తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (ఆదివారం) 77,260 మంది స్వామివారిని దర్శించుకోగా 24,223 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.12 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నంద్యాల జిల్లా: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ సోమవారం కావడంతో దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేశారు, భక్తులకు రద్దీ దృష్ట్యా స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్న అధికారులు ... శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం భక్తుల రద్దీతో సందడిగా మరినా శ్రీశైలం క్షేత్రం
రేపు (24-12-24) ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు విడుదల
పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను డిసెంబరు 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయడం జరుగుతుంది.
25-12-2024 మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల
డిసెంబరు 25వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల శ్రీవాణి టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.
డిసెంబరు 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయడం జరుగుతుంది.
అదే రోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలోని వసతి గదుల కోటాను విడుదల చేస్తారు.
ఈ మార్పును గమనించి టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తెలియజేయడమైనది.
Comments
Please login to add a commentAdd a comment