షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు పొందిన విష్ణుప్రియ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గానూ సత్తా చాటుతుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన ఓ షోతో పాపులర్ అయిన విష్ణు..ఆ తర్వాత సినిమాల్లోనూ అడపాదడపా కనిపిస్తుంటుంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరికొంత మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో స్నేహితురాలు, యాంకర్ శ్రీముఖితో కలిసి పలు వీడియోలు చేస్తూ ఎంటర్‌టైన్ చేసేది. ఇక స్కిన్ షో విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లతో ముచ్చటించిన విష్ణు..తన కాబోయే భర్త ఎలా ఉండాలో వివరిస్తూ ఓ పోస్టును షేర్ చేసింది. తనకు ఆషికి-2 సినిమాలో హీరో ఆదిత్యరాయ్ కపూర్‌లాంటి వ్యక్తి భర్తగా కావాలని, ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయితే ఇలాంటి వ్యక్తిని భర్తగా ప్రసాదించు దేవుడా అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం విష్ణు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో 'వచ్చే జన్మదాకా ఎందుకు ఈ జన్మలోనే నువ్వు కోరుకున్న వ్యక్తి దొరుకుతాడులే' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment