వేడి నీటిలో పడిన చిన్నారి మృతి | child dies fall into hot water | Sakshi
Sakshi News home page

వేడి నీటిలో పడిన చిన్నారి మృతి

Published Sat, Jun 24 2017 11:40 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM

child dies fall into hot water

అగళి (మడకశిర) : అగళి మండలం ఆలూడి గ్రామంలో పవిత్ర, నరసింహరాజు దంపతుల కుమార్తె భానుప్రియ(3) అనే చిన్నారి శుక్రవారం ఉదయం వేడినీటిలో పడి మృతి చెందినట్లు ఏఎస్‌ఐ ఖలీల్‌బాషా తెలిపారు. చిన్నారికి స్నానం చేయించేందుకు కుటుంబ సభ్యులు నీటిని వేడి చేసి బయట ఉంచారన్నారు. అక్కడే ఉన్న ఓ కుక్క మొరగడంతో ఆడుకుంటున్న చిన్నారి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు వేడినీటి బకెట్‌పై పడింది.

దీంతో వేడి నీరంతా పడటంతో శరీరం కాలిపోయింది. వెంటనే చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు. అక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా అగళిలోని గుప్త పాఠశాలలో ఎల్‌కేజీలో చేరిన భానుప్రియ పట్టుమని పది రోజులు కూడా గడవకనే మృతి చెందడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి మృతికి పాఠశాల యజమాన్యం నివాళులర్పించి, మౌనం పాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement