు సకాలంలో చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారని తెలిపారు. టీడీపీ నేతలు ఈ మంటల్లో చలి కాసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గోవింద రాజస్వామి ఆలయం రథం కాలిపోయిందంటూ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రథానికి, లావణ్య ఫ్రేమ్స్ దుకాణానికి చాలా దూరం ఉందని, మంటలు చూసి చలి కాసుకునే విష సంస్కృతి టీడీపీ నేతలదని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. మంటలు అంటుకుంది టీడీపీ సానుభూతి పరుడు దుకాణమేనని కానీ దాన్ని తాము రాజకీయం చేయడం లేదని, మంటలు ఆర్పేందుకు సహాయం చేస్తున్నామని తెలిపారు. వదంతులు నమ్మవద్దు అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. గోవింద రాజస్వామి రథానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని కోరారు. రథాన్ని వెనకకు జరిపి పెట్టామని, మంటలకు దగ్ధమైన షాపుకు రథానికి చాలా దూరం ఉందని తెలిపారు. పది ఫైర్ ఇంజన్లు మంటలను దాదాపు అదుపులోకి తీసుకొచ్చాయని, పది ద్విచక్ర వాహనాలు , ఆరు దుకాణాలు దగ్దమయ్యాయని తెలిపారు. చదవండి: ప్రజలకు మంచి చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు: సీఎం జగన్ -
శ్రీవారి దర్శనం చేసుకున్న కల్యాణ్ రామ్ (ఫొటోలు)
-
సీఎం జగన్ తిరుపతి పర్యటన.. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
-
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
అది నెరవేర్చమని శ్రీవారిని మొక్కుకున్నా: శ్రీకాంత్
సాక్షి, తిరుపతి: ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి విముక్తి కలగాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు. మొదటిసారి బాలకృష్ణతో విలన్‌గా చేస్తున్నానని, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. వీటితోపాటు కన్నడ చిత్రంలోనూ నటిస్తున్నానని, తెలుగులో మరో చిత్రం మరణమృదంగంలో హీరోగా కనిపించనున్నానని పేర్కొన్నారు. ఆయన తనయుడు రోషన్ 'పెళ్లి సందడి' చిత్రం షూటింగ్ పూర్తి అయిందని దీన్ని త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. -
కథ క్లైమాక్స్‌కు, లొకేషన్ వెతుకుతున్న బోయపాటి
సాక్షి, తిరుమల: దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు బుధవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. 'అఖండ' సినిమా క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాలు ఉండటంతో కడపలో లొకేషన్ చూస్తున్నామన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తిని బట్టి అఖండ సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు. కాగా బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అఖండపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పూర్తవగానే బన్నీతో ఓ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది. చదవండి: అలా లీనమైపోయిన నివేథా.. వీడియో వైరల్ -
128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం
-
వెంకన్న దర్శనానికి విరామం
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్ ప్రభావం కలియుగ వైకుంఠానికి చేరింది. 128 ఏళ్ల తర్వాత ఏడుకొండలవాడి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. నిత్య కల్యాణం పచ్చతోరణంగా విలసిల్లే వడ్డీకాసులవాడి వైభవం ఏకాంతంగా సాగనుంది. లక్షలాది భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగే ఆపదమొక్కులవాడి సన్నిధి మూగబోనుంది. 1892వ సంవత్సరంలో శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, అప్పటి మహంతుల మధ్య తలెత్తిన వివాదం వల్ల 2రోజులపాటు వెంకన్న దర్శనం భక్తులకు కరువైంది. అయితే ఇప్పటి కరోనా వైరస్ విజృంబణతో తిరుమలేశుని వీక్షించేందుకు భక్తులకు వారం రోజులు పట్టనుంది. సాక్షి, తిరుమల : తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవాన్ని సైతం ఏకాంతంగా జరిపించేందుకు నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చారు. నిత్య సేవల్లో భాగమైన వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ, సహస్ర కలశాభిషేకం సేవలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు కూడా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా టైంస్లాట్ ప్రకారం నేరుగా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అన్నప్రసాద సముదాయంలో కూడా నలుగురు భోజనం చేసే స్థలంలో ఇద్దరు మాత్రమే కూర్చుని తినేలా దూరం పెంచారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రతి 2గంటలకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నారు. అలిపిరి వద్ద థర్మల్ స్క్రీనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. నడకమార్గాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కరోనా వైరస్ లక్షణాలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడు తిరుమలకు చేరుకున్నాడు. 110మంది బృందంతో కలిసి శ్రీశైలం దర్శనానంతరం శ్రీవారి సన్నిధికి వచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ భక్తుడిని తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత తిరుపతి రుయాకు తీసుకెళ్లి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీటీడీ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు విచ్చేసే భక్తులందరినీ తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అలిపిరిలో తిరుమలకు వెళ్లేదారిని మూసేయించారు. ఇప్పటికే కొండపై ఉన్న భక్తులను దర్శనం పూర్తి చేయించి కిందకు దించే ఏర్పాట్లు చేపట్టారు. నడకదారుల్లో నుంచి కూడా భక్తులను అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్నదాన సత్రం, కల్యాణకట్టను మూసేయనున్నారు. దీంతో కొన్ని రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరం కాబోతున్నారు. కాణిపాకంలో సేవలన్నీ రద్దు కాణిపాకం (యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, స్వామివారి ఆలయ అనుబంధ ఆలయాలు అయిన మణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదరాజుల స్వామి ఆలయాల్లో అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దేముళ్లు తెలిపారు. గురువారం ఆయన కాణిపాకంలో విలేకర్లతో మాట్లాడుతు బయట దేశాలలో కరోనా వైరస్ ఉన్నందున ఆక్కడ నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్నారు. దీనిపై కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఆలయంలో అర్జిత సేవలన్నింటినీ ఈ నెల 20 నుంచి 31 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్వామివాకిరి పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని సూచించారు. -
తిరుమలలో కైశిక ద్వాదశి వేడుకలు
-
శ్రీవారి చరణాలకు తుమ్మల ‘పచ్చకర్పూరం’
సాక్షిప్రతినిధి, ఖమ్మం: తిరుమల శ్రీనివాసునికి రాష్ట్ర రోడ్లు భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 21 వేల ప్రతులతో కూడిన ‘పచ్చకర్పూరం’ దివ్యగ్రంథాన్ని సమర్పించనున్నారు. ఈ దివ్య గ్రంథంలో దేవతల స్త్రోత్రాలు, పురాణగాథలు ఉంటాయి. ఈ గ్రంథాన్ని శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రూపొందిస్తున్నారు. వేంకటాద్రి, యాదాద్రి, భద్రాద్రి పుణ్యక్షేత్రాల ప్రత్యక్ష, పరోక్ష అక్షరమంత్ర దర్శనంగా ఆవిష్కృతమవుతున్న ఈ ‘పచ్చకర్పూరం’ గ్రంథాన్ని మంత్రి తుమ్మల నాణ్యతాప్రమాణాలతో ముద్రిస్తున్నారు. దేశం లో ఎందరో రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు నిత్యం శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్నప్పటికీ.. తొలిసారి ఇలాంటి అపురూప అక్షర ప్రయత్నాన్ని చేసి వేంకటేశుని చరణాలకు సమర్పిస్తున్న భక్తునిగా, మంత్రిగా తుమ్మల గుర్తింపు పొందనున్నారు. 250 పేజీల ఈ గ్రంథాన్ని ఈనెల మూడో వారంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అందజేయనున్నట్లు తుమ్మల తెలిపారు. తిరుమల శ్రీవారిపై పూర్తి నమ్మకంతో ఈ దివ్య గ్రంథాన్ని సమర్పిస్తున్నట్లు వివరించారు. -
వీఐపీలకే ‘ఉత్తర’ దర్శనం
సాక్షి, తిరుమల: పర్వదినాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాంటి ముక్తి వీఐపీలకే లభించేలా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి, అధికారులు వ్యవహరిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తుల బస, దర్శన సౌకర్యాలు ఏమాత్రం పట్టించుకోకుండా.. ఉన్నత వర్గాలకే ఎర్రతివాచీ స్వాగతం పలికేందుకు పూర్తిస్థాయిలో అధికార యంత్రాంగం నిమగ్నమైపోయింది. ఈ నెల 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశిలో మాత్రమే తిరుమల ఆలయంలోని వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) తెరిచి భక్తులను అనుమతిస్తారు. ఈ పర్వదినాల్లో శ్రీవారిని దర్శించి, వైకుంఠ ద్వారంలో ప్రదక్షిణ చేసేందుకు వీఐపీలు పోటెత్తుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన సుమారు 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, 200 మందికి పైగా కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, మరో 100 దాకా న్యాయవిభాగం నుంచి వైకుం ఠ దర్శనం కోసం లేఖలు అందాయి. వీరేకాక తమ బంధు గణాలు కూడా వేల సంఖ్యలోనే తరలివస్తున్నట్టు లేఖలు అందుతున్నాయి. ఇదిలాఉంటే, ప్రముఖుల కోసం గురువారం 5 వేల గదులను బ్లాక్ చేయగా శుక్రవారం ఈ సంఖ్య ఏడు వేలకు పెరిగే అవకాశం ఉంది. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మంచులో బస కష్టాలు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏర్పాట్లు పూర్తి: జేఈవో శ్రీనివాసరాజు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో తరలివచ్చే భక్తులకు బస, శ్రీవారి దర్శన ఏర్పాట్లు పూర్తిచేశామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. వీఐపీ దర్శనం అర్ధరాత్రి 1.45 గంటల నుంచి ఉదయం 7 వరకు, ఆ తర్వాత సర్వదర్శనం, కాలినడక భక్తులను అనుమతిస్తామన్నారు. కాలిబాట భక్తులకు 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి దర్శన టికెట్లు ఇస్తామన్నారు. కాగా, శ్రీవారి దర్శనానికి బుధవారం ఐదు గంటల సమయం పట్టింది. ధార్మిక పరీక్షల తేదీ మార్పు తిరుపతి, న్యూస్‌లైన్: టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 31వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల తేదీని ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీకి మార్పు చేసినట్లు టీటీడీ పీఆర్వో రవి తెలిపారు -
‘మనగుడి’ పోస్టర్ ఆవిష్కరణ
‘ భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా ఈనెల 21న నిర్వహిస్తున్న మనగుడి కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆలయ ఏఈఓ ప్రభాకర్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనగుడి పేరిట అనేక ధార్మిక కార్యక్రమాలను చేపడుతున్నామని, ఈనెల 11 నుంచి వరుసగా షెడ్యూల్ ప్రకారం ఉంటాయని తెలిపారు. ఈనెల 16న స్థానిక బస్టాండ్ ఇన్‌గేట్ వద్ద నున్న కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొన్న భక్తులకు టీటీడీ నుంచి కంకణాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, భద్రాచలం ధార్మిక మండలి సభ్యులు శీలం పుల్లారెడ్డి, గంజి పురుషోత్తం పాల్గొన్నారు.