Bhanupriya
-
హీరోయిన్ భానుప్రియను పెళ్లాడాలనుకున్నారా? డైరెక్టర్ ఆన్సరిదే!
సితార, అన్వేషణ, ఆలాపన, లేడీస్ టైలర్, చెట్టు కింద ప్లీడరు, గోపి గోపిక గోదావరి,అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి ఎన్నో విభిన్న సినిమాలను తెలుగు చిత్రపరిశ్రమకు అందించాడు డైరెక్టర్ వంశీ. హీరోయిన్ భానుప్రియను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే! చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.నా సినిమాతోనే భానుప్రియకు అలాంటి ఆఫర్లుభానుప్రియ తన కెరీర్ ఆరంభంలో ఏ సినిమా చేస్తే బాగుంటుందని నన్ను అడిగేది. సితార మూవీ తర్వాత తను బిజీ అయింది. అయితే తనకు మోడ్రన్ లుక్‌లో కనిపించే పాత్రలు రావడం లేదని అసంతృప్తి చెందేది. దీంతో నేను అన్వేషణ మూవీలో తనను గ్లామరస్‌గా చూపించాను. ఆ సినిమా బాగా ఆడింది. అప్పటినుంచి తనకు గ్లామర్ పాత్రలు వచ్చాయని తనే చెప్పింది. 35 ఏళ్లుగా చూడలేదుతనను కలిసి దాదాపు 35 ఏళ్లు అయ్యాయి అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో వంశీ.. భానుప్రియను పెళ్లి చేసుకోవాలని ఆశపడినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం గురించి ఆయన్ను ప్రశ్నించగా అందుకు వంశీ స్పందించలేదు. అది ఎప్పుడో గతానికి సంబంధించినది.. అదంతా పాత కథ. ఇప్పుడు నాకు ఎవరూ లేరు. నా భార్య కూడా చనిపోయింది. నా పెద్ద కూతురు చెన్నైలో, చిన్న కూతురు నా దగ్గరే ఉంటుందని తెలిపాడు.చదవండి: పదేళ్ల వ్యవధిలో తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయా..: షారూఖ్ -
భర్త మరణం తర్వాత.. మెమరీ లాస్‌తో బాధపడుతున్న భానుప్రియ
సీనియర్ హీరోయిన్ భానుప్రియ అనగానే.. కలువ పువ్వులాంటి ఆమె కళ్లు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్లముందు ప్రతిబింబిస్తుంది. స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ దాదాపు అందరు అగ్రహీరోలతో జతకట్టింది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా వారు చనిపోయిన తర్వాత నుంచి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. డ్యాన్స్‌కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను. మొన్నా మధ్య ఓ తమిళ మూవీ షూటింగ్ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మర్చిపోయా. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్ తీసుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లండన్‌లో చదువుకుంటుందని, ఆమెకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా 1998లో భానుప్రియ ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్‌ను పెళ్లాడారు. ఆయన 2018లో గుండెపోటుతో కన్నుమూశారు. -
గ్లామర్ కన్నా ట్యాలెంట్ ముఖ్యం అని నిరూపించిన నటి భానుప్రియ - స్టార్ స్టార్ సూపర్ స్టార్
-
భవిష్యత్తులో పెదరాయుడు సీక్వెల్
‘‘ఓసారి ర జనీకాంత్ ఫోన్ చేస్తే ఇంటికెళ్లాను. ‘తమిళంలో ‘నాట్టామై’ సినిమా హిట్ అయింది. రీమేక్ హక్కులు మాకు కావాలని చెబుతాను.. నువ్వు సినిమా చూసి నిర్ణయం చెప్పు’ అన్నాడు. సినిమా చూశా.. చాలా బాగుంది, హక్కులు కావాలని రజనీకి చెప్పాను. ‘నిర్మాత ఆర్బీ చౌదరిగారితో మాట్లాడాను నువ్వు వెళ్లి మాట్లాడు’ అన్నాడు. నేను కలవగానే, ‘రజనీగారు చెప్పాక కాదనేది ఏముంది.. ఇస్తాను’ అన్నారు ఆర్బీ చౌదరిగారు’’ అని మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు, రజనీకాంత్, భానుప్రియ, సౌందర్య ప్రధాన పాత్రల్లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పెదరాయుడు’. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి 25ఏళ్లు(1995 జూన్ 15) అవుతోంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు సాక్షితో పంచుకున్న విశేషాలు... ► ‘నాట్టామై’ రీమేక్ హక్కులు తీసుకున్నాక రజనీతో ‘రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహిస్తారు.. అన్ని పాత్రలు కుదిరాయి. పాపారాయుడు పాత్ర కుదరలేదురా’ అన్నాను. ‘నువ్వు ఆలోచించేది ఏంట్రా.. ఆ పాత్ర నేను చేస్తున్నాను’ అన్నాడు. ‘నువ్వేంట్రా! అది అతిథి పాత్ర.. పైగా నువ్వు నాకు తండ్రి వేషం వేయడమేంటి?’ అనగానే.. ‘అవును రా.. ఆ పాత్ర అద్భుతంగా ఉంటుంది, నేను చేయాలనుకునే నీకు చెప్పాను.. చేస్తాను’ అన్నాడు. ఈ విషయం రవిరాజాకి చెప్పగానే ఆశ్చర్యపోయాడు. ► ‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్ ఇచ్చారు. తొలి షాట్లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది’ అన్నాడు రజనీ. ► ‘పెదరాయుడు’కి ముందు నాకు రెండు మూడు పరాజయాలు ఎదురయ్యాయి. అది రజనీకాంత్ ఎలా తెలుసుకున్నాడో. వాడు రాజమండ్రికి వచ్చినప్పుడు మిత్రుడు కదా అని నేను వెళ్లాను.. ఇద్దరం కలిసి కారులో హోటల్‌కి వెళ్లాం.. ‘ఇది తీసుకోరా’ అన్నాడు.. చూస్తే 45లక్షలు ఉంది. ‘ఎందుకురా?’ అని అడిగా. ‘నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావని నాకు తెలుసు, ‘పెదరాయుడు’ మంచి విజయం సాధిస్తుంది.. విడుదల తర్వాత నాకు ఇవ్వరా’ అన్నాడు.. నిజంగా వాడు గొప్ప మనిషి. ► ‘పెదరాయుడు’ సినిమాలో మంచి విషయం ఉంది. నటీనటులందరూ బాగా సహకరించారు. సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్) లేరు. సౌందర్య, కెమెరామేన్ కేఎస్ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్ టు గెదర్ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు.. లేకుంటే చేసేవాణ్ణి. ► కొన్నేళ్ల తర్వాత ఏముందిలే.. ఇంకా ఏం చూస్తాం అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ, నా విషయంలో అది జరగలేదు. నేను ఇంకా ఏదైనా మంచి పాత్ర చేస్తే చూడాలని ఆశిస్తున్నారు. ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజుకీ కొన్ని పాత్రలకు అడుగుతుంటే నేనే వద్దనుకుంటున్నాను.. కొన్ని పాత్రలు నచ్చడం లేదు. నేను కానీ చేస్తే ఏడాదిలో 365 రోజులూ బిజీగానే ఉంటాను. నా జీవితంలో జరిగిందంతా భగవంతుని ఆశీస్సులు, ప్రకృతి వల్లే. ‘మనం విర్రవీగకూడదు.. అహంకారం తలకెక్కకూడదు.. మనిషి మనిషిగా బతకాలి’అనేవి మరచిపోకూడదు. ► ఓ అందమైన కుటుంబ కథ తయారు చేశాం. ‘పెదరాయుడు’ సినిమాలా మంచి నటీనటులుంటారు. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. సినిమాల్లో అయినా, రాజకీయమైనా భగవంతుని ఆశీస్సుల వల్లే రాణించగలం. రాజకీయాల్లో రాణించాలంటే బ్రహ్మాండంగా పనిచేయాలి. సినిమాల్లో నటించాలంటే బ్రహ్మాండంగా నటన తెలిసి ఉండాలి. అక్కడా ఇక్కడా విజయం అన్నది ఒక్కటే అయినా.. సినిమాలు మాత్రం కొంచెం అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలోనూ హిట్ కావాలనే రూల్ లేదు.. ఇదంతా కాకతాళీయమే.. భగవంతుని ఆశీస్సులే. ► ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనాని ఎవరు పంపించారు? ఇదేమైనా ప్రపంచయుద్ధమా? 82లక్షల జీవరాసుల తర్వాత మనుషులం పుట్టామని అంటారు. మనిషి జన్మ అనేది గొప్పది. ఈ జన్మని మనం మరచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నాం. అందుకే కన్నూమిన్నూ కానరాకుండా ప్రవర్తిస్తున్నారురా మనుషుల్లారా అని దేవుడు కరోనా రూపంలో ఓ దెబ్బ కొట్టాడు. ఇది ఎప్పటికి ఏమవుతుందో తెలియదు. తలనొప్పి, కలరా, మలేరియా, టైఫాయిడ్.. వీటికి మందులు వచ్చాయి. కానీ, కరోనాకి ఇప్పటికి విరుగుడు మందు అయితే లేదు. ‘పెదరాయుడు’ని రీమేక్ చేయాలనుకుంటే మీరు, విష్ణు, మనోజ్.. చేసే అవకాశం ఉంటుందా? ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం అసాధ్యం అనుకుంటున్నా. భవిష్యత్తులో విష్ణు, మనోజ్‌కి సీక్వెల్ చేసే అవకాశం ఉండొచ్చేమో. అయితే ఆ రోజుకీ, ఈ రోజుకీ ‘పెదరాయుడు’ అనేది చరిత్ర మరచిపోలేని సినిమా. ఆ సినిమా ఒక చరిత్ర. -
భానుప్రియపై చర్యలు తీసుకోవాలి
పెరంబూరు: నిబంధనలకు విరుద్దంగా మైనర్ బాలికను పనిలో నియమించుకున్న నటి భానుప్రియపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరో సారి తెరపైకి వచ్చింది. నటి భానుప్రియ తన ఇంటిలో నలుగురు మైనర్ బాలల్ని పనికి నియమించుకుందన్న అంశం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఒక మహిళ అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులో చెన్నైలో నటి భానుప్రియ ఇంటిలో పని చేస్తున్న తన కూతుర్ని ఆమె వేధిస్తోందని, ఆమె నుంచి తన కూతుర్ని కాపాడాల్సిందిగా కోరింది. దీంతో పోలీసులు భానుప్రియపై కేసు నమోదు చేసి విచారణ కోసం చెన్నైకి వచ్చారు కూడా. అయితే భానుప్రియ తన ఇంట్లో పని చేస్తున్న పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదని, అదీ కాకుండా ఆ పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందనీ స్థానిక టీనగర్, పాండిబజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది కూడా. ఈ విషయం అలా ఉంచితే బుధవారం బాల కార్మిక నిర్మూలన దినోత్సవాన్ని పురష్కరించుకుని బాల కార్మికుల పరిరక్షణ సమాఖ్య బాలకార్మికుల గురించిన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సమాఖ్య నిర్వాహకుడు శేషారత్నం మాట్లాడుతూ మైనర్ బాలలను పనిలో చేర్చుకున్న నటి భానుప్రియపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బాలకార్మికుల చట్టం ప్రకారం పిల్లలను పనికి చేర్చుకుంటే రూ.50వేల అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే భానుప్రియ తన ఇంటిలో పని చేసే పిల్ల మైనర్ అనే విషయం తనకు తెలియదనీ, ఆ పిల్ల వయసు 17 ఏళ్లు అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులకు తెలిపిన విషయం తెలిసిందే. అయినా ముగిసి పోయిన అంశాన్ని మళ్లీ శేషారత్నం తెరపైకి తీసుకు రావడంతో ప్రయోజనం ఉంటుందా? లేదా? అన్నది చూడాలి. -
నటి భానుప్రియపై మరో ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి : పనిమనిషి వివాదం సద్దుమణగకముందే మరో సమస్యలో చిక్కుకున్నారు సినీ నటి భానుప్రియ. ఆమె మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు దళిత, ప్రజా సంఘాల నేతలు. ఈ మేరకు సోమవారం పెద్దాపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. వివరాలు.. వడ్లమూరుకు చెందిన ఇద్దరు దళిత మైనర్ బాలికలతో భానుప్రియ వెట్టి చాకీరి చేయించుకున్నారంటూ భానుప్రియతో పాటు ఆమె తల్లి, సోదరుని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌తో పాటు.. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయాలంటూ దళిత, ప్రజా సంఘాలు నేతలు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ తన కుమార్తెను వేధిస్తున్నారంటూ భానుప్రియ, ఆమె సోదరుని మీద సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభావతి కుమార్తె తన ఇంట్లో దొంగతనం చేసిందని.. ఆ విషయం అడిగినందుకు తమ మీద తప్పుడు కేసులు పెట్టిందంటూ భానుప్రియ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభావతి, ఆమె కుమార్తెను అరెస్ట్ చేశారు. -
మరో వివాదంలో సినీ నటి భానుప్రియ
-
భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు
సాక్షి, చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా చేరిన బాలిక సంధ్య, ఆమె తల్లి ప్రభావతిని చోరీ కేసులో పాండీబజార్ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పనిచేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెను లైంగిక వేధిస్తున్నాడని, అంతేకాకుండా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నాడని ప్రభావతి కొద్దిరోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన భానుప్రియ.. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని తెలిపారు. మరోవైపు మైనర్ అమ్మాయిని ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న వ్యవహారంలో భానుప్రియ, ఆమె సోదరుడు చట్టపరమైన చర్యలు ఎదుర్కొనే అవకాశముందని తెలుస్తోంది. మైనర్ బాలలను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది. బాలకార్మిక చట్టం ప్రకారం ఇలా వ్యవహరించిన వారిపై రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని భానుప్రియ చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు బాలకార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుంటారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. -
భానుప్రియ పనిమనిషి కథ సుఖాంతం
పెరంబూరు: నటి భానుప్రియ ఇంటి పనిమనిషి కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట, సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కూతుర్ని కొడుతూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణలపై సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసిన విషయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి భానుప్రియను విచారించడానికి శుక్రవారం చెన్నైకి వచ్చారు. కాగా శనివారం నటి భానుప్రియ చెన్నైలో ఒక మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఇంటి పనికి తీసుకొచ్చిన 16 ఏళ్ల యువతి ఇంట్లో దొంగతనానికి పాల్ప డిందని, తాము అడగడంతో దొంగిలించిన కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, ఇంకా విలువైన వస్తువులు ఇవ్వలేదని చెప్పారు. తానే ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబితే వద్దని పనిమనిషి తల్లి ప్రభావతి ఏడ్చిందని తెలిపారు. శుక్రవారం పోలీసులు, పిల్లల సంరక్షణ విభాగం వారు పనిపిల్లను తీసుకెళ్లారని నటి భానుప్రియ తెలిపారు. -
భానుప్రియ ‘అరెస్ట్’పై సోదరుడి స్పందన
చెన్నై : ప్రముఖ నటి భానుప్రియ అరెస్టాయ్యారంటూ వినిపిస్తోన్న వదంతులపై ఆమె సోదరుడు గోపాలకృష్ణ ఫైర్ అయ్యారు. తన సోదరి గురించి అబద్దాలు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భానుప్రియ షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉన్నారని తెలిపారు. అంతేకాక తమపై ఫిర్యాదు చేసిన పనిమనిషిని తేనాంపేట పోలీసులకు అప్పగించినట్లు గోపాలకృష్ణ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం, పండ్రవాడ గ్రామానికి చెందిన పెనుపాకల ప్రభావతి కుమార్తె సంధ్యను మూడేళ్ల క్రితం చెన్నైలోని భానుప్రియ ఇంట్లో పని చేయడానికి పంపించారు. అయితే ఓ ఏడాది నుంచి భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తమ కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడటమే గాక తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు ప్రభావతి రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై భానుప్రియ స్పందించారు. ఆ బాలిక చెన్నైలోని తమ ఇంట్లో వస్తువులు, డబ్బు, నగలు దొంగతనం చేసిందని తెలిపారు భానుప్రియ. ఈ విషయం గుర్తించిన తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించడంతో బాలిక తల్లి ఐప్యాడ్, వాచ్‌లు, కెమెరా తెచ్చి ఇచ్చిందని.. నగలు, డబ్బు మాత్రం ఇవ్వలేదన్నారు. అవి కూడా ఇవ్వాలని అడగడంతో.. వాటిని తెస్తానని వెళ్లి తమపై తప్పుడు కేసు పెట్టిందని భానుప్రియ తెలిపారు. -
బాలిక మా ఇంట్లో చోరీ చేసింది
-
ఇంట్లో వస్తువులను చోరీ చేస్తుంది: భానుప్రియ
-
నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లాలో కేసు నమోదు
-
ఆరోపణలపై స్పందించిన భానుప్రియ
సాక్షి, చెన్నై: తనపై తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై సినీ నటి భానుప్రియ స్పందించారు. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ భానుప్రియపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభావతి చేసిన ఆరోపణలపై భానుప్రియ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంట్లో పనిమనిషిగా ఉన్న సంధ్య తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినట్టు భానుప్రియ తెలిపారు. ఆ వస్తువులను తిరిగి ఇవ్వమని అడిగితే ప్రభావతి తమపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు. తమ ఇంట్లో వస్తువులను చోరీ చేసినందుకు సంధ్యపై చెన్నైలో కేసు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు.(సినీ నటి భానుప్రియపై కేసు నమోదు) దీనిపై సంధ్య మాట్లాడుతూ.. ‘భానుప్రియ, ఆమె సోదరుడు నన్ను బాగా చూసుకుంటున్నారు. వారికి తెలియకుండా నగలు, డబ్బు, ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించి మా అమ్మకు ఇచ్చాను. వస్తువులు చోరీకి గురైనట్టు వారు గమనించడంతో.. వాటిని తిరిగివ్వాలని మా అమ్మకు చెప్పాను. అయితే వాటిని తీసుకువస్తానని చెప్పిన అమ్మ.. తప్పుడు కేసు పెట్టింద’ని తెలిపారు. -
సినీ నటి భానుప్రియపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: ప్రముఖ నటి భానుప్రియపై తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో నిర్భందించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ పండ్రవాడకు చెందిన ప్రభావతి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన కుమార్తె సంధ్యను చెన్నైలోని భానుప్రియ నివాసంలో పనికి పెటినట్టు ప్రభావతి తెలిపారు. అయితే అక్కడ భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణ తన కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తొలుత తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడించేవారిని.. కానీ ఏడాది కాలంగా తన కుమార్తెతో ఫోన్లో కూడా మాట్లాడించడం లేదని పేర్కొన్నారు. తన కుమార్తెతో మాట్లాడించాలని కోరిన పట్టించుకోవడం లేదని.. పైగా తన కుమార్తెపై దొంగతనం కేసు పెడతామని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు. పది లక్షల రూపాయలు చెల్లించి తన కుమార్తెను తీసుకెళ్లాలని భానుప్రియ చెబుతున్నట్టు తెలిపారు.దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పుకొచ్చారు. ప్రభావతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె చెబుతున్న దాంట్లో వాస్తవాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. -
హరికృష్ణ హఠాన్మరణంపై చలించిపోయిన సిమ్రాన్
సాక్షి, చెన్నై : సినీ నటుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని సీనియర్ నటి భానుప్రియ అన్నారు. హరికృష్ణ మృతి చెందారంటే ఇంకా నమ్మలేకున్నానని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయనతో రెండు చిత్రాలు చేశానని, సెట్లో ఆయన అందరితో కలివిడిగా అభిమానంగా ఉంటారని తెలిపారు. తన కుటుంబం అంటే హరికృష్ణకు చాలా అభిమానమన్నారు. ఆయన మృతి చిత్రసీమకే కాదు ఆయనను అభిమానించే వారందరికీ తీరనిలోటేనన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు ఆ కుటుంబానికి బాధను తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నారు. షాక్ గురయ్యా : రాధికా శరత్ కుమార్ నందమూరి హరికృష్ణ మృతి వార్త వినగానే షాక్‌కు గురయ్యానని సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారామె. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. చాలా బాధ కలిగింది : సిమ్రాన్ కారు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు నటి సిమ్రాన్ సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణం చాలా బాధకలిగించిందని ఆమె అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణకు మంచిపేరు తెచ్చిపెట్టిన సీతయ్య సినిమాలో ఆయనకు జోడిగా సిమ్రాన్ నటించిన సంగతి తెలిసిందే. -
అందమైన ప్రేమకు స్టార్ట్ కెమెరా
ఆ కళ్లు విశ్వమంత విశాలంగా ఉంటాయి. కాని నాలుగు గోడలను దాటి ఏమీ చూడలేవు. ఆ పాదాలు అలల వేగంతో కదలుతుంటాయి. కాని గడప దాటి ఎరగవు. ఆ చీర చెంగు నీలి మబ్బు. కాని ఎండ పొడ కూడా తగలదు. ఆ గుండెల్లో పట్టలేనన్ని ఆశలు. కాని ఉచ్చ్వాస నిశ్వాసలకు కూడా రేషన్. మరి– ఆ అమ్మాయి రాజావారి కూతురు. మహల్లో కోకిల. కాదు కాదు పంజరంలో పక్షి. అప్పటికే ఆ జమిందారీ పరగణ దివాలా తీసింది. పెద్దలు చేసిన పాపాలకు తెంపరితనాలకు ఆస్తులు హరించుకుపోయాయి. అప్పులు... కోర్టు కేసులు. మిగిలింది ఆ పాతకాలపు బంగళా. తల మీద తాతల నాటి పరువు బరువు. అలాంటి మహల్లో ఆ అమ్మాయి ఒక్కత్తి. ఆమెకు తోడుగా అన్న. అమ్మాయి భానుప్రియ. అన్న శరత్‌బాబు. ఊరి పెద్దల్లో మాత్రం ఇంకా ఆ కుటుంబం అంటే గౌరవం. మన్నన. గుట్టు బయట పడనందున ఇంకా మహల్లో దర్జాలూ వైభోగాలు ఉండే ఉంటాయని నమ్మకం. ఇలాంటి టైముకు ఊరికి ఉత్సవాలు వచ్చాయి. వాటి వెనుకనే ఒక పగటి వేషగాళ్ల బృందం వచ్చింది. సాక్షి రంగారావు, సుమన్, రాళ్లపల్లి, ధమ్.... వేడుకల్లో నాలుగు వేషాలు కట్టి నాలుగు డబ్బులు రెండు పాత బట్టలకు ఆశపడి వచ్చిన బక్క జీవులు. కాని వారిలో కూడా ఆత్మాభిమానం ఉన్న సుమన్ ఉన్నాడు. అందంతో కట్టి పడేసే అతడి రూపం వుంది. వేషం కడితే అందరూ నిలువు కాళ్లతో కాలాన్ని మరిచి చూసే ప్రతిభ ఉంది. ప్రతి రోజూ ఎవరు చూసినా చూడకపోయినా తొలి ప్రదర్శన మహలు ముందు ఆడాలని నియమం. అందరూ రోజూ మహల్ ప్రాంగణంలో ఆడుతుంటారు. కాని ఆ మహలు తలుపులు ఎప్పుడూ తెరుచుకోవు. ఎవరూ వాటిని చూడరు. లోపలి నుంచి ఏ ఉలుకూ విందామన్నా ఎటువంటి పలుకూ ఉండవు. ఇలాంటి మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడం కన్నా వల్లకాటి ముందు భిక్షాటన చేయడం నయం అనుకుంటాడు సుమన్. కాని ఆ సమయంలోనే అతడి కంటికి ఒక కన్ను కనిపిస్తుంది. మహల్ పైన పగిలిన కిటికీ అద్దం నుంచి తననే చూస్తున్న కన్ను. అందమైన కన్ను. ఆడపిల్ల కన్ను. అరె... ఎవరో చూస్తున్నారే. అమ్మాయి గారేమో. అమ్మాయి గారే. సుమన్‌ను ఊపిరి వస్తుంది. ఉత్సాహం వస్తుంది. వెంటనే వెన్ను విల్లులా వంగి గొంతు నుంచి రాగం ఉబికి వస్తుంది. పరవశంగా ఆడతాడు. పరవశించి పాడతాడు. రోజూ వచ్చి ఆ మహల్ ముందు ప్రదర్శన ఇవ్వడమే అతడి పని. అతడికి తెలుసు. రోజూ అమ్మాయి తననే చూస్తుంది. పగిలిన అద్దం నుంచి. చేపట్టు పగుళ్ల నుంచి. రహస్య కంతల నుంచి. తుదకు దేవి కరుణిస్తుంది. మహల్ తలుపు తెరుచుకుంటుంది. సుమన్‌కు మహల్లో ప్రవేశం లభిస్తుంది. కాని అది మహల్ కాదని గత వైభవం తాలుకు ఒక అవశేషమని లోపలికి వెళ్లాక సుమన్‌కు అర్థమవుతుంది. అతడు ఆమెనూ ఆమెకు తన పట్ల ఉన్న ఆరాధననూ అర్థం చేసుకుంటాడు. ఆ రాజకుమారి తన హృదయానికి బానిస. తాను ఆమె మనసుకు బంటు. ఇంత కాలం ఒక మనిషి తోడు ఒక మగవాడి స్పర్శ ఎరగని భానుప్రియ సంపూర్ణంగా ఆ తొలిప్రేమలో ములిగిపోతుంది. కాని రాజరికం ఊరుకుంటుందా? ఒక పగటి వేషగాడికి తన ఇంటి ఆడపడుచును కట్టపెడుతుందా? సుమన్‌ను చంపమని శరత్‌బాబు మనుషుల్ని పురమాయిస్తాడు. మనుషులు అతణ్ణి చంపి గోదాట్లో శవాన్ని అదిమి పెడతారు. భానుప్రియ నెత్తి మీద పిడుగు పడినట్టవుతుంది. మనసు ఛిద్రం అయిపోతుంది. తన ప్రేమ ఇంతటి క్రూరమైన మలుపు తిరగడం తట్టుకోలేకపోతుంది. మరోవైపు కోర్టు కేసు ఓడిపోయిన శరత్‌బాబు శేష జీవితం బికారిగా గడపడం అవమానంగా భావించి చెల్లెలిని నిర్దాక్షిణ్యంగా వదిలి ఆత్మహత్య చేసుకుంటాడు. ప్రేమించినవాడు చనిపోయి, సోదరుడు దూరమయ్యి భానుప్రియ పూర్తిగా ఒంటరిదవుతుంది. దిక్కుతోచనిదానిలా మద్రాసు చేరుకుంటుంది. అక్కడ శుభలేఖ సుధాకర్ వంటి ఒక మిత్రుడి పరిచయంతో పెద్ద హీరోయిన్ అవుతుంది. కాని ఆమె గతం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది. అది ఒక్కసారిగా బయటపడి ప్రపంచానికి తెలిసి జనం ఆమె వెంట పడటం ప్రారంభిస్తారు. ఒక జమీందారు అమ్మాయి హీరోయిన్గా మారడం వింత. ఆమెకో ప్రేమ కథ ఉండటం ఇంకా ఆసక్తి. దీనంతటి నుంచి విసిగిపోయి భానుప్రియ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కాని సుమన్ చనిపోలేదని బతికే ఉన్నాడని తెలిసి అతడి రాకతో ఆమె మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. ప్రేమను నిలబెట్టుకుంటుంది. 1984లో విడుదలైన సినిమా ‘సితార’. పూర్ణోదయ బేనర్లో వచ్చిన క్లాసిక్ సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. దర్శకుడు వంశీకి, నటి భానుప్రియకు ఇది చాలా పేరు తెచ్చింది. తెలుగులో భానుప్రియకు ఇది తొలి చిత్రం. మనకు పరిచయం ఉన్న జమిందారు కథలు, గోదావరి వెంట ఉండే సంస్కృతి, భాష, మంచి పలుకుబడి, సంగీతం ఇవన్నీ సినిమాకు హానెస్టీని ఒరిజినాలిటీని తీసుకు వచ్చాయి. ముఖ్యంగా అసూరంపశ్య వంటి ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ప్రేమలో పడినప్పుడు కలిగే అలజడి, అస్థిమితత్వం, మైమరపు, ముగ్ధత్వం... ఇవన్నీ భానుప్రియ కళ్లలోని భావాలతో దర్శకుడు కృతకత్వపు ఫిల్టర్స్ లేకుండా చూపించడం మరీ ముఖ్యంగా ఆమె జీవితంలోని తొలి కౌగిలింత తాలుకు గాఢతను చూపడం ఇవన్నీ చాలా బాగుంటాయి. అయితే వీటికి తోడు రాళ్లపల్లి, ధమ్, మల్లికార్జునరావు వంటి వారి హాస్యాన్ని జత చేయడం కూడా దర్శకుడి ప్రావీణ్యమే. లాంచీ మీద ప్యాసింజర్ని అర్ధరాత్రి నుంచి పీక్కు తింటున్న ధమ్ను ఉద్దేశించి ఆ ప్యాసింజరు ‘రేవెప్పుడొస్తుంది బాబూ’ అని అడగడం దానికి మనకు నవ్వు రావడం మర్చిపోలేము. పగటి వేషాలలో భాగంగా రాళ్లపల్లి ‘భేతాళుడు’ వేషం వేసి డప్పులతో దరువులతో ఊరిని హడలు గొడితే చంటి పిల్లలు జ్వరాన పడటం కూడా మంచి హాస్యమే. అసలు ఈ సినిమా మూగగా విడుదలయ్యి మూగగా రాలిపోవాల్సింది. ఇళయరాజా తన ఆర్.ఆర్తో దానికి ప్రాణం పోశాడు. ఆ ఆర్.ఆరే సన్నివేశాలను లేపి జీవంతో నిలబెట్టాయి. ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’, ‘కుకుకూ కోకిల రావే’, ‘కిన్నెర సాని వచ్చిందమ్మా’... ఈ పాటలన్నీ హిట్. కథను, కథా సంవిధానాన్ని, చెప్పే పద్ధతిని అర్థం చేసుకోవాలనుకోనేవారికి ఈ సినిమా మంచి సిలబస్ అని చెప్పవచ్చు. కొన్ని పాతబడవు. సితార కూడా. తెలుగు సినిమాల్లో నిలిచి మిణుకు మిణుకుమనే తార సితార. వెన్నెల్లో గోదారి అందం ‘వెన్నెల్లో గోదారి అందం’ జానకి పాడిన ఈ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఎడిటింగ్‌లోనూ ఈ సినిమా జాతీయ అవార్డులు గెలుచుకుంది. అయితే రాష్ట్ర పురస్కారాలకు మాత్రం మరో మంచి సినిమా ‘ఆనందభైరవి’ అడ్డు నిలిచింది. ఈ సినిమాలో వంశీ చాలా కొత్త తరహా చిత్రీకరణలు చేశారు. ఉదాహరణకు ‘కుకుకూ.. కుకుకూ.. కోకిల రావే’ అనే పాటలో గ్రూప్ డాన్సర్స్ చేతులు మనోహరంగా కనిపిస్తుంటాయి. వాళ్ల ముఖాలు కనిపించవు. దాని కారణం షూటింగ్ రోజున కొంచెం వయసు మళ్లిన డాన్సర్స్ రావడమే. వాళ్లను స్క్రీన్ మీద చూపించడానికి ఇష్టపడక అప్పటికప్పుడు ఆలోచన చేసి చేతుల మీదగా వంశీ పాటను తీసి అద్భుతం అనిపించారు. -
5న మగళీర్ మట్టుం
తమిళసినిమా: జ్యోతిక ప్రధానపాత్రలో నటిస్తున్న మగళీర్ మట్టుం సెప్టెంబర్ 15న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. వివాహానంతరం జ్యోతిక చేస్తున్న రెండో చిత్రమిది. మగళీర్ మట్టుం. ఇంతకు ముందు ఈమె నటించిన 36 వయదినిలే చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో జ్యోతికతో పాటు భానుప్రియ, ఊర్వశి, శరణ్యపొన్‌వన్నన్‌లు నటిస్తుండడం విశేషం. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, లివింగస్టన్ తదితరులు నటించగా, అతిథిగా సూర్య మెరవనున్నారు.సూర్య తన నిర్మాణసంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కుట్రం కడిదల్ వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన బ్రహ్మ కథ, దర్శకత్వం వహించారు. జిబ్రాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. జూలైలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉన్నా, అనివార్యకారణాలతో ఆలస్యమైంది. దీంతో చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం తరువాత సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై తన తమ్ముడు కార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరో పక్క తాను విఘ్నేశ్‌శివన్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తానాసేర్న్‌దకూటం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. -
వేడి నీటిలో పడిన చిన్నారి మృతి
అగళి (మడకశిర) : అగళి మండలం ఆలూడి గ్రామంలో పవిత్ర, నరసింహరాజు దంపతుల కుమార్తె భానుప్రియ(3) అనే చిన్నారి శుక్రవారం ఉదయం వేడినీటిలో పడి మృతి చెందినట్లు ఏఎస్ఐ ఖలీల్‌బాషా తెలిపారు. చిన్నారికి స్నానం చేయించేందుకు కుటుంబ సభ్యులు నీటిని వేడి చేసి బయట ఉంచారన్నారు. అక్కడే ఉన్న ఓ కుక్క మొరగడంతో ఆడుకుంటున్న చిన్నారి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు వేడినీటి బకెట్‌పై పడింది. దీంతో వేడి నీరంతా పడటంతో శరీరం కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అగళిలోని గుప్త పాఠశాలలో ఎల్కేజీలో చేరిన భానుప్రియ పట్టుమని పది రోజులు కూడా గడవకనే మృతి చెందడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతికి పాఠశాల యజమాన్యం నివాళులర్పించి, మౌనం పాటించారు. -
నంబర్ వన్ విద్యార్థి
డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుణ్ణి గురువు ఎలా దారిలో పెట్టాడనే కథతో రూపొందనున్న సినిమా ‘స్టూడెంట్ నెం.1’. కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ముఖ్యతారలుగా రవికిరణ్ దర్శకత్వంలో కె.ఎల్.ఎన్. ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కెమేరా స్విచ్చాన్ చేయగా, భానుచందర్ క్లాప్ ఇచ్చారు. దేవీప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘డ్రగ్స్ మాఫియా, మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో తీస్తోన్న చిత్రమిది. ఈ నెలాఖరున చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు రవికిరణ్. ‘‘నేను ఎన్టీఆర్ ఫ్యాన్. నా సినిమాకి ఆయన సినిమా టైటిల్ పెట్టడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హీరో కృష్ణచైతన్య. నాజర్, ‘తాగుబోతు’ రమేశ్, తనికెళ్ల, అజయ్ ఘోష్ నటించనున్న ఈ చిత్రానికి మాటలు: గోపీకిరణ్, సంగీతం: తలారి శ్రీనివాస్. -
కుమార్తెను అమ్మకానికి పెట్టిన తల్లి
ఓ తల్లి తన 9 ఏళ్ల కుమార్తెను విక్రయిస్తానంటూ ముందుకు రావటంతో తిరుపతి నగరంలో కలకలం రేపింది. జిల్లాలోని బంగారుపాళ్యంకు చెందిన భానుప్రియ తన తొమ్మిదేళ్ల కుమార్తెతో శుక్రవారం చిత్తూరు బజారువీధికి చేరుకుంది. అక్కడ చుట్టుపక్కల వారితో కూతురిని విక్రయిస్తానంటూ బేరానికి పెట్టింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారు ప్రస్తుతం భానుప్రియను విచారిస్తున్నారు. -
మరుపురాని వివాహం!
చెన్నై : ప్రతి మనిషి జీవితంలో వివాహం అనేది ఒక మరుపురాని ఘట్టం. అటువంటి రోజును మరిచిపోలేని విధంగా జరుపుకోవాలని తమిళనాడుకు చెందిన ఓ పెళ్లి కుమారుడికి వచ్చిన ఆలోచన పెళ్లి కుమార్తెను మురిపింపజేసింది. బంధువులను మైమరపింపజేసింది. శివగంగై జిల్లా కారైక్కుడి సమీపంలోని ఎస్ఆర్ పట్టినంకు చెందిన గౌతమన్ ఫ్రాన్స్‌లోని ఒక న్యాయస్థానంలో న్యాయసలహాదారుగా పనిచేస్తున్నారు. పుదుక్కోటైట్ జిల్లా అరంతాంగి సమీపం కూలమంగళం గ్రామానికి చెందిన భానుప్రియతో అక్టోబర్ 30న వివాహానికి పెద్దలు నిశ్చయించారు. వివాహాన్ని పెద్ద వేడుకగా మార్చాలని పెళ్లి కుమారుడు భావించారు. సొంత ఊరి ప్రజలు తన పెళ్లి వేడుకను ఎప్పటికీ మర్చిపోకూడదని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం కోసం 15 లక్షల రూపాయలు అద్దె చెల్లించి బెంగళూరు నుంచి తన గ్రామానికి హెలికాఫ్టర్‌ను తెప్పించుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి హెలికాప్టర్లో బుధవారం సాయంత్రం పెళ్లి కుమార్తె గ్రామంలో మామగారు సిద్దం చేసి ఉన్న హెలిపాడ్‌లో దిగాడు. నిశ్చితార్థం ముగించుకుని అదే రోజు సాయంత్రం పెళ్లి కుమార్తెతో సహా అదే హెలికాప్టర్లో తన గ్రామానికి చేరుకున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు వరుని స్వగ్రామమైన ఎస్ఆర్ పట్టినంలో కల్యాణముహూర్తం సమీపిస్తోంది. అదే సమయంలో వంద కిలోల పూలతో సిద్ధంగా ఉన్న హెలికాప్టర్ మళ్లీ ఆకాశంలోకి రివ్వున లేచింది. వధువు మెడలో వరుడు మాంగల్యధారణ చేస్తుండగా హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిసింది. వివాహ తంతు ముగిసిన తరువాత వధూవరులిద్దరూ హెలికాప్టర్ ఎక్కి సుమారు గంటపాటు గ్రామంపై చక్కర్లు కొట్టారు. పెళ్లి వేడుకకు హాజరైన వారిని ఆకాశం నుంచే పలకరించారు. గ్రామ ప్రజలు ఎంతో ఆనందంగా వారిని చూశారు. అంతేకాదు పెళ్లిపెద్దలలోని ముఖ్యులకు హెలికాప్టర్లో కొద్దిసేపు విహరించే అవకాశం కూడా కల్పించారు. ఇంతవరకు విమాన ప్రయాణమే ఎరుగని తాను పెళ్లి సందర్భంగా హెలికాప్టర్లో ఎగురుతానని ఊహించలేదని పెళ్లి కుమార్తె భానుప్రియ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆకాశంలో దూరంగా విమానాన్ని చూస్తూ అబ్బురపడే వధూవరుల గ్రామాల్లోకి హెలికాప్టర్ దిగడంతో ప్రజలు సంబరపడిపోయారు. గౌతమన్ అనుకున్నట్లే తన వివాహం తనకు, గ్రామస్తులకు ఒక మరుపురాని ఘట్టంగా నిలిచింది. ** -
‘చింతచెట్టు’తో భయపెడతా!
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ తనని తాను నిత్య విద్యార్థిలాగానే భావిస్తారు. 32ఏళ్లుగా అదే పరిశ్రమ.. అదే అంకితభావం... అదే క్రమశిక్షణ. ఏ తరహా సినిమానైనా అవలీలగా తెరకెక్కించే ఈ సీనియర్ సృజనాత్మక దర్శకుడి తాజా ప్రయత్నం ‘అవతారం’ రేపు విడుదల కానుంది. ఈ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రణాళికల గురించి కోడి రామకృష్ణ ఈ విధంగా చెప్పారు. కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ‘అవతారం’ సినిమా చేశాం. పాలు అమ్ముకునే అమ్మాయి, 120 ఏళ్ల వృద్ధురాలు, దేవత.. ప్రధానంగా వీరి చుట్టూ తిరిగే కథ ఇది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే సినిమా ఇది. కానీ, ఏ సన్నివేశంలో గ్రాఫిక్స్ ఉండాలో అక్కడే ఉంటాయి. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నేననుకున్న విధంగా ‘అవతారం’ని తెరకెక్కించాను. ఇది చాలా మంచి సినిమా. ఇప్పటివరకూ నేను చాలా సినిమాలు చేశాను. కానీ, అన్ని సినిమాలకూ ఇలా చెప్పలేదు. ముఖ్యంగా ఈ సినిమాకి చెప్పడానికి కారణం కథాబలం. రాధిక కుమారస్వామి, రిషి నా కథకు న్యాయం చేశారు. ఇక, భానుప్రియ అభినయం ఓ ప్రత్యేక ఆకర్షణ. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాత యుగంధర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు. మొదట నుంచీ కూడా నిర్మాతను నా పక్కన పెట్టుకుని సినిమా చేయడం నా అలవాటు. ఒకవేళ నిర్మాత అందుబాటులో లేకపోతే, ఆయనను సంప్రదించిన తర్వాతే సీన్స్ తీస్తా. ఎందుకంటే, ఏ సినిమాకైనా నిర్మాతే ప్రాణం అని నమ్ముతాను. ప్రస్తుతం ‘పుట్టపర్తి సత్యసాయిబాబా’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాను. ఈ సినిమా నలభై శాతం పూర్తయ్యింది. అలాగే అర్జున్, లక్ష్మీరాయ్ కాంబినేషన్లో ‘రాణీ రాణమ్మ’ చేస్తున్నా. ‘అంకుల్ ఆంజనేయస్వామి’ అనే చిత్రం చేయనున్నాను. ఇందులో ఆంజనేయుడిగా నటించడానికి రాజేంద్రప్రసాద్ సుముఖంగా ఉన్నారు. నా ‘దేవుళ్లు’ సినిమాలో ఆయన ఆంజనేయుడిగా చేశారు. రాజేంద్రప్రసాద్, నా కాంబినేషన్లో ఐదు సినిమాలు వచ్చాయి. అవన్నీ వంద రోజుల సినిమాలే కావడం విశేషం. మా ఊళ్లో నా కళ్ల ముందు జరిగిన సంఘటనలతో ‘చింత చెట్టు’ టైటిల్‌తో ఓ సినిమా చేయాలనుకుం టున్నా. ఇది థ్రిల్లర్ మూవీ. ఈ కథలో విశేషం. ఏంటంటే... మా ఊరు పాలకొల్లులో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చెట్టు దగ్గర ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు వరకూ గోలీలు ఆడేవాళ్లు. ఏదో కాలక్షేపం కోసం కాదు... ఆ రోజుల్లోనే లక్షల్లో పందెం కట్టి ఆడేవాళ్లు. అయితే ఆరు తర్వాత ఆ చెట్టు దగ్గరకు ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. ఒకవేళ ఎవరైనా వెళితే, ఒక షరతు మీద వెళ్లేవాళ్లం. అక్కడికెళ్లిన ప్రతిసారీ ఎవరో పిలిచినట్లు ఉంటుంది. కానీ, వెనక్కి తిరిగి చూడకూడదు. అదే షరతు. దెయ్యం ఉంటుందని భయం. ఆ సంఘటనల సమాహారంతో ఈ ‘చింత చెట్టు’ సినిమా చేయబోతున్నా. -
భానుప్రియ-వంశీ కాంబినేషన్ అంటేనే...
ముందుతరం సినీ హీరోయిన్ భానుప్రియ అనగానే ఆమె విశాల నేత్రాలు, రూపలావణ్యం, అభినయం, ఆమె నాట్యం, వంశీ కాంబినేషన్.. ఒకటి వెంట ఒకటి వరుసగా గుర్తుకు వస్తాయి. డ్యాన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. అటువంటి చిరంజీవికి సమఉజ్జీగా నాట్యం చేసి మెప్పించారు. 1967 జనవరి 15న భానుప్రియ జన్మించారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. అభినేత్రి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం ఆమె. తన అభినయంతో తెలుగువారిని పులకింపచేసింది. అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, వివిధ పాత్రల్లో తనదైన బాణీ పలికించింది. 1980-1993 మధ్య కాలంలో హీరోయిన్గా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు. 'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ కాంబినేషన్ సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి. నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి స్టార్ హీరోగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో స్పీడ్ డాన్సులకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి కాంబినేషన్ అదుర్స్. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి డాన్స్ చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు. నందమూరి బాలకృష్ణ విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో టాప్ హీరో వెంకటేశ్‌తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. 'ఖుద్గర్జ్, ఇన్సాఫ్ కీ పుకార్, మార్ మిటేంగే" వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు. భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. భానుప్రియకు పుట్టిరోజు శుభాకాంక్షలు. భానుప్రియ నటించిన కొన్ని ముఖ్యమైన సినిమాలు: సితార - రౌడీ - రామాయణంలో భాగవతం - ప్రేమించు-పెళ్లాడు - మొగుడూపెళ్లాలు - ఇల్లాలికో పరీక్ష - అన్వేషణ - చిరంజీవి - జ్వాల - పల్నాటి పులి - విజేత - అపూర్వ సహోదరులు - ఆలాపన - దొంగమొగుడు- చక్రవర్తి - జేబుదొంగ - స్వర్ణకమలం - ఖైదీ నంబర్ 786 - త్రినేత్రుడు - బ్లాక్ టైగర్ - స్టేట్ రౌడీ - ఏడుకొండలస్వామి - పెదరాయుడు - మామా బాగున్నావా? - అన్నమయ్య - ఛత్రపతి - గౌతమ్ ఎస్.ఎస్.సి.- అమెరికా అల్లుడు- పెదరాయుడు. s.nagarjuna@sakshi.com