
సాక్షి, తిరుపతి: ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న ఆయనను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి విముక్తి కలగాలని స్వామివారిని మొక్కుకున్నానని తెలిపారు.
మొదటిసారి బాలకృష్ణతో విలన్‌గా చేస్తున్నానని, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'అఖండ' చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నానని చెప్పారు. వీటితోపాటు కన్నడ చిత్రంలోనూ నటిస్తున్నానని, తెలుగులో మరో చిత్రం మరణమృదంగంలో హీరోగా కనిపించనున్నానని పేర్కొన్నారు. ఆయన తనయుడు రోషన్ 'పెళ్లి సందడి' చిత్రం షూటింగ్ పూర్తి అయిందని దీన్ని త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment