Senior Actress Bhanupriya Revealed Her Struggling With Memory Loss | Bhanupriya Latest Interview - Sakshi
Sakshi News home page

Bhanupriya : కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా భానుప్రియ.. ప్రస్తుతం ఎలా ఉంది? 

Published Sun, Feb 5 2023 10:14 AM | Last Updated on Sun, Feb 5 2023 11:53 AM

Senior Actress Bhanupriya Opens Up About Memory Loss After Husband Death - Sakshi

సీనియర్‌ హీరోయిన్‌ భానుప్రియ అనగానే.. కలువ పువ్వులాంటి ఆమె కళ్లు, అందమైన చిరునవ్వుతో కూడిన రూపం మన కళ్లముందు ప్రతిబింబిస్తుంది. స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన భానుప్రియ దాదాపు అందరు అగ్రహీరోలతో జతకట్టింది. చూడ్డానికి అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ, తన అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. నటనతో పాటు అద్భుతమైన నాట్యంతోనూ ప్రేక్షకులను అలరించింది.

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ భాషల్లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత సహాయ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. అయితే కొన్నాళ్లుగా ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''మా వారు చనిపోయిన తర్వాత నుంచి జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. డ్యాన్స్‌కి సంబంధించిన హస్తముద్రలు కూడా మర్చిపోయాను.

మొన్నా మధ్య ఓ తమిళ మూవీ షూటింగ్‌ చేస్తుంటే డైలాగులు పూర్తిగా మర్చిపోయా. మొత్తం బ్లాంక్‌ అయిపోయింది. ఆరోగ్యం అంతగా బాలేదు. డ్యాన్స్‌ స్కూల్‌ పెట్టాలనే ఆలోచనను కూడా విరమించుకున్నాను. ప్రస్తుతానికి మెడిసిన్స్‌ తీసుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన కూతురు లండన్‌లో చదువుకుంటుందని, ఆమెకు నటనపై ఆసక్తి లేదని స్పష్టం చేసింది. కాగా 1998లో భానుప్రియ  ఆదర్శ్ కౌశల్ అనే ఫొటోగ్రాఫర్‌ను పెళ్లాడారు. ఆయన 2018లో గుండెపోటుతో కన్నుమూశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement