
సాక్షి, తిరుమల: దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు బుధవారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా బోయపాటి మీడియాతో మాట్లాడుతూ.. 'అఖండ' సినిమా క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ కోసం వెతుకుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో వర్షాలు ఉండటంతో కడపలో లొకేషన్ చూస్తున్నామన్నారు. కరోనా మూడో దశ వ్యాప్తిని బట్టి అఖండ సినిమాను విడుదల చేస్తామని పేర్కొన్నారు.
కాగా బోయపాటి ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో చిత్రం కావడంతో అఖండపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇది పూర్తవగానే బన్నీతో ఓ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మురగదాస్‌తో గజినీ సీక్వెల్ చేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment